ప్రశాంతమైన నిద్ర యొక్క ప్రాముఖ్యత

మనిషి దైనందిన జీవితంలో నిద్ర చాలా ముఖ్యమైన భాగం. చాలా మందికి ప్రశాంతమైన నిద్ర అనేది అరుదయిపోయింది. ఈ సమస్యకు సాధారణంగా స్థూల స్థాయిలో వైద్యుని సంప్రదించి నిర్దేశించిన ఔషధాలను తీసుకుంటారు. కానీ దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక కారణాలు మనకు తెలిస్తే ఈ సమస్యను అధిగమించడం చాలా సులభం. ఈ వ్యాసం నిద్రను గురించి సాధారణ సమాచారం, నిద్ర యొక్క ప్రాముఖ్యత, నిద్ర వ్యవధి, నిద్ర మరియు దుష్ట శక్తి మధ్య సంబంధం, అలాగే నిద్రలేమి వెనుక ఉన్న ప్రాథమిక సమస్యలు మరియు ప్రశాంతమైన నిద్ర కోసం ఆధ్యాత్మిక ఉపచార పద్ధతుల గురించి మార్గదర్శకత్వం చేయబడింది.

నామజపము చేస్తు పడుకున్నచో వ్యక్తి చుట్టు సంరక్షణ కవచము నిర్మాణమౌతుంది !

1. ‘నిద్ర’ అనే పదం యొక్క ఉత్పత్తి మరియు అర్థం

1 అ. ఉత్పత్తి

నిద్ర అనేది దేవత బ్రహ్మ యొక్క స్త్రీ రూపం మరియు సముద్ర మదనం నుండి ఉద్భవించినది అని పురాణాలలో ఒక కథ ఉంది.

1 ఆ. అర్థం

‘మేధ్యామనఃసంయోగః అనగా ‘మేధ్య’ అని పిలువబడే నాడి మరియు మనస్సు సంయోగమే ’నిద్ర’. సర్వేంద్రియాలు మనస్సులో లీనమైనప్పుడు, అంటే, ఇంద్రియాలు పనిచేయడం మానేసినప్పుడు, వ్యక్తి నిద్రపోతాడు. ఈ సమయంలో వ్యక్తి వినలేడు, చూడలేడు మరియు ఊపిరి తీసుకోలేడు.

1 ఇ. సతేజ నిద్ర

సరైన ఆహారంతో, జీవికి సరైన నిద్ర ప్రాప్తిస్తుంది. దీన్ని ‘సతేజ నిద్ర’ అంటారు. ఉపచేతన మనస్సులో సాత్వికమైన ఆలోచనలు ఉన్నప్పుడు నిద్రలో వున్న సమయంలో కూడా వ్యక్తి యొక్క ఆధ్యాత్మిక సాధన ఉపచేతన మనస్సులో కొనసాగుతుంది. ఈ సాధన కారణంగా, వ్యక్తి యొక్క మనస్సు స్వచ్ఛంగా మారుతుంది మరియు మనోలయ స్థితికి చేరుకోవడానికి సులభం అవుతుంది.

– ఒక పండితుడు (సౌ. అంజలి గాడ్గిల్‌ మాధ్యమంగా, అధిక వైశాఖం, శుక్లపక్షం, పంచమి, కలియుగ సంవత్సరము 5112 (19.4.2010), మధ్యాహ్నం 1.49)

 

2. నిద్ర యొక్క ప్రాముఖ్యత

శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి ఆహారం ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. రోజంతా పని చేయడం ద్వారా శరీరం మరియు ఇంద్రియాలు అలసిపోతాయి. వాటిని మరల అసలు స్థాయికి తీసుకురావడానికి విశ్రాంతి అవసరం. విశ్రాంతి యొక్క సహజ స్థితి నిద్ర. ఆనందం-బాధ, ఊబకాయం-సన్నబడటం, జ్ఞానం-అజ్ఞానం, ఆరోగ్యం మరియు బలం అన్నీ నిద్రపై ఆధారపడి ఉంటాయి.

 

3. నిద్ర యొక్క కాల వ్యవధి

నిద్ర యొక్క కాల వ్యవధి వ్యక్తి యొక్క వయస్సు, త్రిగుణాలు (సత్వ, రజ, మరియు తమ) మరియు స్వభావం పై ఆధారపడి ఉంటుంది.

3 అ. వయస్సును అనుసరించి

1. పిల్లలకు 10 నుండి 12 గంటలు, యువతకు 8 గంటలు, పెద్దలకు 7 గంటలు మరియు వృద్ధులకు 4 నుండి 6 గంటల నిద్ర ప్రతిరోజు అవసరం.

