ప్రథమ పూజ గణపతికి ఎందుకు ?

గణపతి పది దిక్కుల స్వామి. తన అనుమతి లేకుండా ఇతర దేవతలు పూజాస్థలానికి రాలేరు. గణపతి ఒక్క సారి దిక్కులను విముక్తి పరచిన తరువాత ఏ దేవత యొక్క ఉపాసన మనం చేస్తుంటామో ఆ దేవత ఆ స్థలానికి రాగలరు. అందువలనే ఏ ఒక్క శుభ కార్యం చేస్తున్నప్పడు లేదా ఏదైనా ఒక దేవత పూజ చేసే ముందు ప్రథమంగా గణపతి పూజను చేస్తారు. గణపతి చెడు శక్తులను తన పాశంతో బంధించి ఉంచుతాడు. కాబట్టి తన … Read more

అలంకరణ కోసం వాడే చట్రములలో (ఫ్రేమ్) థర్మోకోల్ ను వాడకండి !

శ్రీ గణపతి విగ్రహము కొరకై అలంకరణ చట్రములను తయారు చేసేటప్పుడు థర్మోకోల్ ను వాడకండి. 1. థర్మోకోల్ సహజంగా మట్టిలో కలిసిపోదు, అందుచేత దానిని ఉపయోగించడం పర్యావరణమునకు హానికరం. అది ఒక రసాయనిక పద్ధతిలో తయారు చేయబడినది కాబట్టి దానిలో రజస్, తమో గుణములు ప్రబలంగా ఉంటాయి. అటువంటి రజస్, తమో గుణములు ప్రబలంగా ఉన్నటువంటి వస్తువు సాత్వికతను గ్రహించలేదు. పైగా, అది రజస్, తమో గుణముల ప్రకంపనలను పర్యావరణంలోకి ప్రసరింప చేస్తుంది. 2. దానికి బదులుగా, … Read more

ఓ భక్తుల్లారా, శ్రీ గణపతి గురించి మీకు తెలుసా ?

కార్యము మరియు వైశిష్ట్యములు 1. విఘ్నహర్త  గణేశుడు విఘ్నహర్త అయినందున నాటకము మొదలుకొని వివాహము వరకు, అలాగే ‘గృహ ప్రవేశము’ మొదలగు అన్ని విధుల ప్రారంభములో శ్రీ గణేశుని పూజ చేస్తారు. 2. ప్రాణశక్తిని పెంచేవాడు మానవుని శరీరములోని వేరే వేరే కార్యములు వేరే వేరే శక్తుల నుండి జరుగుతుంటాయి. ఆ వివిధ శక్తుల మూలభూత శక్తినే ‘ప్రాణశక్తి’ అంటారు. శ్రీ గణపతి నామజపము ప్రాణశక్తిని వృద్ధి చేస్తుంది. 3.  మహాగణపతి ఋద్ధి-సిద్ధి (శక్తి) సమేతంగా ఉన్న … Read more

శ్రీ గణపతికి తులసి దళములను ఎందుకు సమర్పించకూడదు ?

పౌరాణిక కారణము పురాణముల ప్రకారము, పూర్వము ఒక అందమైన గంధర్వ కాంత ఉండేది. ఆమె తనకొక మంచి భర్త కావలెనని కోరుకొన్నది. అందుకోసం ఆమె ధ్యానం చెయ్యడం, వ్రతములను ఆచరించడం, తీర్థ యాత్రలు చెయ్యడం వంటి అనేక పుణ్య కార్యములను చేసింది. ఒకరోజు ఆమె శ్రీ గణపతి ధ్యానంలో ఉండడాన్ని గమనించింది. వెంటనే అతని పట్ల ఆకర్షితురాలైంది. అతడిని ధ్యానం నుండి మేల్కొల్పడానికి ఆమె “ఓ ఏకదంతా, ఓ లంబోదరా, ఓ వక్రతుండా” అని పిలువ సాగింది. … Read more

శ్రీ గణేశుడికి గరిక(దుర్వము)ను ఎన్ని సంఖ్యల్లో సమర్పించాలి ?

