తీపి పదార్ధాలు భోజనం ప్రారంభంలోన లేదా చివరిలోన ఎప్పుడు తినాలి?
పాశ్చాత్యులు చేసేది ఉత్తమమైనదనే భావన మన భారతీయులలో ఎక్కువగా పెరిగిపోవడం వల్ల, మనము వారి బట్టలు మరియు జీవనశైలిని మాత్రమే కాకుండా వారి ఆహారపు అలవాట్లను కూడా అనుకరించడం ప్రారంభించాము. అయితే, తీపి వంటకంతో భోజనం ప్రారంభించాలని ఆయుర్వేదం చెబుతోంది.