శివలింగమును దర్శించుకునే పద్ధతి మరియు బిల్వ పత్రమునకు గల ఆధ్యాత్మికశాస్త్రము

1. శృంగదర్శనం (నంది కొమ్ముల మధ్య నుండి శివలింగమును దర్శించుకొనుట)

1 అ. శృంగదర్శన మహత్వము

శృంగదర్శనం అంటే నంది రెండు కొమ్ముల మధ్య నుండి శివలింగమును దర్శించుకోవడం. శివలింగము నుండి వెలువడే శక్తితో కూడిన తరంగాల వల్ల సామాన్య భక్తుల శరీరములో ఊష్ణము నిర్మాణమగుట, తల బరువెక్కుట మొ॥ ఇబ్బందులు కలుగవచ్చును. నంది కొమ్ముల నుండి ప్రసరించే శివతత్త్వ తరంగాల నుండి వ్యక్తి యొక్క సాత్త్వికత ఎక్కువగుట వలన పై ఇబ్బందులు కలుగవు.

1ఆ. శృంగదర్శనం చేసే పద్ధతి

శివుని దేవస్థానంలో నంది మూడు కాళ్ళను మడుచుకొని, ఒక కాలు నిలువుగా వుంటుంది. శృంగదర్శనం కొరకు నంది కుడి వైపు కూర్చొని లేదా నిల్చొని ఎడమచేతిని నంది తోకపై పెట్టవలెను. కుడి చేతి చూపుడు వేలు మరియు బొటనవేళ్ళను నంది కొమ్ములపై పెట్టి ఆ మధ్య ఉన్న ఖాళీ నుండి శివలింగమును దర్శించుకోవలెను.

1ఇ. లింగమును ప్రత్యక్షంగా దర్శించుకొనుట

లింగమును ప్రత్యక్షంగా దర్శించుకునేటప్పుడు లింగము మరియు నందిని చేర్చే రేఖ మీద కాకుండా ప్రక్కగా నిల్చోవలెను.

1ఈ. లింగ పూజ

శివలింగానికి చల్లని నీటితో, పాలతో లేక పంచామృతముతో అభిషేకం చేస్తారు మరియు బిల్వపత్రము అర్పిస్తారు. పసుపు భూమిలో తయారవుతుంది మరియు అది సృష్టికి ప్రతీక. కుంకుమ పసుపు నుండి తయారగుట వలన అది కూడా సృష్టికి ప్రతీకము. శివుడు ‘లయము’ చేయు దేవుడు కాబట్టి అతని పూజలో సృష్టికి ప్రతీకమైన పసుపు, కుంకుమలను వుపయోగించరు. కానీ భస్మము లయముకు సూచిక అయినందున శివుని పూజలో దానిని వుపయోగిస్తారు. శివుని లింగపూజ చేయునప్పుడు తెల్లని అక్షంతలు వుపయోగిస్తారు. తెల్లని అక్షంతలవైపు నిర్గుణమునకు సంబంధించిన మూల ఉచ్ఛదేవతల తరంగాలు ఆకర్షించబడతాయి. శివుడు కూడా ఎక్కువశాతం నిర్గుణమునకు సంబంధించిన దేవుడు కాబట్టి తెల్లని అక్షంతల నుండి శివ తత్వము యొక్క లాభము ఎక్కువ అవుతుంది.

1ఉ. భస్మము

స్నానము చేయించిన తరువాత శివ లింగమును దర్శించుకొను వైపున భస్మముతో మూడు అడ్డ నామాలను గీస్తారు లేక అడ్డ నామాలను గీసి వాటి మధ్యలో ఒక వృత్తమును వేస్తారు. దీనిని శివాక్షము లేక యోగాక్షము అంటారు.

 

2. బిల్వ పత్రమునకు గల ఆధ్యాత్మికశాస్త్రము

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్య్రాయుధం

త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం ॥

అర్థం : మూడు ఆకులున్న, త్రిగుణములు వలె వుండే, మూడు కన్నుల లాగా వుండే, మూడు ఆయుధములాగా వుండే మరియు మూడు జన్మాల పాపములను నష్టము చేయువంటి బిల్వపత్రమును నేను శంకరునికి అర్పించెదను.

2 అ. శివునికి త్రిదళ బిల్వపత్రమును సమర్పించుట వెనుకటి మనఃశాస్త్ర కారణాలు

2 అ 1.‘సత్వ, రజ మరియు తమో వీటి వలన వుత్పత్తి, స్థితి మరియు లయ జరుగును. కౌమారం, యవ్వనం మరియు జరా ఈ అవస్థలకు ప్రతీకముగా శంకరునికి బిల్వపత్రమును అర్పించడము అంటే ఈ మూడు అవస్థలను దాటిన ముందరికి పయనించే/వెళ్ళే ఇచ్ఛ ప్రకటించుట; ఎందుకనగా త్రిగుణాతీతం అయిన తరువాత భగవంతుడు దొరకును.’ (?)

