దేవుడి పూజ

‘భగవంతునికి పూజ’ అనేది హిందు ధర్మములో సగుణ ఉపాసనా పద్ధతికి పునాదివంటిది. ‘వర్తమానములోని భారవంతమైన జీవనములో భగవంతుని పూజ చేయుటకు ఎవ్వరి దగ్గర సమయము ఉంది ?’, అనేటటువంటి నకారాత్మక మానసికత ప్రస్తుతము అనేక జనాల్లో కనిపిస్తున్నది. రోజు చేసే నిత్యకర్మలలో ఒక్క నిత్యకర్మను పూర్తి చేయాలని దేవుని మీద నీటిని తొందర-తొందరగా జల్లి చందనం బొట్టు పెట్టుట, ఏవో పువ్వులను సమర్పించి ఊదుబత్తిని తిప్పడము మరియు చివరిలో ‘దేవుని పూజ’, అయిపోయిందని అనుకోవడము జరుగుతుంది. ఇలాంటి విచిత్రము నేడు కనిపిస్తుంది. సంపూర్ణ సృష్టిని పోషించే భగవంతుని తొందర-తొందరగా పూజించి ఈ విధంగా ‘పూర్తి చేయడము’, వాస్తవంగా భగవంతుని పూజ అనవచ్చా ? ఇలా చేసిన తరువాత భగవంతుడు కూడ మన మీద కృపను ఎందుకు చూపుతాడు ? ఏ విధంగా మనము ఇంటికి వచ్చిన అతిథిని గౌరవపూర్వకంగా స్వాగతిస్తామో, అదే విధంగా భగవంతుని స్వాగతిస్తే అనగా భగవంతునికి శాస్త్రాన్ని అనుసరించి పూజిస్తేనే, వారు మన మీద ప్రసన్నమై మనకు అనేకమైన ఆశీర్వాదములను ప్రసాదిస్తారు.

ప్రస్తుత లేఖలో మనము దేవుడి పూజ అనగా ఏమి, దేవుని పూజ నిర్మితము, మహాత్వము, ప్రకారములు, కొన్ని దేవతల పూజ యొక్క విశిష్టత మరియు దానికి గల కారణాలు, దేవుడి పూజ రోజులో ఎన్ని సార్లు చేయాలి మరియు ఏ సమయము చేయాలి, దేవుడి పూజ ఎప్పుడు చేయకూడదు అనువాటి గురించి శాస్త్రమును తెలుసుకుందాం.

1. దైవ పూజ : వ్యాఖ్య

భగవంతునికి శ్రద్ధతో మనస్సు ద్వారా సమర్పించే విధియుక్త ఉపచారము అనగా ‘దైవ పూజ’. ‘దేవుని ఛాయాచిత్రము లేదా విగ్రహమునకు శాస్త్రీయ పద్ధతితో చేసిన పూజ భగవంతునికి అపేక్షిత రూపంగా ఉన్నచో, అది వాస్తవిక రూపములో ‘పూజ’ అవుతుంది.’ – భగవంతుడు (కు. మధురా భోసలే గారి మాధ్యంగా, 5.1.2005, రాత్రి రాత్ర 8.13)

 

2. ఉత్పత్తి

2 అ. పూజావిధితో సంబంధిత కృత్యముల ఉత్పత్తి బ్రహ్మాండములో ఉన్న ఇచ్ఛాశక్తి సహాయముతో అగుట

‘పూజ చేయుట, నైవేద్యమును నివేదించుట మొదలగు కర్మకాండముతో సంబంధిత కృత్యములు బ్రహ్మాండములోని ఇచ్ఛాశక్తితో సంబంధించినవి. ఈ కత్యములను చేయుచున్నప్పుడు జీవుని భావమునకనుగుణంగా  ఆయా కృత్యముల ద్వారా ఆయా దేవతల ఇచ్ఛశక్తికి సంబంధించిన తరంగాలు లభిస్తాయి.’ – ఒక విద్వాంసుడు (సద్గురువులు శ్రీమతి అంజలీ గాడ్గీళ్ గారి మాధ్యంగా, 17.12.2008, ఉదయము 8.35)

