హారతి ఎలా చేయాలి ?

ఉపాసకులు హదయములోని భక్తిదీపమును తేజోమయంగా చేయుటకు మరియు దేవుడి కపాశీర్వాదమును పొందుటకు సులభమైన మార్గము అనగా ‘హారతి’. సంతుమహాత్ముల సంకల్పశక్తి నుండి సిద్ధమైన హారతి పాడుటవలన పై ఉద్ధేశము నిఃసంశయంగా ఫలిస్తుంది, కాని ఎప్పటికప్పుడు హారతి హదయములో నుండి, అనగా ఆర్తతతో, తపనతో మరియు ఆధ్యాత్మికశాస్త్రానుసారంగా సరియైన పద్ధతిలో పాడటము జరుగుతుంది.

ఏదైన విషయము మన మనస్సులో నాటుకున్నప్పుడే అది ఆర్తతతో, అనగా అంతఃకరణపూర్వకంగా జరుగుతుంది. దాని గురించి శాస్త్రము మరియు సిద్ధాంతము చెప్పినచో దానికి గల ప్రాముఖ్యత తెలుస్తుంది. ఈ ఉద్ధేశముతోనే ఈ లేఖలో హారతి చేస్తున్నప్పుడు వివిధ కత్యముల ఆధ్యాత్మికశాస్త్రమును ఇవ్వబడినది.

ఉపాసన చేస్తున్నప్పుడు ఏ కతి ఆధ్యాత్మికశాస్త్రానుసారంగా సరియైన పద్ధతిలో చేయుటము చాలా ముఖ్యము; ఎందుకంటే ఇలా చేస్తేనే సంపూర్ణంగా ఫలము లభిస్తుంది. హారతి ఎలా పాడాలి, ఎలా త్రిప్పాలి, హారతికి ముందు మరియు తరువాత ఏమి చేయాలి మొదలగు వాటి గురించి చాలా మందికి తెలిసివుండదు లేదా వారి నుండి అయోగ్యమైన పద్ధతిలో కత్యములు జరుగుతూ వుంటాయి. ఈ లేఖ వలన కతులన్ని ఆధ్యాత్మికశాస్త్రానుసారంగా సరియైన పద్ధతిలో ఎలా చేయాలో తెలుసుకుందాం.

హారతి ఎలా చేయాలి ? (5 Videos)

1. హారతి మహత్యము

అ. కలియుగములో మానవునికి ‘భగవంతుడు ఉన్నాడని’ తెలుసుకొనుటకు హారతి సులభమైన మార్గము

‘కలియుగములో మానవులు అసలు భగవంతుడున్నాడా? అనే స్ధితిలో ఉన్నారు. ఇలాంటి కలియుగములో భగవంతుడు ఉన్నాడని నిరూపించుటకు, హారతియే ఒక సులభమైన మార్గము. హారతి అనగా దేవుళ్ళను ఆర్తతతో ఆహ్వానించడము. మానవుడు హారతి ద్వారా భగవంతుడిని ఆహ్వానిస్తే, భగవంతుడు సాకార రూపములో లేదా ప్రకాశ రూపములో దర్శన మివ్వచ్చును.’- శ్రీ గణపతి (శ్రీ. భూషణ కులకర్ణి గారి ద్వారా, 31.1.2004, సా. 6.10)

ఆ. దేవుడు ప్రసన్నమగుట

భగవంతుడు స్తుతిప్రియుడు మరియు కృపాశీలుడు కావున హారతిని పాడేవారిపై ప్రసన్నమవుతాడు.

ఇ. ఆధ్యాత్మికతలోని ఉన్నతులు హారతిని రచించుట వలన వారి సంకల్పశక్తి యొక్క లాభము పొందుట

చాలా హారతులను సంత్‌మహనీయులు మరియు ఉన్నత భక్తులు రచించారు. కాబట్టి వారి సంకల్పము మరియు ఆశీర్వాదము వలన హారతి పాడేవారికి ఐహికంగా మరియు పారమార్ధికంగా లాభమైతుంది.

ఈ. జీవుని సుషూమ్నానాడి జాగృతమై జీవుని భావము జాగృతమవ్వడం

భక్తి మార్గామనుసారంగా సాధన చేయువారిలో భగవంతునిపై భక్తి-భావము త్వరగా ఏర్పడడం అవసరం. ప్రాధమిక స్థాయి సాధకునికి భగవంతుని యొక్క నిర్గుణ రూపము నందు భావము ఏర్పడుట కఠినమగును. తద్విరుద్ధంగా సగణ రూపమును ధరించిన భగవంతుడు సాధకునికి దగ్గ్గరివాడు అనిపిస్తాడు కావున భగవంతుని పట్ల సాధకునిలో భావము త్వరగా ఏర్పడుతుంది. సగణోపాసనయందు హారతి ఒక సులభమైన మార్గము.

