నారాయణ బలి, నాగబలి చేయడం వెనుక ఉద్దేశం: విధి, పద్ధతి.

నారాయణ బలి :

1.     ఉద్దేశం : దుర్మరణం పొందిన లేదా ఆత్మహత్య చేసుకున్న జీవి క్రియాకర్మలు పూర్తవకుండా ఉండడం వలన ప్రేతత్వం ముగిసి పితృత్వం దొరకుకుండా ఉన్నందువలన ఆ జీవి లింగదేహం అలాగే తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి లింగదేహం వంశంలో సంతతి కలగకుండా ఇబ్బందులను ఒడ్డుతూ ఉంటుంది. అదే విధంగా ఏదో ఒక రకంగా వంశజులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇలాంటి లింగదేహానికి సద్గతినివ్వడం కోసం నారాయణ బలి విధిని చేయాలి.

2. విధి :

అ. ఈ విధిని చెయ్యడానికి తగిన సమయం : నారాయణ బలి విధిని చెయ్యడానికి మాసపు శుక్ల ఏకాదశి లేదా ద్వాదశి తగిన రోజు. ఏకాదశి రోజున అధివాసం (దేవస్థాపన) చేసి, ద్వాదశి రోజున శ్రాద్ధ కర్మ చేయాలి. (ఇటీవలి రోజుల్లో ఒకే రోజు ఈ విధిని ముగిస్తారు). సంతాన ప్రాప్తికోసం ఈ విధిని చేయాలనుకుంటే దంపతులు స్వయంగా ఈ విధిని నిర్వర్తించాలి. పుత్రప్రాప్తికోసం ఈ విధిని చేయాలనుకుంటే శ్రవణ నక్షత్రం, పంచమి లేదా పుత్రదా ఏకాదశి వీటిలో ఏ రోజైనా చేస్తే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.

ఆ. విధి చెయ్యడానికి తగిన ప్రదేశం : నదీతీరం లాంటి పవిత్ర స్థలాల్లో ఈ విధిని చెయ్యాలి.

ఇ. పద్ధతి :

మొదటి రోజు : ముందుగా తీర్థంలో స్నానం చేసి నారాయణ బలి సంకల్పాన్ని చెయ్యాలి. రెండు కలశాల పైన శ్రీ విష్ణువు, వైవస్తవ యముడు వీరి సువర్ణ మూర్తులను స్థాపించి వాటికి షోడశోపచార పూజలు చెయ్యాలి. తరువాత ఆ కలశాల తూర్పుకు దర్భతో ఒక గీతను గీసి, దక్షిణం వైపు దర్భలను పరచాలి. వాటి పైన “శుంధంతాం విష్ణురూపీ ప్రేతః” ఈ మంత్రంతో పది మార్లు నీళ్ళు వదలాలి.

తరువాత దక్షిణం వైపు తిరిగి అపసవ్యంతో విష్ణురూపీ ప్రేత ధ్యానం చెయ్యాలి. పరచిన దర్భల పైన తేనె, నెయ్యి, నువ్వులతో తయారు చేసిన పది పిండాలను “కశ్యప గోత్ర….. వీరి ప్రేత విష్ణుదైవత అయం తే పిండః” అని చెప్తూ పెట్టాలి. పిండాలను గంధాది ఉపచారాలతో పూజించి తరువాత వాటిని నదిలోనో, జలాశయాల్లోనో విసర్జించాలి. ఇది ముందు రోజు విధి.