 

3. శివునికి బిల్వపత్రమును సమర్పించు పద్ధతికి గల ఆధ్యాత్మికశాస్త్రము

తారక లేదా మారక ఉపాసన పద్ధతి కనుగుణంగా బిల్వపత్రమును ఎలా అర్పించాలి ? : బిల్వ పత్రములోని ఆకులు తారక శివతత్వవాహకమైతే బిల్వపత్రము యొక్క కాడ శివుని మారకతత్వవాహకము.

3 అ. శివుని తారక రూపము యొక్క ఉపాసన చేయువారు

సర్వసామాన్య ఉపాసకులు తారక స్వభావముగల వారైనందువలన శివుని తారక ఉపాసన వారికి అనుకూలంగా వుండి వారి ఆధ్యాత్మిక ప్రగతికి పూరకంగా వుండును.

3 ఆ. శివుని మారక రూపము యొక్క ఉపాసన చేయువారు

శక్తిసంప్రదాయమువారు శివుని మారక రూపము యొక్క ఉపాసన చేస్తారు. ఇలాంటి ఉపాసకులు శివుని మారక తత్వము యొక్క లాభమగుటకు బిల్వపత్ర ఆకులు దేవుని వైపు మరియు కాడ మన వైపు చేసి సమర్పించవలెను.

 

4. బిల్వపత్రమును వెల్లకిలా ఎందుకు సమర్పించవలెను ?

బిల్వపత్ర ఆకులను లింగముపై వెల్లకిలా సమర్పించినప్పుడు దాని నుండి నిర్గుణ స్థాయిలోని స్పందనలు ఎక్కువ ప్రమాణంలో ప్రక్షేపితమౌతుంటాయి. అందుకని బిల్వపత్ర ఆకుల నుండి భక్తులకు ఎక్కువ లాభమగును.

 

5. శివలింగమునకు అర్ధప్రదక్షిణాలు ఎందుకు చేస్తారు ?

ప్రదక్షిణ చేయునప్పుడు ఎడమ వైపు నుండి ప్రారంభించాలి మరియు పాణివట్టము (అభిషేకము చేసిన నీరు వెళ్ళే నాళము) వరకు వెళ్లి దానిని దాటకుండా తిరిగి వెనకకు వచ్చి పాణివట్టం వరకు వచ్చి ప్రదక్షిణ పూర్తి చేయాలి. ఈ నియమము కేవలము మానవులు నిర్మించిన (మానవస్థాపిత) శివలింగమునకు మాత్రమే వర్తిస్తుంది. స్వయంభూ లింగము మరియు చలన లింగమునకు (పూజగదిలో వుంచిన లింగము) ఈ నియమము వర్తించదు. పాణివట్టం ప్రవాహములో చాలా శక్తి నిర్మాణమవుతూ వుండుటవలన పాణివట్టమును దాటునప్పుడు కాళ్లు వెడల్పుగా చాపుటవలన వీర్యనిర్మిత మరియు పంచ అంతస్థ వాయువు పై ప్రతికూల పరిణామమవుతుంది.

అభిషేకం

శివుడు అభిషేక ప్రియుడు. అభిషేకము ద్వారా లింగమును నిరంతరము తడిగా వుంచుతారు. ఎందుకంటే జగన్మాత యోని నిరంతరము తడిగా వుండును. కావున లింగము కూడా తడిగా వుండును. (శివ-పార్వతు లను ‘జగతః పితరౌ’ అంటే జగత్తు యొక్క తల్లి-తండ్రులని అంటారు. అభిషేక పాత్ర నుండి నిరంతర పడే నీటిధార నుండి లింగము మరియు పాణివట్టం ఎల్లప్పుడూ తడిగానే వుంటాయి. పాణివట్టం యోనికి ప్రతీకము. జగన్మాత యోని నిరంతరము తడిగా వుండడము శక్తి నిరంతరముగా కార్య నిరతమై వుండుటకు ప్రతీకం. శివుడు కార్యము చేయుటకు శక్తి ప్రేరేపిస్తుంది. శివుడు కార్యమును చేయడమంటే శివుని నిర్గుణతత్వము సగుణతత్వములో ప్రకటితమగుట. ఈ విధంగా అభిషేకము ద్వారా పూజా సమయములో శివుని సగుణ లహరుల లాభము కలుగుటకు సహాయమవుతుంది.) శివుడికి రుద్రమును పఠిస్తూ అభిషేకము చేస్తారు.

సందర్భము : సనాతన ప్రచురణ ‘శివుడు – భాగము 1’

Leave a Comment