భగవంతుడికి నమస్కారము చేయు సరైన పద్ధతి

ముందుగా రెండు అరచేతులను ఒకదానికి ఒకటి జోడించవలెను. చేతులను జోడించునపుడు వ్రేళ్ళను వదులుగా ఉంచవలెను. చేతులు జోడించి కొద్దిగా ముందుకు వంగి, రెండు చేతుల బొటన వ్రేళ్ళను భ్రూమధ్యకు స్పర్షించి, మనస్సును దేవుని చరణాల పై ఏకాగ్ర పరచవలెను. ఏకాగ్రచిత్తముతో దేవునికి ప్రార్థన చేసి, జోడించిన చేతులను వెంటనే కిందికి దించకుండా చేతి మణికట్టు హృదయ మధ్యభాగములో తాకే విధంగా కొద్దిసేపు ఉంచి తరువాత చేతులను కిందికి తీసుకురావలెను. ఈ విధంగా నమస్కరించుట వలన దేవుని కృప కలుగుతుంది.

(ఆధారము : సనాతన నిర్మించిన లఘుగ్రంథము ‘నమస్కారముల యోగ్య పద్ధతి’)

Leave a Comment