నాగపంచమి

మనం ఇప్పుడు నేటి సత్సంగంలో తదుపరి అంశానికి వెళ్దాం. శ్రావణ మాసం పండుగల మాసం. అందులో మొదటి పండుగ నాగపంచమి. హిందువుల చాంద్రమానం ప్రకారం శ్రావణ మాసం యొక్క శుక్ల పక్షంలోని ఐదవ రోజున (శ్రావణ శుక్ల పక్ష పంచమి), మనము నాగ దేవతని పూజిస్తాము. ఈ రోజున స్త్రీలు ఉపవాసం ఉంటారు. వారు కొత్త బట్టలు, మరియు ఆభరణాలు ధరించి, నాగదేవతకు ఆచారబద్ధంగా పూజలు చేస్తారు మరియు నైవేద్యంగా పాలు సమర్పిస్తారు. ఈ రోజున కోయడం మరియు కత్తిరించడం నిషేధించబడింది. ఈ పండుగ వెనుక ఉన్న చరిత్ర మరియు శాస్త్రాన్ని నేటి సత్సంగంలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాము.

1. నాగపంచమి వెనుక చరిత్ర :

1 అ. శ్రీ కృష్ణుడు కాళీయుడిని ఎలా ఓడించాడనే దానికి సంబంధించిన కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది. శ్రీ కృష్ణుడు యమునా నదిలోకి దూకి, కాళీయ అనే సర్పాన్ని ఓడించిన రోజు, హిందువుల చాంద్రమాన మాసం శ్రావణ శుక్ల పక్షంలోని ఐదవ రోజు (పంచమి).

1 ఆ. నాగపంచమికి సంబంధించి మరో కథ కూడా ఉంది. ఐదు యుగాల (యుగాల) క్రితం సత్యేశ్వరి అనే క్రింది స్థాయి దేవత ఉండేది. నాగపంచమికి ముందు రోజున ఆమె సోదరుడు సత్యేశ్వర్ మరణించాడు. సత్యేశ్వరుడు నాగరాజు రూపంలో సత్యేశ్వరి ముందు నిలబడ్డాడు మరియు ఆమె ఆ సర్పాన్ని తన సోదరుడిగా భావించడం ప్రారంభించింది. నాగదేవత తనను సోదరునిగా భావించి పూజించే స్త్రీని రక్షిస్తానని ఆమెకు వాగ్దానం చేసింది. అందుకే ఈ రోజున నాగ దేవత పూజ చేస్తారు.

2. నాగపూజ ప్రాముఖ్యత

2 అ. హిందూ సంస్కృతిలో నాగపూజకు చాలా ప్రాముఖ్యత ఉంది. శివుడు హాలాహల విషాన్ని సేవించినప్పుడు, ఆయనకు సహాయం చేయడానికి 9 సర్పాలు వచ్చాయి మరియు అవి కూడా హాలాహలాన్ని  సేవించాయి. శివుడు ఈ సర్పాలు చేసిన కార్యానికి సంతోషించాడు. మొత్తం విశ్వాన్ని రక్షించడానికి సర్పాలు చేసిన ఈ ప్రయత్నాన్ని పరిగణనలోకి తీసుకున్న శివుడు, మనిషి ఎల్లప్పుడూ నాగులకు కృతజ్ఞతతో ఉంటాడని మరియు వాటిని ఆచారబద్ధంగా పూజిస్తాడని పేర్కొంటూ వారికి ఒక వరం ఇచ్చాడు. అప్పటి నుండి, మనిషి 9 సర్పాలను పూజించడం ప్రారంభించాడు. భగవాన్ శివ శంకర్ శరీరంపై కూడా 9 సర్పాలు ఉంటాయి.

2 ఆ. “నవనాగస్తోత్రం”లో నాగులను ఆచారబద్ధంగా పూజించడం యొక్క ప్రాముఖ్యతను వివరించే ఒక శ్లోకం ఉంది. (వీలైతే ఈ శ్లోకం పఠించవచ్చు. లేకుంటే ప్రాముఖ్యతను వివరించండి)

అనంతం వాసుకిం శేషం పద్మనాభం చ కంబళం |

శంఖపాలం ధృతరాష్ట్రం తక్షకం, కాళీయం తథా ||

ఇందులో 9 రకాల సర్పాలను పూజిస్తారని పేర్కొంది. అవి అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధృతరాష్ట్ర, తక్షక మరియు కాళీయ. ఈ పూజ వల్ల సర్పభయం తొలగిపోయి విషప్రయోగాల భయం తొలగిపోతుంది.

