దేవతలకు పంచోపచార పూజ ఎలా చేయాలి ?

గంధం : అనామిక వ్రేలితో (చిటికిన వ్రేలు ప్రక్క వ్రేలు) దేవుడికి గంధమును సమర్పించవలెను. పువ్వులు : ఆయా దేవతల తత్త్వాన్ని అధికంగా ఆకర్షించే పువ్వులు, పత్రిని ఆయా దేవతలకు సమర్పించవలెను. అగర్బత్తీలు : ఆయా దేవతల ఉపాసనకు పూరకమైన సుగంధము కలిగిన 2 అగర్బత్తీలను ఆయా దేవతల ఎదుట వెలిగించవలెను. దీపం : దేవుడికి నెయ్యి దీపముతో మూడు సార్లు హారతి ఇవ్వవలెను. నైవేద్యం : దేవుడికి అరటి ఆకు పై నైవేద్యమును సమర్పించవలెను. (ఆధారం … Read more

భగవంతుడికి నమస్కారము చేయు సరైన పద్ధతి

ముందుగా రెండు అరచేతులను ఒకదానికి ఒకటి జోడించవలెను. చేతులను జోడించునపుడు వ్రేళ్ళను వదులుగా ఉంచవలెను. చేతులు జోడించి కొద్దిగా ముందుకు వంగి, రెండు చేతుల బొటన వ్రేళ్ళను భ్రూమధ్యకు స్పర్షించి, మనస్సును దేవుని చరణాల పై ఏకాగ్ర పరచవలెను. ఏకాగ్రచిత్తముతో దేవునికి ప్రార్థన చేసి, జోడించిన చేతులను వెంటనే కిందికి దించకుండా చేతి మణికట్టు హృదయ మధ్యభాగములో తాకే విధంగా కొద్దిసేపు ఉంచి తరువాత చేతులను కిందికి తీసుకురావలెను. ఈ విధంగా నమస్కరించుట వలన దేవుని కృప … Read more

హిందూ ధర్మానికనుగుణంగా పుట్టిన రోజు ఆచరించండి !

పుట్టినరోజు పండుగను శాస్త్రంలో చెప్పినట్టు తిథికనుగుణంగా, నూనె దీపముతో హారతి చేసి ఆచరించవలెను. కొవ్వొత్తులను ఆర్పీ, కేక్ కోసి పుట్టినరోజును జరుపుకోకండి ! శుభాకాంక్షలను తెలుగులోనే చెప్పండి ! ఇంటి దేవత పూజ చేయవలెను మరియు కనీసం 3 మాలల నామజపం చేయవలెను. పాశ్చాత్య సంస్కృతికనుగుణంగా పుట్టినరోజును ఆచరించి సంస్కృతికి  విరోధులు కాకండి !