3 ఆ. త్రిగుణాలను అనుసరించి

2. సాత్విక వ్యక్తులకు 4 నుండి 6 గంటలు, రాజసిక వ్యక్తులకు 8 గంటలు మరియు తామసిక వ్యక్తులకు 10 నుండి 12 గంటల నిద్ర ప్రతిరోజు అవసరం.

3 ఇ. ప్రకృతిని అనుసరించి

1. వాత(గాలి) ప్రకృతి ఉన్న వ్యక్తికి గాఢమైన నిద్ర రాదు. వ్యక్తి నిద్రలో చంచలంగా ఉంటాడు మరియు  కొంచెం శబ్దం అయినా, కూడా నిద్ర చెదిరిపోతుంది.

2. పిత్త ప్రకృతి ఉన్న వ్యక్తికి ప్రశాంతమైన నిద్ర రాదు. అతనికి ప్రతిరోజూ 8 గంటల నిద్ర అవసరం.

3. కఫ (కఫం) ప్రకృతి ఉన్న వ్యక్తికి ప్రశాంతమైన నిద్ర వస్తుంది. వ్యక్తి రోజూ 8 గంటలకు పైగా నిద్రపోతాడు’.

 

4. నిద్ర సమస్యలు

ప్రస్తుత ఒత్తిడితో కూడిన జీవనశైలి, కుటుంబం లేదా ఉద్యోగ ఒత్తిడి వల్ల చాలా మందికి ప్రశాంతమైన నిద్ర అనేది అరుదయిపోయింది. రాత్రి వేళలో మంచి నిద్ర లేకపోతే, అది మరుసటి రోజు దినచర్యపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. నిద్ర రుగ్మతలతో బాధపడేవాళ్ళు ఆధునిక వైద్యులను ఆశ్రయిస్తారు. వారు నిద్రపోవడానికి మందులను మరియు కొన్ని రకాల వ్యాయామాలను సూచిస్తారు. ‘అల్లోపతి’లో  ఇంతకు మించి పరిష్కారం లేదు.

రాత్రి ప్రశాంతంగా నిద్రపోయిన తర్వాత కూడా ఉదయం పని చేసేటప్పుడు నిద్రవస్తే ఏమి చేయాలి ?

కొన్నిసార్లు  రాత్రి ప్రశాంతంగా నిద్ర పోయిన తర్వాత కూడా ఉదయం పని చేసేటప్పుడు నిద్రవస్తుంది. దీని వెనుక ఆయుర్వేద కారణం క్రింద ఇవ్వబడింది.

శరీరంలో కఫ దోషం పెరగడం వల్ల కూడా ఉదయం వేళల్లో నిద్రవస్తుంది.

పూర్వాహ్వే పూర్వరాత్రే చ శ్లేష్మ (ప్రకుప్యతి) – అష్టాంగ హృదయ్‌, నిదానస్థాన్‌, అధ్యాయం 1, శ్లోకం 18

అర్థం : పగలు మరియు రాత్రిలో మొదటి మూడింట ఒక వంతులో కఫం పెరుగుతుంది.

ఈ సూత్రం ప్రకారం ఉదయం కఫం పెరుగుతుంది, కాబట్టి నిద్ర వస్తుంది. అలాంటి సమయంలో నిద్రపోతే, కఫం పెరిగే అవకాశం ఉంది మరియు రుగ్మత పెరుగుతుంది. అందువల్ల, రాత్రి ప్రశాంతంగా నిద్ర పోయిన తర్వాత కూడా మళ్ళీ ఉదయం వేళలో నిద్రవస్తే, నిద్రపోకుండా శారీరక శ్రమ (ఉదా. నడవడం, ఆడటం) చేస్తే నిద్రరాదు.

– వైద్య మేఘరాజ్‌ పరాడ్కర్‌, సనాతన ఆశ్రమం, గోవా.

 

5. నిద్రలేమికి మూల కారణం

నిద్రకు సంబంధించిన ప్రకృతి నియమాలను విస్మరించడం మరియు ధర్మంలో పేర్కొన్న సంబంధిత ఆచారాలను పాటించకపోవడం, నిద్రలేమి సమస్యకు మూలకారణాలు. నిద్ర సంబంధిత ఇబ్బందులు తొలగించడం ద్వారా రాత్రి ప్రశాంతమైన నిద్ర రావడానికి, తల ఏ దిశలో పెట్టాలి, పడకగదిలో పూర్తి చీకటిలో ఎందుకు నిద్రపోకూడదు మొదలైన విషయాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక శాస్త్రం గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

 