3. ప్రాముఖ్యత

3 అ. విగ్రహం పై చేయబడే పూజ సంస్కారం వల్ల దైవత్వం జాగృతమగుట

ప.పూ. పాగనీస్ మహారాజ్ గారు ప్రతీరోజు ఒక దేవతా విగ్రహమును పూజించేవారు. విగ్రహము మీద నిరంతరము అవుతున్న ఈ సంస్కారముల వలన అందులో గల దేవతా తత్త్వము జాగృతము అయినది మరియు అందులో 5 శాతము వరకు పెరిగినది. పూజాది సంస్కారముల వలన విగ్రహములోని దేవతాతత్త్వము జాగృతము అవుతుంది. దానితో పాటుగా, సంస్కారములలో భావము ఉన్నచో, అనగా పూజా కృత్యములలో భావము ఉన్నచో, ఆ విగ్రహములో దేవతాతత్త్వము పెరుగతుంది.

3 ఆ. భగవంతుని కృప అగుట

పూజ చేయుట వలన దేవతలు ప్రసన్నులౌతారు. అనగా దేవతా కృపను పొందుటకు పూజకునికి సులభము అవుతుంది.

3 ఇ. పూజకునిలో చైతన్యము పెరుగుట

భగవంతునికి పూజ చేయుట వలన పూజకునికి దేవతా తత్త్వము లభిస్తుంది. అతనిలో గల రజ-తమ ప్రమాణము తగ్గి చైతన్యములో వృద్ధి అగును.

3 ఈ. ‘భగవంతునికి పూజ చేయుట వలన లభించిన సాత్త్విక తరంగాల ద్వారా రోజు వారీ కార్యము ప్రారంభము అవుతుంది.’

– ‘ఒక విద్వాంసుడు’ (సద్గురువులు శ్రీమతి అంజలీ గాడ్గీళ్ గారి మాధ్యంగా, 29.10.2007, పగలు 9.46)

3 ఉ. వాతావరణ శుద్ధి

భగవంతుని పూజ, వాతావరణములోని సాత్త్వికత పెరుగుటలో సహాయము చేస్తుంది.

4. దైవపూజ యొక్క ప్రకారములు

ధర్మశాస్త్రములో భగవంతుని పూజకు కొన్ని ప్రకారములు చెప్పబడినవి. మొదటి రెండు ప్రకారములు, సామాన్యంగా దేనినైతే మనము ‘పూజ’ అంటామో, అది స్థూల స్థాయికి చెందినది మరియు దాని తరువాయి రెండు ప్రకారములు సూక్ష్మ స్థాయికి చెందినవి.

4 అ. పంచోపచార పూజ (మూర్తి లేదా చిత్రమునకు పూజ)

ఇందులో చందనము, పుష్పము, ధూపము, దీపము మరియు నైవేద్యము, ఈ అయిదు ఉపచారములను భగవంతునికి సమర్పిస్తారు.

4 ఆ. షోడశోపచార పూజ (మూర్తి లేదా చిత్రమునకు పూజ)

ఇందులో పైన చెప్పిన పంచోపచారములతో పాటుగా పదహారు ఉపచారములు సమావేశమైనవి.

4 ఇ. మానస పూజ

మనస్సుతో సగుణ మూర్తి కల్పనను చేసి, దానిని పూజ చేయుట

4 ఈ. పరాపూజ

పరావాణితో నిర్గుణ పరబ్రహ్మను పూజించుట

5. కొన్ని దేవతల పూజా విశేషతలు మరియు వాటి కారణములు

అ. దేవతలను ప్రసన్నలుగా చేసుకోవడం

పంచోపచారము మరియు షోఢశోపచారము పూజ వలన దేవత ప్రసన్నము అవుతారు. హిందూ ధర్మము విశేషత ఏమనగా, కొన్ని దేవతలకు ఫలానా ఉపాసనా పద్ధతులు ప్రియమై ఉంటాయి. వీటిని ఆచరించుట వలన ఆ దేవతలు ప్రసన్నులౌతారు. హిందూ ధర్మములోని ఈ విశేషతను తెలిపేందుకు ముందర కొన్ని దేవతల పూజా విశేషతలను కారణా సహితంగా ఇవ్వబడినవి. అధ్యాత్మలోని ఇంత లోతైన చింతన కేవలము హిందూ ధర్మములోనే కనిపిస్తుంది.

