శ్రీ గణేశుడి విగ్రహా పూజావిధి

శ్రీ గణేశ చతుర్థి రోజున పూజ కోసం ఇంటికి కొత్త విగ్రహం తీసుకుని వస్తాము. ఆ విగ్రహంలోకి ప్రాణప్రతిష్ఠ చేసి షోడశోపచార పూజ చేయడం జరుగుతుంది.

|| అథ పూజా ప్రారంభ ||

పూజకు ప్రారంభించే ముందు చేసే ప్రార్థన

‘హే శ్రీ సిద్ధివినాయకా,నీ పూజ నా ద్వారా భావపూర్ణంగా చేయించుకొనుము. పూజిస్తున్నప్పుడు నా మనస్సు నిత్యము నీ చరణాలలో లీనమై ఉండని. నీవు ప్రత్యక్షంగా నా ఎదుట ఆసన్నమై వున్నావు మరియు నేను నిన్ను పూజిస్తున్నాను, అను భావము నాలోప్రతి నిత్యము వుండనీ, పూజలో రాబోయే విఘ్నాలన్ని దూరం కాని. పూజ యొక్క చైతన్యము నాకు మరియు అందరికి లభించనీ’.

ఆచమనము

కుడిచేతితో ఆచమనము ముద్ర చెయ్యాలి. తదనంతరము ఎడమ చేతితో చెంచెడు నీళ్ళు కుడి అరచేతిపై (ముద్ర స్థితి) పోయాలి మరియు శ్రీవిష్ణువు యొక్క నామముల చివర ‘నమః’ పదమును ఉచ్చరించి ఆ నీళ్ళను త్రాగాలి.-

1. శ్రీ కేశవాయ నమః 2. శ్రీ నారాయణాయ నమః 3. శ్రీ మాధవాయ నమః

నాలుగావ నామాన్ని ఉచ్చరిస్తున్నపుడు ‘నమః’ అంటున్నప్పుడు కుడిచేతిపై పళ్ళెములో నీళ్ళను వదలాలి.

4. శ్రీ గోవిందాయ నమః
పూజకుడి చేతిని తూడ్చుకొని నమస్కార ముద్రలో ఛాతివద్ద చేతులను జోడించాలి మరియు శరణాగతి భావముతో ఈ దిగువ ఇవ్వబడిన పేర్లను ఉచ్చరించాలి.

5. శ్రీ విష్ణవే నమః 6. శ్రీ మధుసూదనాయ నమః 7. శ్రీ త్రివిక్రమాయ నమః 8. శ్రీ వామనాయ నమః 9. శ్రీ శ్రీధరాయ నమః 10. శ్రీ ఋషికేశాయ నమః 11. శ్రీపధ్మనాభాయ నమః 12. శ్రీ దామోదరాయ నమః 13. శ్రీ సంకర్షణాయ నమః 14. శ్రీ వాసుదేవాయ నమః 15. శ్రీ ప్రధుమ్నాయ నమః 16. శ్రీ అనిరుద్ధాయ నమః 17. శ్రీ పురుషోత్తమాయ నమః 18. శ్రీ అధోక్షజాయ నమః 19. శ్రీ నారసింహాయ నమః 20. శ్రీ అచ్యుతాయ నమః 21. శ్రీ జనార్ధనాయ నమః 22. శ్రీ ఉపేంద్రాయ నమః 23. శ్రీ హరాయ నమః 24. శ్రీ శ్రీకష్ణాయ నమః

మళ్ళి ఆచమనము చేసి 24 నామాల్ని చెప్పాలి. తదనంతరము పంచపాత్రములోని మొత్తం నీళ్ళను పళ్ళెములో పోయాలి మరియు చేతిని తూడ్చుకొని ఛాతివద్ద నమస్కారము యొక్క ముద్రలో చేతులను జోడించాలి.

దేవతాస్మరణ

శ్రీమన్మహాగణాధిపతయే నమః॥ అర్థం : గణాల  నాయకుడైన శ్రీ గణపతికి నమస్కరిస్తున్నాను.

ఇష్టదేవతాభ్యో నమః ॥ అర్థం : నా ఆరాధ్య దేవతకు నేను నమస్కారిస్తున్నాను.

కులదేవతాభ్యో నమః ॥ అర్థం : కులదేవతకు నేను నమస్కరిస్తున్నాను.

గ్రామదేవతాభ్యో నమః ॥ అర్థం : గ్రామదేవతకు నేను నమస్కరిస్తున్నాను.

స్థానదేవతాభ్యో నమః ॥ అర్థం : ఇక్కడి స్థానదేవతాకు నేను నమస్కరిస్తున్నాను.

వాస్తుదేవతాభ్యో నమః ॥ అర్థం :  ఇక్కడి వాస్తుదేవతాకు నేను నమస్కరిస్తున్నాను.

ఆదిత్యాదినవగ్రహదేవతాభ్యో నమః ॥ అర్థం : సూర్యాది నవగ్రహదేవతలకు నేను నమస్కరిస్తున్నాను.

సర్వేభ్యో దేవేభ్యో నమః ॥ అర్థం : సకల దేవతలకు నేను నమస్కరిస్తున్నాను.

సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః ॥ అర్థం : సర్వ  బ్రాహ్మణులకు (బ్రహ్మ తెలిసినవారు) నేను నమస్కరిస్తున్నాను.

అవిఘ్నమస్తు l అర్థం : సర్వ సంకటాలు నాశనము కాని.

