ఉత్తరపూజను చేసిన తరువాత అదే రోజు లేదా తరువాయి రోజున మూర్తిని నిమజ్జనము చేయుట అన్ని విధములుగా సరియైనది

శ్రీ గణేశుని నిమజ్జన సందర్భములో ఒక్క వైశిష్ఠ్యపూర్ణమైన విషయము ఏమనగా జీవము లేని మూర్తిలో ప్రాణప్రతిష్ఠ ద్వారా తీసుకువచ్చిన దైవత్వము ఒక్క రోజు కన్ననూ అధికముగా ఉండదు. దీని అర్థము ఏమనగా గణేశుని నిమజ్జనము ఎప్పుడైనా చేయండి, శ్రీ గణేశుని మూర్తిలో ఉన్న దైవత్వము తరువాయి రోజునే నష్టము అయ్యి ఉంటుంది. అందుకనే ఏదైనా దేవత యొక్క ఉత్తరపూజను చేసిన తరువాత అదే రోజున కానీ లేదా తరువాయి రోజు కానీ మూర్తిని నిమజ్జనము చేయుట మంచిది. పురుడు కానీ లేదా సూతకము కానీ ఉన్నచో, పురోహితుల ద్వారా శ్రీ గణేశుని వ్రతమును ఆచరించవచ్చును. ఇంటిలో ప్రసూతి మొదలగు వాటి గురించి ప్రతీక్షించకుండా అనుకొన్న సమయములో నిమజ్జనము చేయవలెనని శాస్త్రములో చెప్పబడినది.

Leave a Comment