మహాలయ పక్షంలో శ్రాద్ధము చేయుటకు గల మహత్యము

‘శ్రాద్ధము అంటేనే కొందరి మనస్సులో ఇది కేవలం అశాస్త్రియ కర్మకాండము అని తప్పు అభిప్రాయం కలుగుతుంది. కొందరైతే శ్రాద్ధం చేయడానికి బదలుగా పేదలకు అన్నదానం చేయ్యండి లేక ఏదైన ఒక పాఠశాలకు సహాయం చేయ్యండి’ అని సలహాలను ఇస్తారు ! ఇలా చేయుటము అనగా రోగీకి శస్త్రచికిత్స చేసే బదులు అన్నదానాలు మరియు పాఠశాలకు మద్దతు అందించి రోగీ అరోగ్యం బాగా కావాలని అపేక్షించినట్లు అవుతుంది. శ్రాద్ధము చేయడం అనగా ధర్మపాలన యొక్క భాగమే. శ్రాద్ధం పట్ల హిందువులలో ఉన్న తప్పు అపోహ తొలగించి వారికి శ్రాద్ధం విషయంలో అధ్యాత్మ శాస్త్రీయ జ్ఞానాన్ని అందించడానికే ఈ లేఖన …

మహాలయ పక్షంలో శ్రాద్ధము చేయుటకు గల మహత్యము

 

1. శ్రాద్ధం యొక్క మహత్యము

1 అ. కలియుగంలో చాలామంది సాధన చేయకపోవడం వలన వారు మాయలో ఇరుక్కొని ఉంటారు. అందువలన మృత్యు తరువాత ఇలాంటి వ్యక్తుల లింగదేహములు అతృప్తముగా ఉంటాయి. ఇలాంటి అసంతృప్త లింగదేహములు మృత్యులోకములో ఇరుక్కుంటాయి. మృత్యులోకము, భూలోకము మరియు భూవర్లోకము మధ్య ఉంటాయి. అసంతృప్త పూర్వీకుల అశ ఆకాంక్షలను శ్రాద్ధ విధుల ద్వార పూర్తి చేసి వారికి తదుపరి గతి ఇవ్వడమే శ్రాద్ధం యోక్క ప్రముఖ ఉద్దేశము.

1ఆ. పితృల కొసం శ్రాద్ధం చేయ్యకపొతే వారి కోరికలు పూర్తికాకపొవడం వలన మరియు తీవ్ర కోరికలున్న పితృలు చేడుశక్తుల ఆధీనంలోకి వెళ్ళి వారికి భానిసులుగా మారిపొవుట వలన చేడుశక్తులు ఈ పితృలను వినియోగించుకొని కుటుంబ సభ్యలకు కష్టాలు కలిగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకు అసంతృప్త పూర్వీకుల వలన కష్టం కలుగుతున్నది అనే విషయం కాని లేక అసంతృప్త పూర్వికుల ములంగా కష్టం కలిగే అవకాశం ఉన్నది అని విషయమును కేవలం సంతులే చప్పగలరు. ఇలా చేప్పగలగే సంతులు దోరకనీ ఎడల ముందు చేప్పిన విధముగా కష్టములు కలిగనచొ ఇవి అసంతృప్త పూర్వికుల మాధ్యమంగా కలుగుతున్నాయి అని తెలుసుకోవచ్చు. ఇంటీలో నిత్యముగా కలహములు జరుగుట, పరస్పర ద్వేషము, ఉద్యోగ అవకాశములు రాకపొవటము, ఇంటీలో డబ్బు లేకపోవడం, ఇంటిలో ఎవరికైనా పెద్దరోగము ఉండుట, అన్ని విధాలుగా పరిస్థితి అనుకూలించిన కూడా వివాహం జరగక పోవుట, భార్యభర్తల మధ్య విభేదాలు, గర్భదారణ జరగక పోవడము, గర్భపాతము అగుట, బుద్ధివైకల్యము లేక అంగవైకల్యంతో సంతానం కలగటము మరియు కుటుంబ సభ్యులలో ఎవరైన ఒకరికి వ్యసన అలవాటు పడుట. శ్రాద్ధ విధుల ద్వారా పితృల యోక్క ఇబ్బందుల నుండి రక్షణ కలిగి మన జివితము సుఖంగా సాగేందుకు సాహాయం అవుతుంది.

1 ఇ. ధర్మశాస్త్రానుసారంగా దైవ, ఋషీ మరియు సమాజం ఈ మూడు ఋణాలతో పాటు పితృఋణం కుడా తిర్చుకోవడం మనిషి యొక్క కర్తవ్యము. శ్రాద్ధము వలన మనిషి యొక్క పితృఋణం తీరిపోతుంది.

 

2. శ్రాద్ధము ఏ వ్యక్తి చేయ్యాలి ?

కలిసి ఉన్న ఊమ్మిడి కుటుంబములో ఇంటి పెద్దపురుషుడు మరియు విడిపోయిన కుటుంబంలో ప్రతి ఒక్కరు శ్రాద్ధ విధి చేయ్యాలి.

 

3. శ్రాద్ధము కోరకు యోగ్యమైన స్థానము ఏదీ ?

