త్రిపిండి శ్రాద్ధం యొక్క ఉద్దేశం, చేసే విధానం, పద్ధతి !

మనకు తెలియని, మన వంశంలో సద్గతి దొరకని వారికి లేదా దుర్గతి ప్రాప్తించినవారికి,  మన వంశజులను పీడించే పితరులకు, వారి ప్రేతత్వం తొలగి సద్గతి దొరకాలని త్రిపిండి శ్రాద్ధం చేయబడుతుంది.

శ్రాద్ధ కర్మయొక్క ప్రాముఖ్యత

హిందూ ధర్మంలో చెప్పబడిన ఈశ్వర ప్రాప్తి యొక్క మూలభూత సిద్ధాంతాలలో “దేవఋణం, ఋషిఋణం, పితృఋణం అలాగే సమాజ ఋణం తీర్చడం” అన్నది ఒక ముఖ్య ఉద్దేశం. వీటిలో పితృఋణం తీర్చడానికి “శ్రాద్ధ కర్మ అవసరం.