ప్రశాంతమైన నిద్ర కొరకు చేయవలసిన ఉపాయములు

ఈ ఆధునిక ఒత్తిడితో కూడిన జీవనశైలి, దేశీయ, కుటుంబ మరియు ఉద్యోగ ఉద్రిక్తతలు మొదలైనవాటి వల్ల చాలా మందికి ప్రశాంతమైన నిద్ర అరుదైపోయింది. నిద్రకు సంబంధించిన ప్రకృతి నియమాలను విస్మరించడం మరియు ధర్మంలో పేర్కొన్న సంబంధిత ఆచారాలను పాటించకపోవడం వంటివి ప్రశాంతమైన నిద్ర రాకపోవడం అనే సమస్యకు మూలకారణంగా ఏర్పడ్డాయి. ఈ వ్యాసంలో మీరు ప్రశాంతగా నిద్రపోవడానికి పడుకునే ముందు చేయవలసిన విధులు, పఠించాల్సిన మంత్రాలు, ప్రార్థనలు మరియు నిద్రకు వెళ్ళేముందు చేయవలసిన జపాలను గురించి వివరించబడింది.

 

1. పడుకునే ముందు చేయవలసిన విధులు

అ. ఆచమనం చేయడం (అరచేతి నుండి నీటిని త్రాగడం)

ఆచమనము చిత్తమును శుద్ధి చేస్తుంది

ఆ. పాదాలు తడిగా ఉంటే పొడిగా తుడుచుకోండి

సంగ్రాహకుడు : నిద్రపోయేటప్పుడు, పాదాలు తడిగా ఉంటే పొడిగా తుడివమని సలహా ఇవ్వడంలో; అంతర్లీన శాస్త్రం ఏమిటి?

ఒక విద్వాంసుడు : నిద్రపోయేటప్పుడు పాదాలు తడిగా ఉంటే, పాదాల నుండి ఆపతత్వం యొక్క (సంపూర్ణ నీటి సూత్రం) తరంగాలు శరీరంలో వ్యాపిస్తాయి మరియు వాటి తదుపరి కదలికల వల్ల శరీరం ఆపతత్వ తరంగాలతో నిండిపోతుంది. పాదాల నుండి ప్రవహించే ఈ తరంగాలు శరీరంతో పాటు శరీరం యొక్క అన్ని సూక్ష్మ కోశాలలోకి వ్యాపిస్తాయి.

నీరు శరీరాన్ని మరింత సున్నితంగా చేస్తుంది మరియు శరీరం లోపలి కోశాలు చురుకుగా మారుతాయి. నీరు శరీరమంతటా ఉంటుంది కాబట్టి, ఇది సానుకూల మరియు ప్రతికూల ప్రకంపనలకు సమానంగా స్పందిస్తుంది. వ్యక్తి నిద్రపోయేటప్పుడు నేలకి అనుసంధానించబడి ఉండడం వల్ల, భూమి నుండి వెలువడే బాధాకరమైన తరంగాలు వ్యక్తి యొక్క తడి శరీరం వైపు తక్షణమే ఆకర్షించబడతాయి మరియు శరీరం యొక్క లోపలి పొరలకు వ్యాపిస్తుంది, తద్వారా రజ-తమ నిష్పత్తి మానోమయ కోశంలో పెరుగుతుంది.

దీనివల్ల వ్యక్తి చికాకుపడటం మరియు పీడకలలు రావడం, నిద్రలో అరవడం, రాత్రంతా అశాంతి వంటివి అనుభవిస్తాడు. అందువల్ల, పడుకునే ముందు పాదాలను పొడిగా తుడుచుకోవాలి. పొడి శరీరం తేజతత్వ ప్రత్యేకమైన తరంగాలను నిల్వ చేయగలదు. అందువల్ల, ప్రతికూల శక్తులచే దాడి చేయబడే అవకాశం చాలా తక్కువ.
(శ్రీమతి అంజలి గాడ్గిల్‌ మాధ్యమంగా, 12.7.2005, రాత్రి 9.45 ని.)

ఇ. నిద్రిస్తున్నప్పుడు తల దగ్గర నీటితో నిండిన లోహపు చెంబు ఎందుకు ఉంచాలి?

