కలశస్థాపన

శ్రీ దుర్గాదేవి మరియు చెడు తరంగాల మధ్య జరిగిన యుద్ధమునకు ప్రతీకగా కలశము మరియు దీపమును 9 రోజులు పూజించడమే నవరాత్రి. నవరాత్రిలో దీపమును అఖండముగా వెలిగించుట వలన భక్తులకు దైవీతత్త్వ లాభము కలుగుతుంది.

నవరాత్రులలో అఖండ దీపప్రజ్వలన ఎందు కొరకు ?

నవరాత్రులలో వాతావరణము శక్తి స్వరూపమైన తేజస్సుతో నిండియుండును. దీపము తేజమునకు ప్రతీకమైనందున దీపపు జ్యోతి వైపు దేవి యొక్క శక్తి స్వరూపమైన తేజతత్త్వ తరంగాలు ఆకర్షించబడును. ఈ తరంగాలు వాస్తులో నిరంతరము సంచరించుట వలన వాటి నుండి భక్తులకు మేలు జరుగును. కావున నవరాత్రులలో దీపమును అఖండముగా వెలిగించి ఉంచవలెను. గాలి, నూనె తక్కువగుట, కాలి నల్లబడుట మొదలైన కారణముల వలన దీపము కొండెక్కినట్లైతే దీపమును పునః వెలిగించవలెను మరియు ప్రాయశ్చిత్తముగా 108 లేక 1000 వరకు అధిదేవత జపము చేయవలెను.

(మరిన్ని వివరాల కొరకు వీక్షించండి : సనాతన సంస్థ డి.వి.డి. ‘శరన్నవరాత్రులు’ మరియు వెబ్ సైట్ లోని లేఖనలు)

 

Leave a Comment