హారతి పాడుట

హారతి భావపూర్ణముగా మరియు సాత్వికముగా అగటకు అవసరమైన అంశాలు !

1. హారతి పాడే వారి భావము

హారతి ఇచ్చే వారికి భగవంతుని పై ఎంత ఎక్కువ భావము ఉంటుందో, హారతి కూడ అంతే ఎక్కువ భావపూర్ణముగా మరియు సాత్వికంగా అవుతుంది. ఈ విధమైన హారతి త్వరగా భగవంతుణ్ణి చేరుకుంటుంది. ఈ విధంగా హారతి పాడే వారికి క్రింద చెప్పిన లాభములు కలుగుతాయి.

అ. హారతి సమయంలో సమిష్టి భావము ఎక్కువ ప్రమాణంలో ఉంటే, దేవుళ్ళ చైతన్యమయ
లహరులు వాతావరణంలో ఎక్కువ సమయం ఉండడం ద్వారా చైతన్యము యొక్క లాభమవ్వడం

‘హారతి భావపూర్ణముగా అగుటకు ప్రతి ఒక్క జీవుడు ప్రయత్నించవలెను. సమిష్టి భావము ఎంత ఎక్కువగా ఉంటే అంతే ఎక్కువ ప్రమాణంలో మరియు ఎక్కువ సమయము వాతావరణంలో దేవుళ్ళ చైతన్యమయ లహరులు ఉంటాయి. అలాగే సాత్విక స్పందనల పొర భూమిపై నిర్మాణమవుతుంది. ఈ పొర జీవునికి చాలా ఎక్కువ చైతన్యమును లభింపచేస్తుంది. దీని నుండి జీవుని స్ధూల మరియు సూక్ష ్మదేహముల శుద్ధి అగుటకు సహాయమై జీవుని ఆధ్యాత్మిక ఉన్నతి శీఘ్రముగా జరుగుతుంది.’ – (సద్గురు శ్రీమతి అంజలీ గాడ్గీళ్‌ గారి ద్వారా, 5.6.2005, సా.6.33)

(ప్రతి ఒక్కరిలో భావస్ధాయి బాగా ఉండాలి అని లేదు. భావము తక్కువవున్న వారికి కూడా భావపూర్ణ హారతి పాడుటకు వీలుకావలెనని సనాతన సంస్ధ ‘హారతి సంగ్రహము (అర్థముతో సహ) మరియు శ్రీరామ రక్షాస్తోత్రము మరియు మారుతిస్తోత్రము’ అనే ఆడియో సి.డి లను తయారు చేసినది. గణపతి, శివుడు, దుర్గా, శ్రీరాముడు, శ్రీకృష్ణ, దత్తుని మరియు విఠలుని ప్రఖ్యాతి గాంచిన హారతులు వీటిలో ఉన్నవి. సనాతన సంస్ధలో భావమును కలిగియున్న సాధకురాలు (పూ.) శ్రీమతి అంజలీ గాడ్గీళ్‌ మరియు ఇతర సాధకులు ఈ హారతులను పాడుటచే అవి భావపూర్ణము, సాత్విక మరియు చైతన్యదాయకమైనవి. ‘శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము మరియు వాటికి సంబంధించిన శక్తి కలిసి ఉంటుంది’, అనెడి అధ్యాత్మశాస్త్రీయ తత్వానుసారముగా భావమున్న సాధకులు హారతిని పాడిన విధంగా ఇతరులు కూడా పాడితే వారికి కూడా భావజాగృతి త్వరగా అగుటకు సహాయమవుతుంది. – సంకలనకర్త)

 

2. హారతి పదముల ఉచ్చారణ మరియు పలికే విధానము

హారతిలోని పదముల ఉచ్చారణ, పదములను పలికే వేగము, పదములు కలిపి చెప్పడం లేక విడదీసి చెప్పడం మొదలగు వాటిపై పదముల నుండి ఏర్పడు సాత్వికత మరియు చైతన్యము ఆధారపడుతుంది. ఈ అంశము తెలుసుకొనుటకు క్రింద ఉదాహరణ ఇవ్వబడినది. హారతిలోని లేక ఏ పాటలోనైన పదముల ఉచ్చారణ వేరే వేరే విధంగా చేస్తే పదముల నుండి ప్రసరించు సాత్వికత ఎలా మారుతుందో తెలుస్తుంది.

‘శ్రీకృష్ణూని హారతిలో ఒక చరణములో ఇలా ఉంది – ‘ధ్వజవజ్రాంకుశ బ్రీదాచా తోడర ’ ఈ చరణమును క్రింద చెప్పిన విధంగా రెండు పద్ధతులలో చెప్పవచ్చును.

పద్ధతి 1 : ‘ధ్వజవజ్రాంకుశ బ్రీదా చా తోడర’

దీనిలో ‘బ్రీదాచా’ అనే పదములో ‘దా’ అక్షరమును దీర్ఘముగా పలికారు.

పద్ధతి 2 : ‘ధ్వజవజ్రాంకుశ బ్రీదాచా తోడర’

దీనిలో ‘బ్రీదాచా’ ఈ పదములో ‘చా’ అక్షరమును దీర్ఘముగా పలికారు.