‘దేశకాలం’ మరియు సంకల్పం’

‘దేశకాలం’ మరియు సంకల్పం’ వీటి అర్థం

దేశకాలం యొక్క అర్థం : మహాపురుషుడైన భగవాన్‌ శ్రీవిష్ణువు యొక్క ఆజ్ఞతో కట్టుబడిన బ్రహ్మాదేవుడి రెండవ పరార్థములోని శ్రీశ్వేతవారాహ, కల్పాలోని వైవస్వత మన్వంతరలోని ఇరువై ఎనిమిదవ యుగములోని చతుర్యుగములోని మొదటి అంశములోని జంబు ద్వీపాము యొక్క భరతవర్షములోని భరతఖండములోని దండకారణ్య దేశములోని గోదావరి నది దక్షిణా తీరాన బౌద్ధావతారములో రామక్షేత్రములో నేడు ప్రారంభమైన శాలివాహన శతాబ్ధములోని వ్యవాహారిక ‘అనే’ వారము ‘అనే’ నక్షత్రములోని శుభయోగములోని శుభవేళలో పై గుణవిశేషములతో యుక్తమైన శుభమైన మరియు పుణ్యకారకమైన ఈ రోజు తిథి. అన్నిశాస్త్రాలు మరియు శతి-సతి-పురాణాలు నాకు భగవంతుని ఆజ్ఞల వంటివి.

సంకల్పం యొక్క అర్థం : ఇందులో చెప్పబడిన  ఫలం పొందుటకు మరియు భగవంతుడిని ప్రసన్నం చేసుకోవడానికి నేను ఈ పూజ చేస్తున్నాను. శ్రీ సిద్ధివినాయకుని దయ వలన, అన్ని పాపాలు నశిస్తాయి మరియు అన్ని పనులలో అడ్డంకులు తొలగిపోతాయి; పుత్రులకు వృద్ధి జరిగి వారికి శ్రేయస్సు కూడా లభించాలి; శాస్త్రములో పేర్కొన్న జ్ఞానం, విజయం, సంపద మొదలైన ఫలాలను సాధించడం కోసం శ్రీ ఉమా మహేశ్వరులతో పాటు సిద్ధివినాయక దేవతను ప్రసన్నం చేయడానికి నేను ఈ పూజ చేస్తున్నాను. అందులో, మొదటిసారిగా, విఘ్నానాశనము కొరకు మహాగణపతి పూజ మరియు శరీరశుద్ధి కోసం విష్ణువును స్మరిస్తున్నాను. అదేవిధంగా కలశ, ఘంటా మరియు దీపమును పూజిస్తున్నాను.

‘దేశకాలం’ ఉచ్చరించిన తరువాత ‘సంకల్పం’ ఉచ్చిరించాలి.

దేశకాలం : పూజకుడు తన రెండూ కళ్ళకు నీళ్లు అద్దుకుని క్రింది ‘దేశకాలం’ చెప్పవలెను.

శ్రీమద్‌భగవతో మహాపురుషస్య విష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణో ద్వితీయే పరార్ధే విష్ణుపదే శ్రీశ్వేతవారాహకల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే యుగే యుగచతుష్కే కలియుగే ప్రథమచరణే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే దక్షిణపతే రామక్షేత్రే బౌద్ధావతారే దండకారణ్యే దేశే గోదావర్యాః దక్షిణే తీరే శాలివాహన శకే అస్మిన్ వర్తమానే వ్యావహారికే శోభకృత్ నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్షా ఋతౌ, భాద్రపద మాసే, శుక్ల పక్షే, చతుర్థ్యాం తిథౌ, భౌమ వాసరే, స్వాతి (13.48 తరువాత విశాఖ) దివస నక్షత్రే, వైధృతి యోగే, విష్టి కరణే (మ. 1.44 తరువాత బవ కరణే), తులా స్థితే వర్తమానే శ్రీచంద్రే, కన్యా స్థితే వర్తమానే శ్రీసూర్యే, మేష స్థితే వర్తమానే శ్రీదేవగురౌ, కుంభ స్థితే వర్తమానే శ్రీ శనైశ్చరే, శేషేషు సర్వగ్రహేషు యథాయథమ్ రాశిస్థానాని స్థితేషు ఏవం గ్రహ-గుణవిశేషేణ విశిష్టాయాం శుభపుణ్యతిథౌ…

సంకల్పం 

కుడిచేతిలో అక్షింతలను తీసుకుని ‘సంకల్పం’ ఉచ్చరించాలి.

మమ ఆత్మనః పరమేశ్వరాజ్ఞారూపసకలశాస్త్ర

శ్రుతిస్మృతిపురాణోక్తఫలప్రాప్తిద్వారా శ్రీపరమేశ్వర

ప్రీత్యర్థం మమ శ్రీసిద్ధివినాయకప్రీతిద్వారాసకల్ప్య

పాపక్షయపూర్వకంసర్వకర్మనిర్విఘ్నత్వపుత్రపౌత్రాభివృద్ధి

మహైశ్వర్యవిద్యావిజయసంపదాధికల్పోక్తఫలసిద్ధ్యర్థమ్

శ్రీఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయక

దేవతాప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచారైః

పూజనమహం కరిష్యే | తత్రాదౌ నిర్విఘ్నతాసిద్ధ్యర్థం

శ్రీ మహాగణపతిపూజనం కరిష్యే | శరీరశుద్ధ్యర్థం విష్ణుస్మరణం కరిష్యే |

కలశశంఖఘంటాదీపపూజనం చ కరిష్యే ||

ప్రతిసారి ఎడమ చేతితో చెంచడు నీళ్ళను తీసుకొని కుడిచేతిపై పోస్తు ‘కరిష్యే’ అని పలుకాలి.

శ్రీ మహాగణపతి పూజ

ప్రథమంగా మట్టితో తయారైన విగ్రహము ఎదుట మరియు స్థానానుసారంగా పళ్లెములో లేదా అరటి ఆకులో పెట్టాలి. ఆ తరువాత బియ్యపు రాశి చేసి పెట్టాలి. దానిపై శ్రీఫలము (టెంకాయ) పెట్టేటప్పుడు దాని జుట్టు మన వైపు పెట్టాలి. తరువాత చందనాది గంధముతో శ్రీ మహాగణపతి యొక్క పూజ చెయ్యాలి.

ధ్యానము : నమస్కార ముద్ర చేసి మీ చేతులను మీ ఛాతీవద్దకు తీసుకోండి మరియు కళ్ళు మూసుకుని శ్రీ మహాగణపతి రూపాన్ని స్మరించండి మరియు తదుపరి శ్లోకం చదవండి.