దీపప్రియః కార్తవీర్యో మార్తండో నతివల్లభః

స్తుతిప్రియో మహావిష్ణూర్గణేశస్తర్పణప్రియః ॥

దుర్గార్చనప్రియా నూనమభిషేకప్రియః శివః

తస్మాత్తేషాం ప్రతోషాయ విదధ్యాత్తత్తదాదరాత్ ॥

దీపప్రియః ………విదధ్యాత్తత్తదాదరాత్ ॥

సందర్భము : మంత్రమహోదధి 17.116-117 మరియు నారదపురాణము, పూర్వ. 76.115-116

అర్థము : కార్తవీర్యునికి దీపము, సూర్యునికి నమస్కారము, శ్రీవిష్ణూవునకు స్తుతి, శ్రీ గణేశునికి తర్పణము, శ్రీ దుర్గాదేవికి అర్చన మరియు శివునికి అభిషేకము ప్రియమైనవి. అందుకని ఈ దేవతలను ప్రసన్నముగా చేయుటకు వారికి ప్రియమైన కార్యమునే చేయవలెను.

ఆ. శివపూజలో శంఖము యొక్క ప్రాముఖ్యత లేదు

శివపూజలో శంఖమును పూజించరు, అదే విధంగా శంఖముతో జలము వదిలి శివునికి స్నానమును చేయించరు. దేవుళ్ళ విగ్రహ స్థాపన పంచాయతనానుసారంగా ఉంటే, అప్పుడు అందులోని  బాణలింగము మీద శంఖోదకమును వదులవచ్చు; కానీ మహాదేవుని లింగమైన బాణలింగమునకు శంఖోదకముతో స్నానమును చేయించవద్దు.’

శాస్త్రము : శివలింగములో నీటిపాత్ర రూపములో స్త్రీకారకత్వము ఉండుట వలన మరలా స్త్రీకారకత్వము గల శంఖముతో జలమును వేయవలసిన ఆవశ్యకత లేదు. బాణలింగముతో పాటుగా నీటిపాత్ర ఉండదు కాబట్టి దానికి శంఖము జలముతో స్నానమును చేయిస్తారు.

ఇ. హారతి సమయములో శంఖునాదము విహితమైనది

‘దేవాలయములో మహాదేవుడి పూజ చేస్తున్నప్పుడు శంఖపూజ లేదు; కాని హారతికి ముందు శంఖనాదము చేయమని ఆదేశించడము జరుగతుంది మరియు తప్పకుండా జరుగతుంది.’

శాస్త్రము : శంఖానాదముతో ప్రాణాయామము యొక్క సాధనైతే అవుతుంది; దీనితో పాటుగా శంఖానాద ధ్వని ఎక్కడి వరకైతే వినబడుతుందో, ఆ పరిసరములలో భూతము, పిశాచి మొదలగు చెడు శక్తుల కష్టము ఉండదు.

6. భగవంతుని పూజను రోజులో ఎన్నిసార్లు
మరియు ఏ సమయములో చేయవలెను ?

దేవుని పూజ నిత్య కర్మయైనది. ప్రతీదినము త్రికాలములో (ప్రాతఃకాలములో, మధ్యాహ్నము మరియు సూర్యాస్తమయము తరువాత) షోడశోపచార (పదుహారు ఉపచారములతో) పూజ చేయవలెను. ఒక్కవేళ ఈ పూజను త్రికాలములో చేయడము సాధ్యము కాకపోతే ప్రాతఃకాలములో షోడశోపచార పూజను చేయవలెను మరియు మధ్యాహ్నము, సూర్యాస్తమయము తరువాత పంచోపచార (అయిదు ఉపచారములతో) పూజను చేయవలెను. త్రికాల పూజను చేయడము సాధ్యము కాకపోతే త్రికాల సమయములో కనీసము ఒక్కసారైనా పూజను చేయవలెను. షోడశోపచార మరియు పంచోపచార పూజ అసాధ్యము అయితే, చందనము మరియు పుష్పములతో రెండు ఉపచారములతో పూజను చేయవలెను. ధర్మశాస్త్రములో ఈ విధమైనటువంటి వికల్పములు ఇవ్వబడినవి. ఏ స్థితిలోనైనా ఉపాసకుని ద్వారా దేవుని పూజ జరుగవలెనని దీని ఉద్ధేశ్యము !

