హారతి చేయు సంపూర్ణ విధి


హారతి చేయునపుడు ఏ ఏ విధులు చేయవలెనో, క్రింద ఇవ్వబడినవి.

 

1. హారతి చేయుటకు ముందు మూడు సార్లు శంఖ నాదము చేయవలెను

శంఖూనాదము చేయుట

అ. శంఖమును ఊదుటకు ముందు తలను పైకి ఎత్తి ఊర్ధ్వదిశ వైపు మనస్సును ఏకాగ్రత చేయవలెను.

ఆ. శంఖమును ఊదునపుడు కళ్లు మూసుకొని, ‘ఊర్ధ్వదిశ నుండి వచ్చు భగవంతుని మారక తరంగాలను

ఆహ్వానించి వాటిని జాగృత పరుస్తున్నాము’ అనే భావము ఉండవలెను.

ఇ. శంఖమును ఊదుటకు ముందే శక్తి కొలది శ్వాసను పూర్తిగా పీర్చుకొని, ఆ తరువాత ఒకే శ్వాసలో శంఖమును ఊదవలెను.

ఈ. శంఖనాదము చేయునపుడు చిన్న స్వరం నుండి పెద్ద స్వరం వైపు వెళ్ళవలెను మరియు అక్కడే
వదిలి వేయవలెను.

 

2. శంఖనాదము తరువాత హారతి పాడుట ప్రారంభించవలెను

అ. ‘భగవంతుడు నా ముందు ఉన్నాడు నేను ఆయనను ఆర్తతతో వేడుకుంటున్నాను’, అనే భావముతో హారతి పాడవలెను.

ఆ. హారతి పాట అర్ధమును తెలుసుకొని హారతి పాడవలెను.

ఇ. హారతి పాడుతున్నప్పుడు శబ్దోచ్చారణ అధ్యాత్మ శాస్త్రమనుసారంగా సరియైన పద్ధతిలో యుండవలెను.

2.1 హారతి పాడుతున్నప్పుడు చప్పట్లు కొట్టవలెను

అ. ప్రాధమిక స్ధాయి సాధకుడు : హారతి పాటను లయ బద్ధంగా పాడుటకై చప్పట్లను మెల్లగా కొట్టవలెను.

ఆ. ముందు స్ధాయి సాధకుడు : చప్పట్లు మాని అంతర్ముఖతను సాధించుటకు ప్రయత్నించవలెను.

2.2 హారతి పాడుచున్నప్పుడు చప్పట్లతో పాటు వాద్యములను మ్రోగించడము.

అ. గంటను వీనులవిందుగా మ్రోగించవలెను మరియు దాని నాదము లయబద్ధంగా ఉండవలెను.

ఆ. తాళము, జాంజ్‌, హార్మోనియం, తబల వాద్యములు ఒకదానితో ఒకటి కలసి లయబద్ధంగా ఉండవలెను.

2.3 హారతి త్రిప్పడము

అ. హారతిని దేవుని చుట్టూ గడియారము ముల్లు తిరిగే దిశలో గుండ్రంగా త్రిప్పవలెను.

ఆ. హారతి త్రిప్పునపుడు దేవుని తలపైనుండి త్రిప్పకుండా దేవుని అనాహత చక్రము నుండి ఆజ్ఞాచక్రము వరకు త్రిప్పవలెను.

పిదప ‘కర్పూరగౌరం కరుణావతారం…….’ ఈ మంత్రమును పఠిస్తూ కర్పూరహారతి ఇవ్వవలెను.

కర్పూరహారతి నుండి చైతన్యమును గ్రహించవలెను, అనగా జ్యోతిపై రెండు అరచేతుల నుంచి తరువాత కుడి చేతితో తలపై నుండి మెడవరకు నిమరవలెను (కర్పూర హారతి చేయనిచో నేతితో చేసిన నీరాజన జ్యోతిపై చేతుల నుంచి హారతిలోని చైతన్యమును గ్రహించవలెను.)

దేవునికి శరణాగతి భావముతో నమస్కారము చేయవలెను.

ఆ తరువాత దేవుని చుట్టూ 3 ప్రదక్షిణలు చేయవలెను, ప్రదక్షిణలను చేయుటకు వీలు లేనిచో తమ చుట్టూ తామె మూడు ప్రదక్షిణలు చేయవలెను.

ప్రదక్షిణల తరువాత మంత్రపుష్పాంజలి చెప్పవలెను.

మంత్రపుష్పాంజలిని పఠించిన తరువాత భగవంతుని చరణముల పై పువ్వులు మరియు అక్షింతలను అర్పించవలెను. తరువాత క్రింద ఇచ్చిన ప్రార్ధన చేయవలెను.

ఆవాహనం న జానామి న జానామి తవార్చనమ్‌ |
పూజాం చైవ న జానామి క్షమ్యతాం పరమేశ్వర ||

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర |
యత్పూజితం మయా దేవ పరిపూర్ణ తదస్తు మే ||

అపరాధసహస్త్రాణి క్రియన్తేహర్నిశం మయా |
దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర ||

ఆర్థము : నాకు నీ ఆహ్వన మరియు అర్చన అలాగే, నీ పూజ ఎలా చేయవలెను ఇవి నాకు తెలియదు. పూజ చేయునపుడు నానుండి ఏమైనా తప్పులు జరిగియుంటే నన్ను క్షమించండి. హే దేవా, నేను మంత్రహీనుడు, క్రియాహీనుడిని మరియు భక్తిహీనుడిని. నేను నీ హారతి/పూజ చేసాను, దానిని పరిపూర్ణంగా నువ్వు చేసుకో. ప్రతిరోజు నానుండి తెలిసి-తెలియక చాల అపరాధములు జరుగతుంటాయి. భగవంతా, ‘నేను నీ దాసుడిని’, అనుకుని నన్ను క్షమించు. ఆ తరువాత తీర్థప్రాశానము చేయవలెను.

సందర్భము : సనాతన లఘుగ్రంథము ‘హారతి ఎలా చేయవలెను?’

Leave a Comment