ఉగాది

చైత్ర శుద్ధ ప్రతిపద (ఉగాది) హిందువులకు సంవత్సరారంభము !

బంధువుల్లరా, సనాతన హిందూ ధర్మము విశ్వములో అతి ప్రాచీనమైన ధర్మం. ఆంగ్ల కాలమానమునకనుసారంగా ఇది కేవలం 2023 వ సంవత్సరమునకు పాదార్పణ చేస్తున్నట్లయితే ఈ ఉగాదికి హిందూ ధర్మం యొక్క కాలమానమునకనుసారంగా 15 నిఖర్వ, 55 ఖర్వా, 21 అబ్జ, 96 కోటి 8లక్షల 53 వేల 124 వ సంవత్సరం ప్రారంభం అవుతుంది.
(గమనిక : 1 ఖర్వా అనగా 10,00,00,00,000 సంవత్సరాలు (వంద వేల లక్ష లేదా లక్ష లక్ష సంవత్సరాలు), 1 నిఖర్వ అనగా  1,00,00,00,00,000 సంవత్సరాలు (పది వేల కోటి సంవత్సరాలు))

ఉగాదియే (చైత్ర శు. పాడ్యమి) సంవత్సరారంభ దినము. ఎందుకనగా ఈ రోజు సృష్టి ఉత్పన్నమైనది. ఈ రోజు ప్రజాపతి దేవతా తరంగాలు పృథ్విపై అధిక ప్రమాణంలో వస్తాయి.

బ్రహ్మధ్వజం నిలబెట్టడం : సూర్యోదయం అయిన వెంటనే ఇంటి ముఖద్వారం బయట, గుమ్మం ముందు (ఇంటి నుండి చూసేటప్పుడు) కుడివైపునకు, పీఠము పై నిలబెట్టవలెను.

బ్రహ్మధ్వజం దించడం : సూర్యాస్తమయ వేళలో దించవలెను.

(మరిన్ని వివరాల కొరకు చదవండి : సనాతన సంస్థ గ్రంధం ‘ పండుగలను ఆచరించే సరైన పద్ధతి, శాస్త్రము’ మరియు వెబ్ సైట్ లోని లేఖనలు)

 

Leave a Comment