2 ఇ. శ్రీమద్ భగవద్గీతలో, శ్రీ కృష్ణుడు ఇలా పేర్కొన్నాడు, “సర్పాలలో సర్వోన్నతమైనది ‘అనంత’, మరియు అది నేను.”

2 ఈ. నాగ దేవత అనేక అవతారాలతో ముడిపడి ఉంది – అది భగవంతుని సగుణ రూపం (వ్యక్త రూపం). సముద్ర మథనం సమయంలో, వాసుకి అనే సర్పం కూర్మావతారంకు సహాయం చేసింది.

2 ఉ. ప్రతి యుగాంతంలోను, శ్రీవిష్ణువు శేషనాగ శరీరంపై మహా సముద్రంలో విశ్రాంతి తీసుకుంటాడు. అందువల్ల నాగ దేవత పూజకు చాలా ప్రాముఖ్యత ఉంది.

2 ఊ. మన పండుగలన్నింటికీ ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది మరియు ఇది హిందూ ధర్మంలో అత్యంత ముఖ్యమైన అంశం. భగవంతుడు విశ్వంలో – ప్రతి జీవి లోపల – సర్వవ్యాపి అనే ప్రధాన సూత్రాన్ని హిందూ ధర్మం మనకు బోధిస్తుంది. వివిధ పండుగల ద్వారా మనకు దీనిని అనుభవపూర్వకంగా నేర్పుతారు.

3. ఆచార ఆరాధన

పూర్వ కాలంలో ప్రజలు నాగదేవత యొక్క భౌతిక రూపాన్ని పూజించేవారు. కానీ, ఈ విధమైన ఆరాధన ఇప్పుడు ప్రబలంగా లేదు కాబట్టి మనం ఇంట్లో నాగదేవతను నిండు భక్తితో పూజించవచ్చు. ఆచారబద్ధమైన పూజలు ఎలా జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

3 అ. పసుపు, గంధపు పొడి మరియు కుంకుమ మిశ్రమాన్ని ఉపయోగించి, శుభ్రమైన చెక్క పీటపై 5 నాగుపాముల చిత్రాన్ని గీయండి. ప్రత్యామ్నాయంగా, మీరు రక్తచందనం (ఎర్ర చందనం) ఉపయోగించి నవనాగు (తొమ్మిది నాగుపాములు) బొమ్మలను గీయవచ్చు. కొన్ని చోట్ల పాము రూపంలో మట్టి బొమ్మను తయారు చేసి పూజిస్తారు.

3 ఆ. నాగ పూజ చేసేటప్పుడు, 9 నాగులను గుర్తు చేసుకోండి – అనంత, వాసుకి, శేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధృతరాష్ట్ర, తక్షకుడు మరియు కాళీయ . “అనంతాది నాగదేవ్తాభ్యో నమః||” అనే మంత్రాన్ని పఠించడం ద్వారా, పాము చిత్రాలపై పరిమళం, అక్షత (విరగని బియ్యం) మరియు పుష్పాలను సమర్పించండి.

3 ఇ. పదహారు నిర్దిష్ట పదార్థాలతో (షోడోశోపచార పూజ) ఆచారబద్ధమైన ఆరాధన చేయడం సాధ్యమైతే, చేయాలి. సాధ్యం కాకపోతే, ఐదు దశలతో(పంచోపచార పూజ) కూడిన ఆచార పూజ చేసి, ఆపై నాగ దేవతకి నైవేద్యంగా పాలు, పంచదార, మరమరాలు సమర్పించవచ్చు. అలాగే, గృహ సంప్రదాయం ప్రకారం, ‘పాయసం’ (పాలు మరియు బియ్యంతో తయారు చేయబడిన తీపి పదార్ధం) కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు.

