శ్రీ గణేశ చతుర్థి వ్రతం యొక్క మహత్వం

1. మహత్యము

ఆషాఢ పౌర్ణిమ నుండి కార్తీక పౌర్ణిమ వరకు ౧౨౦ రోజుల కాలములో వినాశకారక, తమోప్రధాన యమలహరులు ఎక్కువ ప్రమాణములో పృథ్విపైకి వస్తాయి. ఈ కాలములో వాటి తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. ఈ తీవ్రకర కాలములో, అంటే భాద్రపద శుక్ల చతుర్థి నుండి అనంత చతుర్థి వరకు గణేశుని లహరులు భూమిపైకి ఎక్కువ ప్రమాణములో రావడము వలన యమలహరుల తీవ్రత తక్కువ అగుటకు సహాయమౌతుంది. ఈ స్పందనల గురించి ఎక్కువ వివరాలు ‘ఆధ్యాత్మికశాస్త్రము ఖండము ౫౦-పండుగలు, ధార్మిక ఉత్సవ ములు మరియు వ్రతములు’ ఈ గ్రంథంలో ఇవ్వబడినది.

శ్రీ గణేశ చతుర్థి యందు, అలాగే గణేశోత్సవ రోజులలో శ్రీ గణేశుని తత్త్వము ప్రతిరోజుకు పోలిస్తే ౧,౦౦౦ కార్యనిరతమై యుండును. ఈ సమయంలో చేసిన శ్రీ గణేశుని నామజపం, ప్రార్థన మరియు ఇతర ఉపాసనల ద్వారా ఎక్కువెక్కువ గణేశతత్త్వము యొక్క లాభమగును.

2. కుటుంబములో ఎవరు చేయాలి ?

గణేశ చతుర్థి నాడు ఆచరించే వ్రతమును ‘సిద్ధివినాయక వ్రతము’ అంటారు. వాస్తావానికి దీనిని ప్రతి యొక్క కుటుంబము ఆచరించాలి. అన్నదమ్ములు ఒక్కేచోట కలిసి ఉంటే, అనగా వారు, ఆస్తిపాస్తులను భాగాలు పంచుకోకుండా ఉమ్మడి కుటుంబములోనే ఉంటే అందరు ఒకే మూర్తి పూజను చేయాలి. అయితే ఆస్తిపాస్తుల పంపకాలు ఏ కారణంతో నైనా జరిగి విడిపోయి ఉంటే ప్రతి ఒక్కరు వారివారి ఇంట్లో స్వతంత్రంగా శ్రీ గణేశ మూర్తిని పూజించాలి.

ప్రశ్న : ద్రవ్యకోషము మరియు పాకనిష్పత్తి వేరుగా ఉన్నచో ప్రతి ఒక్కరూ స్వతంత్రంగా శ్రీ గణేశ మూర్తిని పూజించడం యోగ్యమైనది అని శాములో చెప్పినది. కానీ కొన్ని కుటుంబములో కులాచారమునకనుసారంగా లేదా ముందు నుండీ నడుస్తూ ఉన్న పద్ధతికనుసారంగా ఒక్క గణపతిని కూర్చోబెట్టే పరంపర ఉన్నది. ఇలాంప్పుడు అన్నదమ్ముళ్ళలో ప్రతి సంవత్సరం ఒక్కొక్కరి ఇంటిలో కూర్చోబెడతారు. ఇది యోగ్యమా లేదా అయోగ్యమా ?

ప.పూ. డా॥ జయంత బాళాజి ఆఠవలె : కులాచార మునకనుసారంగా లేదా ముందు నుండీ నడుస్తూ వస్తున్న ఒక్కటే గణపతిని కూర్చోబెట్టే ధృఢమైన పద్ధతిని మార్చే ఉద్దేశము లేకపోతే ఎవరిలో శ్రీ గణపతి గురించి ఎక్కువ భక్తిభావము ఉన్నదో ఆ అన్నయ్య ఇంటిలో గణపతిని కూర్చోబెట్టడమే యోగ్యమైనది.

Leave a Comment