6 అ. ‘దేవునికి త్రికాల పూజను చేయవలెను’, అని శాస్త్రములలో చెప్పబడినది;
అయిననూ కూడ కలియుగములో ‘కేవలము ఉదయము అయినా పూజ
తప్పకుండా చేయండి, అని చెప్పుటకు గల వివిధ కారణములు

ప్రాతర్మధ్యందినో సాయం దేవపూజాం సమాచరేత్

అర్థము : అయినంతవరకు దేవునికి త్రికాల పూజను చేయవలెను.

6 అ 1. కలియుగములో సాత్త్వికత లోపము వలన కర్మకాండము మాదిరిగా ధర్మములోని
సర్వ ఆచారములను పాటించుట అసాధ్యము అగుట వలన రూఢీవాదము స్థాపితము అగుట

‘పూర్వకాలము సాత్త్వికముగా ఉండేది, అందువలనే త్రికాల పూజను చేసి రోజంతటిలోని మూడు జాములలో బ్రహ్మాండములో విడువబడే రజ-తమాత్మక ధారణను నాశనము చేసి వాతావరణమును శుద్ధముగా ఉంచుట సాధ్యము అయ్యేది; కాని ఇప్పుడు కలియుగములో సాత్త్వికత లోపించినది. అందుకనే కర్మకాండము మాదిరిగా ధర్మములోని సర్వ ఆచారములను పాటించుట అసాధ్యము అయినది. అందువలన కనీసము ఉదయము సమయములో భావపూర్వక పూజను చేసి భగవంతుని నుండీ ప్రక్షేపితము అయ్యే చైతన్యమును వాస్తులో పొందుపరచి ఉంచటానికి ఈ రూఢీవాదమును ప్రతిపాదితము చేయడము జరిగినది. అందుకనే కనీసము ప్రాతఃకాలములోనైనా పూజను చేయమని సంత్ మహానీయులు శిక్షణను ఇచ్చారని తెలుస్తుంది.

6 అ 2. భక్తియోగములో ప్రత్యక్షముగా కర్మకు ఆధారమైన భావము,
మానసపూజ మరియు నామజపమునకు అధిక ప్రాముఖ్యతను ఇచ్చుట

6 అ 2 అ. భావము మరియు మానసపూజ

ఉపాసనాకాండములో ప్రత్యక్షముగా ఆయా సమయములో కర్మను చేయుటను అనివార్యముగా భావిస్తారు; కానీ భక్తియోగములో కేవలము ప్రత్యక్ష కర్మకు ఆధారభూతమైన భావమునకు అధిక ప్రాముఖ్యతను ఇవ్వడము జరిగినది. అందుకనే మానసపూజ వంటి ఉపాసనా పద్ధతి నిర్మాణమైనది.

6 అ 2 ఆ. నామజపము

కలియుగములో మాయాలొని కర్మలకు విశేషమైన ప్రాముఖ్యత లభించినది. అందువలన ‘కర్మ చేస్తున్నప్పుడు నోటితో జపము చేయుట’ను సర్వశ్రేష్ఠ ప్రకార సాధనగా చెప్పబడినది మరియు త్రికాల పూజను చేయుట సాధ్యము కాకపోవుట వలన ఒక్కసారి ఉదయము పూజ చేసిన తరువాత పని చేస్తూ నామజపమును చేయుట సర్వత్రా సమ్మతించబడినది. అందుకనే సాధు-సంతులు కలియుగములో పూజాకాండము చేయుట కన్ననూ, నామసాధన సరళమైనది’ అని చెప్పారు.

దీని ద్వారా తెలిసేది ఏమనగా, ‘కాలము ఎలాగా ఉంటుందో, అలాగా ఉపదేశము’, ఈ ప్రధాన సూత్రమును ఉపయోగించి సాధు-సంతులు ఆయా కాలములలో సమష్టి (సమాజ) కళ్యాణమును సాధించుటకు ఎలా ప్రయత్నిస్తారనేది తెలుస్తుంది.’ -‘ఒక విద్వాంసుడు’ (సద్గురువులు శ్రీమతి అంజలీ గాడ్గీళ్ గారి మాధ్యంగా, చైత్ర శుక్ల 14, కలియుగు సంవత్సరము 5110 (8.4.2009), మధ్యాహ్నం 3.12)

7. భగవంతుని పూజను ఎప్పుడు చేయకూడదు ?