1. తల దగ్గర నీటితో నిండిన లోహపు చెంబు ఉంచడం ద్వారా దాని అంతర్లీన ప్రక్రియ వల్ల శరీరాన్ని ప్రతికూల శక్తుల దాడుల నుండి రక్షిస్తుంది.

అ. నీరు అత్యంత సున్నితమైన మాధ్యమం. ఇది అన్నింటినీ కలిగి ఉంటుంది, అనగా, సగుణ మరియు నిర్గుణ తరంగాలను సమాన నిష్పత్తిలో గ్రహించి, విడుదల చేయడంలో ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. అందువల్ల, నీటితో నిండిన లోహపు చెంబును తల ప్రక్కన ఉంచడం వల్ల ప్రతికూల శక్తుల దాడి నుండి వ్యక్తి శరీరం రక్షించబడుతుంది.

ఆ. పగటి సాధన (ఆధ్యాత్మిక సాధన) ఫలితంగా వచ్చిన సాత్విక దివ్య తరంగాలు, నిండుగా నీటితో నింపిన లోహపు చెంబు సామీప్యత కారణంగా జాగృత స్థితిలో ఉంటాయి.

ఇ. నీటితో నిండిన చెంబు, తల ప్రక్కన ఉంచడం వల్ల, బ్రహ్మరంధ్రము (సూక్ష్మ-శరీరంలో ఆధ్యాత్మిక శక్తి వ్యవస్థలో తలపైన వున్న సహస్రార చక్రం) కూడా మేల్కొని ఉంటుంది.

ఈ. ఇది సాధన కారణంగా శరీరం చుట్టూ సృష్టించబడిన రక్షిత కోశాన్ని దుర్బేధ్యంగా ఉంచుతుంది; లేకపోతే, రాత్రి సమయంలో వుండే తామసిక శక్తి కారణంగా, శరీరంలోని సాత్విక శక్తి దుష్ట శక్తుల దాడులను ఎదుర్కోవడంలో వృదా అవుతుంది.

2. సగటు వ్యక్తులు విభూతి లేదా కర్పూరంతో కలిపిన నీటితో నింపిన చెంబు లేదా తీర్థయాత్రల నుండి తెచ్చిన పవిత్రమైన నీటితో నింపిన చెంబును ఉపయోగించాలి.

పవిత్రమైన నీటితో నిండిన ఒక లోహపు చెంబును సగటు వ్యక్తులు రక్షణకోసం మాధ్యమంగా ఉపయోగించవచ్చు. సగటు వ్యక్తి సాధన చేయనందున, ఆ వ్యక్తి నిండుగా పవిత్రమైన జలంతో లేదా సాత్విక కర్పూరంతో కలిపిన నీటితో నింపిన చెంబును రక్షణ కొరకు మాధ్యమంగా ఉపయోగించవచ్చు.

ఈ. నిద్రిస్తున్నప్పుడు మంచం ప్రక్కన కర్ర ఉంచే చర్యలో గల అంతర్లీన శాస్త్రం

1. చెక్కలో నిద్రాణమై వున్న అగ్ని యొక్క లక్షణం మరియు దాని పనితీరు

చెక్కలో అగ్ని నిద్రాణ స్థితిలో ఉంటుంది, దీనివల్ల చెక్క కర్రలు తేజతత్వం యొక్క మారక ప్రకంపనలను విడుదల చేస్తాయి. ఈ ప్రకంపనల కారణంగా, వ్యక్తి రాత్రి తామసిక తరంగాలు వున్న సమయంలో బాహ్య వాతావరణంలో బాధపడే ప్రకంపనల నుండి రక్షణ పొందవచ్చు.

2. కర్రను ఉంచే విధానం మరియు దాని అంతర్లీన శాస్త్రం

అ. నిద్రిస్తున్న వ్యక్తి యొక్క కుడి వైపున కర్ర ఉంచినప్పుడు, కర్రలో తేజతత్వ కంపనాలు ఉన్నందున, ఆ వ్యక్తి యొక్క కుడి వైపు శక్తి సక్రియం అవుతుంది మరియు ఆ వ్యక్తికి నిద్రలో కూడా క్షాత్ర తేజం జాగృతమై ఉంటుంది.

