తీపి పదార్ధాలు భోజనం ప్రారంభంలోన లేదా చివరిలోన ఎప్పుడు తినాలి?

పాశ్చాత్యులు చేసేది ఉత్తమమైనదనే భావన మన భారతీయులలో ఎక్కువగా పెరిగిపోవడం వల్ల, మనము వారి బట్టలు మరియు జీవనశైలిని మాత్రమే కాకుండా వారి ఆహారపు అలవాట్లను కూడా అనుకరించడం ప్రారంభించాము. భోజనం తరువాత తీపి పదార్ధం తినటం అటువంటి మరొక పద్ధతి. పశ్చిమంలో భోజనం తర్వాత తీపి  పదార్ధం తింటారు. అయితే, తీపి వంటకంతో భోజనం ప్రారంభించాలని ఆయుర్వేదం చెబుతోంది. ఇది శరీరంలో వాత యొక్క మన జీవ మూలకాలను నియంత్రిస్తుంది మరియు జీర్ణక్రియకు కూడా ఆటంకం కలిగించదు.

ఆధునిక విజ్ఞాన దృక్పథం నుండి, ఆయుర్వేద ఆలోచన మరింత శాస్త్రీయమైనది. తీపి పదార్ధం జీర్ణం కావడం కష్టం. భోజనం ప్రారంభంలో తింటే జీర్ణక్రియ అద్భుతంగావుండటం మాత్రమే కాదు, ఆ తర్వాత తీసుకునే ఆహారం కూడా పరిమితమవుతుంది. దీనికి విరుద్ధంగా, భోజనం తర్వాత ప్రత్యేకంగా చల్లటివి తింటే, ఉదరంలో ఉష్ణోగ్రత తగ్గి అది జీర్ణక్రియకు భంగం కలిగిస్తుంది. అందువల్ల, తీపి పదార్ధం తినాలంటే వాటిని ప్రారంభంలో లేదా భోజనం మధ్యలో తినాలి. భోజనం తర్వాత తీపి పదార్ధం తినడం పాశ్చాత్య అలవాటు, ఖచ్చితంగా మన దేశం అనుసరించడం ప్రమాదకరం.

– వైద్యులు పరిక్షిత్ షెవ్డే, (ఎం.డి., ఆయుర్వేదం), దొంబివాలి

సూచన : Whatsapp నుండి తీసుకున్న సమాచారం లేదా వైద్య పరీక్షిత్ షెవ్డే యొక్క కథనాలు

Leave a Comment