దేవుడి పూజ అనగా ఏమి, దేవుని పూజ నిర్మితము, మహాత్వము, ప్రకారములు, కొన్ని దేవతల పూజ యొక్క విశిష్టత మరియు దానికి గల కారణాలు, దేవుడి పూజ రోజులో ఎన్ని సార్లు చేయాలి మరియు ఏ సమయము చేయాలి, దేవుడి పూజ ఎప్పుడు చేయకూడదు అనువాటి గురించి శాస్త్రమును తెలుసుకుందాం.
హోళి కూడా సంక్రాంతిలాగ ఒక దేవతయే. షడ్వికారాలపై విజయాన్ని సాధించే సామర్థము హోళికా దేవిలో కలదు. ఈ వికారాలపై విజయాన్ని సాధించే సామర్థమును పొందుటకు హోళికా దేవిని ప్రార్థిస్తారు. అందుకే హోళిని ఉత్సవరూపములో జరుపుకుంటారు.
కరచాలన చేయుటవలన క్రిములు వ్యాపిస్తాయి అందుకనే ఇప్పుడు విదేశాలలో కూడా‘కరచాలన చేయుటకు బదులు చేతులను జోడించి నమస్కారం చేయండి’ అని ప్రచారం జరుగుతోంది. కరచాలన చేయుటవలన సూక్ష్మరూపము గల చెడుశక్తుల నుండి ఇబ్బంది కలిగే అవకాశముంటుంది. దీనికి బదలుగా చేతులను జోడించి నమస్కారం చేసినప్పుడు మనలో నమ్రత భావము పెరిగి వృత్తి సాత్త్వికమవుతుంది. హిందువుల్లారా, చైతన్యమయ హిందూ సంస్కృతిని కాపాడండి !
దేవతల జయంతి రోజున (ఉదా. శ్రీరామనవమి) లేదా ఉత్సవ సమయములో (ఉదా. గణేశోత్సవము) ఆయా దేవతా తత్వము ఎక్కువగా కార్యనిరతమై ఉండును. దేవతల జయంతి లేదా ఉత్సవ సమయములో ఆయా దేవతల నామజపం చేయుట వలన దేవతా తత్వమును ఎక్కువగా గ్రహించవచ్చును. (వినండి : సాత్విక స్వరంలోని సనాతన ధ్వనిముద్రిక దేవతల నామజపం చేయు సరైన పద్ధతి)
శృంగదర్శనం అంటే నంది రెండు కొమ్ముల మధ్య నుండి శివలింగమును దర్శించుకోవడం. శివలింగము నుండి వెలువడే శక్తితో కూడిన తరంగాల వల్ల సామాన్య భక్తుల శరీరములో ఊష్ణము నిర్మాణమగుట, తల బరువెక్కుట మొ॥ ఇబ్బందులు కలుగవచ్చును.
ముందు కళశం తరువాత మెట్లకు నమస్కరించాలి. క్రమంగా దేవత చరణాలు, ఛాతి, కన్నుల వైపుకు చూడాలి తరువాత దేవునికి నమస్కారం చేయాలి. మనస్సులో నామజపం చేస్తూ మధ్యమ గతిలో ప్రదక్షిణలను చేయవలెను. కూర్చొని నామజపం చేసి, దేవునికి నమస్కారం, ప్రార్థన చేసి బయలుదేరవలెను. బయటకు వచ్చిన తరువాత కళశానికి మరొక్కసారి నమస్కారం చేయవలెను. ఆధారం : సనాతన గ్రంథం ‘దేవస్థానములో దర్శనం ఎలా చేసుకోవలెను ?’
దేవస్థానంలో దర్శనం కొరకు నిలుచున్నప్పుడు కబుర్లు చెప్పుకోవడం, సినిమా పాటలను వినడం మొ॥ చేయకుండా సతతంగా నామజపం చేయండి ! చక్కెర, నూనె, పాలు, నెయ్యి, కొబ్బరినీరు లాంటి పదార్థములను గర్భగుడిలో లేదా దేవాలయ ప్రాంగణంలో పారబోయకండి ! దేవస్థాన ప్రాంగణంలో చెప్పులను వేసుకోని నడవడం, ధూమపానము మరియు మద్యపానీయమును సేవించడం మొదలైన కృత్యములను చేయకండి ! ఆధారం : సనాతన గ్రంథం ‘దేవస్థానములో దర్శనము ఎలా చేసుకోవాలి ?’
దేవునిగది తూర్పు-పడమరగా ఉండాలి. దేవునిగదిలో ఇలవేల్పు, శ్రీ గణపతి, తరతరాల నుండి వస్తున్న దేవతా మూర్తులు, ఉపాస్యదేవతలు (ఉదా. శ్రీ వెంకటేశ్వర, అమ్మవారు మొ॥) వీరిని మాత్రమే పెట్టవలెను. మధ్యభాగములో గణపతి, పూజ చేయువారి కుడి వైపున స్త్రీ దేవత, ఎడమ వైపున పురుష దేవతా మూర్తులను/పటమును ఒకదాని వెనుక ఒకటి ‘శంఖం’ ఆకారంలో పెట్టవలెను. (ఆధారం : ‘దేవుని గది మరియు పూజా ఉపకరణాలు’ లఘుగ్రంథము)