‘ఇకో-ఫ్రెండ్లి గణేశోత్సవం పేరిట ‘ట్రీ గణేశ’ అనే అశాస్త్రీయ ప్రకారం యొక్క ప్రచారం !

పండుగలు మరియు ఉత్సవాలలో చేయబడే ప్రతి ఆచరణకు ప్రధానంగా ఆధ్యాత్మిక ప్రయోజనం పొందే ఉద్దేశం ఉంటుంది అనే విషయం హిందువులకు ధర్మశిక్షణ లేనందువల్ల వారికి గమనానికి రావడం లేదు. సాధన చేయని వ్యక్తి ఆధ్యాత్మిక ఆచరణల వల్ల కలిగే అనుభూతులను పొందలేడు. పండుగ-ఉత్సవములోని ఆచరణలకు గల శాస్త్రం తెలుసుకోవాలంటే దాని గురించి జ్ఞ్యానం ఉన్నవారు అనగా సంత మహనీయుల మార్గదర్శనం పొందాలని వారికి అనిపించదు. సామాజిక, భౌతిక, పర్యావరణకు సంబంధించిన ఆలోచనలే సరి అయినది అని అనిపిస్తుంది. ఇవన్నీ ధర్మశిక్షణ లేకపోవడం యొక్క పరిణామమని చెప్పచ్చు. సాధన చేసేవారికి ‘ఇంకో ఫ్రెండ్లి’ లాంటి విషయముల నిరర్థకత ప్రత్యేకంగా చెప్పనవసరం ఉండదు. గణేశోత్సవం యొక్క ఆధ్యాత్మిక ప్రయోజనం పొందాలని భక్తులు శాస్త్రానుసారంగా బంక మన్నుతో తయారు చేసిన శ్రీ గణపతి విగ్రహం స్థాపించాలి మరియు ‘ట్రీ గణేశా’ లాంటి ధర్మశాస్త్రానికి విరుద్ధమైన కృతి చేసే హిందువులకు ధర్మప్రేమికులైన హిందువులు ప్రబోధన చేయాలి !

‘ఇకో-ఫ్రెండ్లి’ గణేశోత్సవం ఆచరించేటప్పుడు పర్యావరణకు తోడుగా ఉండే విగ్రహాన్ని తయారు చేయాలనే పేరుతొ ఇప్పటి వరకు పండ్లు-కాయలు, కాగితం ముద్ద, వివిధ రకాల వస్తువులతో శ్రీ గణేశ విగ్రహం తయారు చేసి అందులో విత్తనాలు వేసి దానిని కుండీలోనే విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేయబడుతుంది. ఇంతటితో ఆగకుండా నిమజ్జన సమయంలో శ్రీ గణపతి విగ్రహం ను కుండీతో పాటుగా పూల తోటలో పెట్టి నీళ్లు వేయబడింది. ఈ విధంగా విగ్రహం కరిగేంత వరకు క్రమం తప్పకుండా విగ్రహం పై కొద్ది కొద్దిగా నీళ్లు వేయాలనే అశాస్త్రీయ పద్ధతిని చెప్పడం జరిగింది. ఇందులో విగ్రహం పూర్తిగా కరిగిన తరువాత అందులో విసిన విత్తనాలు కుండీలోనే ఉండిపోతాయి మరియు కొన్ని రోజుల తరువాత కుండీలో మొక్క చిగురుకుంటుంది. ఈ మొక్కలను శ్రీ గణపతి ఉనికికి ప్రతీక అని చెప్పబడుతుంది. ఇందులో కొందరు పండ్లు-కూరగాయలు, పూల మొక్కలతో పాటు మరి కొన్ని వృక్షాల విత్తనాలను శ్రీ గణపతి విగ్రహంలో వేస్తారు.

ఇలాంటి అశాస్త్రీయ పద్దతిని ఆపడం మనందరి ధర్మ కర్తవ్యమే !

Leave a Comment