వర్షాకాలములో వచ్చే వ్యాధులకు మూల కారణములు

1. పరిచయం

వర్షాకాలం ముందు వచ్చే వేసవి కాలంలో ఉష్ణోగ్రత వల్ల, మన శరీరము లో నీటి శాతం తగ్గి శరీరాన్ని తొందరగా అలసటకు గురిచేస్తుంది. అదే వర్షాకాలంలో అయితే గాలిలో తేమ కూడా పెరుగుతుంది. వాతావరణంలో సంభవించే ఈ ఆకస్మిక మార్పుల వల్ల మన శరీరము లో వాతము యొక్క సమతుల్యత లోపిస్తుంది. అలాగే పర్యావరణం లో కూడా ఆమ్ల శాతం పెరుగుతుంది. ప్రత్యేకంగా శాకాహారం, పప్పులు, నీరు మొదలగు వాటిలో ఆమ్ల శాతంపెరుగుతుంది. అలా పెరిగిన ఆమ్ల శాతాన్ని జీర్ణించుకోవటానికి మన శరీరం కూడా తగిన మార్పులు చేసుకుంటుంది. అందువల్లే వర్షాకాలం లో మన జీర్ణవ్యవస్థ బలహీన పడుతుంది. దానివల్ల అజీర్తి వంటి అసౌకర్యాలు ఏర్పడుతాయి. వర్షపు నేటితో పాటు దుమ్ము మరియు చెత్త కలిసిపోయి త్రాగునీరు కూడా కలుషితం అయ్యి అనేక రకముల వ్యాధులకు దారితీస్తుంది. ఈ విధంగా మన శరీరంలో వాతము యొక్క సమతుల్యత లోపించుట మరియు పైన చెప్పిన వివిధ కారణాల వల్ల కీళ్లవాతం మరియు విరోచనాలు మొదలగు వ్యాధులకు గురౌతాము.

 

2. వర్షాకాలానికి తగిన ఆహార నియమాలు

2 అ. వర్షాకాలంలో ఎలాంటి ఆహారం సేవించాలి మరియు ఎలాంటివి సేవించకూడదు

సేవించతగినవి సేవించకూడనివి
1. ఆహారపు రుచి స్వల్పమైన పులుపు  – ఉప్పు, చేదు, వగరు మరియు కారం ఎక్కువ తీపి
2. ఆహార పదార్ధపు లక్షణాలు సులువుగా జీర్ణం, శక్తివంతం, పొడిగా మరియు కొంచము కొవ్వు ఉన్నవి నీరుగా లేదా పలుచని
3. వాత, పిత్త, కఫముకు సంబంధించి వాత, పిత్త, కఫమును తగ్గించే సామర్థ్యం వాత, పిత్త, కఫమును పెంచే సామర్థ్యం
4. గింజలు పాతగింజలు(బియ్యం, గోధుమలు, బార్లీ, రాగులు, ఊదలు, ఆరికలు) వేపిన గింజలు మరియు పప్పు ధాన్యాలతో చేసిన పిండి, రాజగిరా/అమరనాథ్‌ గింజలు, పేలాల్చీన గింజలు కొత్తగింజలు,మరమరాలు, అటుకులు
5. తృణధాన్యాలు / సిరిధాన్యాలు అ. ఎక్కువ పరిమాణంలో : పెసలు, ఎర్ర కందిపప్పు

ఆ. తక్కువ పరిమాణంలో : ఉలవలు, మినుములు

బొబ్బర్లు, బఠానీ, చిక్కుడుగింజలు
6. కూరగాయలు అ. అవసరానికి తగినంత:సొరకాయ/ ఆనపకాయ, బెండ, పొట్లకాయ, కోసుకూర/క్యాబేజి, ముట్టుకోసుకూర/కాలిఫ్లవర్‌, తిండా, చిక్కుడు, గోరుచిక్కుడు,కంద, ఎర్రతోటకూర, లిమా బీన్స్‌

