ప్రవాహిస్తున్న నీటిలో శ్రీ గణేశుడి విగ్రహా నిమ్మజనం చేయండి !

గణేశ భక్తులారా, గణేశ చతుర్థి కాలంలో, మీరు శ్రీ గణేశుడిని భక్తితో,  శాస్త్రానుసారంగా పూజ చేస్తారు. ఆ విగ్రహాన్ని శాస్త్రానుసారంగా   నిమ్మజనం చేయుటకు బదులుగా, కేవలం ప్రసిద్ధి కోసం పర్యావరణాన్ని పరిరక్షింస్తున్నట్లు నటించే నాస్తికులకు మీరు విగ్రహాన్ని అప్పగించబోతున్నారా ? ఈ ధర్మద్రోహుల వికృతి పిలుపుకు లొంగకుండ, నిమ్మజనం చేయని మహాపాపమునకు దూరంగా ఉండండి. శ్రీ గణేశ విగ్రహాన్ని ధర్మ శాస్త్రానుసారంగా బంకమట్టితో తయారు చేస్తే పర్యావరణ కూడా పరిరక్షింపబడుతుంది మరియు ధర్మాచరణ చేసినందు వలన శ్రీ గణేశుడి కృప కూడా అవుతుంది.

శ్రీ గణేశుడి విగ్రహాన్ని మరియు నిర్మాల్యమును ప్రవాహిస్తున్న నీటిలో ఎందుకు నిమ్మజనం చేయ్యలి ?

చతుర్థి కాలంలో ఆధ్యాత్మిక శాస్త్ర ప్రకారం, గణేశుడిని పూజించుట వల్ల, శ్రీ గణపతి విగ్రహం ఎక్కువ పరిమాణంలో చైతన్యమును ఆకర్షిస్తుంది. ఇట్టి విగ్రహాన్ని నీటిలో నిమ్మజనం చేయుట ద్వారా, ఈ చైతన్యము చాలా దూరంగా వ్యాపిస్తుంది. నీటి బాష్పీభవనం (యింకి పోవడం) కారణంగా, ఈ చైతన్యం  వాతావరణంలో కూడా చాలా దూరంగా చేరుకుంటుంది.

 కరువు పీడిత ప్రాంతాల్లో విగ్రహ నిమ్మజనం వికల్పములు

చాలా చోట్ల, వర్షం లేకపోవడం వల్ల, నది లేదా నీటి ప్రవాహం ఎండిపోతుంది. ఈ కారణంగా,  శాస్త్ర  ప్రకారంగా ప్రవహించే నీటిలో శ్రీ గణేశ విగ్రహాన్ని నిమజ్జనం చేయడానికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది. సంక్షోభ సమయాల్లో, ఆధ్యాత్మిక సూత్రాల ప్రకారంగా ధర్మం సూచించినట్లు చర్యలు చేయమని ధర్మశాస్త్రం అనుమతిస్తుంది. దీని ప్రకారంగా, కరువు సంభవించినప్పుడు, శ్రీ గణేశ మూర్తిని  నిమజ్జనం చేయడానికి ఈ క్రింది ఎంపికలను అనుసరించండి !

1. చిన్న విగ్రహం స్థాపించండి

అ. ప్రతి సంవత్సరం ఒక పెద్ద విగ్రహాన్ని తీసుకువచ్చే సంప్రదాయం ఉన్నప్పటికీ, కరువు స్థితిని దృష్టిలో ఉంచుకొని నిమజ్జనకు సులభమయ్యేటటువంటి చిన్న (6-7 అంగుళాల ఎత్తున) విగ్రహాన్ని పూజించండి.

ఆ. ఉత్తరపూజ తరువాత, ఈ విగ్రహాన్ని ఇంటి వెలుపల తులసి బృందావన సమీపంలో లేదా ప్రాంగణంలో ఉంచండి మరియు నగరాల్లోని  నివసించేవారు, వారి ఇళ్లలోని పాత్రలో నీటిని నింపి దానిలో నిమజ్జనం చేయండి.

ఇ. విగ్రహం పూర్తిగా నీటిలో కరిగిపోయిన తరువాత, ఆ నీరు మరియు మట్టి కాళ్ళ  క్రిందకు రాని విధంగా మర్రి చెట్టు, రావి చెట్టు వంటి సాత్విక చెట్లకు నీరును పోయండి.

