శరద్‌ ఋతువు

1. ఎక్కువ దోషాలు (టాక్సిన్స్‌)శరద్‌ ఋతువులో ఉత్పత్తి అవుతాయి

‘ఋతుపవనాల తరువాత సూర్యుని బలమైన కిరణాలు భూమిపై పడినప్పుడు శరద్‌ ఋతువు ప్రారంభమవుతుంది. వర్షాకాలంలో శరీరం చల్లని వాతావరణంతో కలిసిపోతుంది. వేడి పెరుగుతున్నప్పుడు శరద్‌ ఋతువు ప్రారంభమైనప్పుడు పిత్తము పెరిగి కండ్లకలక,సేగ్గెడలు, మొల్లలు(పైల్స్‌), జ్వరం వంటి అనేక అనారోగ్యాలకు దారితీస్తుంది. శరద్‌ ఋతువులో అనారోగ్యాలు సంభవించటానికి ఎక్కువ అవకాశం ఉంది, ఎందుకంటే వైద్యులకు ఎక్కువ మంది రోగులను ఇచ్చే నెలగా హాస్యాస్పదంగా కుడా సూచిస్తారు.

 

2. ఋతువు ప్రకారం ఆహారం తీసుకోండి

2 అ. శరద్‌ ఋతువులో తినవలసిన మరియు తినకూడని ఆహారం

సేవించతగినవి సేవించకూడనివి
1. ఆహారపు రుచి తీపి, చేదు, వగరు కారం, ఉప్పు, పులుపు
2. ఆహార పదార్ధపు లక్షణాలు సులువుగా జీర్ణం, శక్తివంతం, మరియు కొంచము కొవ్వు ఉన్నవి (నెయ్యి లేదా కొబ్బరి నూనె) జీర్ణించుట కష్టం, వేడి ఉత్పత్తి (ఉదా. పెరుగు, వెల్లుల్లి)
3. వాత, పిత్త, కఫముకు సంబంధించి పిత్తమును నియంత్రిస్తుంది పిత్తమును ఉత్పత్తి చేస్తుంది
4. ధాన్యాలు బియ్యం, జొన్నలు, గోధుమలు సజ్జలు
5. తృణధాన్యాలు/ సిరిధాన్యాలు అ. ఎక్కువ పరిమాణంలో: పెసలు, ఎర్ర కందిపప్పు
ఆ. తక్కువ పరిమాణంలో: బఠానీ,నల్ల శనగలు, కందిపప్పు
ఉలవలు, నువ్వులు, వేరుశనగ
6. కూరగాయలు మెంతికూర, పోట్లకాయ, బీరకాయ, గుమ్మడికాయ, చిలగడదుంప, కాకరకాయ, పప్పుకూర (చక్వత్‌ (పచ్చిఆకుకూర)), ఆకాకరకాయ (మోమోర్డికా, చేదుకాయను పోలిఉంటుంది), కీరాదోసకాయ ఆవాలు, ములంకాయ ఆకులు
7. మసాలాదినుసులు అన్నిరకముల మసాలాదినుసులు (ఎక్కువ పరిమాణం లో), తినేసోడా
8. నూనె, నూనె గింజలు కొబ్బరి నూనె ఆవనూనె
9. పాలు మరియు పాల ఉత్పత్తులు అ. మరిగించిన భారతీయ ఆవు పాలు
ఆ. వండిన ఆహారంలో నెయ్యి లేదా కాటేజ్‌ చీజ్‌
ఇ. తీపి మజ్జిగ
అ. పెరుగు, పుల్లని మజ్జిగ
ఆ. గెడ్డకట్టిన పాలు (కోవా), దాని నుండి తయారైన మిఠాయి(స్వీట్లు) – పెద్ద పరిమాణంలో కలకండ లేదా కోవా అచ్చులు

2 ఆ. ఆహారంలో కొన్ని ముఖ్యమైన అంశాలు

2 ఆ 1. మీరు ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినండి

వర్షాకాలంలో జీర్ణ సామర్థ్యం తక్కువగా ఉంటుంది. శరద్‌ ఋతువులో ఇది క్రమంగా పెరుగుతుంది. అందువల్ల ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే తినండి. ఆకలితో లేనప్పుడు తింటే జీర్ణక్రియ దెబ్బతింటుంది మరియు పిత్త సమస్యలు మొదలవుతాయి.

