శ్రీ గణేశుడికి గరిక(దుర్వము)ను ఎన్ని సంఖ్యల్లో సమర్పించాలి ?

1. ఉత్పత్తి మరియు అర్థం

గరిక (దుర్వ) : శ్రీ గణపతి పూజలో దుర్వ మహత్వమైనది. దుర్వ ఈ పదము దూః + అవమ్‌ ఇలా తయారయినది. ‘దూః’ అంటే దూరములో ఉన్నది మరియు ‘అవమ్‌’ అంటే ఏది దగ్గరకు తెస్తుందో అది. దూరములో ఉన్న గణేశుని పవిత్రకములను ఏది దగ్గరకు తెస్తుందో, అదే దుర్వము అంటే గరిక.

2. గణపతికి ఎన్ని సంఖ్యలో దుర్వ సమర్పించాలి ?

బేసి సంఖ్యా శక్తి తత్త్వానికి ప్రతీక. గణపతికి గరికలకు 3, 5, 7 ఈ విధంగా సమర్పించాలి. దీని నుండి విగ్రహంలో శక్తి తత్త్వం సులభంగా ఆకర్షించబడుతుంది. శ్రీ గణపతికి అర్పించే గరిక లేతగా ఉండాలి. దీనినే ‘బాలతృణమ్‌’ అని అంటారు. ఎండిన దానిని ఒక విధమైన గడ్డిగా పరిగణిస్తారు.

3. గరికను సమర్పించే విధానం

గణపతి విగ్రహం పే గరికను సమర్పించే టప్పుడు మొహం వదిలి సంపూర్ణ విగ్రహం పై సమర్పించాలి. దీనితో గరిక యొక్క సుగంధం విగ్రహం నలువైపులా ప్రసరిస్తుంది.

గరికలో గణపతి తత్త్వం ఉండడం వల్ల ఆ విగ్రహం లో గణపతి తత్త్వం త్వరగా ఆకర్షితం అవుతుంది. దీనితో గణపతి పూజ చేసే పూజకుడికి అలాగే పూజలో ఉపస్థితులై ఉన్నవారికి గణపతి తత్త్వం ఎక్కువగా దొరుకుతుంది.

Leave a Comment