వక్రతుణ్డ మహాకాయ కోటిసూర్యసమప్రభ

నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ॥

అర్థం : కుమార్గములో నడిచే వారికి మార్గదర్శకత్వం వహించే, భారీ శరీరం మరియు కోట్లాది సూర్యుల తేజస్సు కలిగి వున్న హే గణపతి దేవా, నా కార్యములోని విఘ్నాలను శాశ్వతంగా తొలగించుము. నేను నీకు నమస్కరిస్తున్నాను మరియు ధ్యానం చేస్తున్నాను.

శ్రీ మహాగణపతయే నమః  ధ్యయామి ॥

ఆవాహనం : కుడి చేతిలో (మధ్యమా అనామిక మరియు బొటనవేలు కలిసి, అక్షతలు తీసుకొని, ఆవాహయామి చెబుతూ, ఆ శ్రీఫలరూపములో గల మహాగణపతి చరణాల్లో సమర్పించాలి.

శ్రీమహాగణపతయే నమః  మహాగణపతిం సాంగం  సపరివారం సాయుధం సశక్తికం ఆవాహయామి ॥

ఆసనం : కుడి చేతిలో అక్షితలు తీసుకొని ‘ సమర్పయామి’ అని చెబుతు వాటిని శ్రీ మహాగణపతి యొక్క చరణాల్లో సమర్పించాలి.

శ్రీమహాగణపతయే నమః  ఆసనార్థే అక్షతాన్‌ సమర్పయామి ॥

చందనాది ఉపచారం : కుడి చేతి అనామికతో గంధం (చందనము) దేవుడికి పెట్టాలి. తరువాత నామమంత్రం చెబుతు ‘సమర్పయామి’ అని ఉచ్చరిస్తు దేవుడికి సమర్పించాలి.

శ్రీ మహాగణపతయే నమః l చందనం సమర్పయామి ॥ (గంధంపెట్టాలి.)

ఋద్ధిసిద్ధిభ్యాం నమః l హరిద్రాం సమర్పయామి ॥ (పసుపును సమర్పించాలి.)

ఋద్ధిసిద్ధిభ్యాం నమః l  కుంకుమం  సమర్పయామి ॥ (కుంకూమను సమర్పించాలి.)

శ్రీ మహాగణపతయే నమః l ఋద్ధిసిద్ధిభ్యాం నమః  సింధూరం సమర్పయామి ॥ (సింధూరం సమర్పించాలి.)

శ్రీ మహాగణపతయే అలంకారార్తే అక్షతాన్‌ సమర్పయామి ॥ (అక్షింతలను సమర్పించాలి.)

శ్రీ మహాగణపతయే నమః l పుష్పం సమర్పయామి ॥ (ఫూలను సమర్పించాలి.)

శ్రీ మహాగణపతయే నమః  l దూర్వామ్ కురాన్‌ సమర్పయామి ॥ (దూర్వాను సమర్పించాలి.)

శ్రీ మహాగణపతయే నమః l ధూపం సమర్పయామి ॥ (ఉదబత్తీ ని వెలగించాలి.)

శ్రీ మహాగణపతయే నమః  l దీపం సమర్పయామి ॥ (నిరాంజన సమర్పించాలి.)

కుడిచేతితో 2 దుర్వ (గరిక) తీసుకొని వాటిపై నీటిని చల్లాలి. తరువాత దుర్వాతో నీటిని నైవేద్యముపై ప్రోక్షణము(చల్లి) చేసి దుర్వాను చేతిలో అలానే పట్టుకొని, ఎడమ చేతి వ్రేళ్ళను కళ్ళపై (వచన వివక్షం : ఎడమ చేతిని ఛాతి పై) పెట్టి నైవేద్యమును సమర్పిస్తు ఈ క్రింది మంత్రాన్ని పఠించాలి.

ప్రాణాయ నమః  l అపానాయ నమః  l వ్యానాయ నమః  l ఉదానాయ నమః  l సమానాయ నమః  l బ్రహ్మణే నమః  l l

గమనిక – వేదోక్త పూజవిధిలో ‘ప్రాణాయ నమః ’ ఈ చోట ‘ఓం ప్రాణాయ స్వాహా’ అని మంత్రపఠన చెయ్యాలి.

చేతిలోని ఒక దూర్వను నైవేద్యముపై మరియు మరొక దూర్వను శ్రీ గణపతి యొక్క చరణాల్లో సమర్పించాలి. చేతిపై నీటిని తీసుకొని ప్రతి ఒకసారి మంత్రాన్ని పఠిస్తు పళ్ళెములో నీటిని వదలాలి.

శ్రీమహాగణపతయే నమః l  నైవేద్యం సమర్పయామి ॥ మధ్యే పానీయం సమర్పయామి l ఉత్తరాపోశనం సమర్పయామి l హస్తప్రక్షాలనం సమర్పయామి l ముఖప్రక్షాలనం సమర్పయామి ॥ (గంధ-ఫూల సమర్పించాలి.) కరోద్వర్తనార్థే చన్దనం సమర్పయామి ॥

నమస్కారము ముద్ర చేసి ప్రార్థన చెయ్యాలి.

కార్యం మే సిద్ధిమాయాతు ప్రసన్నే త్వయి ధాతరి  విఘ్నాని నాశమాయాన్తు సర్వాణి గణనాయక ॥

అర్థం : హే గణనాయక, నీవు నాపై ప్రసన్నమై, నా కార్యములోని విఘ్నాలనన్నిటిని దూరం చేసి, నీవే నా కార్యాన్ని సిద్ధికి తీసుకెళ్ళుము.

ఆ తరువాత చెంచెడు నీరును తీసుకొని ‘ప్రీయతాం’ అను పదాన్ని చెబుతు పళ్ళెములో వదలాలి.

అనేన కృతపూజనేన శ్రీ మహాగణపతిః ప్రీయతామ్‌ l

శ్రీవిష్ణు స్మరణ : రెండు చేతులను తూడ్చుకొని నమస్కారము ముద్రలో ఛాతికి చేతులను జోడించాలి. తరువాత 9 సార్లు ‘విష్ణవే నమో’ అని చెప్పి మరియు చివరికి ‘విష్ణవే నమః ’ అని చెప్పాలి.