రెండవ రోజు : మధ్యాహ్న సమయంలో శ్రీ విష్ణువు పూజ చెయ్యాలి. తరువాత 1, 3 లేదా 5 బేసి సంఖ్యలో బ్రాహ్మణులను ఆమంత్రించి ఏకోద్దిష్ట విధితో ఆ విష్ణురూపీ ప్రేతం యొక్క శ్రాద్ధ కర్మ చెయ్యాలి. ఈ శ్రాద్ధ కర్మను బ్రాహ్మణుల పాద ప్రక్షాళనతో మొదలుకొని తృప్తిప్రశ్న వరకు మంత్ర రహితంగా చెయ్యాలి. శ్రీవిష్ణువు, బ్రహ్మ, శివుడు, సపరివార యముడు వీరికి నామ మంత్రాలతో నాలుగు పిండాలను పెట్టాలి. విష్ణురూపీ ప్రేతానికి ఐదవ పిండాన్ని పెట్టాలి.  పిండపూజను చేసి, వాటిని నిమజ్జన చేసిన తరువాత బ్రాహ్మణులకు దక్షిణనివ్వాలి. ఒక బ్రాహ్మనుడికి వస్త్రాలంకారం, గోవు, బంగారం ఈ వస్తువులను ఇవ్వాలి. తరువాత ప్రేతానికి తిలాంజలి ఇవ్వమని బ్రాహ్మణులను ప్రార్థించాలి. బ్రాహ్మణులు దర్భ, నువ్వులు, తులసీ పత్రాలతో ఉన్న నీటిని దోసిట్లో తీసుకుని దాన్ని ప్రేతానికి ఇవ్వాలి. తరువాత శ్రాద్ధ కర్త స్నానం చేసి భోజనం చెయ్యాలి. ఈ విధివలన ప్రేతాత్మకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పబడింది.

స్మృతులలో నారాయణ బలి, నాగబలి ఒకే ఉద్దేశం కోసం చెప్పబడడం వలన రెండు విధులనూ జతగా చేసే సంప్రదాయం ఉంది. నారాయణ-నాగబలి అనే జంట పేరు ఇదే కారణం వలన ప్రచలితమయ్యింది.

నాగబలి

1.     ఉద్దేశం : మన వంశంలో పూర్వం ఎవరో ఒక పూర్వీకుల చేతిలో నాగుపాము హత్య జరిగి, దానికి సద్గతి దొరకకుండా ఉండడం వలన అది ఆ వంశంలో సంతతికి ఇబ్బంది కలిగిస్తుంది. అలాగే ఏదో ఒక విధంగా ఆ వంశజులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఈ దోష నివారణకోసం ఈ విధిని చేస్తారు.

2.     విధి : సంతతి ప్రాప్తి కొరకు ఈ విధిని చేయాలని ఉంటే అ దంపతులు స్వయంగా ఈ విధిని చేయవలెను. పుత్రప్రాప్తి కొరకు చేయాలని ఉంటే శ్రవణ నక్షత్రం, పంచమి లేదా పుత్రదా ఏకాదశి వీటిలో ఏదైనా ఒక తిథి రోజున చేస్తే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది.

3. నారాయణ-నాగబలి చేసినప్పుడు కలిగిన అనుభవం

ఈ విధిని చేస్తున్నప్పుడు నిజమైన ప్రేతం పైన అభిషేకం చేస్తున్న అలాగే కర్పూరం వెలిగించినప్పుడు ప్రేతం నుండి ప్రాణజ్యోతి బయటకు రావడం కానరావడం : నారాయణ-నాగబలిని చేస్తున్నసమయంలో నారాయణుడి మూర్తిని పూజించేటప్పుడు ఈ విధి వలన పూర్వీకులకు నిజంగా సద్గతి దొరుకుతుంది అనిపించింది.  అదే విధంగా పిండితో చేసిన ప్రేత ప్రతిమ ఛాతీ పైన కర్పూరం వెలిగించినప్పుడు ప్రాణ జ్యోతి బయటికి వస్తూండడం కనిపించి నా శరీరం రోమాంచితమయ్యింది. అప్పుడు నాకు ఎడతెగకుండా ప.పూ డాక్టర్ గారు గుర్తుకు రాసాగారు. – శ్రీ. శ్రీకాంత్ పాధ్యె – నాగ్ పూర్ ( 01-12-2006)

(ఆధారం: సనాతన ప్రచురించిన గ్రంథం – శ్రాద్ధ కర్మ -2 భాగాలు )

Leave a Comment