దీపావళి, లక్ష్మీ పూజ

లక్ష్మి మరియు కుబేరుని పూజ !

లక్ష్మి సంపదల యొక్క దేవత, కుబేరుడు ఆ సంపత్తిని రక్షించేవాడు. చాల మందికి డబ్బులు సంపాదించే కళ తెలిసి ఉంటుంది; కాని దానిని పొదుపు చేసే మార్గం తెలియకపోవడం వల్ల అనవసరమైన ఖర్చులను చేసి డబ్బులను వృధా చేస్తుంటారు. అందువల్ల డబ్బులను సంపాదించడంతో పాటు దానిని పొదుపుగా వాడడం మరియు యోగ్య మైన కారణానికి ఖర్చు పెట్టడం చాలా మహాత్వమైనది. కుబేరుడు డబ్బులను ఎలా రక్షించుకోవాలో నేర్పించే దేవుడు. అందుకే ఇతడు ధనాధిపతి. అందుకే ఈ రోజు లక్ష్మి-కుబేరుని పూజ చేయమని చెప్పబడినది. సాధారణంగా వ్యాపారస్తులు ఈ పూజను చాలా ఉత్సాహంగా పెద్ద స్థాయిలో చేస్తారు.

(మరిన్ని వివరాల కొరకు వీక్షించండి : సనాతన సంస్థ డి.వి.డి. ‘దీపావళి శాస్త్రము’ మరియు వెబ్ సైట్ లోని లేఖనలు)