అడవిలో, పూణ్యస్థానము లేక వీలయినంత వరకు స్వంత ఇంటీలో దిగువ భాగములో (గ్రోండ్ ఫ్లోర్) శ్రాద్ధము చేసుకోవలెను. మన ఇంటిలో శ్రాద్ధము జరుపుకుంటే బయట తిర్థక్షేత్రాల వద్ద జరుపుకునే శ్రాద్ధంకన్న 8 రేట్టింపు పుణ్యము ప్రాప్తం అవతుంది. సాధన లేకపోవడము మరియు ఎక్కువ కొరికలుండుటవలన సుమారు 50% పితరులు మన స్వంత ఇంటి వాస్తువులలోనే నివసిస్తు ఉంటారు అందు చేత ఆ వాస్తులోనే శ్రాద్ధవిధులను జరపిస్తే పితరులుకు వారి యొక్క హవిర్భాగము స్వీకరించుటకు మరింత సహజమోతుంది. దీనివలన పితరులు తృప్తిని పోందే ప్రమాణము కూడా ఎక్కువ ఉంటుంది.

 

4. పితృపక్షము (మహాలయ పక్షము)

4 అ. సంవత్సరీకము చేసినప్పటికి కూడా పితృపక్షములోను శ్రాద్ధము ఎందుకు చేయ్యాలి ?

సంవత్సరీకము చేయడం వలన ఆయా లింగదేహములకు సద్గతి ప్రాప్తం అవుతుంది మరియు దీనివలన మన నుండి వ్యక్తిగత స్థాయిలో పితృఋణం తీరిపోతుంది. పితృపక్షంలో చేసిన శ్రాద్ధము వలన మన నుండి సమష్టి స్థాయలో పితృఋణం తీరిపొయ్యి వ్యాపక స్థాయిలో ఇచ్చిపుచ్చకొనే సంబంధము (లెక్కలు) తీరుతుంది. అందుచేత తిథిప్రకారముగా సంవత్సరీకముతో పాటు పితృపక్షంలో కుడా శ్రాద్ధవీధి చేయడం శ్రేయస్కరము.

4 ఆ. పితృపక్షంలో శ్రాద్ధము ఎందుకు చేయ్యవలేను ? :

1. ఈ కాలంలో వాతావరణంలో తీర్యక్ తరంగాలు (రజ-తమాత్మకమైన) మరియు యమ తరంగాల యొక్క ప్రమాణము ఎక్కవ ఉన్నందున పితృలకు భూమి యొక్క వాతావరణం కక్షములోకి రావడము సులభము అవుతుంది. శ్రాద్ధవీధిలో బ్రాహ్మణభోజనము ఒక మహత్వపూర్ణమైన అంశమైనది. బ్రాహ్మణుడు సేవించిన భోజనము పితృలకు చేరుతుంది. ఒక మహాలయంలో పేట్టీన భోజనము పితరులకు రెండవ మహాలయం వరకూ అనగా ఒక సవత్సరం వరకు సరిపోతుంది. సంక్షిప్తముగా చెప్పాలంటె పితృపక్షంలో పితరలకు మహాలయ శ్రాద్ధమును చేస్తే వారు సవత్సరమంతా సంతృప్తితో ఉంటారు.

2. ఈ కాలంలో పితరులందరూ కుడా ఆశీర్వాదము ఇచ్చేందుకు భూలోకానికి వారి వారి వంశికుల వద్దకు వస్తారు కాని శ్రాద్ధము చేయలేని ఎడల శపించి వేళ్ళుతారు.

4 ఇ. సర్వపితృ అమావాస్య (పితృపక్షంలో గల అమావాస్య) ఈ తిథి రోజు కులానికి చెందిన అందరూ పితరులకు శ్రాద్ధము చేయుదురు. సవత్సరమంత మరియు పితృపక్షంలో ఇతర తిథులకు శ్రాద్ధము చేయలేని ఎడల పితృపక్షంలోని అమావాస్య రోజున అందరూ శ్రాద్ధము చేయవలెను ఎందుకనగా ఇది పితృపక్షంలో గల అంతీమ తిథి. అమావాస్య రోజు శ్రాద్ధమునకు యోగ్యమైన తిథి, అందులో కూడా పితృపక్షంలో గల అమావస్యా అనేదీ చాలా ఉన్నతమైన తిథి.

 

పితృపక్షంలో శ్రీ గురుదేవ దత్త నామజపము ఎక్కువ ప్రామాణంలో చేయ్యండి !

అసంతృప్తులైన పూర్వీకుల యోక్క కష్టాల నుండి రక్షణ పొందుటకు సవత్సరమంత ప్రతిరోజు ‘శ్రీ గురుదేవ దత్త’ ఈ నామజపమును ముందు చెప్పిన విధంగా స్మరించండి. ప్రస్తుతము ఇబ్బంది లేని పక్షంలో మరియు తరువాత కాలంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అలాగే కొంచం ఇబ్బంది ఉన్నచో, రోజు కనీసం 1 నుండి 2 గంటల వరకు నామజపము చేయవలెను. మధ్యమ స్థాయిలో ఇబ్బంది ఉంటే కనీసం 2 నుండి 4 గంటల వరకు నామజపం చెయ్యాలి. తీవ్రమైన ఇబ్బంది ఉన్నచో 4 నుండి 6 గంటల వరకు నామజపము చేయవలెను. సంపూర్ణ పితృపక్షములో అందరూ నిరంతరముగా దత్త నామజపమును చేయవలెను. ఇలా చేయడం వీలుకాని పక్షంలో పై చేప్పిన విధంగా తమ తమ ఇబ్బందులను బట్టి నామజపమును చేసుకోవాలి.

సందర్భం : సనాతన ప్రచురణ ‘శ్రాద్ధ విధుల శాస్త్రం’

Leave a Comment