పూజకు సంబంధించిన సామాగ్రిల పూజ

కలశపూజ

కలశంలో దేవతలు, సముద్రాలు, పవిత్ర నదులు మొదలైనవి ఆవాహన చేయాలి మరియు దానికి గంధం, పూలు మరియు అక్షతలు అర్పించాలి. ఈ సాత్విక నీటిని ఆచార పూజలో ఉపయోగించాలి.

గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి ।

నర్మదే సిన్ధుకావేరి జలేఽస్మిన్ సన్నిధిం కురు ।।

కలశే గంగాదితీర్థాన్యావాహయామి ।।

కలశదేవతాభ్యో నమః ।

సర్వోపచారార్థే గన్ధాక్షతపుష్పం సమర్పయామి ।।

శంఖ పూజ

శంఖాన్ని కడిగి నీటితో నింపాలి. అప్పుడు దానికి గంధం మరియు తెల్లని పువ్వులు అర్పించాలి. అక్షత మరియు తులసి ఆకులను సమర్పించకూడదు.

 


శఙ్ఖదేవతాభ్యో నమః । సర్వోపచారార్థే గన్ధపుష్పం సమర్పయామి ।।

అర్థం: ఓ శంఖం దేవత, నేను మీకు నమస్కరిస్తున్నాను మరియు నేను మీకు గంధము మరియు పూలను సమర్పిస్తున్నాను.

ఘంటపూజ

దేవతలను స్వాగతించడానికి మరియు రాక్షసులను తరిమికొట్టడానికి, ఘంట (గంట) మోగించండి. గంటను కడిగి, ఆరాధకుడి ఎడమవైపు ఉంచాలి మరియు గంధం, పూలు మరియు అక్షతలను అర్పించాలి.


ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రాక్షసామ్ ।

కుర్వే ఘణ్టారవం తత్ర దేవతాహ్వానలక్షణమ్ ।।

ఘణ్టాయై నమః । సర్వోపచారార్థే గన్ధాక్షతపుష్పం సమర్పయామి ।।

దీప-పూజ

దీపానికి గంధం మరియు పుష్పాలను అర్పించాలి.


భో దీప బ్రహ్మరూపస్త్వం జ్యోతిషాం ప్రభురవ్యయః ।

ఆరోగ్యం దేహి పుత్రాంశ్చ మతిం శాన్తిం ప్రయచ్ఛ మే ।।

దీపదేవతాభ్యో నమః । సర్వోపచారార్థే గన్ధాక్షతపుష్పం సమర్పయామి ।।

మండపం పూజ

ఈ మంత్రం చెపుతున్నప్పుడు ‘సమర్పయామి’ అనే పదం చెప్పే సమయంలో మండపం పై గంధం, అక్షింతలు మరియు పువ్వులను సమర్పించాలి.

మండపదేవతాభ్యో నమః |గంధాక్షతపుష్పం సమర్పయామి ||

పూజసామగ్రులు, పూజా స్థలం మరియు ఆరాధకుడి స్వయం శుద్ధి

కళశం మరియు శంఖంలో కొంచెం నీరుని చెమ్చాలో తీసుకోవాలి. పూజకుడు క్రింది మంత్రమును పఠిస్తూ తులసీ దళంతో ఆ నీటిని పూజా సామగ్రుల పై, తన చుట్టూ (పూజాస్థలం) మరియు తన పై (తన తల పై) చిలకరించుకోవాలి.

అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాఙ్గతోఽపి వా ।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యన్తరః శుచిః ।।

అర్థం : అపవిత్రం లేదా ఇతర ఏ స్థితిలోని మనిషి పుండరీకాక్షుడి (శ్రీవిష్ణువు) స్మరణ నుండి అంతర్బాహ్యం పరిశుద్ధమౌతాడు.

పై మంత్రం పఠించడం కష్టాంగా అనిపిస్తే ‘శ్రీ పుండరీకాక్షాయ నమః l’ అని నామమంత్రం చెబుతూ పైన చెప్పిన ఆచరణ చేయవచ్చు. దాని తరువాత తులసీ దళమును పళ్లెంలో వదలవలెను.

శ్రీ గణపతి విగ్రహ ప్రతిష్ఠ మరియు పూజ

అ. శ్రీ గణపతి విగ్రహాన్ని తూర్పు దిశలో ఏర్పాటు చేయాలి. ఆలా చేయడం సాధ్యం కాకపొతే ఆరాధకుడి ముఖము దక్షిణ దిక్కుకి రాకుండా శ్రీ గణపతి విగ్రహాన్ని స్థాపించాలి.

ఆ. ఏ పీఠ పై విగ్రహం స్థాపించాలో ఆ పీఠ పై గుప్పెడు అక్షింతలను పోయాలి. దాని పై కుంకుమతో స్వస్తిక్ రాయాలి.

ఇ. తరువాత ఆ బియ్యం పై క్రింది విధానం తో ‘ప్రాణప్రతిష్ఠ’ చేయాలి.

ప్రాణప్రతిష్ఠ (విగ్రహ ప్రతిష్ఠ) : దేవత విగ్రహం యొక్క హృదయంపై కుడి చేతిని ఉంచి మంత్రాన్ని చదవండి. శ్రీ గణేష్ చతుర్థి నాడు లేదా ఏదైనా కొత్త దేవతా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేయునప్పుడు ఇలా చేయాలి. రోజువారీ ఆరాధనలో ఇది చేర్చబడలేదు, ఎందుకంటే ప్రతి నిత్యం ఆరాధన కారణంగా అప్పటికే దేవుని తత్త్వం అందులో ఉంటుంది.

