మహాశివరాత్రి


shiv
 

శివ

 

మహాశివరాత్రి యొక్క వ్రతము ఎందుకు ఆచరించాలి?

శివుడు అతి సులభంగా ప్రసన్నుడయ్యే దేవుడు. కావున పథ్విపై శివుని భక్తులు ఎక్కువ ప్రమాణములో వున్నారు. మహాశివరాత్రి శివుడి వ్రతమైనందువలన వ్రతము యొక్క ప్రాముఖ్యత, వ్రతమును ఆచరించే విధానము మరియు మహాశివరాత్రి వ్రతము యొక్క విధి వీటి గురించి ఈ క్రింద ఇవ్వబడిన లేఖ నుండి వివరంగా తెలుసుకుందాం.

 

1.తిథి

మహాశివరాత్రి వ్రతము మాఘ బహుళ చతుర్దశి తిథిన ఆచరిస్తారు.

 

2. దేవత

మహాశివరాత్రి ఇది శివుడి వ్రతము.

 

3. ప్రాముఖ్యత

మహాశివరాత్రి రోజున శివతత్వము ఇతర రోజుల కన్న 1000 రెట్లు ఎక్కువ కార్యనిరతమై ఉంటుంది. శివతత్వము యొక్క లాభము ఎక్కువ పొందుటకు మహా శివరాత్రి రోజు శివుని భావపూర్ణ పూజను చేయుటతో ‘ఓం నమః శివాయ ’ నామజపమును ఎక్కువ చేయవలెను.

మహాశివరాత్రి గురించి వివరించిన వివిధ చలనచిత్రములు చూడండి !

 

4. ప్రకారములు

కామ్యక మరియు నైమిత్తక

 

5. మహాశివరాత్రి వ్రతమును ఆచరించే విధానము

ఉపవాసము, పూజ మరియు జాగరణ ఈ వ్రతమునకు గల 3 భాగములు.

 

6. వ్రతము యొక్క విధి

మాఘ కృష్ణ త్రయోదశి రోజు ఒక్కపూట భోజనం చేయాలి. చతుర్ధశి రోజు ప్రాతఃకాలము వ్రత సంకల్పము చేయాలి. సాయంకాలము నదిలో లేదా చెరువులో శాస్త్రోక్తంగా స్నానము చేయాలి. భస్మము మరియు రుద్రాక్షధారణ చేయాలి. ప్రదోష కాలములో శివుని గుడికి వెళ్ళాలి, శివుని ధ్యానము చేయాలి, తరువాత షోడశోపచార పూజ చేయాలి. భవభావముతో తర్పణము చేయాలి. శివుడికి 108 కమల పుష్పములు లేదా బిల్వపత్రములు సమర్పించాలి. తరువాత పుష్పాంజలి అర్పించి అర్ఘ్యము ఇవ్వాలి. శివుని హారతి, పూజసమర్పణము, స్తోత్రపఠన మూలమంత్రజపమైన తరువాత శివుడి మస్తకముపై పెట్టిన ఒక పువ్వు తీసుకొని దానిని స్వంత మస్తకముపై పెట్టుకోవాలి మరియు క్షమాయాచన చేయాలి.

 

7. యామపూజ

శివరాత్రికి రాత్రిలోని నాలుగు ప్రహరాలలో నాలుగు పూజలు చేయాలి. దీనిని ‘యామపూజ’ అని అంటారు. ప్రతిఒక్క యామపూజలో దేవతలకు అభ్యంగనస్నానము చేయించాలి, అనులేపనము చేయాలి, దీనితోపాటు లిల్లీ, మామిడి మరియు బిల్వపత్రములు సమర్పించాలి. బియ్యపు పిండితో 26 దీపాలు వెలిగించి దేవతలకు హారతి ఇవ్వాలి. పూజ చివరిలో 108 దీపములు దానం చెయ్యాలి. ప్రతిఒక్క పూజమంత్రము వేరుగా ఉండును. మంత్రాల సహితంగా అర్ఘ్యము ఇవ్వవలెను. నాట్యము, భక్తిగీతాలు, కథాశ్రవణము మొదలగునవి చేస్తూ జాగరణ చేయవలెను. ప్రాతఃకాలము స్నానము చేసి పునః శివపూజ చేయవలెను. పారాయణ చేస్తూ బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. బ్రాహ్మణుల ఆశీర్వాదము పొంది వ్రతము సమాప్తి చేయవలెను.

