అక్షయ తృతీయ

సత్పాత్రదానము చేయండి : అక్షయ తృతీయ నాడు చేసిన దానం ఎప్పటికి క్షయంకాదు. దానం సత్పాత్రగా ఉండాలి. సంతులకు, సత్కార్యములకు చేసిన దానం ‘అకర్మకర్మ’ అగుట వలన దానం చేయువారు ఏ బంధనంలో చిక్కుకోకుండా, మృత్యువు తరువాత ఉచ్ఛలోకాలకు వెళ్తారు. నువ్వుల తర్పణ ఇవ్వవలెను : దేవతలకు మరియు పూర్వీకులకు నువ్వులు మరియు నీళ్ళను సమర్పించడమనగా నువ్వుల తర్పణ. ఇటువంటి తర్పణ చేయుట వలన దేవతలు మరియు పూర్వీకులు సంతోషించి ఆశీర్వదిస్తారు. (మరిన్ని వివరాల కొరకు చదవండి … Read more

హనుమంతుడు

హనుమాన్ జయంతి రోజున మిగితా రోజులకు పోలిస్తే వాతావరణంలో 1000 రెట్లు ఎక్కువ హనుమంతుని తత్త్వం కార్యనిరతమై ఉంటుంది. హనుమంతుని ఉపాసకులకు ఈ తత్త్వం యొక్క ప్రయోజనం కలగాలనే ఉద్దేశంతో హనుమంతుని వేరు వేరు రూపాలు దాని శాస్త్రము మరియు హనుమంతుని ఉపాసనా శాస్త్రము గురించి ఇక్కడ పొందుపరచడమైనది.

హోళి యొక్క ప్రాముఖ్యత మరియు హోళి పండుగను ఆచరించే పద్ధతి

హోళి కూడా సంక్రాంతిలాగ ఒక దేవతయే. షడ్వికారాలపై విజయాన్ని సాధించే సామర్థము హోళికా దేవిలో కలదు. ఈ వికారాలపై విజయాన్ని సాధించే సామర్థమును పొందుటకు హోళికా దేవిని ప్రార్థిస్తారు. అందుకే హోళిని ఉత్సవరూపములో జరుపుకుంటారు.

శ్రీ సరస్వతిదేవి విశిష్ఠతలు

శ్రీ సరస్వతి దేవి విశిష్టతలు, అమ్మవారి నివాసము, అమ్మవారి చేతిలోని వస్తువుల విశిష్టతలను తెలుసుకొని అమ్మవారి గురించి భక్తి భావమును పెంచుకుందాము.

వసంత పంచమి

ఋతువులన్నిటికి రాజ వసంత ఋతువు. ఈ ఋతువు యొక్క ఆగమనం వసంతపంచమినాడు ప్రారంభమౌతుంది. అలాగే ఈ రోజుననే శ్రీసరస్వతిదేవి మరియు లక్ష్మీదేవి జన్మదినము అని ఆచరిస్తారు.

మకర సంక్రాంతి

సూర్యుడు మకరరాశిలో సంక్రమణమవుతాడు; దానిని ‘మకర సంక్రాంతి’ అని అంటారు. ప్రతి ఎనబై సంవత్సరాలకు సంక్రాంతి ఒక రోజు ముందుకు సాగుతుంది.

యమద్వితీయ, భగినీహస్త భోజనం

ఈ తిథి నాడు యమలోకంలో నుండి వచ్చే యమతరంగాలు పృథ్విలోని వాయుమందలములోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ పృథ్వి అనగా యముడి సహోదరి. అందుకే ఈ రోజున యముడు తన లోకాన్ని విడిచి, తన సహోదరి అనగా, పుత్రిస్వరూపమైన భూలోకానికి ప్రవేశిస్తాడు. దీనికి ప్రతీకగా ఈ రోజున ప్రతి ఇంటి పురుషుడు తన భార్య చేతి వంటను స్వీకరించకుండా, సహోదరి ఇంటికి భోజనానికి వెళ్తాడు. సహోదరి ఇంట అతడు యమాది దీవతలకు పూజ చేస్తాడు. అకాల మృత్యువును తప్పించేందుకు యమద్వితీయ … Read more

బలిపాడ్యమి

దీపావళిలో ఇది ముఖ్యమైన రోజు ప్రాతఃకాలంలో స్త్రీలు అభ్యంగనస్నానం చేసి, తమ భర్తకు హారతినిస్తారు. అందరూ క్రొత్త వస్త్రాలు ధరించి, మధ్యాహ్నం వివిధ రకాల వంటకాలతో భోజనం చేసి, రోజంతా ఆనందంగా గడుపుతారు. ఈ రోజు కొందరు బలిచక్రవర్తి ప్రతిమకు పూజ చేస్తారు. దీని కారణం, సంవత్సరమంతా బలిరాజు తన శక్తి బలముతో పృథ్వీ పై ఉన్న జీవులకు ఇబ్బంది కలగకుండా, ఇతర చెడు శక్తులను శాంతపరచాలనేది ఈ పూజ యొక్క ఉద్దేశము. (మరిన్ని వివరాల కొరకు … Read more

దీపావళి, లక్ష్మీ పూజ

లక్ష్మి మరియు కుబేరుని పూజ ! లక్ష్మి సంపదల యొక్క దేవత, కుబేరుడు ఆ సంపత్తిని రక్షించేవాడు. చాల మందికి డబ్బులు సంపాదించే కళ తెలిసి ఉంటుంది; కాని దానిని పొదుపు చేసే మార్గం తెలియకపోవడం వల్ల అనవసరమైన ఖర్చులను చేసి డబ్బులను వృధా చేస్తుంటారు. అందువల్ల డబ్బులను సంపాదించడంతో పాటు దానిని పొదుపుగా వాడడం మరియు యోగ్య మైన కారణానికి ఖర్చు పెట్టడం చాలా మహాత్వమైనది. కుబేరుడు డబ్బులను ఎలా రక్షించుకోవాలో నేర్పించే దేవుడు. అందుకే … Read more

నరకచతుర్దశి

నరకచతుర్దశి ఆచరించే పద్దతి ! ఆకాశంలో నక్షత్రాలు ఉన్నప్పుడు బ్రహ్మ ముహూర్తములో అభ్యంగన స్నానం చేస్తారు. ఓకే వనస్పతితో తల నుండి కాళ్ళ వరకు మరియు మళ్ళి కాళ్ళ నుండి తల వరకు నీళ్ళు ప్రోక్షణ చేసుకుంటారు. యమతర్పణ : అభ్యంగన స్నానం తరువాత అకాలమృత్యు నివారణ కొరకు యమతర్పణ చేయమని చెప్పబడినది. ఈ తర్పణ యొక్క విధి పంచాంగంలో ఇచ్చి ఉంటుంది. దాని ప్రకారంగా విధిని చేయాలి. తరువాత తల్లి పిల్లలకు హారతినివ్వాలి. కొంత మంది … Read more