అస్యశ్రీప్రాణప్రతిష్ఠామన్త్రస్య బ్రహ్మవిష్ణుమహేశ్వరా

ఋషయః ఋగ్యజుఃసామానిఛన్దాంసి పరాప్రాణ

శక్తిర్దేవతా ఆం బీజం హ్రీం శక్తిః క్రోం కీలకమ్ l

అస్యాం ముర్తౌ ప్రాణప్రతిష్ఠాపనే వినియోగః ।।

ఓం ఆంహ్రీంక్రోంయంరంలంవంశంషంసంహం హంసఃసోహమ్ ।

దేవస్య ప్రాణా ఇహ ప్రాణాః ।।

ఓం ఆంహ్రీంక్రోంయంరంలంవంశంషంసంహం హంసః సోహమ్ ।

దేవస్య జీవ ఇహ స్థితః ।।

ఓం ఆంహ్రీంక్రోంయంరంలంవంశంషంసంహం హంసః సోహమ్ ।

దేవస్య సర్వేన్ద్రియాణి ।।

ఓం ఆంహ్రీంక్రోంయంరంలంవంశంషంసంహం హంసః సోహమ్ ।

దేవస్యవాఙ్మనఃచక్షుఃశ్రోత్రజిహ్వాఘ్రాణప్రాణా ఇహాగత్య సుఖంసుచిరం తిష్ఠన్తు స్వాహా ।।

అస్యై ప్రాణాః ప్రతిష్ఠన్తు అస్యై ప్రాణాః క్షరన్తు చ ।

అస్యై దేవత్వమర్చాయై మామహేతి చ కశ్చన ।।

పై మంత్రాలను చదివిన తరువాత, ఆరాధకుడు ‘ॐ’ లేదా ‘పరమాత్మనే నమః.’ అని 15 సార్లు జపించాలి.

షోడశోపచార పూజ


ధ్యానం : ‘వక్రతుండ మహాకాయ .. (वक्रतुंड महाकाय)’ అనే మంత్రాన్ని పఠించండి. నమస్కారం యొక్క ముద్రలో రెండు చేతులను కలిపి ఉంచి కింది వాటిని చదవండి.

ఓం గణానాంత్వాగణపతింహవామహేకవింకవీనాముపమశ్రవస్తమమ్ ।

జ్యేష్ఠరాజంబ్రహ్మణాంబ్రహ్మణస్పతఆనఃశృణ్వన్నూతిభిఃసీదసాదనమ్ ।।

ఏకదన్తం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజమ్ ।

పాశాఙ్కుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధివినాయకమ్ ।।

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః । ధ్యాయామి ।।

1. ఆవాహనం : కుడి చేతిలో అక్షింతలను తీసుకుని ‘ఆవాహయామి’ అని చెప్తున్నప్పుడు మహాదేవ, గౌరి మరియు సిద్ధివినాయక వీరి చరణాలలో సమర్పించాలి. (అక్షింతలను సమర్పించేటప్పుడు మధ్యమా, అనామికా మరియు బొటన వేలుని కలిపి సమర్పించాలి.)

ఆవాహయామి విఘ్నేశ సురరాజార్చితేశ్వర |

అనాథనాథ సర్వజ్ఞ పూజార్థం గణనాయక ||

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః | ఆవాహయామి ||

2. ఆసనం : కుడి చేతిలో అక్షింతలను తీసుకుని ‘సమర్పయామి’ అని చెప్తున్నప్పుడు దేవుడి చరణాలలో సమర్పించాలి.

విచిత్రరత్నరచితం దివ్యాస్తరణసంయుతమ్ |

స్వర్ణసింహాసనం చారు గృహాణ సురపూజిత ||

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః |

ఆసనార్థే అక్షతాన్ సమర్పయామి ||

3. పాదపూజ : కుడి చేతితో చెమ్చా లో నీరు తీసుకోండి మరియు ‘సమర్పయామి’ అని చెప్పేటప్పుడు ఆ నీటిని మహాదేవ్, గౌరి మరియు సిద్ధివినాయక వీరి చరణాలకు చిలకరించాలి.

సర్వతీర్థసముద్‌భూతం పాద్యంగంధాదిభిర్యుతమ్ |

విఘ్నరాజ గృహాణేదం భగవన్భక్తవత్సల ||

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః |

పాద్యం సమర్పయామి ||

4. అర్ఘ్యం : ఎడమచేతితో చెంచాలో నీరు తీసుకోండి. ఆ నీటిలో గంధం, పువ్వు మరియు అక్షింతలను వేయండి. కుడి చేతిలో దుర్వా తీసుకొని ‘సమర్పయామి’ అని చెప్తున్నప్పుడు ఆ నీటిని మహాదేవ్, గౌరి మరియు సిద్ధివినాయక వీరి చరణాలకు చిలకరించాలి.

అర్ఘ్యం చ ఫలసంయుక్తం గంధపుష్పాక్షతైర్యుతమ్ |

గణాధ్యక్ష నమస్తేస్తు గృహాణ కరుణానిధే ||

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః |

అర్ఘ్యం సమర్పయామి ||

5. ఆచమనం : ఎడమ చేతిలో ఒక చెంచాలో నీరు మరియు కుడి చేతిలో దుర్వా తీసుకోండి. తరువాత ‘సమర్పయామి’ అని చెప్తున్నప్పుడు ఆ నీటిని మహాదేవ్, గౌరి మరియు సిద్ధివినాయక వీరి చరణాలకు చిలకరించాలి.

వినాయక నమస్తుభ్యం త్రిదశైరభివందితమ్ |

గంగోదకేన దేవేశ శీఘ్రమాచమనం కురు ||

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః |

ఆచమనీయం సమర్పయామి ||

6. స్నానం : చెంచాలో నీవు తీసుకోండి. కుడి చేతిలో దుర్వా తీసుకోండి. తరువాత ‘సమర్పయామి’ అని చెప్తున్నప్పుడు ఆ నీటిని మహాదేవ్, గౌరి మరియు సిద్ధివినాయక వీరి చరణాలకు చిలకరించాలి.

