దేవుడికి సాష్టాంగ నమస్కారము ఎలా చేయవలెను ?

సాష్టాంగ నమస్కారము చేయడం

దేవుడి విగ్రహము ముందు ఖాళీస్థలము వున్నచో దేవుడికి సాష్టాంగ నమస్కారము చేయుట ముఖ్యమైనది. ఈ లేఖనములో శాస్త్రశుద్ధ సాష్టాంగ నమస్కారము ఎలా చేయాలి, దీనిని వివరించడమైనది. ఈ వివరణ చదివి అందరికి దేవాలయములో, అలాగే ఇతర పండుగలు, ఉత్సవాల సమయాలలో సరియైన పద్ధతిలో సాష్టాంగ నమస్కారము చేయుటకు ప్రోత్సాహము లభిస్తుంది !

 

1 . విధిపూర్వకంగా సాష్టాంగ నమస్కారము అంటే ఏమిటి మరియు సాష్టాంగ నమస్కారము యొక్క శాస్త్రమేమిటి ?

(సాష్టాంగ నమస్కారమంటే మనసా వాచా కాయా దేవతలకు శరణాగతులై ఆత్మశక్తిని జాగృతపరుచుటకు స్థూలదేహము మరియు సూక్ష ్మదేహముల శుద్ధి చేయడము)

ఉరసా శిరసాదృష్ట్యా మనసా వచసా తథా

పద్భ్యాం కరాభ్యాం జానుభ్యాం ప్రాణామోష్టాంగముచ్యతే l

అర్థము : 1. ఛాతి, 2. శిరస్సు (తల), 3. దృష్టి (కళ్ళ నుండి నమస్కరించుట), 4. మనస్సు (మనస్సుతో నమస్కరించుట), 5. వాచా (నోటితో నమస్కారము అని చెప్పడము), 6. కాళ్లు, 7. చేతులు, 8. మోకాళ్ళను నేలకు తాకించి నమస్కరించడమంటే సాష్టాంగ నమస్కారము.

ఈ విధంగా చేయు నమస్కారమును విధిపూర్వకంగా నమస్కారం అని అంటారు. దీనిలో మనసా వాచా కాయా దేవతలకు శరణాగతులై వారిని ఆహ్వానిస్తారు. ఈ విధంగా సాష్టాంగా నమస్కారము నుండి ఆత్మశక్తిని జాగృతము చేసి సంపూర్ణ స్థూలదేహము మరియు సూక్ష్మ దేహముల శుద్ధీకరణ చేయబడుతుంది.

 

2. సాష్టాంగ నమస్కారమునకు మరొక నిర్వచనము

షడ్వైరులు, మనస్సు మరియు బుద్ధి ఈ ఎనిమిది భాజకముల సమేతంగా భగవంతునికి శరణాగతి కావడం అంటే సాష్టాంగ నమస్కారము చేయడము. షడ్వైరులు సూక్ష్మమనస్సుకు సంబంధించినవి. పై నిర్వచనములో మనస్సు మరియు బుద్ధి ఈ రెండూ అంశాలను క్రమంగా స్థూల మనస్సు మరియు స్థూలబుద్ధి అనే అర్థంతో ఉపయోగించబడినవి. ఈశ్వరప్రాప్తి కావలెననే తపన 60% కన్నా ఎక్కువగా ఉండే సాధకులు మాత్రమే అహంభావ సమేతంగా శరణాగతి కావచ్చును, అందువలన పైన చెప్పిన నిర్వచనము తపన ఉండే సాధకుల సందర్భములో చెప్పబడినది. – ఒక విద్వాంసుడు (సద్గురువులు) శ్రీమతి అంజలీ గాడ్గీళ్‌ గారి ద్వారా లభించిన జ్ఞానము 8.7.2005 మ. 1.34

(షడ్వైరులు అంటే జన్మజన్మలుగా చిత్తములో ఉండే సంస్కారాల ఆవిష్కారములు. సంస్కారములు చిత్తమునకు అంటే అంతర్మనస్సుకు సంబంధించినవి అంతేకాక అంతర్మనస్సు బాహ్యమనస్సు కన్నా ఎక్కువ సూక్ష ్మమైనది. అందువలన షడ్వైరులు సూక్ష ్మమనస్సుకు సంబంధించినవై ఉంటాయని ఇక్కడ చెప్పబడినది. సాధారణంగా మనము ఆలోచించే మనస్సు (బాహ్యమనస్సు) మరియు ఆలోచించే బుద్ధి ఇలా సంభోధిస్తామో, వాటిని ఇక్కడ క్రమంగా స్థూల-మనస్సు మరియు స్థూల-బుద్ధి అని సంభోధించడమైనది.)

– సంగ్రహకర్తలు

 

3. కృతి

అ. సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు ఛాతి దగ్గ్గర రెండు చేతులను జోడించవలెను, తరువాత నడుము వంచి రెండు చేతులను భూమికి తాకించవలెను.

ఆ. కుడి తరువాత ఎడుమకాలును వెనక్కి పొడుగ్గా చాపవలెను.

ఇ. రెండు మోచేతులను మడచి నుదురు, ఛాతి, అరచేతులు, మోకాళ్ళు కాలివ్రేళ్ళు నేలకు తాకే విధంగా పడుకొని కళ్ళు మూసుకొనవలెను.

ఈ. మనస్సులో నమస్కరించి ‘నమస్కారం’ అనుకోవలెను.

ఉ. లేచి నిలబడి ఛాతి దగ్గ్గర (అనాహతచక్రం) రెండు చేతులను జోడించి భావపూర్ణంగా నమస్కారం చేయవలెను.

1 ఇ. చేతులను జోడించి దేవుడికి నమస్కారము చేయుట

సాష్టాంగ నమస్కారము చేయడానికి వీలుకానట్లైతే చేతులను జోడించి భావపూర్వకంగా నమస్కారము చేయవలెను.

సందర్భము : సనాతన లఘుగ్రంథము ‘నమస్కారముల సరియైన పద్ధతి’

Leave a Comment