6. నిద్ర మరియు దుష్ట శక్తి

కొన్నిసార్లు నిద్రలేమికి లక్షణాలు, కారణాలు తెలియవు. నిద్రలో మంచం నుండి లేచి నడిచి వెళ్ళడం వంటి సందర్భాలు ఉంటాయి. దీనికి దుష్ట శక్తుల బాధ కారణం అయి ఉండవచ్చు. రాత్రి సమయంలో దుష్ట శక్తుల ప్రభావం పెరగడంవల్ల, నిద్రలో ఉన్న వ్యక్తిపై చెడు శక్తులు సులభంగా దాడి చేయగలవు. కాబట్టి ఉదయాన్నే నిద్రలేవకపోవడం, నిద్ర  మేల్కొన్న వెంటనే లేవలేకపోవడం, శరీర భారం, ఉత్సాహం లేకపోవడం వంటి సమస్యలు కలుగుతాయి. పై వాటికి ఆధ్యాత్మిక నివారణలు మాత్రమే తీసుకోవాలి. నిద్రపోయిన తరువాత, నిద్రిస్తున్న వ్యక్తి యొక్క దిశ మరియు భంగిమలో మార్పు ఉండటానికి దుష్ట శక్తుల బాధ కారణం కావచ్చు. అటువంటప్పుడు, కుటుంబంలోని సభ్యులు వ్యక్తి యొక్క తల తూర్పు వైపు పెట్టి పడుకొనేలా చేయవచ్చు.

 

7. ప్రశాంతమైన నిద్ర కోసం కొన్ని ఆధ్యాత్మిక నివారణలు

నిద్రలో ఉన్నప్పుడు చెడు శక్తుల కారణంగా నిద్ర భంగం కలగకుండా మరియు ప్రశాంతమైన నిద్ర కోసం, మంచం చుట్టూ దేవతల నామజపము పట్టీలను ఉంచాలి, దిండు దగ్గర సాత్విక సాంబ్రాణి కడ్డీ వెలిగించాలి, మంచం మీద విభూతి మరియు కర్పూరం చల్లాలి, రాత్రంతా నూనె దీపం వెలిగించండి, నిద్రపోయే ముందు ఉపాస్య దేవతను మరియు నిద్రా దేవతను ప్రార్థించడం వంటి సులువైన ఆధ్యాత్మిక నివారణలు చేయాలి.

 

8. జీవితంలో సాధన యొక్క ప్రాముఖ్యత

కలియుగంలో, తమోగుణ నిద్రను సత్వగుణ నిద్రలోకి మార్చడానికి, అంటే, ప్రశాంతమైన నిద్ర కోసం, సాధన చేయడం చాలా అవసరం.

సూచన : సనాతన ప్రచురణ గ్రంథం ‘ప్రశాంతంగా ఎలా నిద్రపోవాలి?’

 

9. నిద్రరావడానికి కారణాలు మరియు సంబంధిత ప్రక్రియలు, నిద్ర సమస్యలు

అ. శరీరం యొక్క వివిధ కదలికల కారణంగా అవయవాలు అలసిపోతాయి మరియు వాటికి విశ్రాంతి అవసరం. నిద్ర ఈ అవసరాన్ని తీరుస్తుంది.

ఆ. రోజంతా ఆలోచించే విధానం మనస్సు మరియు మెదడును అలసిపోయేలాచేస్తుంది ; కాబట్టి వాటికి కూడా విశ్రాంతి అవసరం. నిద్ర ఈ అవసరాన్ని తీరుస్తుంది. ప్రశాంతంగా నిద్రపోయిన వ్యక్తి, తన చుట్టూ జరిగే అన్ని సంఘటనలను విస్మరిస్తాడు మరియు అతనికి కలలు కూడా రావు.

ఇ. అన్ని ఇంద్రియాలు మనస్సులో విలీనం అయినప్పుడు, అంటే, అన్ని అవయవాల పనితీరు ఆగిపోయినప్పుడు, వ్యక్తి నిద్రపోతాడు. ఆ సమయంలో, వ్యక్తి  వినలేడు, చూడలేడు, వాసన చూడలేడు.

ఈ. మనస్సు శ్వాసతో లయమయినప్పుడు, దాని పనితీరు ఆగిపోతుంది మరియు వ్యక్తి నిద్రపోతాడు.

ఉ. సమతుల్యమైన ఆహారం తీసుకుంటూ మరియు తగినంత చురుకుగా వుండు వ్యక్తికి తగినంత నిద్ర అవసరం.

