వసంత ఋతువు కోసం ఆరోగ్య చిట్కాలు ఋతువు

వైద్య మేఘరాజ్‌ పరాడ్కర్‌

విశ్వం సృష్టించేటప్పుడు భగవంతుడే ఆయుర్వేదాన్ని (ఆరోగ్యానికి సంబంధించిన వేదం) సృష్టించాడు. అందువల్ల ఆయుర్వేద సూత్రాలు విశ్వం సృష్టించినప్పటి నుండి వర్తిస్తాయి. ప్రతి యుగంలో ప్రతి సంవత్సరం అవే ఋతువులు వస్తాయి మరియు ఆయుర్వేదం సూచించిన కాలానుగుణ సూచనలు కూడా స్థిరంగా ఉంటుంది. ఎప్పటికప్పుడు మారుతున్న అల్లోపతి (ఆధునిక ఓషధం) తో పోల్చితే ఆయుర్వేదం ఎంత గొప్పదో దీనిద్వారా అర్ధమవుతుంది. ఈ వ్యాసంలో వసంత ఋతువులో పాటించాల్సిన ఆరోగ్య నిబంధనలను తెలుసుకుందాం.

 

1. వసంత ఋతువు /కాలం – వైద్యుల తండ్రి (ఆయుర్వేద వైద్యుడు)

శీతాకాలంలో దక్షిణనాయ సమయంలో భారతదేశం నుండి మళ్లిన సూర్యుడు వసంత ఋతువులో తిరిగి అదే కక్షలోకి వస్తాడు, దాని ఫలితంగా హిమాలయాలలో మంచు కరగడం ప్రారంభమవుతుంది. అదేవిధంగా చలికాలంలో శరీరంలో పేరుకుపోయిన కఫా (కఫం) సూర్యుని కిరణాలతో ద్రవీకరించడం/కరగటం ప్రారంభమవుతుంది. వసంతకాలం అంటే శీతాకాలం నుండి వేసవి కాలానికి మద్య ఉండే కాలం. నేటి కాలుష్యం కారణంగా చైత్రా-వైశాఖ్‌ వసంత ఋతువు అని పాఠశాలల్లో నేర్చుకున్నప్పటికీ, ఈ ఋతువు మార్చి 15 నుండి ఏప్రిల్‌ 15 వరకు విస్తరించి ఉంది. ఈ కాలంలో పెరిగిన కఫా కారణంగా జలుబు, దగ్గు, జ్వరం మరియు శ్వాసనాళాలు ఉబ్బసం తీవ్రతరం అవుతుంది. వాస్తవానికి ఈ కాలంలో వ్యాధులు కలగటం శీతాకాలంలో కంటే ఎక్కువగా ఉంటాయి, దీనివల్ల హాస్యాస్పదంగా శరద్‌ (శరదృతువు) ఋతువును తల్లిగా మరియు వసంత ఋతువును వైద్యాల తండ్రిగా సూచిస్తారు.

 

2. వసంత ఋతువులో కఫమును అదుపులో ఉంచడానికి అనుసరించాల్సిన కాలానుగుణ ఆచరణము

ఈ ఋతువులో కఫా యొక్క లక్షణాలు జిగురుగా, చల్లగా మరియు స్థూలంగా ఉంటాయి. కాబట్టి ఇవి ఆహారం మరియు ఆచరణము ద్వారా మెరుగుపరచబడకుండా చూసుకోవాలి, ఈ ఆచరణ నియమావళి వాటిని అదుపులో ఉంచుతుంది.

 

3. కఫం యొక్క సృష్టికర్త నీరు

‘కెన్‌ ఫలతి ఇతి కఫః.’ అనే వాక్యము నుండి ఉద్భవించింది, “క” అనగా నీరు అని అర్థం. అంటే నీటి నుంచి పుట్టేదే కఫము. కాబట్టి ఈ కాలంలో ఒక పావు టీస్పూన్‌ అల్లం పొడిని గాని లేదా తుంగ ముస్తలు(నగరమోత) పొడిని గాని లీటర్‌ నీటిలో కలిపి సేవించడం వల్ల కఫం వృద్ధి చెందకుండా ఉంటుంది. కఫం ప్రమాదకర స్థాయిలో ఉంటే అల్లం పొడి కన్నా తుంగ ముస్తలు(నగరమోత) పొడిని వాడడం మంచిది.

 

4. తియ్యటి ఆహారం కన్నా చేదు ఆహరం మేలు

ఎక్కువుగా తీపి మరియు పుల్లటి ఆహరం తినకూడదు. వసంత కాలం ఆరంభంలో మొదటి పదిహేను రోజులు క్రమం తప్పకుండ ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు వేపాకులు తినాలి. ఇది మన ఆరోగ్యాన్ని అద్భుతంగా రక్షిస్తుంది. ఉగాది పర్వదినాన వేపాకు తినడానికి గల కారణం కూడా ఇదే.

