నమస్కారము ఎలా చేయావలెను ?

దేవుణ్ణి దర్శించుకొనునప్పుడు లేక పెద్దలు మరియు గౌరవనీయ వ్యక్తులు కలిసినప్పుడు మన చేతులు మన ప్రమేయంలేకుండానే నమస్కరిస్తాయి. ‘నమస్కార’ము అంటే హిందువుల మనస్సులో ఉండే ఒక సాత్విక సంస్కారం, సమృద్ధమైన హిందూ సంస్కృతిని కాపాడే పద్ధతి. భక్తిభావము, ప్రేమ, గౌరవము, లీనత, మొదలగు దైవీ గుణములను వ్యక్తపరచు మరియు ఈశ్వరీ శక్తిని ప్రదానం చేసే సులభమైన ధార్మిక కృతి అంటే నమస్కారము.

నమస్కారము యొక్క అధ్యాత్మశాస్త్రము తెలియనందున, పాశ్చాత్య సంస్కృతి ప్రభావ ఫలితంగా ప్రస్తుత కాలంలో చాలామంది నమస్కారానికి బదులు కరచాలనం (శెక్ హ్యాండ్) చేస్తారు. నమస్కారము చేయునప్పుడు మన వలన తప్పులు జరిగితే నమస్కారము వలన లభించే ఫలము తక్కువవుతుంది. ఇందుకొరకు నమస్కారము గురించిన వివరాలను ఇక్కడ పొందుపరచాము.

1. బయటి ఊరికి వెళ్ళేటప్పుడు మరియు ఊరి నుండి
వచ్చిన తరువాత ఇంటిలోని పెద్దలకు ఎందుకు నమస్కారము చెయ్యాలి?

‘ఇంట్లోని పెద్దలకు నమస్కారము చేయడమంటే ఒక విధంగా వారిలోని దైవత్వానికి శరణాగతి కావడం. ఎప్పుడు ఒక జీవము క్రిందికి వంగి లీనభావంతో (వినయ) పెద్దలలో ఉండే దైవత్వానికి శరణాగతి అవుతుందో, అప్పుడు ఆ దేహంలో కరుణారసము నిర్మితి ఏర్పడును. ఈ కరుణారసము జీవుని సూక్ష్మదేహము వరకు పోతుంది. అప్పుడు అతని మనఃశక్తి కార్యనిరతమై మణిపూరచక్రంలో స్థిరమైయున్న పంచప్రాణములను కార్యనిరతము చేస్తాయి. శరీరంలోని పంచప్రాణముల చలనమువల్ల జీవుని ఆత్మశక్తి జాగృతమౌతుంది. ఆత్మశక్తి ఆధారముతో సుషూమ్నానాడి కార్యనిరతమై జీవుని వ్యక్తభావశక్తి అవ్యక్తభావశక్తిగా రూపాంతరము చెందుతుంది. అవ్యక్తభావశక్తి ఆధారంగా జీవునికి పెద్దల ద్వారా బ్రహ్మాండములో అవశ్యకమైన దైవ తత్వం లభిస్తుంది. ఇందుకొరకు జీవము ఇంటినుండి బయటకు వెళ్లేటప్పుడు పెద్దలకు నమస్కరించి సాత్విక తరంగాల ఆధారముతో వాయుమండలములోని ఇబ్బందికర స్పందనల నుండి తన రక్షణ చేసుకోవడం అలాగే బయటి నుండి వచ్చిన తరువాత కూడా పెద్దలకు నమస్కరించి వారిలో ఉండే దైవత్వమును ప్రకటింపజేసి తనతోపాటు వచ్చిన రజ-తమ కణముల వాయుమండలమును నాశనము చేయవలసి ఉంటుంది.’ – (సద్గురువు) శ్రీమతి. అంజలీ గాడ్గీళ్‌ 20.5.2005 మ.2.57

 

2. వయోవృద్ధులకు ఎందుకు నమస్కారము చెయ్యాలి ?

ఊర్ధ్వ ప్రాణా హుత్క్రామంతి యూనః స్థవిర ఆయతి l

ప్రత్యుత్థానాభివాదాభ్యాం పునస్తాన్ప్రతిపద్యతే ll

– మనుస్ము ృతి 2.120, మహాభారతము, ఉద్యోగ. 38.1, అను. 104, 64-65.