అ. శరీరంలోని సానుకూల మరియు ప్రతికూల ప్రవాహాల సమతుల్యత మరియు నిద్రతో వాటి సంబంధం

శరీరంలో ’సానుకూల శక్తి’ ప్రభావం వల్ల చేతనా-శక్తి (చేతనాశీల శక్తి) యొక్క నిష్పత్తిలో పెరుగుదల ఉన్నప్పుడు, అనగా, ‘ధ్రువరేఖ’  (గమనిక 1) యొక్క ‘యాంగ్‌’ (గమనిక 2) ద్వారా, నిద్రలేమి వచ్చే అవకాశం ఉంది. అయితే, ‘యిన్‌’ (గమనిక 3) ధ్రువరేఖ అంటే జీవిత శక్తిలో నిష్పత్తి ‘ప్రతికూల శక్తి’ ప్రభావంతో పెరిగితే, అధిక నిద్ర లేదా విస్మృతి ఫలితాలను ఇస్తుంది. సానుకూల మరియు ప్రతికూల ధ్రువరేఖల మధ్య చేతనా-శక్తి యొక్క సమతుల్యత ఉంటే, అప్పుడు మూడు నుండి నాలుగు గంటల నిద్ర కూడా ఉత్సాహాన్ని లేదా హాయిని ఇస్తుంది.

గమనిక 1: శరీరంలోని చేతనా-శక్తి శరీరమంతా నిర్దిష్ట మార్గాల్లో ప్రవహిస్తుంది. ఈ మార్గాలను (చైనీస్‌ భాషలో ‘జింగ్‌ లువో’) ధ్రువరేఖలు అని పిలుస్తారు. మొత్తం మీద, అటువంటి ప్రధాన ధ్రువరేఖలు పద్నాలుగు ఉన్నాయి.

గమనిక 2: మానవులు సూర్యుడి నుండి స్వీకరించే చేతనా-శక్తిని ‘సానుకూల’ (చైనీస్‌ భాషలో ‘యాంగ్‌’) శక్తిగా గుర్తించారు. ఈ శక్తి వేలికొనల నుండి నోటికి మరియు అక్కడి నుండి పాదాలకు ప్రవహిస్తుంది.

గమనిక 3: భూమి నుండి మానవులు స్వీకరించే చేతనా-శక్తిని ‘ప్రతికూల’ (చైనీస్‌ భాషలో ‘యిన్‌’) శక్తిగా గుర్తించారు. ఇది పాదాల నుండి నడుము వరకు మరియు అక్కడ నుండి చేతి లోపలి వైపు నుండి అరచేతి వరకు ప్రవహిస్తుంది.

సూచన: సనాతన ప్రచురణ గ్రంథం ‘ప్రశాంతంగా ఎలా నిద్రపోవాలి?’

 

10. రాత్రి సమయానికి నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేవడం వల్ల కలిగే ప్రయోజనాలు

ఈ రోజుల్లో ప్రజల జీవిత విధానం వేగవంతమై జీవనశైలి క్షీణించింది.  ప్రజలు ఉదయాన ఆలస్యంగా నిద్రలేస్తున్నారు మరియు  అర్థరాత్రి నిద్రపోతున్నారు. బహుశా దీని వల్ల వారు ఉదయాన్నే మేల్కొనలేరు. తెల్లవారుజామున మేల్కొనడం వల్ల అనేక ప్రయోజనాలు వున్నాయి అని ఒక పరిశోధనలో తేలింది.

అ. రాత్రి త్వరగా పడుకొని మరియు ఉదయాన్నే లేచిన వారు రోజంతా ఉత్సహంగా ఉంటారు.

ఆ. ఉదయాన్నే లేవడం అనే అలవాటు తల్లిదండ్రుల నుండి పిల్లలకు వారసత్వంగా వస్తుంది. వారు ప్రశాంతంగా ఉంటారు మరియు తేలికగా చిరాకు పడరు. విచారం మరియు మనోవైకల్యము వంటి అనారోగ్యాల గురించి వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారు మంచి మానసిక ఆరోగ్యంతో ఉంటారు.

ఇ. నేచర్‌ కమ్యూనికేషన్స్‌ అనే దినపత్రికలో ఈ విషయంపై ప్రచురితమైన ఒక పరిశోధనా పత్రం మనిషి యొక్క రోజువారీ జీవనశైలి గురించి ఒక పెద్ద సత్యాన్ని వెల్లడించింది. ‘ఆలస్యంగా నిద్రపోవడం మరియు ఆలస్యంగా మేల్కొనడం’ మానసిక ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ఎలా ప్రభావితం చేస్తుంది పేర్కొంది. మరియు ఇతర అనారోగ్యాలకు కూడా ఎలా కారణమౌతుందో పేర్కొంది.

ఈ. బ్రిటన్‌లోని ‘ఎక్సెటర్‌ విశ్వవిద్యాలయం’ మరియు అమెరికాలోని ‘మసాచుసెట్స్‌ జనరల్‌ హాస్పిటల్‌’ మార్గదర్శకత్వంలో ఈ అంశంపై పరిశోధనలు జరిగాయి.

సూచన : మరాఠి దిన పత్రిక ‘సనాతన ప్రభాత్‌ ’

Leave a Comment