శీతాకాలములో వ్యాధులపై సులభమైన ఉపచారము

‘శీతాకాలంలో చలి, పొడిబారటం పెరుగుతుంది. తగిన విధంగా పోరాడకపోతే అది వివిధ వ్యాధులకు దారితీస్తుంది. అయితే చాలా వ్యాధులను నూనె మరియు వేడి కాపడం ఉపయోగించడం ద్వారా నియంత్రించవచ్చు.

 

1. శీతాకాలంలో వ్యాధుల చికిత్సకు ఉపయోగించు నూనెలు

కొబ్బరి నూనె చల్లబరుస్తుంది మరియు ఆవ నూనె అధిక వేడిని ఉత్పత్తి చేస్తుంది. అన్ని ఇతర తినదగిన నూనెలు మితమైన వేడిని ఉత్పత్తి చేస్తాయి. అటువంటి నూనెలను చలికి తట్టుకోలేని వారు కొబ్బరి నూనెను చికిత్స కోసం ఉపయోగించవచ్చు. ఏదైనా తినదగిన నూనెను, ఒక గిన్నె తీసుకొని దానిలో 1 లేదా 2 ముక్కలు చేసిన వెల్లుల్లి లేదా ఒక అంగుళం అల్లం వేసి మరిగే వరకు మధ్యస్థ మంట మీద ఉడికించాలి. తరువాత చల్లార్చి, వడపోసి ఒక సీసాలో నిల్వ చేయాలి. ఈ నూనె వేడిని ఉత్పత్తి చేస్తుంది మరియు శీతాకాలం వల్ల కలిగే చలిని ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.

 

2. కాపడముకు ప్రత్యామ్నాయాలు

కాపడం కోసం వేడి నీటి సంచిని ఉపయోగించండి. అందుబాటులో లేకపోతే ఇస్త్రీ చేయడం ద్వారా వేడెక్కిన మందపాటి బట్టను వాడండి. శీతాకాలంలో సూర్యకిరణాలు ఎక్కువ వేడిగా ఉండవు. కాబట్టి, కొంతకాలం ఇలా వేడికి గురిచేయడం కూడా కాపడంకు సమానం. స్నానం చేసేటప్పుడు, వేడి నీటితో కూడా కాపడం చేయవచ్చు.

 

3. కొన్ని శీతాకాల వ్యాధుల చికిత్స

3 అ. చర్మం పగుళ్ళు

పొడి వాతావరణం కారణంగా చర్మం మరియు పెదవులపై పగుళ్ళు ఏర్పడతాయి. అరచేతులు మరియు అరికాళ్ళపై ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పొడి చర్మం దురద పెడుతుంది మరియు గోకినప్పుడు చర్మం ఊడి మంటపెడుతుంది. కొన్నిసార్లు మూత్ర విసర్జన చేయు అంగాలలో చర్మం పొడిబారి పగుళ్లు ఏర్పడతాయి మరియు మూత్రవిసర్జన సమయంలో మంటపెడుతుంది.

3 అ 1. చికిత్స

అ. చర్మానికి నూనె రాయాలి. ఇది చర్మానికి తేమను ఇస్తుంది మరియు పగుళ్ళు నయం చేస్తుంది.

ఆ. పెదవులు అధికంగా పొడిగా ఉంటే రోజుకు 3 – 4 సార్లు నూనె పూయాలి.

ఇ. మూత్ర విసర్జన చేయు అంగాలకు చివరన రోజుకు 2 నుండి 3 సార్లు నూనె పూయాలి.

ఈ. చల్లటి వాతావరణం నుండి రక్షణ కోసం ఉన్ని దుస్తులు ధరించాలి.

