శ్రీ గణపతికి ఎర్రని వస్తువులు సమర్పించుటకు గల ప్రాముఖ్యత 

దేవతా పవిత్రకములు అనగా ఆ దేవత యొక్క సూక్ష్మాతి సూక్ష్మ కణములు. ఏ వస్తువులో పలానా దేవత యొక్క పవిత్రకములు ఇతర వస్తువులకు పోలిస్తే ఎక్కువ ప్రమాణంలో ఆకర్షించబడుతుందో, అటువంటి వస్తువులను దేవతకు సమర్పిస్తే ఆ దేవతా తత్త్వము విగ్రహంలో ఆకర్షితమై ఆ దేవతా విగ్రహంలోని చైతన్యం యొక్క ప్రయోజనం మనకు చేకూరుతుంది.

ఈ తత్త్వానికి అనుగుణంగా, శ్రీ గణపతి పూజలో ఎర్ర రంగు వస్తువులను ఉపయోగించవలెను. శ్రీ గణపతి రంగు ఎర్రగా ఉంటుంది. ఆయన పూజలో ఎర్రని వస్త్రము ఎర్రని పువ్వులు మరియు రక్తచందనాన్ని ఉపయోగిస్తారు. వాటి ఎర్రని రంగు ద్వారా వాతావరణములోని శ్రీ గణపతి పవిత్రకాలు మూర్తివైపు ఎక్కువ ప్రమాణములో ఆకర్షితమై మూర్తిని జాగృత పరచడములో సహాయపడతాయి.

Leave a Comment