సందర్భము : సనాతన ప్రచురణ ‘పండుగలు, ధార్మిక ఉత్సవములు మరియు వ్రతాలు’

 

8. శివుడు విశ్రాంతి తీసుకొనే సమయము అంటే ‘మహాశివరాత్రి’

భగవాన్ శంకరుడు రాత్రి ఒక ప్రహరము విశ్రాంతి తీసుకొంటాడు. ఆ ప్రహరము, అనగా శంకరుడి విశ్రాంతి తీసుకొనే కాలమును మహాశివరాత్రి అని అంటారు. భూమిపై ఒక సంవత్సరము అనగా స్వర్గలోకములో ఒక దినము. భూమి జడమైనది(స్థూలము). జడమునకు వేగము తక్కువగా వుంటుంది. అనగా జడమునకు బ్రహ్మాండములో ప్రయాణించుటకు ఎక్కువ సమయము పడుతుంది. దేవతలు సూక్ష్మమైనందువలన వారి వేగము ఎక్కువగా వుంటుంది. ఇందుకని బ్రహ్మాండములో ప్రయాణించుటకు వారికి ఎక్కువ సమయము పడుతుంది. ఇందుచేతనే భూమి మరియు దేవతల మధ్య ఒక సంవత్సరము అంతరము వున్నది. మహాశివరాత్రికి ఉపాసన చేయుటవలన దుష్టశక్తుల ప్రభావము తగ్గుతుంది. – బ్రహ్మతత్వము (సౌ. పాటిల్ గారి మాధ్యమంగా, 18.2.2004, మధ్యాహ్నం 3.05)

 

9. మహాశివరాత్రి వ్రతఫలం

‘ఎవరైతే మహాశివరాత్రి రోజున నా వ్రతమునాచరించెదరో వారి పై ఈ విధంగా కృప చూపుతానని’ సాక్షాత్తు శంకరుడే భక్తులకు ఆశీర్వాదమిచ్చాడు – అ. పురుషుల మనోభీష్టాలన్నీ నెరవేరుతాయి. ఆ. కన్యలు వారి మనస్సుకు నచ్చిన వరున్ని పొందుతారు.

. వివాహమైన స్త్రీలు దీర్ఘ మాంగళ్యము కలిగిన వారగుదురు.’

 

10. శివునికి చేయవలసిన కొన్ని ప్రార్థనలు

అ. హే మహాదేవ, నీలాగ వైరాగ్య భావము నాలో నిర్మాణమవ్వని.

ఆ. హే శివశంకరా, చెడుశక్తుల ఇబ్బంది నుండి నన్ను రక్షించు. నీ నామజపము యొక్క సంరక్షణ కవచము నా చుట్టూ సతతంగా ఉండని, ఇదే నీచరణములోప్రార్థన.

 

11. మహాశివరాత్రి రోజున శివుడు జ్ఞానమును ప్రసాదించుట

‘మహాశివరాత్రి రోజున శివుడు జీవులందరికి మార్గదర్శనము చేస్తాడు. ఇందుకని అనేక జీవులు శివుడి ద్వారా మార్గదర్శనము పొందుటకు ఆ రోజు శివలోకములో ఉపస్థితులౌతారు.’- ఈశ్వరుడు (కుమారి. మధురా భోసలే వీరి మాధ్యమంగా, 4.2.2005, మధ్యాహ్నం 1.25 నుండి 2.57)

సందర్భము : సనాతన ప్రచురణ ‘శివుడు’

2 thoughts on “మహాశివరాత్రి”

    • మనము జీవితంలో సాధన చేయడం మొదలుపెడితే మన సాధన బాగా జరిగితే అప్పుడు గురువులే మన జీవితంలోకి వస్తారు. సాధన అంటే ఎక్కువెక్కువ మన ఇలవేల్పు నామజపం చేయడం. గురువు మన జీవితంలోకి వచ్చేవరకు ఇలవేల్పు దేవతయే మనకు ప్రథమ గురువు. ఇలవేల్పు నామజపంతో పాటు దత్తాత్రేయుడి నామజపం కూడా చేయాలి.
      Read more @ https://www.sanatan.org/en/a/171.html

      Reply

Leave a Comment