విజయదశమి (దసరా)

అశ్విని శుక్ల దశమి తిథీని దసరా అంటారు. దసరా అను పదానికి వ్యుత్పత్తి దశహరా అని కూడ ఉన్నది. దశ అనగా పది మరియు హరా అనగా ఓడిపోవటము (పరాజయము). దసరాకు తొమ్మిది రోజుల ముందు నవరాత్రులలో పది దిశలు దేవి శక్తితో నిండి, నియంత్రణలో ఉండును, అనగా పది దిశలలో దిక్భవము, గణాలు మొదలగునవి నియంత్రణలోకి వచ్చి ఉండును, పది దిశలపై విజయము సాదించబడి ఉంటుంది.

 

అ. దసరా ఇతిహాసిక మహత్వము

1. శ్రీరాముని పూర్వజులైన అయోధ్యాదిశుడు రఘు విశ్వజిత యజ్ఞము చేశాడు. తను సంపత్తిని దానము చేసిన తరువాత ఒక పర్ణకుటీరములో నివసిస్తుండెను. కౌస్తవ పేరుగల ఒక శిష్యుడు అక్కడికి వచ్చినప్పుడు వారికి గురుదక్షిణ ఇవ్వటానికి 14 కోట్ల సువర్ణ నాణెములు కావలసి ఉండెను. అందుకని, రఘువు కుబేరునిపై ఆక్రమించుటకు సిద్ధమైనప్పుడు కుబేరుడు ఆపటా మరియు శమి ఈ వక్షాలపై సువర్ణ నాణెములను కురిపించాడు. కౌస్తవుడు కేవలము 14 కోట్ల సువర్ణ నాణెములు తీసుకున్న తరువాత మిగిలిన సువర్ణ నాణెములు ప్రజలు తీసుకెళ్ళారు. దీనితో మనము గ్రహించవలసినదేమిటంటే కౌస్తవు అవసరమున్నంతనే సువర్ణ నాణెములు తీసుకున్నాడు. కౌస్తవునికి అవసరము లేని సువర్ణ నాణెములన్నిరఘు జనాలకు పంచిపెట్టినాడు. ఇది హిందూ సంస్కృతి ! త్యాగముపై ఆధారమైన మన మహాన్ హిందూ సంస్కృతి ఎక్కడా, ప్రతి దాని హవ్యాసమున్న(లోభము, స్వార్థము ఉన్న) నేటి రాజకీయ నాయకులు మరియు జనాలు ఎక్కడ !

2. శ్రీరామచంద్రుడు ఈ దినమున రావణుడి పై విజయాన్ని సాధించి అతన్ని వధించాడు. ఈ ఘటన వలన ఈ దినము విజయదశమి అని పేరు గాంచినది.

3. పాండవులు అజ్ఞాతవాసము పూర్తి కాగనే శక్తి పూజ చేసి శమి వక్షముపై నున్న వారి శస్త్రాలు తిరిగి తీసుకున్నారు. విరాట రాజుని గోవులను తీసుకుని పారిపోయే కౌరవులసైన్యముపై స్వారి చేసి విజయాన్ని సాధించిన దినము కూడ ఇదే.

4. దసరా దినమున ఇష్టమైన మిత్రులకు శమి ఆకులను బంగారమని పంచిపెట్టే పద్ధతి మహారాష్ట్రలో ఉన్నది. ఈ పరంపరకు ఐతిహాసిక ప్రాముఖ్యత కలదు. మరాఠా వీరులు మొగలులను ఓడించి వారి ప్రదేశము నుండి బంగారము, సంపత్తిని ఇంటికి తీసుకొచ్చేవారు. ఇలా విజయ వీరులు లేదా శిలేదారులు వారి ఉధ్యమము నుండి తిరిగి వచ్చే సరికి ఇంటి కడపలో(ద్వారమున) వారి భార్యలు లేదా అక్కచెల్లిండ్లు నిలబడి వారికి హారతినిచ్చిన తరువాత వారు పర ఊరు నుండి తెచ్చిన సంపత్తిలో నుండి ఒక జతను హారతి పల్లెములో కానుకగా వేసేవారు. ఇంటిలోకి వెళ్ళి ఆ బంగారమును దేవుని ఎదుట పెట్టి దేవునికి మరియు తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీర్వాదమును పొందేవారు. ఈ ఘటన స్మృతిలో(గుర్తుంచుకొని) ఉంచుకొని నేడు శమివక్ష ఆకులను బంగారమని ఇవ్వటము జరుగుచున్నది.