అర్థము : వృద్ధపురుషుల రాకతో యువకుల పంచ ప్రాణాలు పైదిశలో జరుగనారంభిస్తాయి. ఎప్పుడు యువకులు లేచి నమస్కారము చేస్తారో అప్పుడు వారి పంచప్రాణములు పూర్వ స్థితికి చేరుకుంటాయి.

‘వృద్ధవ్యక్తుల ప్రయాణము మెల్లమెల్లగా దక్షిణదిక్కువైపు అంటే యమలోకమువైపు (మృత్యువువైపు) అవుతున్నందున వారి శరీరము నుండి రజ-తమ తరంగాల ప్రసరణ చాలా పెద్ద ప్రమాణంలో జరుగుతుంది. ఇలాంటి వృద్ధవ్యక్తి ఎదురైనప్పుడు యువవ్యక్తి శరీరంపై ఆ తరంగాల పరిణామము అవుతుంది, మరియు వారిద్దరిలో సూక్ష ్మ అయస్కాంత క్షేత్రము తయారవుతుంది. దీనినుండి యువవ్యక్తి పంచ ప్రాణాలు పైకి తేలుతాయి. ఈవిధంగా అకస్మాత్తుగా పంచ ప్రాణములు చలించుట వలన వ్యక్తికి ఇబ్బంది కలిగే అవకాశలుంటాయి. ఎప్పుడు యువవ్యక్తి వృద్ధవ్యక్తికి నమస్కరిస్తాడో అప్పుడు యువవ్యక్తిలోని సుషూమ్నానాడి కొంత ప్రమాణంలో జాగృతమై వానిలోని సత్వగుణము పెరుగుతుంది. దీనినుండి ఆ వ్యక్తిలో ఉండే రజస్తమో గుణములపై సత్వగుణ ప్రభావము జరిగి వారి పంచప్రాణములు పూర్వస్థితికి వస్తాయి. కావున వృద్ధవ్యక్తి వచ్చిన వెంటనే చిన్నవారు నమస్కరించే పద్ధతి కలదు’.

– కు. మధురా బోసలే 3.1.2005 మ. 2.44

 

3. వివాహమయిన తరువాత భార్యభర్తలు కలిసి ఎందుకు నమస్కరించాలి ?

‘వివాహమంటే శివరూపమైన పతి మరియు శక్తిరూపమైన పత్ని ఈ తత్వముల సంగమము (కలయిక). ప్రతి కర్మము శివరూపమైన సగుణ ‘క్రియాశక్తి’ (ప్రతక్ష్యకార్యము చేయు) మరియు ఆ కర్మకు చలనానిచ్చే అలాగే నిర్గుణానికి సంబంధించిన ‘శక్తి’, ఈ రెండిటి సంగమము నుండి పూర్ణత్వమునకు వెళ్ళుతుంది. వివాహమయిన తరువాత రెండూ జీవములు గృహస్థాశ్రమములో ప్రవేశిస్తాయి. గృహస్థాశ్రమములో ఒకదానికొకటి అనుకూలంగా ఉంటూ సంసారసాగరములోని కర్మలను చేయడము మరియు అందు కొరకు పెద్దల ఆశీర్వాదము తీసుకొవడము అత్యంత మహత్వము. ఇద్దరు కలిసి నమస్కరించడము చేత బ్రహ్మాండములోని శివ-శక్తిరూపమైన తరంగాలు కార్యనిరతమై జీవులలోని ఐకమత్యభావము పెరుగుతుంది. దీనినుండి గృహస్థాశ్రమములోని కర్మలు పరిపూర్ణమై అవి యోగ్య ఫలితాలిచ్చుట వలన ఇచ్చి పుచ్చుకునే లెక్కలు అతి తక్కువగా నిర్మాణమవుతాయి. కావున వివాహము అయిన తరువాత భార్య-భర్తలిద్దరూ ప్రతి కర్మకు పూరకంగా ఉంటూ నమస్కారము లాంటి కృతిని కూడా పరస్పర ఆమోదంతో చేయవలసి ఉంటుంది. ఇదే పై కృతియందున్న ఉద్దేశము.

 

4. ఒకరినొకరు కలిసినప్పుడు ఏ విధంగా నమస్కరించవలెను ?

