మకర సంక్రాంతి

1. తిథి

సూర్యుడు మకరరాశిలో సంక్రమణమవుతాడు; దానిని ‘మకర సంక్రాంతి’ అని అంటారు. ప్రతి ఎనబై సంవత్సరాలకు సంక్రాంతి ఒక రోజు ముందుకు సాగుతుంది.

2. ఇతిహాసము

సంక్రాంతిని దేవిగా భావించబడినది. సంక్రాంతి దేవి సంకరాసురుడను దానవుణ్ణి వధించిన దినము సంక్రాంతి.

3. ప్రాముఖ్యత

సూర్యుడు నెలకొక రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరింబడుతుంది. సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు ఆ రాశిని మకర సంక్రాంతి అంటారు. ఇలా సంక్రమణం చెంది సూర్యగమనము ఉత్తరదిశగా మారి ‘ఉత్తరాయణ-పుణ్యకాలము’ ప్రారంభమౌతుంది. సూర్యుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలో కర్కట సంక్రమణంలో ప్రవేశిస్తాడు. అది దక్షిణాయనం. ఈ రెండు (ఒక్కొక్కటి ఆరుమాసాలు) ఆయనాలు పూర్తి అయితే ఒక సంవత్సరము పూర్తి అవుతుంది.

ఉత్తరాయణం దేవతలకు పగలుగా ఉంటుంది. కనుకనే దేవతలకు పగటి కాలంలో యజ్ఞయాగాదులు చేసి దేవతల అనుగ్రహాన్ని పొందుమని సూచిస్తుంది ‘మకర సంక్రాంతి’. పవిత్రమైన ఉత్తరాయణ పుణ్యకాలము ఉత్తమ లోకప్రాప్తి కలిగిస్తుంది.

మకర సంక్రాంతి కాలములో తీర్థస్నానము చేసేవారికి మహాపుణ్యము ప్రాప్తించును.

3 అ. సాధనపరంగా ప్రాముఖ్యత

మకర సంక్రాంతి రోజున సూర్యోదయము నుండి సూర్యస్తమయం వరకు వాతావరణములో చైతన్యము అధికంగా ఉంటుంది. సాధన చేసేవారికి ఇది చైతన్యమును కలుగజేస్తుంది.
సంక్రాంతికి నెల రోజుల ముందు నుండి వాకిట్లలో ముగ్గులు వేసి గొబ్బెమ్మలను అలంకరించి పాటలు పాడుతుంటారు. బోగి మంటలు వేస్తారు.

4. దానము

మకర సంక్రాంతి నుండి రథసప్తమి వరకు ఉన్న కాలమును ‘పర్వకాలము’ అంటారు. ఈ పర్వకాలములో చేసిన దానము మరియు పుణ్యకర్మకు విశేషంగా ఫలితము ఉంటుంది. ఈ పుణ్యదినమున యథాశక్తి కొత్త పాత్రలు, వస్త్రాలు, అన్నము, నువ్వులు, బెల్లము, గోవు, గుర్రము, స్వర్ణము మరియు భూమిని దానధర్మాలు చేయుటవల్ల జన్మజన్మల దారిద్య్ర బాధలు అంటవని, అలాగే ‘స్త్రీలు’ పూలు, పసుపు, కుంకుమ, పండ్లు మరియు సాత్వికమైన వస్తువులు (సద్గ్రంథాలు, పూజ సామాగ్రీలు, దేవుళ్ళ సాత్విక చిత్రాలు) దానము చేయుటవల్ల సకల సంపదలతో పాటు చక్కని సౌభాగ్యం కలుగుతుంది. ఇట్టి దానమును ‘ఉపాయనము’ అని అంటారు. సౌభాగ్యవతులైన స్త్రీలు ఒకరికొకరు ఉపాయనము ఇవ్వటము, ఒడి నింపటము అంటే ఎదుటి స్త్రీలో నివసించి ఉన్న దేవీ-తత్వమును పూజించి తనువు, మనస్సు మరియు ధనముతో ఆమెకు శరణు వెళ్ళడము. సంక్రాంతి కాలము సాధన చేయుటకు అనుకూలమైనటువంటిది. సంక్రాంతిన ఉపాయనము ఇవ్వటము వలన భగవంతుని కృపకు పాత్రులై వాంఛిత ఫలము పొందుతారు.

సంక్రాంతి రోజున నువ్వులను ఉపయోగించుటకు గల ప్రాముఖ్యత

సంక్రాంతి రోజున నువ్వులను వాడడం ద్వారా పాపక్షాలనమవుతుంది, ఉదా. నువ్వులు వేసిన నీటితో స్నానము చేయటము, నువ్వుల లడ్డులను తినటము మరియు ఇతరులకు ఇవ్వటము, బ్రాహ్మణులకు నువ్వుల దానము చేయుట, శివుని దేవాలయములో నువ్వుల నూనేతో దీపము వెలగించుట, పితృదేవతారాధనలో నువ్వుల జలముతో తర్పణము చేయుటవల్ల వారి శుభాశీస్సులతో వారి వారి వంశాలు వర్ధిల్లుతాయని శాస్త్రము చెబుతుంది.

5. కనుమ

ఈ రోజున రైతన్నలకు అత్యంత ప్రీతి పాత్రమైనది. వారికి ఏ లోటు లేకుండా పాడిని అందించే ‘గోమాతను’ వ్యవసాయ పనులలో రైతన్నకు చేదోడుగా ఉంటూ చివరికి ‘ధాన్యపు రాశులను’ ఇంటికి చేర్చువరకు తోడ్పడే ‘బసవన్న’కు పూజలు జరిపి పసుపుల పండుగ చేస్తారు.

6. రథసప్తమి

1. తిథి

మాఘ శుక్ల పక్ష సప్తమి

2. సూర్యనారాయణుని పూజ

పీఠపై ముగ్గుతో లేదా చందనముతో ఏడు గుర్రములు ఉన్న సూర్యనారాయణుని రథము, అరుణ సారథిని మరియు సూర్యనారాయణ భగవానుని తయారు చేసి సూర్యనారాయణుని పూజిస్తారు. వాకిట్లో ఆవు పేడ పిడకలను కాల్చి వాటిపై పాలును పొంగిస్తారు. అగ్నిలో సమర్పణమయ్యేదాక పాలును పొంగించి, మిగిలినది అందరికి ప్రసాదంగా పంచుతారు. రథ సప్తమికి మరుసటి రోజు నుండి ప్రతిరోజు సూర్యునికి ప్రార్థన మరియు సూర్యనమస్కారము చేయవలెను. దీనితో మనము ఉత్తమ ఆరోగ్యము పొందుతాము.

సందర్భము :- Sanatan’s Holy text