హారతి ఎలా చేయాలి ?

‘కలియుగములో మానవులు అసలు భగవంతుడున్నాడా? అనే స్ధితిలో ఉన్నారు. ఇలాంటి కలియుగములో భగవంతుడు ఉన్నాడని నిరూపించుటకు, హారతియే ఒక సులభమైన మార్గము. హారతి అనగా దేవుళ్ళను ఆర్తతతో ఆహ్వానించడము.

హారతి పాడుట

హారతి ఇచ్చే వారికి భగవంతుని పై ఎంత ఎక్కువ భావము ఉంటుందో, హారతి కూడ అంతే ఎక్కువ భావపూర్ణముగా మరియు సాత్వికంగా అవుతుంది. ఈ విధమైన హారతి త్వరగా భగవంతుణ్ణి చేరుకుంటుంది. ఈ విధంగా హారతి పాడే వారికి క్రింద చెప్పిన లాభములు కలుగుతాయి.