పండ్ల వినియోగంపై ఆయుర్వేద దృక్కోణం

ఈ రోజుల్లో ఆధునిక వైద్యులందరూ భోజనం తర్వాత పండు తినమని సలహా ఇస్తున్నారు. సమతుల్య ఆహారంలో పండ్లు కూడా భాగమని అవగాహన ఏర్పడింది. దీని వెనుక నిజం ఏమిటి? ఈ లేఖనం ద్వారా పండ్ల వినియోగం గురించి ఆయుర్వేద దృక్పథాన్ని అర్థం చేసుకుందాం.

1. పండ్లు పోషకమైనవి అయినప్పటికీ, జీర్ణమవడం కష్టం

పండ్లు చాలా రసాలను కలిగి ఉంటాయి. ఇవి రక్తం, రసం మొదలైన శరీరంలోని ఏడు రకాలైన మూలకాలకు పోషణను అందిస్తాయి. సాధారణంగా, మన శరీరాన్ని బలంగా చేసే అన్ని ఆహార పదార్థాలు జీర్ణించుకోవడానికి కష్టమైనవే, ఉదా. మినుములు. పండ్లు కూడా ఈ కోవలోకి వస్తాయి.

పండ్లు జీర్ణం కాకపోతే అజీర్ణం నుండి కోలుకోవడానికి ఔషధం తీసుకోవాలి ఉదా. పనస పండు ఆరోగ్యానికి మంచిది అయినప్పటికీ, జీర్ణించుకోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. ఇది చాలా పోషకమైనది అయినప్పటికీ, అది జీర్ణం అవ్వకపోతే జీర్ణవ్యవస్థను మరింత బలహీనపరుస్తుంది.  కాబట్టి బద్ధకం, మగత, నిరుత్సాహంగా అనిపించడం, పొత్తికడుపులో బిగుతు లేదా నొప్పి అనుభూతి, మొద్దుబారడం,అనారోగ్యంగా అనిపించడం వంటి లక్షణాలకు కారణమవుతుంది.

2. వీలైతే ఉదయం పండ్లు తినండి!

సాధారణంగా, బొప్పాయి, ఉసిరి, దానిమ్మ, అనాసపండు (పైనాపిల్)  వంటి తేలికగా జీర్ణం అయ్యే పండ్లు మినహా మిగతా పండ్లన్నీ జీర్ణించుకోవడం కష్టం. అందువల్ల పండ్లను భోజన సమయానికి ముందు తినండి. భోజనం తర్వాత జీర్ణం కావడానికి కష్టంగా ఉండే ఆహార పదార్థాన్ని ఎవరైనా తీసుకుంటే, అది భోజనం యొక్క జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది మరియు అజీర్ణానికి కారణమవుతుంది. సాధ్యమైనంతవరకు, పండ్లను ఉదయాన్నే అల్పాహారంతో పాటు తినాలి, దీనివల్ల అవి రోజంతా జీర్ణమవుతాయి. పండ్లు జీర్ణించుకోవడం కష్టం కాబట్టి, వాటిని రాత్రిపూట తినకూడదు.

3. ఉపవాసం ఉన్న రోజున ఒక రకం పండు మాత్రమే తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

అప్పుడప్పుడు ఒక్కో రోజు, సుష్టిగా భోజనం చేయడం కాకుండా, ఒక రకం పండు మాత్రమే తీసుకోండి. దీనితో, శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి మరియు ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని కలిగించదు. అందుకే, మన సంప్రదాయంలో వివిధ రకాల ఉపవాసాలు సూచించబడ్డాయి.

4. పాలతో పాటు పండ్లు తినవద్దు

పండ్లను ఎప్పుడూ పాలతో తినకూడదు. పాలలో ఏదైనా పండు కలిపితే, పాలు పాడైపోతాయి. అరటిపండ్లను ముక్కలు చేసి పాలు, చక్కెరతో కలిపి తరచూ తీసుకుంటే, ఇది చర్మ వ్యాధులు మరియు జీర్ణ రుగ్మతలు, అభివృద్ధి చేస్తుంది. ఫలితంగా, అలెర్జీలకు దారితీస్తుంది. పండ్లు మరియు పాలను కలిపి తయారుచేసిన ఆహార పదార్థాన్ని ఆయుర్వేదంలో ‘విరుద్ధ-అన్నం’ అని పిలుస్తారు (అంటే రెండు వ్యతిరేక ఆహార పదార్థాలను కలపడం).

5. పండ్ల రసం త్రాగకుండా పండు తినండి !

పండ్లను రసం తీసి త్రాగటం అనేది తప్పు. నమలడానికి దంతాలు లేనివాళ్ళు లేదా దంతాలు బలంగా లేనివారు మాత్రమే పండ్ల రసాలను త్రాగాలి. మిగతావాళ్ళు పండ్లను అనేకసార్లు నమిలి తినాలి మరియు సాధ్యమైనప్పుడు వాటిని తొక్కతో పాటు తినాలి.