2 ఆ 2. ప్రతి అన్నపు ముద్దాని ముప్పు రెండు సార్లు నమలాలి

ప్రతి ముద్దని ముప్పు రెండు సార్లు నమలేల తినడం చాలా సమయం వృధా అవుతుందని చాలామంది భావిస్తారు, కానీ మీరు ఈ పద్ధతిలో తింటే తక్కువ తినడం ద్వారా మీరుతృప్తిగా తిన్న అనుభూతి చెందుతారు మరియు జీర్ణక్రియ కూడా బాగా జరుగుతుంది. ప్రతి ముద్దని ముప్పు రెండు సార్లు నమలడం వల్ల లాలాజలంతో బాగా కలుస్తుంది. లాలాజలం యొక్క లక్షణాలు పిత్త లక్షణాలకు సరిగ్గా వ్యతిరేకం కాబట్టి మీరు పిత్తము (హైపరాసిడిటీ)తో ఎప్పుడు బాధ పడరు. చాలా లాలాజలం కడుపులోకి ప్రవేశించటం వల్ల అక్కడ ఉన్న అధిక పిత్తము నియంత్రించబడుతుంది. స్వామి రామ్‌సుఖ్‌ దాస్‌ మహారాజ్‌ గారు తన ఒక ఉపన్యాసంలో, మీరు ప్రతి ముద్దని ముప్పు రెండు సార్లు నమిలినట్లు ఎలా చూసుకోవాలో అందంగా మార్గనిర్దేశం చేశారు. ‘హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రెండుసార్లు జపించండి. ప్రతి పదాన్ని ఒకే వేగంతో చెప్పండి. ఈ శ్లోకంలో పదహారు పదాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ముద్దకు రెండు సార్లు చేస్తే అది ముప్పు రెండు సార్లు జరుగుతుంది మరియు దేవుడు కూడా స్మరించినట్టు అవుతుంది.

2 ఇ. తాగునీటిపై కొన్ని చిట్కాలు

2 ఇ 1. హంస నీరు అమృతము (దైవ అమృతం) కు సమానం

వర్షాకాలం తరువాత ,ఆయుర్వేదం ప్రకారం అగస్తి నక్షత్రం ఆకాశంలో ప్రకాశిస్తుంది. అది, అపరిశుభ్రమైన, సహజ జలసంపద నుండి వెలువడే విషాన్నిశుద్ధి చేస్తుంది.రోజంతా నీటిని సూర్యకిరణాలతో వేడి చేసి, రాత్రి సమయంలో చంద్రుని కిరణాలతో చల్లబరిస్తే హంస నీరు అంటారు మరియు ఇది దైవ అమృతానికి సమానం. ఈ ఋతువులో బావి, కుంతల వంటి సహజ వనరుల నుండి వచ్చే నీటిని త్రాగ్గొచ్చు.

2 ఇ 2. కూలర్‌ నుండి వచ్చే చల్లని నీరు ఆరోగ్యానికి హానికరం

‘మట్టి కుండలో నిల్వ చేసిన నీరు పిత్తమును నియంత్రిస్తుంది. మట్టి భౌతిక శరీరానికి అవసరమైన ఖనిజాలను కూడా ఇస్తుంది. అందువల్ల ఈ రుతువులో నీటి కుండలో నిల్వ ఉంచిన నీరు ప్రయోజనకరంగా ఉంటుంది. రిఫ్రిజిరేటర్‌ లేదా కూలర్‌ నుండి వచ్చే చల్లని నీరు ఆరోగ్యానికి హానికరం. తులసి (హోలీ బాసిల్‌) విత్తనాలు లేదా వట్టివేరు (వెటివేరియా) తో నానబెట్టిన నీరు, ఆమ్లా (గూస్బెర్రీ) సిరప్‌ మొదలైనవి ఈ ఋతువులో ప్రయోజనం పొందడానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగించవచ్చు.

