శ్రీ గణపతి ఉత్తరపూజ

శ్రీ గణపతి ఉత్తరపూజ

ఉత్తరపూజ

అ. విధి : కర్మకాండ ద్వారా ఆరాధన ముగింపు

కుటుంబ సంప్రదాయం ప్రకారం విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయాలి. గంధము, పువ్వులు, ధూపం, వెలిగించిన నెయ్యి దీపం మరియు పెరుగు, అన్నం మరియు మోదకాలను(కుడుములు) నైవేద్యంగా పూజలో చేర్చాలి. ఆరాధకుడు ముందుగా కుంకుమ ధరించాలి. అప్పుడు అతను ఆచమనం చేసి, తన చేతిలో అక్షతలు పట్టుకుని కింది సంకల్పం చేయాలి.

శ్రీ ఉమామహేశ్వరసహితసిద్ధివినాయకదేవతాప్రీత్యర్థమ్ ఉత్తరారాధనం కరిష్యే ।

తదఙ్గత్వేన ధ్యానగన్ధాదిపఞ్చోపచారపూజనమహం కరిష్యే ।

శ్రీ ఉమామహేశ్వరసహితసిద్ధివినాయకాయ నమః । ధ్యాయామి ।

1. గంధము సమర్పించడం :

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః । విలేపనార్థే చందనం సమర్పయామి ।।

(నేను దేవుడికి చందనం సమర్పిస్తున్నాను)

శ్రీ ఉమాయై నమః । హరిద్రాం కుంకుమమ్ సమర్పయామి ।।

(నేను నమస్కారం చేసి శ్రీ ఉమాదేవికి పసుపు-కుంకుమ సమర్పిస్తున్నాను)

2. పత్రి మరియు పూలను సమర్పించడం :

శ్రీసిద్ధివినాయకాయ నమః । నానావిధపత్రాణి సమర్పయామి ।।

శ్రీసిద్ధివినాయకాయ నమః । ఋతుకాలోద్భవపుష్పాణి సమర్పయామి ।।

3. ధూపం చూపించడం :

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః । ధూపం సమర్పయామి ।।

4. నెయ్యి దీపం వెలిగించడం : 

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః । దీపం సమర్పయామి ।।

5. నైవేద్యం నివేదించడం :

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః । నైవేద్యం సమర్పయామి ।।

అనేన కృతపూజనేన శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకః ప్రీయతామ్ ।

‘ ప్రీయతామ్’ అని చెబుతున్నప్పుడు కుడి చేతి అరచేతి నుండి నీటిని పళ్ళెంలోకి  వదలండి.

ఆ తరువాత ఈ క్రింది మంత్రాన్ని పఠించండి.

 

ప్రీతో భవతు । తత్సత్ బ్రహ్మార్పణమస్తు ।

కుడి చేతిలో అక్షింతలు తీసుకొని క్రింది మంత్రాన్ని చదవండి

 

యాన్తు దేవగణా: సర్వే పూజామాదాయ పార్థివాత్ ।

ఇష్టకామప్రసిధ్ద్యర్థం పునరాగమనాయ చ ।।

ఆ. ప్రాముఖ్యత

లక్ష్యం ఏమిటంటే, పూజ చేసేవారు గరిష్టంగా శ్రీ గణపతితత్త్వాన్ని పొందాలి. ముగింపులో ఉత్తరపూజ అనేది తుది దశ, ఇది శ్రీ గణపతి తరంగాలను గరిష్ట స్థాయిలో ఆకర్షించి ఆరాధకుడు లాభం పొందటానికి సహాయపడుతుంది. ఉత్తరపూజ సమయంలో, శ్రీ గణపతితత్వ తరంగాలు విగ్రహాన్ని ఒకేసారి వదిలివేస్తాయి. ఈ పూజ చేసిన తరువాత, విగ్రహం దాని స్థానం నుండి కొద్దిగా జరుపబడుతుంది. దీని కారణంగా, మిగిలిన గణపతితత్వ తరంగాలు విగ్రహాన్ని విడిచిపెడతాయి, అందువల్ల, పూజ చేసేవారు వాటి గ్రహీత కావచ్చు.

శ్రీ గణపతి దేవాలయంలో, భక్తుడి ద్వారా మహాపూజ పూర్తయిన వెంటనే, ఉత్తరపూజ చేస్తారు. తర్వాత తదుపరి భక్తుడి ద్వారా మహాపూజ చేస్తారు. ఇక్కడ ఉత్తరపూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శ్రీ గణపతిని మళ్ళీ ఆహ్వానించినందున, ఆయనకు సమాన గౌరవంతో వీడ్కోలు చెప్పడం ముఖ్యం.

Leave a Comment