క్షాత్ర తేజం కారణంగా, ఒక వ్యక్తి యొక్క స్థూల శరీరం రాత్రి సమయంలో కూడా ప్రతికూల శక్తుల దాడులను తిప్పికొట్టడానికి అప్రమత్తంగా మరియు సున్నితంగా ఉంటుంది. – ఒక విద్వాంసుడు (శ్రీమతి అంజలి గాడ్గిల్‌ మాధ్యమంగా)

 

2. నిద్రించడానికి ముందు పఠించాల్సిన మంత్రాలు, చేయవలసిన ప్రార్థనలు మరియు నామజపము

అ. రాత్రిసూక్త

సౌరసూక్త (వేదాలలో దేవత సూర్యడికి సంబంధించిన మంత్రాల సమూహం) ఉన్నట్లే, రాత్రిసూక్త (వేదాలలో రాత్రి దేవతకు సంబంధించిన మంత్రాల సమూహం) కూడా ఉంది. దేవి యొక్క వివిధ అవతారాలలో, నిద్ర కూడా ఒక అవతారం. మీరు మంచం మీద పడుకున్నప్పుడు, రాత్రిసూక్తమును 2-3 సార్లు పఠించండి. చేయగలిగిన వారు, రాత్రిసూక్తమును వేదోక్త పద్ధతిలో పఠించాలి.

ఆ. నిద్రపోయే ముందు పఠించాల్సిన శ్లోకాలు / మంత్రాలు

యా దేవి సర్వభూతేషు నిద్రరూపేణ సంస్థితా |
నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః || – శ్రీదుర్గసప్తశతి, అధ్యయం 5, శ్లోకం 16

అర్థం : అన్ని జీవులలో నిద్ర రూపంలో ఉన్న దేవికి నేను మూడుసార్లు నమస్కారం చేస్తున్నాను. ఈ శ్లోకాన్ని పఠిస్తూ వుండండి. క్రమంగా, ఆలోచన ప్రక్రియ ఆగిపోతుంది, ఒక లయ ఏర్పడుతుంది మరియు మనము పది నుండి పదిహేను నిమిషాల్లో నిద్రపోతాము.

పీడకలలను నివారించడానికి క్రింది మంత్రాన్ని పఠించండి.

రామస్కందం హనుమంతం వైనతేయం వకోదరమ్‌ |
శయనే యః స్మరేన్నిత్యం దుఃస్వప్నస్తస్య నశ్యతి ||

అర్థం : నిద్రపోయేటప్పుడు శ్రీరామ, కార్తికేయ, హనుమంతుడు, గరుడ మరియు భీమలను గుర్తుచేసుకోవడం పీడకలలను తొలగిస్తుంది.

ఇ. నిద్రపోయేటప్పుడు, క్రింది శ్లోకాన్ని పఠించండి (మరాఠీలో శ్లోకం)

హేచి దాన దేగా దేవా | తుఝా విసర్‌ న వ్హావా ||

అర్థం : ఓ దేవా! నేను నిన్ను ఎప్పటికీ మరచిపోలేని ఒకే ఒక్క బహుమతిని నాకు ఇవ్వండి. – పరమ పూజ్యులు కేన్‌ మహారాజ్‌, నారాయణగావ్‌, పూణే జిల్లా, మహారాష్ట్ర ( 1991 వ సంవత్సరం)

ఈ. నిద్రాదేవికి లేదా మీ ఆరాధ్య దైవాన్ని ప్రార్థించండి

1. దేవునికి అన్ని శుభ మరియు అశుభ కర్మలు (విధికి దారితీసే కర్మలు), అలాగే పుణ్యాన్ని – పాపాన్ని అందించే కర్మలు, అలాగే తెలిసి-తెలియక చేసిన తప్పులను సమర్పించండి. పగటిపూట చేసిన అన్ని పాపాలకు ఆయన నుండి క్షమాపణ కోరండి. – గురుదేవులు డాక్టర్‌ కాటేస్వామిజీ

2. నిద్రలో కూడా నా జపం ఉపచేతన మనస్సులో కొనసాగాలి, నాకు ప్రశాంతమైన నిద్ర లభించాలి అని – మీ ఆరాధ్య దైవాన్ని ప్రార్థించండి.

3. ప్రార్థన చేసినప్పుడు నిద్రపోవడానికి సంబంధించిన ఆధ్యాత్మిక అనుభవాలు.