2. కొద్దీ సమయం తరువాత పెద్ద విగ్రహాన్ని నిమజ్జనం చేయండి !

ఒక పెద్ద విగ్రహం యొక్క ప్రత్యామ్నాయాన్ని అంగీకరించినప్పుడు, ఆ విగ్రహాన్ని పూజించినట్లయితే, దానిని ఇంట్లో సాత్విక ప్రదేశంలో ఉంచండి (ఉదా. ప్రార్థనా స్థలానికి సమీపంలో). ఈ విగ్రహాన్ని పూజించాల్సిన అవసరం లేదు. దుమ్ము పారకుండా కవర్‌తో కప్పండి. ప్రవాహిస్తున్న నీరు అందుబాటులో ఉన్నప్పుడు, ఆ నీటిలో విగ్రహాన్ని ముంచండి. పైన చెప్పబడిన విధంగా నిమ్మజనం లభ్యత లేని (తక్కువ వర్షం) వంటి కాలానికి మాత్రమే ఉంటుంది.

– శ్రీ. దామోదర్‌ వాజే గురుజీ, సనాతన సాధక-పురోహిత పాఠశాల, గోవా.

 

శ్రీ గణేశమూర్తి నిమజ్జనమును కృత్రిమ జలకుండములో ఎందుకు చేయకూడదు ?

‘కాలుష్యముక్త గణేశుని మూర్తి నిమజ్జనము’ పేరుతో కొన్ని నగరపాలక మండలిలు మరియు స్థానిక పాలనామండలి వారు విభిన్న ప్రదేశములలో తాత్కాలిక జలకుండలములను తయారు చేుస్తున్నారు. ఇలాంటి జలప్రవాహములో శ్రీ గణేశ మూర్తిని నిమజ్జనము చేయడము అనుచితమైనది ఎందుకనగా –

1. ధర్మశాస్త్రము అనుసారముగా ‘ప్రాణప్రతిష్ఠ చేసిన మూర్తిని ప్రవహించే జలములో నిమజ్జనము చేయవలెను’. ప్రవహించే జలములో మూర్తిని నిమజ్జనము చేయుట వలన మూర్తిలో ఉన్న చైతన్యము జలము మాధ్యమముతో అంతటా చేరుతుంది మరియు అనేక మందికి దాని లాభము కలుగుతుంది. జలకుండములో ప్రవహించే జలము ఉండకపోవుట వలన భక్తులు ఈ ఆధ్యాత్మిక లాభము కలుగదు.

2. జలకుండములో గణేశమూర్తిని నిమజ్జనము చేసిన తరువాత సంబంధిత కార్మికుడు గణేశమూర్తి నీటిలో పూర్తిగా కరుగక ముందే దానిని జలకుండము నుండీ బయటకు తీసి పెడతాడు.

3. జలకుండములో నిమజ్జనము చేసిన మూర్తులను నగర పాలక మండలికి చెందిన చెత్త వాహనములో తీసుకొని వెళ్ళడము జరుగుతుంది.

4. గణేశమూర్తి నిమజ్జనము అయిన తరువాత జలకుండమును మూసివేసే ముందు నగర పాలకము వారు గణేశోత్సవముతో పూరిత జలమును కాలువలో పోస్తారు. ఇది కూడ ఒక్క విధముగా శ్రీ గణేశుని అగౌరవపరిచినట్లే అగును.

 ‘ఈకో ఫ్రెండ్లీ’ గణేష్ విగ్రహం అనే అపాయం నుండి జాగ్రత్త

ప్రస్తుతం ‘ఈకో ఫ్రెండ్లీ’ అని పేరు చెప్పి చత్త్త కాయితాల ముద్దతో విగ్రహాలను తయారు చేయడం కూడా ఆశాస్త్రీయమైనదే ! ఇటువంటి విగ్రహం పర్యావరణానికి హానికారకమైనదే ఎందుకంటే వాటిని నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత ఆ కాగితాల ముద్ద నీటిలో ఉన్న ప్రాణవాయువుని పీల్చుకోవడంతో జీవసృష్టికి అపాయం కలిగించే ‘మీథేన్’ వాయి యొక్క నిర్మాణం అవుతుంది.

Leave a Comment