ఒకరినొకరు కలిసినప్పుడు ఎదురెదురు లేచి నిలబడి రెండూ చేతుల వేళ్లను జోడించి బొటన వేలికొనను తమ అనాహత చక్రముపై పెట్టి నమస్కరించవలెను. ఈ విధంగా నమస్కరించడము వలన జీవమునకు నమ్రతాభావము పెరిగి బ్రహ్మాండములోని సాత్విక లహరులు నాలుగు వేళ్లనుండి సంగ్రహించబడి బొటన వేలి నుండి శరీరములో వెళ్లడం వలన అనాహతచక్రం జాగృతమౌతుంది. దీనినుండి జీవుని ఆత్మశక్తి కార్యగతమౌతుంది. అలాగే పరస్పరం నమస్కారం చేయడం వలన, ఒకరి నుండి ఒకరికి ఆశీర్వాదాత్మక తరంగాలు ప్రసరితమౌతాయి. దీని వలన ఇద్దరిలో జాగృతమైన దైవత్వలాభము ఇద్దరికి లభించుటకు సహాయమౌతుంది. – (సద్గురువులు) శ్రీమతి అంజలీ గాడ్గీళ్‌ 12.7.2005

 

5. ఎవరినైనా కలిసినప్పుడు కరచాలన (శ్యేక్‌హ్యాండ్‌)
చేయకుండా చేతులను జోడించి నమస్కారం ఎందుకు చేయాలి ?

1. కరచాలన చేసేటప్పుడు చేతుల నుండి ఒకరి ద్వారా మరొకరికి రోగక్రిములు వ్యాపించవచ్చు. అదే విధంగా కొందరికి ఏదైనా తిన్నప్పుడు కాని బయటనుండి వచ్చిన తరువాత గాని చేతులు కడుక్కునే అలవాటు ఉండదు. ఇలాంటి సమయంలో కరచాలన ఆరోగ్యరీత్య అహితకరము.

2. ‘కరచాలన చేయడమంటే మనలో లీనతను తగ్గించుకోవడం మరియు తామసిక ప్రవృత్తిని పెంపొందించడం. ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తులు పరస్పరంగ కరచాలన చేస్తారో, అప్పుడు వారి చేతుల ద్వారా రజో-తమాత్మకమైన తరంగములు వారిద్దరి అరచేతుల ఖాళిలో సంగ్రహించబడతాయి మరియు ఈ తరంగముల ఘర్షణతో ఏర్పడిన ఇంధనము జీవుల చేతుల ద్వారా దేహములోకి ప్రవహిస్తుంది. అలాగే ఈ ఇంధనము నుండి వెలువడే కణముల వలన బయట వాయుమండలము కూడా తామసికమగుట వలన వాతావరణము అశుద్ధమవుతుంది. రజో తమో తరంగముల చలనముల వలన శరీరములోని సూర్యనాడి కార్యనిరతమై తమోగుణము యొక్క సంచారము ఎక్కువ ప్రమాణములో మొదలవుతుంది. దీని పరిణామము మనోమయకోశం పై జరిగి జీవునిలో చికాకు పెరుగుతుంది. అందువలన కరచాలన వంటి తామసిక కృత్యాలను ఆపి జీవునిలో సాత్వికతను పెంపొందించే మరియు లీనత భావమును నేర్పించే నమస్కారము వంటి కృత్యాలను ఆచరణలోకి తీసుకు రావాలి. దీనివలన జీవునికి అతని యొక్క కర్మ ఫలానుసారంగా ఈశ్వరుడి చైతన్యశక్తి లభిస్తుంది. జీవునికి ఆశీర్వాద రూపమైన సంకల్పశక్తి ప్రాప్తమగుటకు తోడ్పడుతుంది మరియు జీవుని కృతి సాధన రూపాన్ని దాల్చిన కొంత వ్యవధిలోనే పూర్ణత్వాన్ని చేరుకుంటుంది.

(సద్గురువులు) శ్రీమతి అంజలీ గాడ్గీళ్‌ , 28.5.2005, మ 12.11)

కరచాలన చేయడము పాశ్చ్యాత్తుల సంసృ్కతి. కరచాలన చేయడమనగా పాశ్చ్యాత్త సంసృ్కతిని ప్రోత్సాహించడం మరియు నమస్కారం చేయడమనగా భారతీయ సంసృ్కతిని ప్రోత్సాహించడం. భారతీయులు భారతీయ సంసృ్కతిని ప్రోత్సాహించి ఈ శిక్షణను భావీ తరాలవారికి ఇవ్వవలెను.

సందర్భము : సనాతన లఘుగ్రంథము ‘నమస్కారముల సరియైన పద్ధతి’

Leave a Comment