మన నోటిలోని లాలాజలం పండ్ల రసంతో సరిగ్గా కలవాలి. ఒక నిర్దిష్టమైన పండు పొట్టలోకి వెళుతుందని లాలాజలం మరియు నాలుక ద్వారా మెదడు తెలుసుకుంటుంది మరియు తదనుగుణంగా పొట్టలో పండ్లను జీర్ణించుకోవడానికి తగిన యంత్రాంగాన్ని ఇది సిద్ధం చేస్తుంది. ఇది పొట్టలో రసాయనికామ్లద్రవమును తయారుచేయడానికి సహాయపడుతుంది. ఒక పండ్ల రసాన్ని నాలుకకు తగలకుండా స్ట్రా తో  త్రాగినప్పుడు, అది జీర్ణమవ్వదు.

6. మన ఆరోగ్యం మీద పండ్లపై పిచికారీ చేసిన కృత్రిమ రసాయనాల ప్రభావం

పండ్లు తినే ముందు శుభ్రంగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఈ రోజుల్లో, జామ, పనస వంటి పండ్లు మినహా మిగతా పండ్లన్నీ వాటిపై కార్బైడ్ వంటి విష రసాయనాలను చల్లడం ద్వారా కృత్రిమంగా పండిస్తారు. ఆపిల్, మామిడి, ద్రాక్ష, పుచ్చకాయ, మరియు అరటిపండు వంటి అత్యధికంగా అమ్ముడయ్యే పండ్లపై కూడా చల్లిన రసాయనాలను మన కళ్ళతో చూడవచ్చు. ఎంత రుద్ది కడిగినాగాని ఈ రసాయనాలు ఇంకా పండ్లపై ఉంటాయి. ఆహార ఉత్పత్తిని పెంచడానికి, చెట్లపై రసాయనాలను పిచికారీ చేస్తారు, లేదా ఎరువుల రూపంలో యూరియా లేదా సల్ఫేట్ వంటి విష పదార్థాలు చెట్ల మూలాలకు పిచికారీ చేస్తున్నారు. ఈ రసాయనాలు అటువంటి పండ్ల మాధ్యమం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయనే విషయాన్ని ఎవరూ ఆలోచించడంలేదు.

7. పండ్లపై హానికరమైన రసాయనాలు క్యాన్సర్ వంటి వ్యాధులను కలిగిస్తున్నాయి

పండ్లను పండించడానికి ఉపయోగించే హానికరమైన రసాయన ఎరువులు మరియు రసాయనాల కారణంగా, క్యాన్సర్ రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రఖ్యాత సంస్థల నిపుణులు మరియు ఆధునిక వైద్యులు ఈ అభిప్రాయాన్ని గట్టిగా సమర్థిస్తున్నారు. జీవితంలో ఎన్నడూ సిగరెట్, పొగాకు లేదా మద్యం తాగని వారు చాలా మంది క్యాన్సర్ కు గురవుతున్నారు, మరి వీరందరికి క్యాన్సర్ ఎలా వస్తుంది? పైన సమాచారం ఈ ప్రశ్నకు సమాధానాన్ని అందిస్తుంది. సాధారణంగా ఒక వరుసలో ఉన్న అరటి కాయలు పక్వానికి వస్తాయి మరియు తరువాత వరుసలో, ఒకదాని తరువాత ఒకటి క్రింది నుంచి పైన వరకు కొమ్మపై పండుతాయి. కానీ మార్కెట్లో దుకాణదారుల బండిలో లభించే అరటిపండ్లు ఒకే సమయంలో ఎలా పండుతున్నాయి? ఈ అరటిపండ్లు ఒక నిర్దిష్ట రసాయనంలో ముంచినవి, ఇవి చాలా విషపూరితమైనవి. ఈ రసాయనాలు క్యాన్సర్ వంటి వివిధ వ్యాధులకు కారణమౌతున్నాయి.

8. పంజాబ్ లోని భటిండా జిల్లాలో రసాయన ఎరువుల గరిష్ట వినియోగం వల్ల, క్యాన్సర్ రోగుల సంఖ్య అధికంగా ఉన్న కారణంగా, క్యాన్సర్ స్పెషల్ పేరుతో ప్రభుత్వం కొత్త రైలును ప్రారంభించవలసి వచ్చింది.

మన దేశంలో రసాయన ఎరువుల గరిష్ట వినియోగం పంజాబ్‌లోని భటిండా జిల్లాలో జరుగుతుంది. భటిండా జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో క్యాన్సర్ రోగులు ఉన్నారు. క్యాన్సర్ రోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉన్న కారణంగా, ప్రభుత్వం నడుపుతున్న ప్రధాన క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించడానికి వీలుగా రాజస్థాన్‌లో క్యాన్సర్ స్పెషల్ రైళ్ళు వారానికి రెండుసార్లు నడుస్తాయి.

– వైద్యులు సువినయ దామ్లే, కుడల్

సందర్భం : సనాతన ప్రభాత్ దినపత్రిక

Leave a Comment