గంగాసరస్వతీరేవాపయోష్ణీయమునాజలైః |

స్నాపితోసి మయా దేవ తథా శాంతి కురుష్వ మే ||

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః |

స్నానం సమర్పయామి ||

6 అ. పంచామృత స్నానం : పాలు, పెరుగు, నెయ్యి, తేనే మరియు చక్కర వీటితో స్నానం వేయాలి. కుడి చేతిలో దుర్వా తీసుకోండి. తరువాత ‘సమర్పయామి’ అని చెప్తున్నప్పుడు ఆ నీటిని మహాదేవ్, గౌరి మరియు సిద్ధివినాయక వీరి చరణాలకు చిలకరించాలి.

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః |

పయస్నానం సమర్పయామి |

తదంతే శుద్ధోదకస్నానం సమర్పయామి ||

ముందరి ప్రతి స్నానం తరువాత పై శుద్ధోదక మంత్రం పఠించి దేవుడి చరణాలలో నీటిని చిలకరించాలి.

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః |

దధిస్నానం సమర్పయామి ||

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః |

ఘృతస్నానం సమర్పయామి ||

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః |

మధుస్నానం సమర్పయామి ||

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః |

శర్కరాస్నానం సమర్పయామి ||

6 ఆ. గంధోదక స్నానం 

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః | గంధోదకస్నానం సమర్పయామి || తదంతే శుద్ధోదక స్నానం సమర్పయామి || (నీటిలో గంధం మరియు కర్పూరం వేసి దానిని దేవుడి చరణాలలో చిలకరించాలి. తరువాత శుద్ధోదకమును చిలకరించాలి.)

6 ఇ. అభిషేకం : పంచపాత్రలో నీరుని నింపుకోవలెను మరియు కుడి చేతిలో దుర్వాను తీసుకోవలెను. తరువాత చెంచాలోని నీయుని దేవుడి పై చిలకరించునప్పుడు ‘శ్రీగణపతి అథర్వశీర్ష’ లేదా ‘సంకటనాశన గణపతి స్తోత్రం’ పఠించాలి.

7. పత్తి హారం : రెండు పత్తి హారం తీసుకోవలెను మరియు ‘సమర్పయామి’ అని చెప్పేటప్పుడు వాటిలోని ఒక హారం విగ్రహం మేడలో అలంకరణగా వేయాలి మరియు మరొకటిని విగ్రహం చరణాలలో సమర్పించాలి.

రక్తవస్త్రయుగం దేవ దేవతార్హం సుమంగలమ్ |

సర్వప్రద గృహాణేదం లంబోదర హరాత్మజ ||

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః |

కార్పాసనిర్మితం వస్త్రం సమర్పయామి ||

8. యజ్ఞోపవీతం : మహాదేవ మరియు సిద్ధివినాయక వీరికి జనివారం సమర్పించాలి మరియు దేవుడికి అక్షింతలను సమర్పించాలి.

రాజతం బ్రహ్మసూత్రం చ కాంచనస్యోత్తరీయకమ్ |

వినాయక నమస్తేస్తు గృహాణ సురవందిత ||

శ్రీఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః |

యజ్ఞోపవీతం సమర్పయామి ||

శ్రీ ఉమాయై నమః | ఉపవీతార్థే అక్షతాన్సమర్పయామి ||

యజ్ఞోపవీతంను శ్రీ గణపతి మేడలో వేయవలెను మరియు తరువాత దానిని విగ్రహం కుడి చేతి కిందకు తీసుకు రావాలి. పూజలో మహాదేవుడి విగ్రహం లేకపోతె, మహాదేవుడిని ఆవాహనం చేసిన స్థలంలో యజ్ఞోపవీతం సమర్పించాలి.

9. చందనం : శ్రీ గణపతికి అనామికతో గంధం పెట్టవలెను.

శ్రీఖండ చందనం దివ్యం గంధాఢ్యం సుమనోహరమ్ |

విలేపనం సురశ్రేష్ఠ చందనం ప్రతిగృహ్యతామ్ ||

శ్రీఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః |

విలేపనార్థే చందనం సమర్పయామి ||

శ్రీ ఉమాయై నమః | హరిద్రాం కుంకుమం సమర్పయామి || (అరిశిన్ళకుంకుమవన్ను అర్పిసబేకు.) శ్రీ ఉమాయై నమః | శ్రీసిద్ధివినాయకాయ నమః | సిందూరం సమర్పయామి || (గౌరి మరియు సిద్ధివినాయక వీరికి సింధూరం సమర్పించాలి.)

10. పువ్వు, పత్రి (ఆకులు) : అందుబాటులో ఉన్న వివిధ రకాల పువ్వులు మరియు పత్రిలను సమర్పించాలి.

మాల్యాదిని సుగంధీని మాలత్యాదిని వై ప్రభో |

మయా హృతాని పూజార్థం పుష్పాణి ప్రతిగృహ్యతామ్ ||

సేవంతికాబకులంపకపాటలాబ్జైః

పున్నాగజాతికరవీరరసాలపుష్పైః |

బిల్వప్రవాలతులసీదలమాలతీభిః

త్వాం పూజయామి జగదీశ్వర మే ప్రసీద ||

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః |

ఋతుకాలోద్భవపుష్పాణి సమర్పయామి ||

మహాదేవ మత్తు గౌరికి తుళసి మత్తు బిల్వపత్రం సమర్పించాలి

శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః |

తులసీపత్రం బిల్వపత్రం చ సమర్పయామి ||

అంగపూజ : క్రింది పేరులతో శ్రీ సిద్ధివినాయకుడి చరణాలలో లేదా దేవుడి పాలనా అవయవాల పై కుడి చేతితో అక్షింతలను సమర్పించాలి.