3 ఈ. కుటుంబ సభ్యులు పూలు, దుర్వ (బెర్ముడా గడ్డి), మరమరాలు మరియు శనగలు సమర్పించాలి. 9 నాగులను పూజించడం ద్వారా, సర్ప భయాలు తొలగిపోతాయి మరియు విషప్రయోగ భయం కూడా తొలగిపోతుంది.

4. నాగపంచమి రోజున చేసే ఆచారాలు మరియు వాటి ఆధ్యాత్మిక ప్రయోజనం

4 అ. ఆభరణాలు మరియు కొత్త బట్టలు ధరించడం ద్వారా, ఒకరు ఆనందం మరియు చైతన్య పౌనఃపున్యాలను ఆకర్షించగలుగుతారు మరియు దానిని ధరించిన మహిళ చుట్టూ రక్షణ కవచం ఏర్పడుతుంది.

​​4 ఆ. ఊయల మీద కూర్చోవడం ద్వారా, క్షాత్రభావం (యోద్ధుల వైఖరి) మరియు భక్తిభావం పెరుగుతుంది మరియు వ్యక్తి సాత్వికతను పొందుతాడు. ఊగే చర్య కారణంగా, స్త్రీ ఊయల ఊగేటప్పుడు గాలి యొక్క సున్నితమైన స్పర్శ కారణంగా వాయుతత్వాన్ని (సంపూర్ణ వాయు సూత్రం) పొందుతుంది.

4 ఇ. ఉపవాసం దైవిక శక్తిని పొందేలా చేస్తుంది మరియు పుణ్యాన్ని కూడా ఇస్తుంది.

4 ఈ. నాగదేవతలను భక్తితో పూజించిన స్త్రీకి దివ్యశక్తి లభిస్తుంది.

4 ఉ. స్త్రీలు నాగ దేవతని తమ సోదరునిగా పూజిస్తారు. ఇది వారి సోదరులకు దీర్ఘాయువును ఇస్తుంది. పరిసరాల్లోని శివతత్వం ఆకర్షితమవుతుంది మరియు ఇది పూజ చేసే వ్యక్తికి ప్రయోజనాన్ని చేకూరుస్తుంది.

4 ఊ. నాగపంచమి రోజున చేసే పూజల వల్ల నాగదేవత ప్రసన్నుమవుతుంది.

 

5. నాగపంచమి రోజున కోయడం, కత్తిరించడం లేదా వేయించడం ఎందుకు నిషిద్ధం?

నాగపంచమి రోజున, శివ తత్వం, విష్ణు తత్వం మొదలైన ఇతర సంబంధిత పౌనఃపున్యాలతో పాటు నాగదేవత యొక్క పౌనఃపున్యాలు అధిక నిష్పత్తిలో భూమిని చేరతాయి మరియు చురుకుగా ఉంటాయి. కోయడం, కత్తిరించడం మరియు వేయించడం వంటి చర్యలు రజ-తమ పౌనఃపున్యాలను ఉత్పత్తి చేస్తాయి మరియు ఈ పౌనఃపున్యాలు దేవతల నుండి వచ్చే పౌనఃపున్యాలను అడ్డుకుంటాయి. అందువల్ల, ఈ రోజున కోయడం, కత్తిరించడం, వేయించడం మరియు దున్నడం వంటి చర్యలు నిషేధించబడ్డాయి.

6. నాగపంచమి నాడు చేయవలసిన ప్రార్థన

నాగపంచమి యొక్క ఆచారపరమైన పూజలు చేసిన తర్వాత, ఈ క్రింది ప్రార్థనను చదవండి.

“ఓ నాగదేవతా, నేను నాగారాధన చేశాను, దయచేసి ఈ పూజకు సంతుష్టులై నన్ను సదా సంతోషంగా ఉండునట్లు ఆశీర్వదించండి. అలాగే, ఈ పూజ చేసేటప్పుడు తెలిసి గాని, తెలియక గాని ఏమైనా పొరపాట్లు ఉంటే మన్నించండి. నా కోరికలన్నీ నెరవేరుగాక. మీ దీవెనలతో, నా వంశంలో పాము విషపు భయం ఎప్పటికీ అభివృద్ధి చెందకుండా ఉండనివ్వండి. ఇది మీ పవిత్ర పాదాలకు నా వినయపూర్వకమైన ప్రార్థన”

Leave a Comment