గల్లు ఉప్పు మరియు ఎర్ర ఎండు మిరపకాయలను ఉపయోగించి కుదృష్టిని తీసివేయు పద్దతి 

మనోమయ శరీరంలో రజ – తమ ప్రధానమైన తరంగాలు తొలగడం వల్ల ఆ వ్యక్తి మానసిక సందేహాలు తొలగి ఉద్రిక్తతకు లోనవకుండా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మితిమీరిన ఆలోచనలు ద్వారా బాధపడే వ్యక్తులకు ఈ విధంగా కుదృష్టిని తీసివేయడం వల్ల చాల ప్రయోజనాన్ని పొందుతారు.

శ్రీ గణేశ చతుర్థీ రోజున పూజ చేసేందుకు మూర్తిని ఇంటికి ఎలా తీసుకొనిరావలెను ?

మూర్తి యొక్క ముందు భాగము నుండీ సగుణ తత్త్వము మరియు వెనుక భాగము నుండీ నిర్గుణ తత్త్వము ప్రక్షేపితము అవుతుంది. మూర్తిని చేతిలో పట్టుకొనేవారు పూజకుడైయుంటాడు.

అలంకరణ కోసం వాడే చట్రములలో (ఫ్రేమ్) థర్మోకోల్ ను వాడకండి !

శ్రీ గణపతి విగ్రహము కొరకై అలంకరణ చట్రములను తయారు చేసేటప్పుడు థర్మోకోల్ ను వాడకండి. 1. థర్మోకోల్ సహజంగా మట్టిలో కలిసిపోదు, అందుచేత దానిని ఉపయోగించడం పర్యావరణమునకు హానికరం. అది ఒక రసాయనిక పద్ధతిలో తయారు చేయబడినది కాబట్టి దానిలో రజస్, తమో గుణములు ప్రబలంగా ఉంటాయి. అటువంటి రజస్, తమో గుణములు ప్రబలంగా ఉన్నటువంటి వస్తువు సాత్వికతను గ్రహించలేదు. పైగా, అది రజస్, తమో గుణముల ప్రకంపనలను పర్యావరణంలోకి ప్రసరింప చేస్తుంది. 2. దానికి బదులుగా, … Read more

శ్రీ గణపతికి తులసి దళములను ఎందుకు సమర్పించకూడదు ?

పౌరాణిక కారణము పురాణముల ప్రకారము, పూర్వము ఒక అందమైన గంధర్వ కాంత ఉండేది. ఆమె తనకొక మంచి భర్త కావలెనని కోరుకొన్నది. అందుకోసం ఆమె ధ్యానం చెయ్యడం, వ్రతములను ఆచరించడం, తీర్థ యాత్రలు చెయ్యడం వంటి అనేక పుణ్య కార్యములను చేసింది. ఒకరోజు ఆమె శ్రీ గణపతి ధ్యానంలో ఉండడాన్ని గమనించింది. వెంటనే అతని పట్ల ఆకర్షితురాలైంది. అతడిని ధ్యానం నుండి మేల్కొల్పడానికి ఆమె “ఓ ఏకదంతా, ఓ లంబోదరా, ఓ వక్రతుండా” అని పిలువ సాగింది. … Read more