శ్రీ గణేశాయ నమః | పాదౌ పూజయామి || (చరణాల పై)

శ్రీ విఘ్నరాజాయ నమః | జానునీ పూజయామి || (మోకాళ్ళ పై)

శ్రీ ఆఖువాహనాయ నమః | ఊరూ పూజయామి || (తొడల పై)

శ్రీ హేరంబాయ నమః | కటిం పూజయామి || (నడుము పై)

శ్రీ కామారిసూనవే నమః | నాభిం పూజయామి || (నాభి పై)

శ్రీ లంబోదరాయ నమః | ఉదరం పూజయామి || (కడుపు పై)

శ్రీ గౌరీసుతాయ నమః | హృదయం పూజయామి || (ಎద పై)

శ్రీ స్థూలకంఠాయ నమః | కంఠం పూజయామి || (మెడ పై)

శ్రీ స్కందాగ్రజాయ నమః | స్కంధౌ పూజయామి || (భుజాల పై)

శ్రీ పాశహస్తాయ నమః | హస్తౌ పూజయామి || (చేతుల పై)

శ్రీ గజవక్త్రాయ నమః | వక్త్రం పూజయామి || (ముఖం పై)

శ్రీ విఘ్నహర్త్రే నమః | నేత్రే పూజయామి || (కన్నుల పై)

శ్రీ సర్వేశ్వరాయ నమః | శిరః పూజయామి || (మస్తకం పై)

శ్రీ గణాధిపాయ నమః | సర్వాంగం పూజయామి || (సర్వాంగాల పై)

పత్రీ పూజ (ఆకులతో పూజ) : క్రింది పేరులతో పత్రీల తోడియమును దేవుడి వైపు చేసి ‘సమర్పయామి’ అని చెప్పుతున్నప్పుడు దేవుడి చరణాలలో సమర్పించాలి. (పత్రీలు దొరకకపోతే 2 దుర్వా / అక్షింతలు దేవుడికి సమర్పించాలి.)

శ్రీ సుముఖాయ నమః | మాలతీపత్రం సమర్పయామి || (మల్లె పత్రీ)

శ్రీ గణాధిపాయ నమః | భృంగరాజపత్రం సమర్పయామి || (భృంగరాజ)

శ్రీ ఉమాపుత్రాయ నమః | బిల్వపత్రం సమర్పయామి || (బిల్వ)

శ్రీ గజాననాయ నమః | శ్వేతదూర్వాపత్రం సమర్పయామి || (తెల్ల దూర్వೆ)

శ్రీ లంబోదరాయ నమః | బదరీపత్రం సమర్పయామి || (బదరీ పత్రೆ)

శ్రీ హరసూనవే నమః | ధత్తూరపత్రం సమర్పయామి || (ధత్తూరి)

శ్రీ గజకర్ణాయ నమః | తులసీపత్రం సమర్పయామి || (తుళసి)

శ్రీ గుహాగ్రజాయ నమః | అపామార్గపత్రం సమర్పయామి || (ఉత్తరణೆ)

శ్రీ వక్రతుండాయ నమః | శమీపత్రం సమర్పయామి || (శమీ)

శ్రీ ఏకదంతాయ నమః | కేతకీపత్రం సమర్ప యామి || (మొగలి)

శ్రీ వికటాయ నమః | కరవీరపత్రం సమర్పయామి || (గన్నేరు)

శ్రీ వినాయకాయ నమః | అశ్మంతకపత్రం సమర్పయామి || (మందార)

శ్రీ కపిలాయ నమః | అర్కపత్రం సమర్పయామి || (జిల్లేడు)

శ్రీ భిన్నదంతాయ నమః | అర్జునపత్రం సమర్పయామి || (మత్తి)

శ్రీ పత్నీయుతాయ నమః | విష్ణుక్రాంతాపత్రం సమర్పయామి || (శంఖపుష్ట)

శ్రీ బటవే నమః | దాడిమీపత్రం సమర్పయామి || (దానిమ్మ)

శ్రీ సురేశాయ నమః | దేవదారూపత్రం సమర్పయామి || (దేవదార)

శ్రీ భాలచంద్రాయ నమః | మరూబకపత్రం సమర్పయామి || (మరుగ)

శ్రీ హేరంబాయ నమః | సిందువారపత్రం సమర్పయామి || (సిందువార/ నిర్గుండి)

శ్రీ శూర్పకర్ణాయ నమః | జాతీపత్రం సమర్పయామి || (జాజి)

శ్రీ సర్వేశ్వరాయ నమః | అగస్తిపత్రం సమర్పయామి || (అగసి)

తరువాత శ్రీ సిద్ధి వినాయకుడి 108 పేరులను ఉచ్చరిస్తూ ఒకొక్క దుర్వాను సమర్పించాలి.

11. ధూపం : అగర్బత్తిని  వెలిగించాలి లేదా ధూపం చూపించాలి.

వనస్పతిరసోద్భూతో గంధాఢ్యో గంధ ఉత్తమః |

ఆఘ్రేయః సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతామ్ ||

శ్రీ ఉమామహేశ్వరసహిత శ్రీసిద్ధివినాయకాయ నమః | ధూపం సమర్పయామి ||

12. దీపం 

ఆజ్యం చ వర్తిసంయుక్తం వహ్నినా యోజితం మయా |

దీపం గృహాణ దేవేశ త్రైలోక్యతిమిరాపహ ||

భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే|

త్రాహి మాం నిరయాద్ ఘోరాద్ దీపోయం ప్రతిగృహ్యతామ్ ||

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః |

దీపం సమర్పయామి || (నీరాజనంతో హారతినివ్వాలి)

13. నైవేద్యం : కుడిచేతిలో 2 దుర్వాలను తీసుకొని వాటి పై నీరు వేయవలెను. ఆ నీరుని నైవేద్యం పై చిలకరించి దుర్వాలను చేతిలోనే పట్టుకోవలెను. దుర్వాలతో నీరుని నైవేద్య చుట్టూ మండలం వేయాలి. తరువాత తమ ఎడమ చేతిని ఎద పై పెట్టుకోవలెను. అలాగే తమ కుడి చేతి వేళ్ళతో దేవుడికి ఆ నైవేద్యం సుగంధం సమర్పించేటప్పుడు క్రింది మంత్రం పఠించాలి.