ఆ. తక్కువ పరిమాణంలో : మెంతులు,ఆవాలు

ఆకుకూరలు
7. మసాలాదినుసులు అన్నిరకముల మసాలాదినుసులు
8. నూనె మరియు నూనె గింజలు నువ్వుల నూనె, వేరుశనగ నూనె
9. ఆహార పదార్ధాలు అ. చిరుధాన్యాల రొట్టి, జొన్న ఉప్మా (శొంఠి పొడి,మిరియాల పొడి కూడా తయారీలో వేసుకుంటే మంచిది)

ఆ.పెసలు,కందిపప్పు,ఎర్రకందిపప్పు, బొబ్బర్లునుంచి తీయబడిన ద్రావకాలు, టమాటా సూప్‌,కొకుం సూప్‌

ఇ.పెసలతో తయారు చేయబడిన ఆహార పదార్ధాలు : పప్పు, చారు/సూప్‌,కిచిడి, ద్రావకాలు, బోండా, లడ్డు

ఈ. ఉలవలతో తయారు చేయబడిన ఆహార పదార్ధాలు : చారు/సూప్‌, పిట్ల్లా/ముంబాయి చట్నీ, శాంగోలే, లడ్డు

ఇ. రాజగిరా/అమరనాథ్‌ గింజలతో చేసిన లడ్డులు

ఈ. వేడి ఆహార పదార్ధాలు మరియు ప్రత్యక్షంగా వేడి చేసిన పదార్ధాలు ఉదా. పుల్కా, అప్పడాలు

అ. పప్పుధాన్యాలతో చేసిన పప్పు

ఆ. బాగా తీపి మరియు బాగా నూనెతో చేసిన ఆహార పదార్ధాలు ఉ.దా. పాయసం, బూందీ లడ్డు

ఇ. నిల్వ ఉన్న ఆహార పదార్ధాలు

ఉ. ఈగలు ముసిరినా ఆహరం

10. పాలు మరియు పాల ఉత్పత్తులు అ. త్రాగే ముందు శొంఠి పొడి లేదా పసుపు కలుపుకొని త్రాగాలి

ఆ. పెరుగు మీద తేరుకున్న నీటిని నల్ల ఉప్పు లేదా హిమాలయన్‌ ఉప్పు వేసుకొని త్రాగొచ్చు

ఇ. మజ్జిగతో గళ్ళు ఉప్పు మరియు జీలకర్ర

ఈ. భోజనంలో ఒక చెంచాడు నెయ్యి లేదా వెన్నపూస

పాలు మరియు పాల ఉత్పత్తులతో చేసిన మిఠాయిలు ఉదా. కోవా
11. పండ్లు అ. అవసరానికి తగినంత : దానిమ్మ, అరటిపండ్లు, యాపిల్‌

ఆ. తక్కువ పరిమాణంలో : కీరా దోసకాయ, కర్బూజా

పనసపండు
12. డ్రై ఫ్రూట్స్‌ అ. అవసరానికి తగినంత : ఎండుద్రాక్ష, అంజీర్‌

ఆ. తక్కువ పరిమాణంలో : యితరమైనవి

13. ఉప్పు గళ్ళు ఉప్పు, నల్ల ఉప్పు లేదా హిమాలయన్‌ ఉప్పు
14. తీపి పాతబెల్లం మరియు తేనె ఎక్కువగా సేవించాలి కొత్తబెల్లం
15. నీరు అ. స్పటిక వేసి వడకట్టిన నీరు త్రాగాలి

ఆ. నీటిలో క్రిములు నశించేలా సరిగ్గా మరిగించాలి

నదినీరు, ఎక్కువగా త్రాగునీరు సేవించటం
16. మద్యము మద్యము తగినంత సేవించొచ్చు మద్యము మితిమించి సేవించరాదు
17. మాంసము వేడిగా మరియు సులువుగా జీర్ణం అయ్యే మాంసము : గొర్రెలు, కొలిమి/ఒవేన్‌ లో కాల్చిన/ఉడకపెట్టిన మాంసము, మిరియాలు వంటి మసాలాలు వేసిన మాంసపు సూప్‌ చేపలు మరియు ఇతర జంతువుల మాంసము

సూచనా : – వేదాల గ్రంధాల ప్రకారం,మద్యము మరియు మాంసము సేవించటం నిషిద్ధం,పైన పీఠికలో చెప్పటానికి గల ఉదేశ్యం వాటిని సేవించేవారికి దాని ఉపాయములు మరియు అపాయములు తెలియచేయటానికే.