5. ఈ పండుగా చాలా ప్రాచీన కాలము నుండి జరుపబడుచున్నది. ప్రారంభములో ఇది ఒక కషికి సంబంధించిన లోకోత్సవంగా జరుపుకునేవారు. వర్షాకాలములో వ్యవసాయదారులు నాటిన విత్తనాల మొలకెత్తిన మొదటి మొక్కలను(వరి) ఇంటిలోకి తీసుకొచ్చి ఉత్సవాన్ని జరుపుకుంటారు. నవరాత్రులలో ఘటస్థాపన చేయు దినమున తొమ్మిది విత్తనాలను మట్టిలో నాటుతారు. దసరా రోజున ధాన్యాలతో మొలకెత్తిన అంకురాలను(మొక్కలను) పీకి దేవునికి సమర్పిస్తారు. చాలా చోట్లలో పొలములోని వడ్ల వరిని(గొలకలు) తీసుకొచ్చి ప్రవేశ ద్వారమునకు తోరణము(దండ) చేసి కడ్తారు.

 

ఆ. దసరా పండుగకు చేయవలసిన కృతి

దసరా పండుగకు విశేషమైన ప్రాముఖ్యత కలదు. అదేమిటంటే మూడున్నర శుభ ముహూర్తాలలోని ఒక ముహూర్తము దసరా పండుగ. ఈ దినమున సీమోల్లంగన (సరిహద్దు దాటడము), శమీపూజ, అపరాజితాపూజ మరియు శస్త్రపూజ ఈ నాలుగు కృతులను ఆచరిస్తారు.

1. సీమోల్లంగన

(మూడవ ప్రహరము, పగటికి) ఊరి సీమను(సరిహద్దును దాటుటకు) ఈశాన్య దిశకు వెళ్ళుతారు. ఎక్కడైతే శమీ(జమ్మి) లేదా ఆపటా వక్షము (మరాఠి పదము) ఉండునో అక్కడ ఆగుతారు.

2. శమి (జమ్మి) పూజ

జమ్మికి ఈ దిగువనీయబడిన విధంగా ప్రార్థించాలి.

శమి శమయతే పాపం శమీ లోహితకంటకా l
ధారిణ్యర్జునబాణానాం రామస్య ప్రియవాదినీ ll

కరుష్యమాణయాత్రాయాం యథాకాల సుఖం మయా l
తత్ర నిర్విఘ్నకర్త్రి త్వం భవ శ్రీరామపూజితే ll

అర్థము : శమి(జమ్మి) పాపములను నాశనము చేయును. శమి(జమ్మి) ముల్లు రాగి రంగులో ఉంటుంది. అది అర్జునిడి బాణాలను ధరించినది. జమ్మి శ్రీరామునికి ప్రియమైనది, కాబట్టి హే జమ్మి, శ్రీరాముడు నిన్ను పూజించినాడు. నేను యథాకాలము విజయయాత్రకు వెళ్ళుచున్నాను. ఈ యాత్రను నీవు నాకు నిర్విఘ్నంగా, సుఖకారకంగా చేయుము.