3 ఆ. జలుబు (ముక్కు కారుట) మరియు దగ్గు

వైద్యులు. మేఘ్‌రాజ్‌ పరాడ్కర్‌

మంచుతో కూడిన వాతావరణంలో రాత్రి సమయంలో ప్రయాణం చేసినప్పుడు జలుబు వస్తుంది. చాలా మంది ఉదయం సమయంలో నడక, వ్యాయామం కోసం వెళతారు. ఈ సమయంలో కళ్ళు, ముక్కు, నోరు మరియు చెవులు కప్పి ఉండకపోతే, ఉదయపు మంచు జలుబు లేదా దగ్గుకు కారణం కావచ్చు. నిద్రలో రాత్రి సమయంలో నోరు ఎక్కువగా తెరిచి ఉండటం వల్ల, ముక్కులో జలుబు అడ్డుకుంటుంది, ఫలితంగా నోటి ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. ఈ చల్లని గాలి నిరంతరం గొంతులోకి ప్రవహించడం వల్ల గొంతు నొప్పితో మొదలయ్యి అది దగ్గును ప్రేరేపిస్తుంది. జలుబు ముక్కు యొక్క లోపలి పొర యొక్క వాపుకు కారణమవుతుంది, తద్వారా ముక్కుకు ఆనుకొని ఉన్న నాసికా రంద్రాల నుండి స్రావాల ప్రవాహాన్ని అడ్డుకుంటుంది మరియు దీని కారణంగా ముక్కు కారుట, దగ్గు వస్తాయి.

3 ఆ 1. చికిత్స

అ. రోజుకు 2-3 సార్లు ముక్కు ద్వారా ఆవిరి పట్టాలి. నాసికా రంధ్రాలను తెరవడానికి మరియు కఫంను బయటకు పంపడానికి సహాయపడుతుంది.

ఆ. చిటికిన వేలు యొక్క కొనను నూనెలో ముంచి, రెండు నాసికా రంధ్రాల లోపలి పొరకు రోజుకు రెండు లేదా మూడుసార్లు పూయాలి. ఇది పొరను పొడిబారకుండా నిరోధిస్తుంది మరియు వాపును కూడా తగ్గిస్తుంది. నాసికా రంధ్రాలలోకి ప్రవేశించే చల్లని గాలి ఊపిరితిత్తులకు చేరేముందు వేడెక్కుతుంది. గాలి నుండి పుప్పొడి మరియు ధూళి కణాలు నూనెకు అంటుకుంటాయి, తద్వారా విపరీతమైన జలుబు లేదా దగ్గును నివారిస్తుంది.

ఇ. కారుతున్న ముక్కు విషయంలో రోజంతా రెండు చెవుల్లో దూదిని పెట్టుకోవాలి.

ఈ. నిద్రపోతున్నప్పుడు, ముక్కు, నోరు మరియు చెవులు కండువాతో శ్వాసక్రియకు అంతరాయం కలగకుండా కప్పుకోవాలి.

ఉ. రాత్రి సమయంలో గాలి పంకాను(ఫ్యాన్‌) ఆపివేయండి. ఒకవేళ వేడిగా ఉంటే సీలింగ్‌ ఫ్యాన్‌కు బదులుగా టేబుల్‌ ఫ్యాన్ను ఉపయోగించండి. చల్లటి గాలి నిరంతరం తగలక పోవడంతో ఇది శరీరానికి బాధను నివారిస్తుంది.

 

సర్వసాధారణమైన ఉపచారము (చికిత్స)

1. కేశరి మరియు వేఖండ నీటిలో నూరి దాని లేపనమును ముక్కు అటు-ఇటు ప్రక్కన మరియు నొసలికి పెట్టవలెను.

2. పడుకునేటప్పుటడు చెవులను, తలను గుడ్డతో కప్పుకోవలేను, దినములో కాల్లలో చెప్పులను ధరించవలెను.

3. ఆవాలు, ఓమా లేదా వేఖండ చూర్ణమును పెంచుపై వేడి చేసి రుమాలులో కట్టి ముడివేసి ముక్కుకు అటు-ఇటు ప్రక్కన కాపవలెను.

4. వేడి నీటి కిట్లి యొక్క కొన నుండి బయట పడే పొగను ముక్కుతో పీర్చుకోవాలి, నీలిగిరి నూనె మరియు వెల్లుల్లిపాయ వాసన అప్పుడప్పుడు పీర్చుకొనాలి.

5. పసుపు పొడిని 1, 2 చెంచల తులిశీ రసముతో నాకాలి.

6. సొంటి, మిరియాలు, పిప్పళ్ళ, దాల్చిని చెక్క మరియు నిమ్మగడ్డి(గవతి చాయి) వీటి కాఢ త్రాగాలి.

7. ఎక్కువ జ్వరము మరియు ఒళ్ళునొప్పి వున్నచో త్రిభువనకీర్తి రసము లేదా ఆనందభైరవ రసము త్రాగవలెను.