 

3. శరద్‌ ఋతువులో అనుసరించాల్సిన ఇతర నియమాలు

3 అ. స్నానానికి ముందు మీ శరీరాన్ని నూనెతో మర్దన చేయండి

స్నానానికి ముందు కొబ్బరి నూనెతో చర్మాన్ని మర్దన చేయడం వల్ల చర్మంపై కురుపులు లేకుండా చేస్తుంది. వేడి వల్ల అధిక చెమట స్రవించటం కూడా కొబ్బరి నూనె రాయడం ద్వారా తగ్గుతుంది.

3 ఆ. సుగంధభరిత పువ్వులను మీతో ఉంచండి

సువాసన పువ్వులు పిత్తమును తొలగించడంలో సహాయపడతాయి. కాబట్టి సాధ్యమయ్యే వారి కోసం పరిజాతాలని , చాఫా (ఫ్రాంగిపని), సోంటక్కా (లిల్లీ) వంటి పువ్వులను మీ వద్ద ఉంచండి.

3 ఇ. దుస్తువులు

కాటన్‌ దుస్తువుల్ని వాడాలి. వాడే బట్టలు కూడా లేత రంగులో వదులుగా వుండేటట్టు చూసుకోవాలి.

3 ఈ. నిద్ర

రాత్రి ఎక్కువ సేపు మేల్కొని ఉండటం పిత్తమును పెంచుతుంది కాబట్టి ఈ కాలంలో దీనిని నివారించాలి. బదులుగా ఉదయాన్నే నిద్ర లేవాలి . ఈ ఋతువులో మీరు ఇంటి వరండా లేదా ప్రాంగణంలో బహిరంగంగా, వెన్నెలలో నిద్రిస్తే, మీకు మంచి నిద్ర పట్టి బద్ధకం దరిచేరదు . ఈ కాలం లో పగటిపూట నిద్రపోవడంని నిషేధించాలి

 

4. శరద్‌ ఋతువులో కలిగే సాధారణ ఆరోగ్య సమస్యలకీ సులభతరమైన ఆయుర్వేద పరిష్కారాలు

4 అ. శోధనము లేదా పంచకర్మ

శోధనము లేదా పంచకర్మ అంటే కొన్ని ఋతువుల్లో శరీరంలో పెరిగిన దోషాలు (టాక్సిన్స్‌) శరీరం నుండి తీసివేయడం.

4 అ 1. విరోచనం

ఈ కాలంలో శరీరాన్ని శుభ్రపరచాడికి మొదటిగా పేగుల్ని శుభ్రపరుచుకోవాలి. వెచ్చని నీటిలో ఒక టీస్పూన్‌ ఆముదం (కాస్టర్‌ ఆయిల్‌) గాంధర్వ హరితాకి చుర్నాని (ఆయుర్వేద దుకాణంలో లభిస్తుంది) ఒక టీస్పూన్‌ కలిపి వరుసగా ఎనిమిది రాత్రులు పడుకునే ముందు తీసుకోవాలి.

4 అ 2. రక్తమోక్షణం (బ్లడ లెట్టింగ్‌)

ఆయుర్వేదంలో శరీరం నుండి రక్తాన్ని తొలగించడాన్ని రక్తమోక్షన్‌ అంటారు. ప్రతి శరద్‌ ఋతువులో రక్తం యొక్క స్వచ్ఛతను కాపాడటానికి రక్తమోక్షణం (బ్ల్‌డ లెట్టింగ్‌) ఒకసారి చేయాలి. ఇది ముఖం మీద మొటిమలు, ముక్కు నుండి రక్తస్రావం, కండ్లకలక, కురుపులు వంటి అనారోగ్యాలను నివారిస్తుంది. అందువల్ల ఈ ఋతువులో మొదటి పక్షం రోజులలో మీరు బ్లడ బ్యాంక్‌ వైద్యుడి పర్యవేక్షణలో రక్తదానం చేయాలి.