3. ఆశ్మంతక పూజ

ఆశ్మంతక మహావక్ష మహాదోషనివారణ l
ఇష్టానం దర్శనం దేహి కురు శత్రువినాశనం ll

ఈ మంత్రాన్ని పలుకాలి. దీని అర్థము ఏమిటంటే హే ఆశ్మంతక మహావక్షమా, నీవు మహాదోషాలను నివారించెదవు. నాకు నా మిత్రుల దర్శనము చేయించు మరియు నాకున్న శత్రువులను నాశనము చేయుము, అని ప్రార్థించాలి. ఆ తరువాత వక్షము వద్ద బియ్యము, పోకలు, సువర్ణ నాణెములను (లేకపోతె ఇత్తడి నాణెములు) పెడతారు. తరువాత వక్షమునకు ప్రదక్షిణలు చేసి దాని దగ్గరలో ఉన్న కొద్ది మట్టిని, ఆ వక్షము ఆకులను ఇంటికి తీసుకొస్తారు. జమ్మి ఆకులు లేకుంటే, ఆశ్మంతక ఆకులను బంగారమని దేవునికి సమర్పించిన తరువాత ఇష్టమిత్రులకు, చిన్నవాళ్ళు పెద్దలకు బంగారమని ఇచ్చే పద్ధతి ఉన్నది.

4. అపరాజితా పూజ

ఏ చోటనైతే జమ్మిని పూజిస్తారో, అక్కడే భూమిపై అష్టదలమును వేసి దానిపై అపరాజిత మూర్తిని పెట్టి పూజించి మంత్రముతో ప్రార్థన చేస్తారు.

హారెణ తు విచిత్రేణ భాస్వత్కనకమేఖలా l
ఆపరాజితా భద్రరతా కరోతు విజయం మమ ll

అర్థము : మెడలో చిత్రవిచిత్రమైన మాలలను ధరించిన, నడుమున మెరిసే సువర్ణగొలుసు ఉన్నటువంటి, భక్తుల కల్యాణము చేయు హే అపరాజితదేవి తత్పరతంగా నాకు విజయమును కలుగజేయుము అని ప్రార్థిస్తారు. కొన్ని చోట్లలో అపరాజిత పూజ సీమోల్లంగనకు వెళ్ళే ముందు చేస్తారు.

5. శస్త్రాలు మరియు ఉపకరణాల పూజ

ఈ దినమున రాజులు, సామంతులు, సర్దారులు వారి శస్త్రాలు మరియు ఉపకరణాలు శుభ్రపరచి వాటిని వరుసగా పెట్టి వాటిని పూజిస్తారు. అలాగే వ్యవసాయదారులు మరియు కార్మికులు వారి ఉపకరణాలను మరియు ఆయుధాలను పూజిస్తారు. (కొందరు నవమి రోజున శస్త్ర పూజ చేస్తారు.) కలములు (పెన్స్) మరియు పుస్తకాలు విద్యార్థుల శస్త్రాలు, కాబట్టి వాటిని విద్యార్థులు పూజిస్తారు. ప్రతి దానిలో ఈశ్వరుని రూపాన్ని చూడటము, అంటేనే ఈశ్వరునితో ఏకరూపమగుటకు ప్రయత్నించటమనేది కూడ పూజించే ఉద్ధేశము ఉంటుంది.

భావార్థము : అసుషు రమంతే ఇతి అసురః l అనగా ప్రాణాలలో, భోగాలలో(ఆకర్షణ) రమమాణమయ్యే వారు అసురులగుదురు. ఇలాంటి అసుర స్వభావము గల మహిషాసురుని నివాసము నేడు ప్రతి మనిషి హృదయములో ఉండి, తను మనుష్యుల ఆంతరిక దైవప్రవత్తిపై ఆధిపత్యము స్థాపించాడు. ఈ మహిషాసురుని మాయను గ్రహించి వారి అసూర జాలము నుండి ముక్తమగుటకు శక్తి ఉపాసన ఆవశ్యకమైనది. అందుకోసమని నవరాత్రులలో తొమ్మిది రోజులు శక్తి ఉపాసన చేయవలెను. దశమికి విజయోత్సవమును ఆచరించాలి. దీనినే దసరా అందురు.

సందర్భం : పండుగలు, ధార్మిక ఉత్సవాలు మరియు వ్రతాలు (హిందీ) గ్రంథం

Leave a Comment