2 ఆ. ఉపవాసం

ప్రతిఒక్కరు వారానికి ఒకరోజు ఉపవాసం చెయ్యాలి. వీలైతే రోజంతా అస్సలు ఏమి తినకుండా ఉండాలి. ఒకవేళ ఆకలిగా ఉంటె మరమరాలు వంటివి తినొచ్చు. ఇది కూడా కుదరకపోతే పెసలతో తయారు చేసిన ఆహార పదార్ధాలు తిని మరియు ఉపవాసం ఉండొచ్చు.

 

3. వర్షాకాలంలో తెసుకోవాల్సిన ప్రత్యేక జాగ్రత్తలు

 • వర్షాలు మొదలు కాకముందే అన్ని దుప్పట్లు,కప్పుకొనేవి ఎండలో ఎండపెట్టుకొని పెట్టుకోవాలి
 • వర్షాకాలంలో స్నానానికి వేడినీరు లేదా గోరువెచ్చని నీరు వాడుకోవాలి
 • తడిగా లేదా తేమగా ఉన్న ప్రదేశాలలో ఉండకూడదు
 • తడిగా లేదా చెమ్మగా వుండే బట్టలు ధరించరాదు
 • నీటిలో నుంచోటం మరియు పనిచేయటం చెయ్యరాదు
 • వర్షంలో తడవటాన్ని మానుకోవాలి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఒకవేళ తడిచిన సరే వెంటనే పొడి దుస్తులు ధరించాలి
 • వర్షాకాలంలో చలి లేదా శీతల వాతవరణం నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి
 • అర్ధరాత్రి వరకు నిద్రించకుండా ఉండటం వాళ్ళ మన శరీరంలో నీటిశాతం తగ్గుతుంది మరియు వాతము యొక్క సమతుల్యత లోపిస్తుంది. అందుచేత అర్ధరాత్రి వరకు మెలుకువగా ఉండటాన్నిమానుకోవాలి.
 • పగటిపూట నిద్రించరాదు

4. దోమలు మరియు ఈగల సమస్యకు ప్రాకృతిక నివారణ మార్గాలు

వర్షాకాలంలో దోమలు మరియు ఈగల పునర్యోత్పత్తికి అణువుగా ఉండటం వల్ల ఆకస్మిక వృద్ధి పర్యావరణంలో కనపడతుంది. వాటి వ్యాప్తిని నివారించటానికి ఈ క్రింద నివారణ మార్గాలు ఉపయోగపడతాయి.

 • వేపఆకులూ, వెలుల్లి తొక్కలు, సాంబ్రాణి, వాము మిశ్రమాన్ని కాల్చి, వాటి పొగ అన్ని మూలల్లో వ్యాపించేలా తిప్పాలి.
 • ఒకవేళ ఇంటి చుట్టుప్రక్కల చెట్లు ఉంటె, వాటి చుట్టూ గోవు మూత్రమును చల్లండి.
 • ఒక కుండలో వస వేరుని నాటుకోవాలి, ఈ వేరు దోమల్ని తరిమికొడుతుంది
 • దోమల చక్రం(మస్కిటో కోయిల్‌) వెలిగించే ముందు ఒక వెల్లులి రెబ్బని దానిమీద పెట్టుకొని వెలిగిస్తే దోమల నివారణకు ఉపయోగపడుతింది.