నిద్రాదేవిని ప్రార్థించిన వెంటనే నిద్రపోవడం

25.8.2006 రాత్రి, నేను నిద్రపోలేకపోయాను. అందువల్ల, నేను ఇలా ప్రార్థించాను – ఓ నిద్రాదేవి, రాత్రి సమయంలో ప్రతికూల శక్తుల వల్ల బాధపడకుండా నేను నిద్రపోయేల ఆశీర్వదించు. ఆ తరువాత, నేను వెంటనే నిద్రపోయాను. – చిరంజీవి కౌషల్‌ నితిన్‌ కోతవాలే, మీరజ్‌, మహారాష్ట్ర (వయసు 15 సంవత్సరాలు)

ఉ. ఆరాధ్య దేవత యొక్క పేరు జపించడం

ఆరాధ్య దేవత యొక్క పేరు జపిస్తూ నిద్రపోండి.

 

3. నిద్రలో ప్రతికూల శక్తుల నుండి రక్షణ కోసం చేయవలసిన ఆధ్యాత్మిక నివారణలు

అ. సాత్విక సాంబ్రాణి కడ్డీని వెలిగించి, గదిలో అన్ని మూలల త్రిప్పి, దిండు నుండి కొంచెం దూరంలో ఉంచండి.

ఆ. చిన్న వెలుగుతో నెయ్యి లేదా నూనె దీపం (నువ్వుల నూనె / వేరుశనగ నూనె), తల దగ్గర వెలిగించి ఉంచండి.

ఇ. పడుకునే ముందు, విభూతి లేదా విభూతితో కలిపిన నీటిని మంచం క్రింద మరియు పైన చల్లుకోండి.

ఈ. చేతులు మరియు కాళ్ళకు విభూతిని పూసుకోండి.

ఉ. మంచం చుట్టూ సాత్వికమైన నామజపం పట్టీలు పెట్టడం వల్ల రక్షిత వలయం సృష్టించబడుతుంది. తల మరియు కాళ్ళ దగ్గర శ్రీ గణపతి యొక్క నామజపం పట్టీలు మరియు చేతులవైపు, మంచం పైన లేదా క్రింద శ్రీకృష్ణుని నామజపం పట్టీలు సౌలభ్యం ప్రకారం ఉంచండి. నామజపం పట్టీల యొక్క రక్షిత వలయం సృష్టించడం సాధ్యం కాకపోతే, పరుపు మీద కూర్చొని విభూతి కలిపిన నీటి యొక్క రక్షిత వలయం సృష్టించండి. విభూతి కలిపిన నీటి పాత్రతో మంచం మీద కూర్చోండి. ఆరాధ్య దేవతను ప్రార్థించండి మరియు పరుపు చుట్టూ మూడుసార్లు సవ్యదిశలో చల్లుకోండి. ఆ తర్వాత మంచం నుండి దిగవద్దు, ఎందుకంటే రక్షిత వలయం విచ్ఛిన్నం అవుతుంది. కొన్ని కారణాల వల్ల మీరు మంచం దిగి వెళ్ళవలసి వస్తే, మంచంపైకి తిరిగి వచ్చిన తర్వాత ఈ విధానాన్ని పునరావృతం చేయండి.

ఊ. రాత్రంతా పరమ పూజ్యులు. భక్తరాజ్‌ మహారాజ్‌ యొక్క భజనలు, శ్లోకాలు లేదా భక్తి పాటలు (గమనిక 1) నడిపించండి.

ఋ. ఖాళీ అట్ట పెట్టెలను (గమనిక 2) (ఆధ్యాత్మిక వైద్యం కోసం ఉద్దేశించబడినవి) మంచం చుట్టూ ఉంచండి.

గమనిక 1 – ఈ భజనల రచయిత, స్వరకర్త మరియు గాయకుడు సనతాన సంస్థ యొక్క ప్రేరణకు మూలం అయిన పరమ పూజ్యులు. భక్తరాజ్‌ మహారాజ్‌. భజనల నుండి చైతన్యం ప్రతికూల శక్తుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది.

గమనిక 2 – ఖాళీ అట్ట పెట్టెలో శూన్యత సృష్టించబడుతుంది. ఇది నిర్గుణ సూత్రాన్ని సూచిస్తుంది. నిర్గుణ సూత్రం దుష్ట శక్తిని నాశనం చేస్తుంది.

సేకరణ : సనాతన ప్రచురణ ‘ప్రశాంతంగా ఎలా నిద్రపోవాలి?’

Leave a Comment