సనాతన సంస్థ ద్వారా తయారు చేయబడిన శ్రీ గణపతి సాత్విక విగ్రహం

శాస్త్రాలకు అనుగుణంగా చేయబడిన  శ్రీ గణేశ విగ్రహములను పూజించడం ద్వారా ధర్మమును కాపాడండి !

ఆధ్యాత్మిక దృక్కోణంలో, ప్రతీ దేవతా మూర్తికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు కలిసి ఉంటాయి. దీని ప్రకారము, దేవతా విగ్రహమును గ్రంథములకు అనుగుణంగా తయారు చేయనట్లయితే ఆ దేవత యొక్క ఆశీస్సులను మనము పొందలేము. కాబట్టి, అటువంటి విగ్రహమును ఆరాధించే భక్తుడు ఎటువంటి ప్రయోజనమును పొందలేడు అని గ్రంథాలు చెబుతున్నాయి. అదే సమయంలో, ఈ చర్య వలన ఆ దేవతను కించ పరచినట్లు కూడా  అవుతుంది.

ప్రకంపన శాస్త్రము ప్రకారము, ప్రతి ఆకారం నుండి వెలువడే ప్రకంపనలు దానిలోని సత్వ, రజస్సు, తమో గుణముల కలయికను బట్టి మారుతాయి. ఆకారంలో మార్పు జరిగినప్పుడు వీటి నిష్పత్తి కూడా మారుతుంది.

దేవతా విగ్రహముల విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. శ్రీ గణపతి యొక్క పొడవు, పరిమాణము లేదా ఆకారములో కొంచం మార్పు ఉన్నా విగ్రహము యొక్క సమగ్ర ప్రకంపనలలో మార్పు ఉంటుంది. కాబట్టి, మనము సూక్ష్మ పకంపనలను అర్థం చేసుకుని ప్రతి భాగమును చెక్కాలి.

సనాతన సంస్థ వారు 28.3% గణేశ తత్వమును ఆకర్షించే విగ్రహమును తయారు చేశారు. (కలియుగంలో ఏ విగ్రహము లేదా చిత్రములోకి గరిష్ఠంగా 30% దేవతా తత్వమును ఆకర్షించవచ్చు.)

 

Leave a Comment