1. ఉత్పత్తి మరియు అర్థం గరిక (దుర్వ) : శ్రీ గణపతి పూజలో దుర్వ మహత్వమైనది. దుర్వ ఈ పదము దూః + అవమ్‌ ఇలా తయారయినది. ‘దూః’ అంటే దూరములో ఉన్నది మరియు ‘అవమ్‌’ అంటే ఏది దగ్గరకు తెస్తుందో అది. దూరములో ఉన్న గణేశుని పవిత్రకములను ఏది దగ్గరకు తెస్తుందో, అదే దుర్వము అంటే గరిక. 2. గణపతికి ఎన్ని సంఖ్యలో దుర్వ సమర్పించాలి ? బేసి సంఖ్యా శక్తి తత్త్వానికి ప్రతీక. గణపతికి … Read more

శ్రీ గణపతికి ఎర్రని వస్తువులు సమర్పించుటకు గల ప్రాముఖ్యత 

దేవతా పవిత్రకములు అనగా ఆ దేవత యొక్క సూక్ష్మాతి సూక్ష్మ కణములు. ఏ వస్తువులో పలానా దేవత యొక్క పవిత్రకములు ఇతర వస్తువులకు పోలిస్తే ఎక్కువ ప్రమాణంలో ఆకర్షించబడుతుందో, అటువంటి వస్తువులను దేవతకు సమర్పిస్తే ఆ దేవతా తత్త్వము విగ్రహంలో ఆకర్షితమై ఆ దేవతా విగ్రహంలోని చైతన్యం యొక్క ప్రయోజనం మనకు చేకూరుతుంది. ఈ తత్త్వానికి అనుగుణంగా, శ్రీ గణపతి పూజలో ఎర్ర రంగు వస్తువులను ఉపయోగించవలెను. శ్రీ గణపతి రంగు ఎర్రగా ఉంటుంది. ఆయన పూజలో … Read more

సంకటకాలములో (అత్యవసర పరిస్థితులు) గణేశోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి ?

కరోనా వంటి సంక్షోభం నేపథ్యంలో, హిందూ  ధర్మాచరణ యొక్క శాస్త్రములో కొన్ని ప్రత్యామ్నాయాలు ఇవ్వబడ్డాయి, దీనిని  ‘ఆపద్ధర్మము’ అని పిలుస్తారు. 

ఉత్తరపూజను చేసిన తరువాత అదే రోజు లేదా తరువాయి రోజున మూర్తిని నిమజ్జనము చేయుట అన్ని విధములుగా సరియైనది

శ్రీ గణేశుని నిమజ్జన సందర్భములో ఒక్క వైశిష్ఠ్యపూర్ణమైన విషయము ఏమనగా జీవము లేని మూర్తిలో ప్రాణప్రతిష్ఠ ద్వారా తీసుకువచ్చిన దైవత్వము ఒక్క రోజు కన్ననూ అధికముగా ఉండదు. దీని అర్థము ఏమనగా గణేశుని నిమజ్జనము ఎప్పుడైనా చేయండి, శ్రీ గణేశుని మూర్తిలో ఉన్న దైవత్వము తరువాయి రోజునే నష్టము అయ్యి ఉంటుంది. అందుకనే ఏదైనా దేవత యొక్క ఉత్తరపూజను చేసిన తరువాత అదే రోజున కానీ లేదా తరువాయి రోజు కానీ మూర్తిని నిమజ్జనము చేయుట మంచిది. … Read more

ప్రవాహిస్తున్న నీటిలో శ్రీ గణేశుడి విగ్రహా నిమ్మజనం చేయండి !

గణేశ భక్తులారా, గణేశ చతుర్థి కాలంలో, మీరు శ్రీ గణేశుడిని భక్తితో,  శాస్త్రానుసారంగా పూజ చేస్తారు. ఆ విగ్రహాన్ని శాస్త్రానుసారంగా   నిమ్మజనం చేయుటకు బదులుగా, కేవలం ప్రసిద్ధి కోసం పర్యావరణాన్ని పరిరక్షింస్తున్నట్లు నటించే నాస్తికులకు మీరు విగ్రహాన్ని అప్పగించబోతున్నారా ? ఈ ధర్మద్రోహుల వికృతి పిలుపుకు లొంగకుండ, నిమ్మజనం చేయని మహాపాపమునకు దూరంగా ఉండండి. శ్రీ గణేశ విగ్రహాన్ని ధర్మ శాస్త్రానుసారంగా బంకమట్టితో తయారు చేస్తే పర్యావరణ కూడా పరిరక్షింపబడుతుంది మరియు ధర్మాచరణ చేసినందు వలన … Read more