గోకులాష్టమి (కృష్ణ జన్మాష్టమి)

 

 

పూర్ణావతారి శ్రీకృష్ణుడు శ్రావణ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి రోజున భూతలంపై జన్మించాడు. ఆయన బాల్యం నుండి చేసిన అసాధారణమైన కృత్యాల ద్వారా అనేకమంది భక్తుల ఇబ్బందులు, కష్టాలు తొలగిపోయాయి. ఈ కృష్ణ జన్మాష్టమి గురించి కొన్ని వివరణలను మనము ఈ లేఖ ద్వారా తెలుసుకుందాం

 

గోకులాష్టమి

తిధి : శ్రావణ బహుళ అష్టమి

 

చరిత్ర

భగవాన్ శ్రీకృష్ణుడి జన్మం శ్రావణ మాసములోని కృష్ణ పక్ష అష్టమి తిధిన మధ్యరాత్రి రోహిణి నక్షత్ర యందు వృషభ లగ్నంలో చంద్రుడు ఉండగా సంభవించింది .

 

మహత్యము

1. శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజున మిగితా రోజులతో పోలిస్తే శ్రీకృష్ణ తత్వం 1000 రెట్లు అధికంగా కార్యారతమై ఉంటుంది. ఈ రోజున ఓం నమో భగవతే వాసుదేవాయ అని నామజపముతో పాటు శ్రీకృష్ణుడి ఇతర ఉపాసనలు బావపూర్ణంగా ఆచరిస్తే శ్రీకృష్ణ తత్వం యొక్క ప్రయోజనం కూడా పుష్కలంగా దొరుకుతుంది.

2. రజస్వల కాలం, మైలు-సూతకము, అస్పర్శం వీటి యొక్క మహిళలపై జరిగే పరిణామం ఈరోజు చేసిన ఉపవాసం ద్వారా మరియు ఋషి పంచమి వ్రతాన్ని ఆచరించడం వలన తగ్గుముఖం పడుతుంది. (పురుషుల పై జరిగే పరిణామం క్షౌరం వంటి ప్రాయశ్చిత్త కర్మలు వలన మరియు వాస్తువు పైన జరిగే పరిణామం ఉదకశాంతి జరపడం వలన తగ్గును.)

 

ఉత్సవాన్ని జరుపుకునే విధానం

రోజంతా ఉపవాసం ఉండి మధ్య రాత్రి 12 గంటలకు బాల కృష్ణుడి జన్మోత్సవాన్ని జరుపుకుంటారు తదుపరి ప్రసాదాన్ని సేవించి ఉపవాస వ్రతాన్ని విరమింప చేస్తారు, లేని పక్షంలో కొందరయితే మరుసటి రోజున ఉదయం పెరుగుతో పాటు అనేక రకాలు ప్రసాదాన్ని కలిపిన మిశ్రమం (దహికాల) ప్రసాదాన్ని భక్షించి వ్రతంను వీడుతారు .

 

పెరుగు ప్రాసాదం (దహీకాల)

అనేక రకాల తినే పదార్థాలు, పెరుగు, పాలు, వెన్న వీటన్నిటినీ కలపడం అంటే కాలా ! శ్రీకృష్ణుడు తన సహచరులతో గోకులంలో ఆవులను మేపేందుకు వనములో వెళ్లినప్పుడు అందరూ తన భోజనంతో స్నేహితులు తెచ్చుకున్న మధ్యాహ్నం భోజనం అన్ని ఒకటిగా కలుపుతూ ఆ మిశ్రమాన్ని అందరు కలిసి భూజించారు. ఈ కథను అనుసరించి తర్వాత గడిచిన కాలంలో గోకులాష్టమి మరుసటి రోజు ఇలా కలిపిన పదార్థమును తయారు చేయడం మరియు ఉట్టికొట్టడం అనే ఆచారాలు మొదలైనవి.

 

ఉట్టికొట్టడం ఉత్సవం సందర్భంగా
ఆ రోజున జరిగే తప్పుడు కత్యాలను అరికట్టండి !

ఇటీవల ఉట్టికొట్టడం ఉత్సవాన్ని నిర్వహించేటప్పుడు రహదారుల ఇబ్బంది, బీభత్స నృత్యాలు, మహిళల పట్ల అసభ్యమైన ప్రవర్తన, భజన పేరుతో కర్ణకర్కశమైన ధ్వనికాలుష్యం వంటి అనేక విధమైన అయోగ్యమైన కృతులు అపచారాలు జరుగుతున్నాయి. వీటివలన ఆ ఉత్సవం యొక్క పవిత్రత నష్టమౌతుంది. వీటి వలన ఉత్సవం ద్వారా దైవ లాభం అందుకు పోగా తిరిగి ధర్మహాని జరుగుతుంది. ఇలాంటి అపచారాలను అరికట్టే ప్రయత్నం అందరూ కలిసి చేస్తేనే ఉత్సవం యొక్క పవిత్రత నిలిచి ఉత్సవం యొక్క సత్ఫలితం అందరికీ అందుతుంది. ఇలా చేయడం అనగా సమష్టి స్థాయి గల భగవాన్ శ్రీ కృష్ణ ఉపాసన అవుతుంది.

 

హిందువుల్లారా, ధర్మహాని అరికట్టి శ్రీకృష్ణ వారి కృపను సంపాదించండి !

తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ
కృతనిశ్చయః (ఎలై అర్జునా, లేచిరా, యుద్ధానికి సిద్ధమవ్వు !)

ఈ విధంగా శ్రీకృష్ణుడి ఆజ్ఞను శిరసావహించి అర్జునుడు ధర్మాన్ని రక్షించాడు శ్రీకృష్ణుడికి ప్రియు శిష్యుడయ్యాడు ! హిందువుల్లారా, దేవతల అవమానం, మతమార్పిడి, లవ్ జిహాద్, దేవాలయంలో లూటీలు, గోహత్య, విగ్రహ ధ్వంసం తదితర మాధ్యమాల ద్వారా ధర్మంపై జరుగుతున్న ఆఘాతాలకు విరుద్ధంగా మీరందరూ కూడా యధాశక్తి న్యాయబద్ధంగా పోరాటాన్ని కొనసాగించండి !

సందర్భం : సనాతన ప్రచురణ పండుగలు, ధార్మిక ఉత్సవాలు మరియు వ్రతాలు (హిందీ మరియు ఆంగ్ల భాషలో)

1 thought on “గోకులాష్టమి (కృష్ణ జన్మాష్టమి)”

Leave a Comment