అ. స్నానము చేయనప్పుడు మరియు వ్యసన (మాదక పదార్థము) స్థితిలో ఉన్నప్పుడు

ఆ. మడి అయిన పది రోజుల వరకు. (మడి తగిలిన తరువాత పది రోజుల వరకు మైలు ఉంటుంది. పదుకొండవ రోజు శుద్ధి అయిన పిమ్మట పూజను చేయవచ్చును. మడి తగిలిన 12వ రోజు తరువాతనే కర్త పూజ చేయవచ్చును.)

ఇ. ఇంటిలోని స్త్రీ రజస్వల అయితే మరియు ఏ గదిలోనైతే ఆమె తిరుగదో, ఆ గదిలో పూజాగదిని స్థాపించవలెను, ఇంటిలోని జ్యేష్ఠ పురుషులు స్నానోపరాంతము పూజను చేయవలెను. ఖాళీ ప్రదేశము లేకపోవుట వలన ఒక్కవేళ పూజాగదిని వేరే గదిలో పెట్టడము సాధ్యము కాకపోతే, నాలుగు రోజులు (స్త్రీ యొక్క రజోకాలము సమాప్తము అయ్యేంతవరకు) పూజాగదిని బట్టతో కప్పివేయవలెను. ఏదో కారణము చేత ఈ విధముగా పూజాగదిని మూసి ఉంచడము అనుచితము కాదు. వైష్ణవ సంప్రదాయములోని దేవాలయములలో కూడ ‘భగవంతుడు స్నానమును చేస్తున్నాడు, భగువంతుడు నిద్రిస్తున్నాడు’ అనే కారణములతో భగువంతుని విగ్రుహమును తెరతో కప్పివేసే పద్ధతి కలదు. ఇది ఒక్క రకముగా భగవంతునికి వేరే గది తయారు చేయుటయే అగును.

స్త్రీ రజోకాలములో ఉన్నప్పుడు గదిని తెరతో కప్పివేయవలెను.
దీనికి వివిధ కారణములు క్రింది విధముగా ఉన్నాయి.

1. రజోకాలములో స్త్రీ యొక్క రజోగుణము పెరుగుతుంది. పూజాగదిని తెరిచి ఉంచుట వలన దేవతల నుండీ ప్రక్షేపితము అయ్యే సాత్త్విక స్పందనలు అధిక ప్రమాణములో బయటకు పోతాయి. ఈ సాత్త్విక శక్తి వలన స్త్రీకి కష్టము కలుగువచ్చును.

2. రజోకాలములో స్త్రీలోని రజోగుణములో వృద్ధి అవుతుంది మరియు ఆ అస్తిత్వము వలన వాతావరణము ఒక్క విధముగా అపవిత్రముగా తయ్యారవుతుంది. సంపూర్ణ వాస్తు రాజసిక స్పందనలతో కలుషితము అవుతుంది. దేవతా మూర్తి మీద కూడ రాజసిక స్పందనల వలయము వస్తుంది.

పై కారణముల వలన నాలుగు రోజులు పూజను చేయవద్దు; కానీ మానసపూజను తప్పకుండా చేయండి. అయిదవ రోజు ఇంటిలో గోమూత్రమును (ఉపలబ్ధము లేకపోతే విభూతి జలము)చల్లి మరియు ధూపమును చూపించి వాస్తుశుద్ధి చేయండి. తదనంతరము ఎప్పటిలాగానే దేవుడి పూజించడము ప్రారంభించాలి.

8. దేవుని పూజను ఏ దిశలో చేయవలెను?

తూర్పు దిశకు అధిక ప్రాముఖ్యము ఉన్నది మరియు ఆ దిశ వైపునకు ముఖమును చేసి పూజావిధిని చేయమని చెప్పబడినది; అందుకనే పూజాగది ఎల్లప్పుడూ తూర్పు-పశ్చిమ దిక్కులో ఉండటము సరియైనది. ( ఈ విషయములో అధిక సమాచారము సనాతన లఘగ్రుంథము అయిన ‘పూజాగది మరియు పూజా ఉపకరణములు (శాస్త్రీయ మహత్యము మరియు సంరచన)’ గ్రుంథములో ఇవ్వబడినది.)

సందర్భము : సనాతన ప్రచురణ ‘పంచోపచారము మరియు షోడోశోపచార పూజ యొక్క శాస్త్రము’

Leave a Comment