నైవేద్యం గృహ్యతాం దేవ భక్తిం మే హ్యచలాం కురు |

ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాం గతిమ్ ||

శర్కరాఖండఖాద్యాని దధిక్షీరఘృతాని చ |

ఆహారం భక్ష్యభోజ్యం చ నైవేద్యం ప్రతిగృహ్యతామ్ ||

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః |

పురతస్థాపితమధురనైవేద్యం నివేదయామి ||

ప్రాణాయ నమః | అపానాయ నమః | వ్యానాయ నమః |ఉదానాయ నమః | సమానాయ నమః | బ్రహ్మణే నమః ||

ఒక దుర్వా ఆకును నైవేద్యంపై ఉంచండి మరియు మరొకటి శ్రీ గణపతి పవిత్ర పాదాల వద్ద సమర్పించండి. ఈ క్రింది మంత్రాన్ని పఠిస్తూ కుడి చేతి అరచేతిలో కొంత నీరు తీసుకొని పళ్ళెం లో వదిలేయండి.

నైవేద్యం సమర్పయామి ।। మధ్యే పానీయం సమర్పయామి ।

ఉత్తరాపోశనం సమర్పయామి । హస్తప్రక్షాళనం సమర్పయామి । ముఖప్రక్షాళనం సమర్పయామి ।।

చందనం పూసిన పూలను సమర్పించండి.

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః |

కరోద్వర్తనార్థే చందనం సమర్పయామి ||

అ. హారతి : నైవేద్యం సమర్పించిన తరువాత హారతిని ఇవ్వవలెను. దానికి ముందు మూడు సార్లు శంఖనాదం చేయవలెను. హారతి చేసేటప్పుడు ‘ప్రత్యక్షణగా గణపతి ఎదురు ఉన్నాడు మరియు నేను తన చరణాలకు ఆర్త్రతతో ప్రార్థన చేస్తున్నాను’ అనే భావంతో హారతిని ఇవ్వవలెను. హారతిని ఇచ్చేటప్పుడు హారతి పళ్లెం దేవుడి అనాహత చక్రం నుండి ఆజ్ఞ చక్రం వరకు తిప్పాలి.

ఆ. కర్పూరం హారతి : హారతి తరువాత ‘కర్పూరగౌరం కరుణావతారం…’ ఈ మంత్రం పఠిస్తూ కర్పూర హారతిని ఇవ్వవలెను.

14. నమస్కారం : క్రింది శ్లోకం పఠిస్తూ దేవుడికి పూర్ణ శరణాగతి భావంతో సాష్టాంగ నమస్కారం చేయవలెను.

నమః సర్వహితార్థాయ జగదాధారహేతవే |

సాష్టాంగోయం ప్రణామస్తే ప్రయత్నేన మయా కృతః ||

నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే

సహస్రపాదాక్షిశిరోరుబాహవే ||

సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే

సహస్రకోటీ యుగధారిణే నమః ||

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః |

నమస్కారన్ సమర్పయామి ||

15.  ప్రదక్షిణ : క్రింది మంత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి.

యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ |

తాని తాని వినశ్యంతి ప్రదక్షిణపదే పదే ||

అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ |

తస్మాత్కారుణ్యభావేన రక్ష మామ్ పరమేశ్వర ||

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః |

ప్రదక్షిణాం సమర్పయామి ||

16. మంత్రపుష్పాంజలి మరియు ప్రార్థన 

శ్రీ ఉమామహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకాయ నమః | మంత్రపుష్పాంజలిం సమర్పయామి |

తరువాత క్రింది ప్రార్థన చేయవలెను.

ఆవాహనం న జానామి న జానామి తవార్చనమ్ |

పూజాం చైవ న జానామి క్షమ్యతాం పరమేశ్వర ||

మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర |

యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ||

అపరాధసహస్రాణి క్రియంతేహర్నిశం మయా |

దాసోయమితి మాం మత్వా క్షమస్వ పరమేశ్వర ||

అర్థం : నాకు నీ ఆవాహనం మరియు అర్చన, అలాగే నీ పూజ ఎలా చేయాలో తెలియదు. పూజ చేయునప్పుడు ఏదైనా తప్పు జరిగి ఉంటె నన్ను క్షమించు. ఓ దేవా, నేను మంత్రహీనం, క్రియాహీనం మరియు భక్తిహీనంగా ఉన్నాను. నేను చేసిన పూజను నువ్వు పరిపూర్ణంగా చేయించుకో. పగలు రాత్రి నా నుండి తెలిసో లేదా తెలియకో వేలాది అపరాధములు జరిగి ఉంటాయి. ‘నేను నీ దాసుడిని’ అని భావించి నన్ను క్షమించు.

కాయేన వాచా మనసేన్ద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతిస్వభావాత్ ।

కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయే తత్ ।।

అనేన దేశకాలాద్యనుసారతః కృతపూజనేన శ్రీ ఉమా మహేశ్వరసహితశ్రీసిద్ధివినాయకదేవతా ప్రీయతాం ||  (చేతిలో నీరు తీసుకొని పళ్లెంలో వదలాలి.)

ప్రీతో భవతు | తత్సద్‌బ్రహ్మార్పణమస్తు ||

జయధ్వానం : దేవుడి పేరుతో జయధ్వానం చేయాలి.

కృతజ్ఞత : పూజ చివరిలో దేవుడికి నీ కృపతో నా నుండి భావపూర్ణ రీతిలో పూజ జరిగింది’ అని కృతజ్ఞత సమర్పించాలి.

తీర్థప్రాశనం మరియు ప్రసాద స్వీకరించడం : కుడిచేతితో తీర్థం తీసుకుంటూ క్రింది మంత్రం పఠిస్తూ తీర్థం స్వీకరించాలి.

అకాలమృత్యుహరణం సర్వవ్యాధివినాశనమ్ |

దేవపాదోదకం తీర్థం జఠరే ధారయామ్యహమ్ ||

తరువాత భావపూర్వకంగా ప్రసాదం స్వీకరించాలి.

తరువాత ఆచమనం చేసి ‘విష్ణవే నమో విష్ణవే నమో విష్ణవే నమః l’ అని చెప్పవలెను.

 

 

Leave a Comment