4 అ 3. రక్తదానంలో భిన్న కోణం

అల్లోపతిలో రక్తం దానం చేస్తున్నప్పుడు రక్తవర్గీకరణ అయ్యిఉండాలి. అలాగే దాత రక్తంలో వ్యాధి సూక్ష్మక్రిములు లేకుండా ఉండాలి. కానీ రెండింటి రక్తంలో వాత (గాలి), పిత్త (పిత్త) మరియు కఫా (కఫం) స్థాయిలను పోల్చలేదు. వాటిని పోల్చిన తర్వాత రక్తదానం చేయడం నిజంగా పరిశోధనకు సంబంధించిన అంశం, ఎందుకంటే ఒక రోగి ఇప్పటికే తన రక్తంలో అధిక స్థాయి పిత్తను కలిగి ఉంటే మరియు అధిక పిత్త ఉన్న రక్తంలో కలిస్తే, అతని రక్తంలో మరింత పెరిగే అవకాశం ఉంది. తద్వారా వ్యాధి కూడా పెరగవచ్చు. అల్లోపతి ఈ విషయాన్ని ఎప్పుడూ చర్చించలేదు, ఆయుర్వేద పరిశోధకుడిగా నేను ఈ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాను.

4 ఆ. ఇంటి చిట్కాలు

ఈ రోజుల్లో విషపూరితమైన(టాక్టాక్సిసిటీ) వాతావరణం నుండి ఉత్పన్నమయ్యే అన్ని వ్యాధులను ఎదుర్కోవటానికి గంధపు చెక్క, వట్టివేరు, అడ్డసారం(వాసాకా), తిప్పతీగ (గుల్వెల్‌ (టినోస్పోరా కార్డిఫోలియా)), కిరైట్‌ (కాన్స్కోరా), వేప, కొబ్బరి నూనె మరియు నెయ్యి వంటి సహాయాలు విపరీతంగా సహాయపడతాయి మరియు ఈ క్రింది విధంగా వాడాలి –

1. శనికల్లా( రోలింగ్‌ బోర్డు (శాన్‌)) పై ఒక గంధపు కర్రను ఉదయం మరియు సాయంత్రం రెండుసార్లు రుద్ది, ఆ పేస్ట్‌ ఒక టీస్పూన్‌ తో ఒక గిన్నె నీటిలో వేసి త్రాగండి లేదా 4 నుండి 7 రోజులు చర్మానికి రాసుకోవచ్చు.

2. వట్టివేరు యొక్క మూలాలను నీటిలో నానబెట్టి, ఆ నీటిని త్రాగాలి.

3. అడ్డసారం, తిప్పతీగ (గుల్వెల్‌ (టినోస్పోరా కార్డిఫోలియా)), కిరైట్‌ (కాన్స్కోరా)తో ఒక మిశ్రమాన్ని సిద్ధం చేసి 4 నుండి 7 రోజులు, రోజుకు మూడుసార్లు ఒక కప్పు త్రాగాలి.

4. ఖాళీ కడుపుతో ఒక గిన్నె వేపాకులా రసం 4 నుండి 7 రోజులు తాగాలి.

5. ఘనాకారపు (పటిక బెల్లమా?) పంచదార దిమ్మకు కొబ్బరి నూనె లేదా నెయ్యి వేసి చప్పరించాలి.

గమనిక : 4 నుండి 7 రోజులు పైన సూచించిన మందులు 7 రోజులకు మించకూడదు

 

5. కఠినమైన నిర్భంధనాలు

ఈ కలం ఎండలో తిరగడం, నీరు లేదా మంచుతో తడిసిపోవటం, నిరంతరం ఫ్యాన్‌ కింద కూర్చోవడం లేదా నిద్రించడం, సహనం కోల్పోవడం వల్ల శరీరంలోని దోషాల సమతుల్యతకు భంగం కలిగి, వ్యాధులకి దారితీస్తాయి. శరద్‌ ఋతువులో సూచించిన ఆచరణ నియమావళిని అనుసరించడం ద్వారా సాధకుల ఆరోగ్యంగా మారి మరియు ఆయుర్వేదంపై వారి విశ్వాసం పెరగాలని నేను ధన్వంతరి దేవుడికి హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.

– వైద్య మేఘరాజ్‌ పరాడ్కర్‌, సనాతన ఆశ్రమం, రామ్‌నాథి, గోవా

Leave a Comment