8. స్వల్ప ఆహారమును తీసుకోవలెను. సొంటి, మిరియాలు, పిప్పళ్ళు వేసి తయారు చేసిన పేయము లేదా పెసరి లేదా ఉల్వ కాఢ లేదా ముల్లంగి రసమును త్రాగవలెను.

9. చిత్రక హరితాకి ఉసిరికాయ

 

3 ఈ. తరచుగా మూత్రవిసర్జన లేదా మూత్ర విసర్జన ప్రారంభించడంలో ఇబ్బంది

ఈ లక్షణం అప్పటికే ఉంటే, అది శీతాకాలంలో ఎక్కువ కావచ్చు.

3 ఈ 1. చికిత్స

అ. ప్రతి ఉదయం మేల్కొనగానే మీరు తట్టుకోగల ఉష్ణోగ్రతతో 10 నుండి 15 నిమిషాలు వేడి నీటి తొట్టెలో కూర్చోవాలి. మీ నాభి వరకు నీటి మట్టం ఉండేలా చూసుకోవాలి.

ఆ. 5 నుండి 10 నిమిషాలు, రెండుసార్లు లేదా మూడుసార్లు వేడి నీటితో పొత్తి కడుపుకు కాపడం పెట్టాలి.

3 ఉ. మలబద్ధకం

చల్లటి వాతావరణంకు ఆసన సంవరణి కండరాలు సంకోచించి మలబద్దకానికి కారణమవుతుంది. ఆసన చర్మంపై పగుళ్ళు నొప్పిని కలిగిస్తాయి, ఇది మలం వెళ్ళకుండా నిరోధిస్తుంది. అందువల్ల మలం ప్రేగులో ఎక్కువసేపు ఉండి గట్టిగా మారుతుంది. పాయువును చల్లటి నీటితో కడగడం వల్ల మల ప్రారంభానికి మరింత సంకోచం ఏర్పడుతుంది.

3 ఉ 1. చికిత్స

అ. రాత్రి పడుకునే ముందు ఆసన మార్గంలో ఏదైనా తినదగిన నూనెలో నానబెట్టిన ఒక వక్క గింజంత దూది ఉండను చొప్పించండి. ఇది మలం విసర్జిస్తున్నప్పుడు పడిపోతుంది. ఇది ఆసన కండరాలను సడలిస్తుంది మరియు అవి తేలికగా వ్యాకోచిస్తాయి మరియు మలం గట్టిపడటాన్ని కూడా నివారిస్తుంది. మొలలు మరియు పగుళ్ల కేసులలో కూడా ఇది సహాయపడుతుంది. తీవ్రమైన మలబద్దకంతో బాధపడేవారు ఆముదం నూనెలో ముంచిన దూది ఉండను ఉపయోగించాలి.

ఆ. మీరు పాయకానాపై కూర్చోనేముందు పాయువు మరియు నడుము వేడి నీటితో తడపాలి. ఇది ఆసన కండరాలను సడలిస్తుంది. నడుముపై వేడి నీటితో తడపడం వల్ల మలం వేగంగా బహిష్కరించబడటానికి వీలు కల్పిస్తుంది.

3 ఊ. మెడ మరియు ఇతర అవయవాలలో కండరాల బెణుకులు

చల్లటి వాతావరణం మెడలోని కండరాల సంకోచానికి కారణమవుతుంది మరియు శరీరంలో ఇతర కండరాల బెణుకులకు దారితీస్తుంది. కీళ్ళ నెప్పుల వ్యాధులతో బాధపడుతున్న వారిలో శీతాకాలంలో సమస్య మరింత తీవ్రమవుతుంది.

3 ఊ 1. చికిత్స

అ. బెణికిన కండరానికి రోజుకు 2 – 3 సార్లు గోరువెచ్చని నూనె పూయాలి, ఎక్కువ మర్ధనా చేయవద్దు.

ఆ. అప్పుడు 5 – 10 నిమిషాలు వేడి కాపడం పెట్టాలి మరియు కాపడం పెట్టేటప్పుడు ప్రభావిత భాగాన్ని కదిలించాలి. వేడి, కండరాలను వ్యాకోచింపచేస్తుంది. ఈ విధమైన కదలిక కండరాల సంకోచాన్ని తగ్గిస్తుంది.

3 ఎ. మడమల నొప్పి

చల్లటి గచ్చుపై చెప్పులు లేకుండా నడవడం లేదా అలాంటి గచ్చుపై పాదాలు పెట్టి కూర్చోడం మడమల్లో నొప్పికి దారితీస్తుంది.

