పరమ పూజ్యులు ఆబా ఉపాధ్యేగారు వ్యాధులను నివారించుటకు సూచించిన కొన్ని ఆధ్యాత్మిక నివారణలు (ఉపాయములు)

పూణే నగరానికి చెందిన పరమ పూజ్యులు ఆబా ఉపాధ్యేగారు వ్యాధులను నివారించుటకు సూచించిన కొన్ని ఆధ్యాత్మిక నివారణలు (ఉపాయములు).

వ్యాధి

నివారణ(ఉపాయములు)

1. జలుబు మరియు దగ్గు (పెరిగిన కఫా కారణంగా) ఒక చిన్న ఉల్లిపాయ ముక్కలను ఒక గ్లాసు నీటిలో 10 నిమిషాలు ఉడకబెట్టి ఒక టీచెంచా బెల్లం వేసి త్రాగాలి. ఇది దగ్గును తగ్గిస్తుంది.
2. దీర్ఘకాలిక జలుబు తమలపాకు కాడను తీసివేసి 1/2 టీచెంచా తేనె వేసి, దీనిని మధ్యాహ్నం భోజనం తరువాత మరియు రాత్రి భోజనం తరువాత 21 రోజులు తీసుకోవాలి.
3. ఉబ్బసం(దమ్ము) తమలపాకు కాడను తీసివేసి దీనికి 1/2 టీచెంచా తేనె వేసి 2 చిటికెల అల్లం పొడితో తీసుకోవాలి.
4. మూత్రపిండాల్లో రాళ్ళు 2 లీటర్ల నీటిలో 2 టీచెంచాల సెలోసియా (కోడిజుట్టుతోటకూర, గురుగు లేదా పంచెచెట్టు) విత్తనాలను 10 నిమిషాలు కాచి, దాహం వేసినప్పుడు ఆ నీటిని రోజంతా త్రాగాలి.
5. డిఫ్తీరియా కాలాబాష్‌ (కమండల్‌) చెట్ల పండ్ల నుంచి చేసిన పొడి మరియు మొగలి పువ్వుకు మధ్య గల భాగం నుండి తయారు చేసిన పొడి, రెండు పొడులను కలపాలి. కాగితాన్ని బీడీ ఆకారంలో చుట్టి, తయారు చేసుకున్న పొడితో నింపి, నిప్పుతో వెలిగించి నోటిలో పట్టుకుని పొగను పీల్చుకోవాలి. నాసికా రంధ్రాల ద్వారా పొగను వదులవద్దు. వ్యాధిగ్రస్తులు చిన్నపిల్లలైతే, పెద్దవాళ్ళు పొగను తీసుకొని సన్నని గొట్టాం ద్వారా పిల్లల నోటిలోకి విడుదల చేయాలి.
6. ప్లేగు(మహామారి) ఐస్‌ ముక్కలను ప్లేగు బొబ్బల మీద 2 నిమిషాలు రుద్దాలి.
7. కడుపులో లోపాలతో సహా 72 వ్యాధులు 72 వ్యాధులలో (పూణేలోని భీమాశంకర్‌ / తులసిబాగ్‌లోని ఆయుర్వేద దుకాణాల్లో లభిస్తుంది) దువ్వెన నెయిల్‌ ప్లాంట్‌ (కొంబడ్నాఖి) యొక్క మూలాలు వుపయోగపడతాయి. మెత్తటి పొడిచేసి పాలు లేదా నీటితో కలిపి మధ్యాహ్నం భోజనం మరియు రాత్రి భోజనం ముందు ఒక టీచెంచా తీసుకోవాలి.
8. అసైటిస్‌ (జలోదరము, ఉదర కుహరంలో ద్రవం చేరడం) కలోట్రోపిస్‌ గిగాంటెయా (తెల్ల జిల్లేడు) ఆకుకు నూనె పూసి పెంచు మీద వేడి చేయాలి. దానితో పొత్తికడుపు పైన కాపడం పెట్టి, రాత్రంతా పొత్తికడుపుపై కట్టి వుంచాలి.
9. గుండె జబ్బులు యోగ వ్యాయామాలు చేయాలి. శవాసనం వుపయోగపడుతుంది. ఒక టీచెంచా అర్జున్‌ (టెర్మినాలియా అర్జున) అరిష్టా (సహజంగా పులియబెట్టబడిన ప్రక్రియతో తయారుచేసిన కషాయము) మరియు ఉసిరికాయ (గూస్బెర్రీ) మధ్యాహ్నం మరియు రాత్రి భోజనం తర్వాత 1 టీచెంచా తీసుకోవాలి.
10. టైఫాయిడ్‌ మునగ చెట్టు యొక్క బెరడు నుదిటిపై కట్టాలి. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.
11. మెదడు యొక్క వ్యాధులు చపాతీతో సిట్రాన్‌ (మహాలంగ్‌, నిమ్మజాతి,తురంజిపండు, మాదీఫలము, దబ్బకాయ, దీది నిమ్మకాయ) జామ్‌ తినాలి.
12. మధుమేహం గుడ్మార్‌ (మధునాషిని) లత(వేర్లు) యొక్క ఒక ఆకును ప్రతి ఉదయము ఖాళీ కడుపుతో పడిగడుపున నమలాలి.
13. మహిళల్లో తెల్లబట్ట 1 టీచెంచా జీలకర్ర పొడి 1 టీచెంచా నెయ్యితో కలిపి, కొద్దిగా చక్కెర వేసి తినాలి.
14. మహిళల్లో ఋతు సమస్యలు 1 స్టీల్‌ గిన్నె నీటిలో 1 టీస్పూన్‌ అశోక్‌ (సరాకా అసోకా) అరిష్టా వేసి తీసుకోవాలి. లేదా హోమియోపతి ఔషధం ‘జనోసియా అశోక’ తీసుకోవాలి.
15. పురుగులు కొద్దిగా చక్కెరతో 1 టీచెంచా ఎంబెలియా రైబ్స్‌ (వావ్డింగా) పొడి మరియు 1 టీచెంచా నెయ్యి మిశ్రమాన్ని తీసుకోవాలి లేదా 1 స్టీల్‌ గిన్నె నీటిలో 1 టీచెంచా ఎంబెలియా రైబ్స్‌ (వావ్డింగా, చిత్రతండులము) పొడిని వేసి కొంతసేపు కాచి, ఆ మిశ్రమాన్ని త్రాగాలి.
16. హుక్‌ వారమ్స్‌ (కొంకి పురుగు-ఇది పేగుకు అతుక్కుంటుంది) చిటికెడు కర్పూరములో 1/2 టీచెంచా తేనెను కలిపి ఆ మిశ్రమాన్ని తీసుకోవాలి.
17. చీముతో కూడిన పొక్కులు జామ్లం అల్లనేరేడుపండు గింజను మెత్తటి పొడి చేసిన తర్వాత అది ముద్దగా తీసుకోవాలి.

– పరమ పూజ్యులు ఆబా ఉపాధ్యే, పుణే, మహారాష్ట్ర

సేకరణ : మరాఠి దిన పత్రిక ‘సనాతన ప్రభాత్‌’

Leave a Comment