గ్రహణకాలములో సాధన ఎందుకు చేయవలెను ?

గ్రహణకాలంలో వాయుమండలంలో సూక్ష్మ క్రిములు, చెడుశక్తుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో తినటం, నిద్రించటం మొదలైన రజ-తమతో కూడిన కృతులను చేస్తే చెడుశక్తుల ఇబ్బంది కలుగవచ్చును. కానీ గ్రహణ కాలంలో నామజపం, స్తోత్రపఠణం మొదలైన వాటిని చేస్తే మన చుట్టూ సంరక్షణ కవచం నిర్మాణమై గ్రహణం యొక్క అమంగల ప్రభావం నుండి మన రక్షణ అవుతుంది.

ప్రతీరోజు దేవునికి భావపూర్ణ ప్రార్థనను చేయండి !

దేవుడికి శరణై మన కోరికలను కోరుకోవడం అనగా ప్రార్థన. ప్రార్థన చేయడం వల్ల దేవుడి ఆశీర్వాదం, శక్తి మరియు చైతన్యం లభిస్తుంది.

రాబోయే ఆపత్కాలంలో రక్షణకై భక్తి పెంచుకోండి !

భవిష్యత్తులో ప్రపంచ యుద్ధాలు, అతివృష్టి-అనావృష్టి, వరదలు వంటి విపరీతాలను మనం ఎదుర్కోవలసి ఉంటుంది. ఆ క్షణంలో వేల కొలది ప్రజల ప్రాణాలను బలి తీసుకొనే మహా భయంకర ఆపదల నుండి మనల్ని ఎవరు రక్షించగలరు ? కేవలం ఆ పరమాత్ముడు మాత్రమే. భగవంతుడు మనల్ని రక్షించాలి అని మనకు అనిపిస్తుంటే ఇప్పటి నుండే మనం సాధనను ప్రారంభించాలి, భగవంతుని భక్తులవ్వాలి. ‘నా భక్తులు ఎప్పటికీ నాశనమవ్వరు’ అని భగవంతుడే తెలియజెప్పారు. మరిన్ని వివరాల కొరకు భక్తిని పెంచే … Read more

జీవితంలో సాధన యొక్క ప్రాముఖ్యతను తెలుసుకోండి !

సాధన వలన వ్యక్తి సాత్వికమై అతను రజ-తమతో కూడిన విషయముల నుండి (ఉదా. గంటల తరబడి టి.వి. చూడడం) దూరమగును. సాధన వలన వ్యక్తిలో దేవుని ఎడల శరణాగత భావము మరియు కృతజ్ఞతా భావము వృద్ధి అగును మరియు నెమ్మదిగా అహంభావం యొక్క పొర నాశనమవుతూ చిరంతన ఆనందము పొందుటకు సాధ్యమగును. సాధన నుండి ఇతరుల ఎడల ప్రీతి నిర్మాణమై వ్యక్తి మనస్సు శాంతమగును. సనాతన సంస్థ ఆధ్యాత్మిక సాధన ఎలా చేయాలో నేర్పించును !

మనలోని స్వభావదోషాలను ఎలా దూరం చేసుకోవాలి ?

భగవంతుని వలె ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడానికి మనలోని దోషములను తీసి గుణములను పెంచుకోవడం చాలా అవసరం. ‘స్వయంసూచన’ పద్ధతి ద్వారా స్వభావదోషములను దూరం చేసుకోవచ్చును. ‘స్వయంసూచన’ అనగా ఏమిటి ? : అయోగ్య కృతులను మార్చి సరైన కృతులను చేయుటకు మన అంతర్మనస్సుకి సూచించడమే ‘స్వయంసూచన’ ఇవ్వడం. రోజులో 5 నుండి 6 సార్లు స్వయంసూచన ఇవ్వవలెను. దీని వలన మన ఆలోచనలలో మార్పులు వచ్చును మరియు కృతులు కూడా యోగ్యరీతిగా జరుగును.

శీఘ్ర భగవత్‌ ప్రాప్తికై ‘గురుకృపాయోగా ’నుసారంగా సాధన చేయండి !

శీఘ్ర భగవత్‌ ప్రాప్తికై ‘గురుకృపాయోగం’ అనుసారంగా సాధన చేయండి ! మానవజన్మ యొక్క సార్థకత భగవత్‌ప్రాప్తిలో ఉంది’, అని హిందూ ధర్మం చెబుతుంది. భగవత్‌ప్రాప్తి కొరకు రోజూ చేసే ప్రయత్నమును ఆధ్యాత్మిక సాధన అంటారు. సాధన చేయడం వలన మనిషి ధర్మ పరాయణుడౌతాడు. శీఘ్ర భగవత్‌ ప్రాప్తి కొరకు సనాతన సంస్థ సత్సంగాలలో ‘గురుకృపాయోగము’ అనుసారంగా సాధన చేయడంను నేర్పించబడుతుంది. నామసాధన ఎలా చేయవలెను ? శీఘ్ర ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు కులదేవత (ఇంటిదేవత) నామజపమును (ఉదా … Read more