3 ఎ 1. చికిత్స

అ. పాదరక్షలు ధరించాలి.

ఆ. మడమలకు వేడి కాపడం పెట్టాలి.

ఇ. మీరు ఎక్కువసేపు ఒకే చోట పాదాలను ఉంచాల్సిన అవసరం ఉంటే (ఉదా: కంప్యూటర్‌లో పనిచేసేటప్పుడు, వంట చేసేటప్పుడు) అప్పుడు పాదాల క్రింద జనపనార సంచి లేదా మెత్తటి చాప వేసుకోవాలి.

– వైద్యులు మేఘరాజ్‌ మాధవ్‌ పరాడ్కర్‌ (18.12.2019)

 

ఇంటిని నిర్మిస్తున్నప్పుడు చల్లని వాతావరణం తట్టుకోలేనివారు పాలరాయి, కోటా లేదా గ్రానైట్‌ వంటి రాతి పలకలకు బదులుగా మట్టి లేదా సిరామిక్‌ పలకలను ఉపయోగించాలి

మార్బుల్‌, కోటా, గ్రానైట్‌ మరియు ఇతర రాతి పలకలు మరింత చల్లబరుస్తాయి కాబట్టి, శీతాకాలంలో బాధను కలిగిస్తాయి. వీటితో పోల్చినప్పుడు మట్టి లేదా సిరామిక్‌ పలకలు వెచ్చగా ఉంటాయి. కాబట్టి చలిని తట్టుకోలేని వారు రాయికి బదులుగా ఫ్లోరింగ్‌ కోసం మట్టి లేదా సిరామిక్‌ పలకలను ఉపయోగించాలి. – వైద్యులు మేఘరాజ్‌ మాధవ్‌ పరాడ్కర్‌

 

టేబుల్‌ ఫ్యాన్‌, సీలింగ్‌ ఫ్యాన్‌ కంటే ఉత్తమం !

‘సీలింగ్‌ ఫ్యాన్‌ యొక్క గాలి శరీరంపై ఆపకుండా తగులుతుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. మీరు రాత్రి 6 గంటలు నిద్రపోతే, రోజులో 1/4 వ వంతు మీరు ఈ గాలికి గురవుతారు. ఇది చర్మం పొడిభారటం, కండరాల తిమ్మిరి మరియు మెడ, వీపు , నడుము మరియు ఇతర కీళ్ళలో నొప్పిని కలిగిస్తుంది. వాయుమార్గంలో పొడి పునరావృతం అవడం వల్ల జలుబు మరియు దగ్గుకు దారితీస్తుంది. అధిక వేడి కారణంగా ఫ్యాన్‌ అధిక వేగంతో ఉంచుతారు. మీరు గాడ నిద్రలో ఉన్నందున రాత్రి చల్లగా ఉన్నప్పుడు ఫ్యాన్‌ ఆపివేయరు కాబట్టి అనవసరంగా శరీరం చల్లని గాలిని ఎదుర్కోవలసి ఉంటుంది. శరీరం యొక్క రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉన్నంత వరకు అది ఫ్యాన్‌ గాలి వల్ల కలిగే వ్యాధితో పోరాడుతుంది. కాని ఈ రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు వ్యాధి ఏర్పడుతుంది మరియు దీనికి కారణం ఫ్యాన్‌ అని రోగికి కూడా తెలియదు. మూల కారణం తొలగించబడనందున చికిత్స తీసుకుంటున్నప్పటికీ, మెరుగుదల ఉండదు మరియు ఫ్యాన్‌ ఉపయోగించకపోవడం ఆరోగ్యం మెరగవడానికి సహాయపడుతుంది.

గాలి ఒక దిశలోనే కేంద్రీకృతమై ఉండకపోవడం మరియు సీలింగ్‌ ఫ్యాన్‌ యొక్క చెడు ప్రభావాలను నివారించడం వలన, తిరిగే టేబుల్‌ ఫ్యాన్‌ ఎల్లప్పుడూ సీలింగ్‌ ఫ్యాన్‌ కంటే మంచిది.

– వైద్యులు మేఘ్‌రాజ్‌ మాధవ్‌ పరాడ్కర్‌, సనాతన ఆశ్రమం, రామనాథి, గోవా (18.12.2019)

Leave a Comment