గోకులాష్టమి (కృష్ణ జన్మాష్టమి)

పూర్ణావతారి శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి రోజున భూతలంపై జన్మించాడు. ఆయన బాల్యం నుండి చేసిన అసాధారణమైన కృత్యాల ద్వారా అనేకమంది భక్తుల ఇబ్బందులు, కష్టాలు తొలగిపోయాయి.

అక్షయ తృతీయ

సత్పాత్రదానము చేయండి : అక్షయ తృతీయ నాడు చేసిన దానం ఎప్పటికి క్షయంకాదు. దానం సత్పాత్రగా ఉండాలి. సంతులకు, సత్కార్యములకు చేసిన దానం ‘అకర్మకర్మ’ అగుట వలన దానం చేయువారు ఏ బంధనంలో చిక్కుకోకుండా, మృత్యువు తరువాత ఉచ్ఛలోకాలకు వెళ్తారు. నువ్వుల తర్పణ ఇవ్వవలెను : దేవతలకు మరియు పూర్వీకులకు నువ్వులు మరియు నీళ్ళను సమర్పించడమనగా నువ్వుల తర్పణ. ఇటువంటి తర్పణ చేయుట వలన దేవతలు మరియు పూర్వీకులు సంతోషించి ఆశీర్వదిస్తారు. (మరిన్ని వివరాల కొరకు చదవండి … Read more

హనుమంతుడు

హనుమాన్ జయంతి రోజున మిగితా రోజులకు పోలిస్తే వాతావరణంలో 1000 రెట్లు ఎక్కువ హనుమంతుని తత్త్వం కార్యనిరతమై ఉంటుంది. హనుమంతుని ఉపాసకులకు ఈ తత్త్వం యొక్క ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతో హనుమంతుని వేరు వేరు రూపాలు దాని శాస్త్రము మరియు హనుమంతుని ఉపాసనా శాస్త్రము గురించి ఇక్కడ పొందుపరచడమైనది.

హోళి యొక్క ప్రాముఖ్యత మరియు హోళి పండుగను ఆచరించే పద్ధతి

హోళి కూడా సంక్రాంతిలాగ ఒక దేవతయే. షడ్వికారాలపై విజయాన్ని సాధించే సామర్థము హోళికా దేవిలో కలదు. ఈ వికారాలపై విజయాన్ని సాధించే సామర్థమును పొందుటకు హోళికా దేవిని ప్రార్థిస్తారు. అందుకే హోళిని ఉత్సవరూపములో జరుపుకుంటారు.

శ్రీ సరస్వతిదేవి విశిష్ఠతలు

శ్రీ సరస్వతి దేవి విశిష్టతలు, అమ్మవారి నివాసము, అమ్మవారి చేతిలోని వస్తువుల విశిష్టతలను తెలుసుకొని అమ్మవారి గురించి భక్తి భావమును పెంచుకుందాము.

వసంత పంచమి

ఋతువులన్నిటికి రాజ వసంత ఋతువు. ఈ ఋతువు యొక్క ఆగమనం వసంతపంచమినాడు ప్రారంభమౌతుంది. అలాగే ఈ రోజుననే శ్రీసరస్వతిదేవి మరియు లక్ష్మీదేవి జన్మదినము అని ఆచరిస్తారు.

‘కరచాలన’కు బదలు నమస్కారము చేయండి !

కరచాలన చేయుటవలన క్రిములు వ్యాపిస్తాయి అందుకనే ఇప్పుడు విదేశాలలో కూడా‘కరచాలన చేయుటకు బదులు చేతులను జోడించి నమస్కారం చేయండి’ అని ప్రచారం జరుగుతోంది. కరచాలన చేయుటవలన సూక్ష్మరూపము గల చెడుశక్తుల నుండి ఇబ్బంది కలిగే అవకాశముంటుంది. దీనికి బదలుగా చేతులను జోడించి నమస్కారం చేసినప్పుడు మనలో నమ్రత భావము పెరిగి వృత్తి సాత్త్వికమవుతుంది. హిందువుల్లారా, చైతన్యమయ హిందూ సంస్కృతిని కాపాడండి !

దేవతల జయంతి, ఉత్సవ సమయములో ఆయా దేవతల నామజపము చేయండి !

దేవతల జయంతి రోజున (ఉదా. శ్రీరామనవమి) లేదా ఉత్సవ సమయములో (ఉదా. గణేశోత్సవము) ఆయా దేవతా తత్వము ఎక్కువగా కార్యనిరతమై ఉండును. దేవతల జయంతి లేదా ఉత్సవ సమయములో ఆయా దేవతల నామజపం చేయుట వలన దేవతా తత్వమును ఎక్కువగా గ్రహించవచ్చును. (వినండి : సాత్విక స్వరంలోని సనాతన ధ్వనిముద్రిక దేవతల నామజపం చేయు సరైన పద్ధతి)