‘బ్రీదాచా’ ఈ పదము సహజముగా ఆలాపన లేకుండా చెప్పడము వలన ఆ శబ్దము నుండి ప్రసరించు సాత్వికత 100% ఉంటుంది, అయితే హారతిలో మనకు తాళ బంధనము ఉండడము వలన ఆ పదము

ఆలాపనతో, అనగా పదములోని ప్రత్యేక అక్షరమును దీర్ఘముగా పలుకవలెను.

పద్ధతి ‘1’ ప్రకారముగా ‘దా’ పదమును పలికితే, ఆ పదము నుండి సాత్వికత 80% ప్రసరించుతుంది. పద్ధతి ‘2’ ప్రకారముగా ‘చా’ పదమును పలికితే, ఆ పదము నుండి సాత్వికత 60% ప్రసరించును.

దీని నుండి ఏదైనా పాటలోని ప్రతి ఒక్క పదమును చక్కగా ఉచ్ఛరించుట ఎందుకు ముఖ్యమైనదో తెలుస్తుంది. ఉచ్చారణ చక్కగావుంటేనే భావము ఏర్పడుటకు తోడ్పడుతుంది. పదములోని మధ్య అక్షరమును దీర్ఘముగా పలుకుట వలన, దాని నుండి నిర్మాణమగు నాద లహరులను కట్టి ఉంచే సామర్ధ్యము పదము యొక్క చివరి అక్షరములో ఉండుటవలన అలాంటి పదములో చైతన్యము ఎక్కువగా ఉంటుంది మరియు అది ఎక్కువ సమయము నిలిచి ఉంటుంది. దీనికి విరుద్ధంగా పదము లోని చివరి అక్షరమును దీర్ఘముగా పలుకుట వలన మరియు దాని తరువాత అక్షరము లేనందున, ఇలాంటి పదము నుండి నిర్మాణమగు నాదలహరులకు బంధనము లేకపోవుట చేత అవి వాతావరణములో వెంటనే కలిసి పోతాయి. దాని వలన ఇలాంటి పదములో చైతన్యము క్షణిక కాలము ఉండుటవలన ఆ పదములో సాత్వికత లాభము మనకు చెప్పుకొన్నంత కలగదు. అందుకొరకు పదము యొక్క చివరి అక్షరము కంటే మధ్య అక్షరమును దీర్ఘముగా పలుకుట ఎక్కువ లాభదాయకము. ఆధ్యాత్మ ఉన్నతి కొరకు పై స్థాయిలో ఉండే పాటను ఆలపించుటకన్నా సరళమైన పాటలను ఆలపించుట వలన మనస్సుకి ఆనందము మరియు శాంతి లభించును.’ – ఒక విద్వాంసుడు (సద్గురు శ్రీమతి అంజలీ గాడ్గీళ్‌ గారి ద్వారా, 19.1.2004, ఉ. 10.59)

(కొన్ని ప్రఖ్యాతి గాంచిన హారతులు సాత్వికమగుటకు, దానిలోని పదముల ఉచ్చారణ మరియు వాటిని పలికే విధానము ఎలా ఉండవలెనో తెలుసుకొనుటకు సనాతన తయారు చేసిన ఆడియోక్యాసెట్‌ మరియు సి.డి ‘హారతి సంగ్రహము మరియు ఓంకార సాధన’ చూడుము.)

 

3. హారతి యొక్క అర్ధమును తెలుసుకొని హారతి పాడడము

చాలా వరకు హారతులను సంతులు మరియు గొప్ప భక్తులు రచించారు. ఉన్నతస్ధాయి సంతులు రచించి నటువంటి హారతుల అర్ధము తెలుసుకొనుట కొన్ని సందర్భాలలో కఠినమవుతుంది. అయితే హారతి అర్ధము తెలుసుకొని హారతి పాడితేనే, దేవునిపట్ల భావజాగృతి త్వరగా అగుటకు సహాయమవుతుంది. అర్ధము తెలుసుకొని హారతి పాడే సందర్భములో ఒక సాధకురాలికి కలిగిన అనుభూతి క్రింద ఇవ్వడమైనది.

హారతిని యిచ్చెడి సమయములో హారతి పాట యొక్క అర్ధము వైపు మనస్సును నిలిపినపుడు భావజాగృతి కావడము ప్రతిరోజు హారతి పాడే సమయములో హారతి పాట అర్ధము వైపు మనస్సును కేంద్రికరించడము వలన నా తల నుండి కాళ్ళవరకు మరియు కాళ్ళనుండి తలవరకు మెట్టు మెట్టుగా సంవేదన గమనించగలిగాను. ఈ సంవేదనం యొక్క ప్రతి మెట్టుతో పాటు నా భావము జాగృతమె్యును. తరువాత చాలా ఉత్సాహముగా అనిపించినది మరియు శక్తి లభించినది. హారతి అయిన తరువాత కూడా చాలా సమయం వరకు భావ స్థితిలోనే ఉన్నాను. – శ్రీమతి మేఘనా వాఫ్‌ుమారె, దేవద్‌ సనాతన ఆశ్రమం, పన్వేల్‌, మహారాష్ట్ర.(ఎప్పుడు జీవుని భావజాగృతి అవుతుందో, ఆ సమయములో భగవంతుని నుండి వచ్చు చైతన్యమును గ్రహించుట వలన జీవుని ఉత్సాహము పెరుగుతుంది.- పరాత్పర గురువులు డా. జయంత్‌ ఆఠవలె)

సేకరణ : సనాతన లఘుగ్రంథము ‘ హారతి ఎలా చేయాలి ?

Leave a Comment