హారతి ఎలా చేయాలి ?

‘కలియుగములో మానవులు అసలు భగవంతుడున్నాడా? అనే స్ధితిలో ఉన్నారు. ఇలాంటి కలియుగములో భగవంతుడు ఉన్నాడని నిరూపించుటకు, హారతియే ఒక సులభమైన మార్గము. హారతి అనగా దేవుళ్ళను ఆర్తతతో ఆహ్వానించడము.

హారతి పాడుట

హారతి ఇచ్చే వారికి భగవంతుని పై ఎంత ఎక్కువ భావము ఉంటుందో, హారతి కూడ అంతే ఎక్కువ భావపూర్ణముగా మరియు సాత్వికంగా అవుతుంది. ఈ విధమైన హారతి త్వరగా భగవంతుణ్ణి చేరుకుంటుంది. ఈ విధంగా హారతి పాడే వారికి క్రింద చెప్పిన లాభములు కలుగుతాయి.

దేవుడికి సాష్టాంగ నమస్కారము ఎలా చేయవలెను ?

దేవుడి విగ్రహము ముందు ఖాళీస్థలము వున్నచో దేవుడికి సాష్టాంగ నమస్కారము చేయుట ముఖ్యమైనది. ఈ లేఖనములో శాస్త్రశుద్ధ సాష్టాంగ నమస్కారము ఎలా చేయాలిఇ దీనిని వివరించడమైనది.

దేవాలయములోకి ప్రవేశించేటప్పుడు మెట్లకు ఏ విధంగా నమస్కరించవలెను ?

దేవాలయములోకి ప్రవేశించేటప్పుడు మెట్లకు నమస్కరించి లోనికి వెళ్ళవలసి వుంటుంది, ఇది అందరికి తెలిసిన విషయమే; కాని ఈ నమస్కారము ఎందుకు మరియు ఎలా చేయాలో ఈ జ్ఞానము దర్శనార్థులకు తెలియకుండును.

నమస్కారము ఎలా చేయావలెను ?

‘ఇంట్లోని పెద్దలకు నమస్కారము చేయడమంటే ఒక విధంగా వారిలోని దైవత్వానికి శరణాగతి కావడం. ఎప్పుడు ఒక జీవము క్రిందికి వంగి లీనభావంతో (వినయ) పెద్దలలో ఉండే దైవత్వానికి శరణాగతి అవుతుందో, అప్పుడు ఆ దేహంలో కరుణారసము నిర్మితి ఏర్పడును.

దేవుడి పూజ

దేవుడి పూజ అనగా ఏమి, దేవుని పూజ నిర్మితము, మహాత్వము, ప్రకారములు, కొన్ని దేవతల పూజ యొక్క విశిష్టత మరియు దానికి గల కారణాలు, దేవుడి పూజ రోజులో ఎన్ని సార్లు చేయాలి మరియు ఏ సమయము చేయాలి, దేవుడి పూజ ఎప్పుడు చేయకూడదు అనువాటి గురించి శాస్త్రమును తెలుసుకుందాం.

‘కరచాలన’కు బదలు నమస్కారము చేయండి !

కరచాలన చేయుటవలన క్రిములు వ్యాపిస్తాయి అందుకనే ఇప్పుడు విదేశాలలో కూడా‘కరచాలన చేయుటకు బదులు చేతులను జోడించి నమస్కారం చేయండి’ అని ప్రచారం జరుగుతోంది. కరచాలన చేయుటవలన సూక్ష్మరూపము గల చెడుశక్తుల నుండి ఇబ్బంది కలిగే అవకాశముంటుంది. దీనికి బదలుగా చేతులను జోడించి నమస్కారం చేసినప్పుడు మనలో నమ్రత భావము పెరిగి వృత్తి సాత్త్వికమవుతుంది. హిందువుల్లారా, చైతన్యమయ హిందూ సంస్కృతిని కాపాడండి !

దేవతల జయంతి, ఉత్సవ సమయములో ఆయా దేవతల నామజపము చేయండి !

దేవతల జయంతి రోజున (ఉదా. శ్రీరామనవమి) లేదా ఉత్సవ సమయములో (ఉదా. గణేశోత్సవము) ఆయా దేవతా తత్వము ఎక్కువగా కార్యనిరతమై ఉండును. దేవతల జయంతి లేదా ఉత్సవ సమయములో ఆయా దేవతల నామజపం చేయుట వలన దేవతా తత్వమును ఎక్కువగా గ్రహించవచ్చును. (వినండి : సాత్విక స్వరంలోని సనాతన ధ్వనిముద్రిక దేవతల నామజపం చేయు సరైన పద్ధతి)

శివలింగమును దర్శించుకునే పద్ధతి మరియు బిల్వ పత్రమునకు గల ఆధ్యాత్మికశాస్త్రము

శృంగదర్శనం అంటే నంది రెండు కొమ్ముల మధ్య నుండి శివలింగమును దర్శించుకోవడం. శివలింగము నుండి వెలువడే శక్తితో కూడిన తరంగాల వల్ల సామాన్య భక్తుల శరీరములో ఊష్ణము నిర్మాణమగుట, తల బరువెక్కుట మొ॥ ఇబ్బందులు కలుగవచ్చును.