 

5. వర్షాకాలంలో వ్యాధుల నిర్మూలన కొరకు  ప్రభావవంతమైన మార్గం

వర్షాకాలంలో ఆకలి తగ్గిపోవటం ముఖ్యమైన అనారోగ్య లక్షణం. ఆకలి తక్కువగా ఉండటం వల్ల సహజంగానే తక్కువ ఆహరం సేవిస్తారు దానిద్వారా వ్యాధులను ఆహ్వానించినట్టే. ఆకలి మరియు జీర్ణశక్తి తగ్గటం అనేది అనేక వ్యాధులకు మూలకారణం. కడుపులో బరువుగా ఉండటం, చెడువాసనతో కూడిన తేన్పులు, కడుపులో వాయువులు మొదలగునవి ఆకలి తగ్గటానికి మూలకారణాలు. అలాంటి సందర్భంలో తేలికపాటి ఆహారాన్ని (ఉదా. గంజి) లేదా కాల్చిన పదార్థాలని మరియు తక్కువ పరిమాణంలో సేవించాలి. కడుపులో బాగోనప్పుడు కూడా ఆహారాన్ని సేవించినట్లయితే అది అజీర్తికి(అజీర్ణత) మరియు విరోచనాలకి దారితీస్తుంది.

5 అ. జీర్ణశక్తినీ పెంపొందించే సులువైన మార్గాలు

5 అ 1. జీర్ణింపచేసే మజ్జిగ

ఒక గ్లాసు మజ్జిగలో శొంఠి, జీలకర్ర, వాము, ఇంగువ, గళ్ళుఉప్పు మరియు మిరియాలపొడి తక్కువ పరిమాణంలో వేసి బాగా కలుపుకొని రోజుకి 2 లేదా 3 సార్లు త్రాగాలి.

5 అ 2. జీర్ణింపచేసే లేపనం (పేస్ట్‌)

అల్లం మరియు నిమ్మరసం బాగా కలిసేలా రుబ్బుకొని తగినంత గళ్ళుఉప్పు వేసి ఒక గాజుసీసాలో నిల్వ చేసుకొని రోజుకి 1 లేదా 2 చెంచాలు భోజనం ముందు తీసుకోవాలి.

5 అ 3. శొంఠి మరియు పంచదార మిశ్రమం

ఒక కప్పు శొంఠి మరియు ఒక కప్పు పంచదార కలిపి పిండి చేసుకోని ఒక గాజుసీసాలో నిల్వ చేసుకోవాలి. భోజనం ముందు 1  చెంచాడు తీసుకోవాలి, ఇది సేవించిన తర్వాత స్వచ్ఛమైన తేన్పు వస్తుంది, ఆకలిగా అనిపిస్తుంది మరియు పిత్తము కూడా సమతుల్యంగ ఉంటుంది.

5 ఆ. ప్రతిరోజు వంటికి నూనె రాసుకోవాలి

ప్రతిరోజు వంటికి నూనె రాసుకోవాలి వర్షాకాలంలో ప్రతిరోజు వంటికి నూనె రాసుకోవాలి. కీళ్ళకి ఎక్కువసేపు మర్దన చెయ్యాలి. వర్షాకాలంలో వాతావరణంలో చలి మరియు తేమ శాతం ఎక్కువగా ఉండటంవల్ల కొబ్బరినూనె కన్నా నువ్వులనూనె లేదా ఆవనూనె వాడటం శ్రేయస్కరం.మిగిలిన కాలాలలో కొబ్బరినూనె వాడవచ్చు.  నూనెని వంటికి రాసుకున్నాక తేలికపాటి వ్యాయామాలు ఉదా. సూర్యనమస్కారాలు లేదా యోగాసనాలు వెయ్యాలి. ఒకవేళ వంటినొప్పులు సంభవిస్తే వేడినీటి కాపడాంతో తొలిగిపోతాయి. స్నానం కూడా వేడినీటితో చేస్తే వంటినొప్పులకి ఉపశమనం లభిస్తుంది.

సందర్భము : మరాఠి దిన పత్రిక ‘సనాతన ప్రభాత్‌’

Leave a Comment