‘హారతి చేస్తున్న సమయములో, హారతి పాటలోని పదముల సూక్ష ్మరూపము ఎదురుగా ఉండే భగవంతుని విగ్రహమును నెమ్మదిగా తాకి హారతి పాడెడి మరియు వినేవారివైపు వెళ్తాయి. ఆ పదముల వలన కలిగిన సాత్వికతను జీవుల సూక్ష ్మదేహముపై వెదజల్లుతాయి. కావున హారతి చేసిన తరువాత తేలికగా అనిపిస్తుంది. హారతి పాటలోని పదముల నుండి జీవుల సుషూమ్నానాడి జాగృతమవ్వడం వలన వారి భావము జాగృతమవుతుంది.’- భగవంతుడు (కు. మధురా భోసలె వీరి ద్వారా, 16.1.2005 సా. 7.00 నుండి రాత్రి 12.22)

ఉ. అనుభూతి పొందుట వలన శ్రద్ధ పెరుగట

హారతి సమయంలో భగవంతుని పట్ల సాధకుల భావము వద్ధి చెంది వారికి అనుభూతి కలుగతుంది. అనుభూతి వలన దేవునిపై శ్రద్ధ(నమ్మకము, భక్తి) పెరుగుటకు సహాయమవుతుంది.

ఊ. హారతి సమయంలో భగవంతుని తత్వము అధిక ప్రమాణంలో కార్యగతమగట వలన చైతన్యము యొక్క లాభము కలుగుట

హారతి సమయంలో భగవంతుని తత్వము అధిక ప్రమాణంలో పనిచేయుట వలన సాధకునికి భగవంతుని శక్తి మరియు చైతన్యము ఎక్కువగా లభిస్తుంది. కావున దేవాలయములో ఇతర సమయాలలో కన్నా హారతి సమయంలో ఉండడము మిక్కిలి లాభదాయకం.

ఎ. వాతావరణము యొక్క శుద్ధి జరుగట

‘హారతి నుండి ఏర్పడు నాద తరంగముల వలన జీవుని చుట్టూ ఉండెడి వాతావరణము సాత్వికంగా మారి పరిసరాలు శుద్ధమగును.’ – ఒక విద్వాంసుడు ((పూ.) శ్రీమతి అంజలీ గాడ్గీళ్‌ గారి ద్వారా 21.4.2005, రాత్రి 9.02)

 

2. హారతి ఎప్పుడు చేయవలెను ?

అ. హారతిని ఉదయము మరియు సాయంకాలము, రెండు సార్లు ఎందుకు చేయవలెను ?

‘సూర్యోదయ సమయంలో రాత్రి రజ-తమాత్మక వాతావరణము లయమై బ్రహ్మాండములో భగవంతుని తేజ తత్వాత్మక తరంగాల ఆగమనం జరుగతుంది. ఆ సమయంలో ప్రసరించు తారక చైతన్యమును స్వాగతించుటకు హారతి చేయవలెను. సూర్యాస్తమయ సమయంలో రజ-తమాత్మక తరంగాలను నాశనం చేయుటకు భగవంతుని మారక చైతన్యము ఆరాధనను హారతి ద్వారా చేయవలెను. అందుకే సూర్యోదయం మరియు సూర్యాస్తమయ సమయాలలో, రెండు సార్లు హారతి చేయవలెను.

ఆ. సూర్యాస్తమయ సమయంలో హారతి చేయుటయందున్న శాస్త్రమేమిటి ?

సూర్యాస్తమము సమయంలో పెరిగిన దుష్టశక్తుల సంచారమును నియంత్రించుటకు భగవంతుని తరంగాలు లభించవలెనని హారతి చేయడము

సూర్యాస్తమయ సమయంలో సూర్యుని కిరణాలలోని తేజతత్వ ప్రమాణము తక్కువగుట వలన వాతావరణములో రజ-తమ కణముల ప్రాభల్యము మరియు వాటి నిర్మితి ఎక్కువగా పెరుగతుంది. ఇలాంటి రజ-తమాత్మక వాతావరణము నుండి ఇబ్బంది కలుగకూడదని హారతి ద్వారా ప్రసరించు నాదతరంగాల ద్వారా భగవంతుని తరంగాలను ఆహ్వానించి, వాటిని బ్రహ్మాండలోనికి తేవలసివస్తుంది. హారతి వలన వాతావరణములో భగవంతుని చైతన్యమయ తరంగాల ప్రమాణము పెరిగి, కష్టదాయక స్పందనల ప్రమాణము తక్కువవుతుంది మరియు జీవుని దేహము చుట్టూ సంరక్షక కవచము ఏర్పడుతుంది.’- (పూ.) శ్రీమతి అంజలీ గాడ్గీళ్‌ గారి ద్వారా, 5.6.2005 సా. 6.33)

సేకరణ : సనాతన లఘుగ్రంథము ‘హారతి ఎలా చేయవలెను?’

Leave a Comment