 

5. కఫాను అరికట్టే పప్పుధాన్యాలు

ఆయుర్వేదంలో పప్పుధాన్యాలు ‘సింబి ధాన్యగా’ పరిగణిస్తారు. ఆయుర్వేద ఆచార్యులు పప్పుధాన్యాలు గురించి వివరిస్తూ ‘మేదాఃశ్లేష్మాస్త్రపిత్తెషు హితం లెపోపసేకయోః.’ అని అంటారు. పప్పుధాన్యాలు అనవసరపు కొవ్వును మరియు కఫాన్ని కరిగించడం ద్వారా శరీరంలో రక్తం వృద్ధిచెందటానికి మరియు పిత్త గుణాన్ని తగ్గించడానికి తోడ్పడుతుంది అని ఆ వాక్యం యొక్క అర్ధం. పప్పుధాన్యాలు పొడి రూపంలో తీసుకున్న ఆరోగ్యానికి మంచిది. ఎవరికైతే పప్పుధాన్యాలు సులభంగా అరగదో, వాళ్ళు పెసరపప్పు మరియు ఎర్రకందిపప్పుని ఆహారంలో తీసుకుంటే సులభంగా అరిగిపోతాయి.

 

6. నూనె ఆహారం వద్దు

నూనెలో వేపిన పధార్థాలు తినడం వల్ల శరీరంలో కఫం పెరుగుతుంది, కాబట్టి వీటిని చాలా తక్కువ మోతాదులో మాత్రం ఆరగించాలి.

 

7. పాతవి లేదా వేపినా పప్పుధాన్యాలు

ఆయుర్వేదం ప్రకారం ‘నవం ధాన్యమభిష్యన్ది లఘు సంవత్సరోషితమ్‌.’ అంటే కొత్త పప్పులు శరీరంలో కఫా ప్రవాహాన్ని పెంచుతాయి మరియు జీర్ణించుకోవడం కూడా కష్టమే, అయితే ఒక సంవత్సరం వయసు ఉన్నపిల్లల ప్రకృతిలో ఇది వ్యతిరేకంగా ఉంటుంది మరియు సులభంగా జీర్ణమవుతాయి. కఫాను పెంచకుండా మరియు పెరిగిన కఫాను తగ్గించడానికి పాత పప్పుధాన్యాలు తీసుకోండి. పాత పప్పుధాన్యాలు అందుబాటులో లేనట్లయితే, వేపిన పప్పులను ఉపయోగించిన అదే ప్రభావాన్ని ఇస్తుంది.

 

8. వ్యాయామం

వ్యాయామం కఫాను తగ్గిస్తుంది. వేదగ్రంధాలలో కూడా వసంత ఋతువులో వ్యాయామం చెయ్యమని చెప్పింది. మీరు మీ శక్తిని సగం మాత్రమే ఉపయోగించుకోడానికి వ్యాయామం చేయాలి. వ్యాయామం చేసేటప్పుడు నోటి ద్వారా ఊపిరి పీల్చుకోవలసిన అవసరం మీకు అనిపించినట్లైతే మీరు మీ శక్తిని సగం ఉపయోగించుకున్నారని అర్థం. మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ రోజూకి అరగంట లేదా ఒక గంట వ్యాయామం చేయండి.

 

9. పగటిపూట నిద్రపోవడం మానుకుంటే మంచిది

‘రాత్రౌ జాగరణం రుక్షం స్నిగ్ధం దివా.’ అంటే రాత్రి మేల్కొని ఉండటం వల్ల శరీరం పొడిగా ఉంటుంది మరియు పగటిపూట నిద్రపోవడం కొవ్వును పెంచుతుంది. పగటిపూట నిద్రపోవడం ద్వారా శరీరంలో అనవసరమైన స్రావాలు విడుదలవుతాయి, ముక్కులో స్రావాలు గొంతులో ప్రవేశించటం, శరీర బరువు మరియు మానసిక మందగింపుకు దారితీస్తుంది. వసంత ఋతువులో పగటిపూట నిద్రపోకుండా ఉండడం మంచిది. అయితే వృద్ధులు, అనారోగ్యంతో మరియు అలసిపోయిన వ్యక్తులు మధ్యాహ్నం స్వల్పనిద్ర తీసుకోవచ్చు.

 

10. కఫముకు ఉత్తమ ఔషధం – తేనె !

కఫముకు తేనె ఉత్తమ ఔషధం. ఈ వసంత ఋతువులో సంభవించే జలుబు మరియు దగ్గు కోసం తేనెను తక్కువ వ్యవధిలో తీసుకోవాలి. తేనె రోజంతా 5 నుండి 6 టీస్పూన్లు మించకూడదు.

 

11. సంతోషంగా ఉండండి

వసంతకాలం అనేది శ్రేయస్సును సూచిస్తుంది. ఈ ఋతువులో కోకిల పాడటం ప్రారంభిస్తుంది, చెట్లుకు కొత్త ఆకులు చిగురిస్తాయి. ఈ ఋతువులో ఉగాది (హిందూ నూతన సంవత్సరం) మరియు శ్రీ రామనవమి పండుగలు వస్తాయి. ఆనందం మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది, అందువల్ల ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి.

అందరూ ఈ కాలానుగుణ ఆచరణ నియమావళిని అనుసరించి మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదిస్తూ మరియు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని శ్రీ ధన్వంతరి భగవంతుడి పవిత్ర పాదాలకు నా హృదయపూర్వక ప్రార్థన.

– వైద్య మేఘరాజ్‌ మాధవ్‌ పరాడ్కర్‌, సనాతన ఆశ్రమం, రామ్‌నాథి, గోవా

Leave a Comment