ఆపత్కాలంలో అంగడిలో(మార్కెట్లో) అనేకమైన నిత్య ఉపయోగ వస్తువుల యొక్క కొరత రావచ్చు. స్వల్ప సరఫరా వల్ల వాటి ధర పెరగవచ్చు లేదా అవి లభించకపోవచ్చు. ఇటువంటి పరిస్థితులలో, క్రింద పేర్కొన్న ప్రత్యామ్నాయాలు ఉపయోగపడతాయి. ఇప్పటినుండే ఈ ప్రత్యేమ్నాయ వస్తువులను ఉపయోగించడం అలవాటు చేసుకోగలరు.
ఆపత్కాలములో పెట్రోల్, డీజిల్ మొదలైన వాటి కొరత వస్తుంది. భవిష్యత్తులో, ఇంధనాలు కూడా అందుబాటులో వుండవు. అప్పుడు అలాంటి ఇంధనాలపై నడుస్తున్న ద్విచక్ర మరియు నాలుగు చక్రాల వాహనాల వల్ల ప్రయోజనం లేకుండా పోతుంది.
ఆపత్కాలంలో, వంట కోసము గ్యాస్ కొరత, కుటుంబ సభ్యుల అనారోగ్యం, అకస్మాత్తుగా మరొక ప్రదేశానికి వెళ్ళిపోవలసిరావడం, మార్కెట్లో కూరగాయలు లభించకపోవడం మొదలగు సమస్యలు ఎదురౌతాయి.
ఆహార ధాన్యాలను భవిష్యదుపయోగమునకు ఎంత నిలువచేసినాగాని అవి నిధానంగా అయిపోతాయి. ఇలాంటి సమయములో ఆకలి భాదలు లేకుండా వుండటానికి, ఆహార ధాన్యాలు సాగుచేయడం, పశువులను పెంచడం మొదలైనవి చేయవలసిన అవసరం ఎంతైనావుంది.
తుఫానులు, అతివష్టి (భారీ వర్షాలు), భూకంపాలు వంటి నైసర్గిక ఆపదలను మనం ఎప్పుడు ఎదుర్కోవలసి వస్తుందో అంచనా వేయడం కష్టం. ఇలాంటి విపత్తులు ఏ క్షణంలోనైనా ఉద్భవించవచ్చు. అందువల్ల, సంసిద్ధత అవసరం. దీన్ని దృష్టిలో పెట్టుకుని, అందరు ఇక్కడ ఇచ్చిన సూచనలను తప్పకుండా పాటించవలెను.
నవెంబర్-ఫెబ్రవరి : చలికాలంలో జీర్ణక్రియ బాగా ఉండడం వల్ల ఆహార నిబంధనలు ఉండవు. కాబట్టి – ఎక్కువగా ఉన్న ఆకలిని తీర్చడానికి కావలసినంత పౌష్టిక ఆహారం సేవించండి ! నువ్వులు, వేరుసెనగ, కొబ్బరి మొ॥ స్నిగ్ధ పదార్థాలను కావలసినంత తినండి ! వంటలో వాము, ఇంగువ, మిరియాలు మొ॥ మసాల పదార్థాలను వాడండి ! చలివల్ల చర్మం పగలకుండా రోజు స్నానానికి ముందు ఒంటికి నూనె రాయండి ! చలిని తట్టుకోవడానికి రోజు వ్యాయామం చేయండి ! … Read more
వరదలు, భూకంపం, మహాయుద్ధం మొదలైన భీకర సంకట సమయంలో వైద్యులు దొరకనప్పుడు సమయానికి మందులు అందుబాటులోకి ఉండడానికి ఔషధ, వనస్పతులను నేటినుండే పెంచండి. స్వీయ రక్షణ మాత్రమే కాకుండా ఇతరుల ప్రాణ రక్షణ కోసం ఔషధీ గుణం కల వనస్పతులను పెంచడం మరియు ఇతరులను కూడా ఉద్యుక్త పరచడం ప్రస్తుత సమయంలో అవసరమైన సమిష్టి సాధనయే. [చదవండి – సనాతన గ్రంథం – ఔషధ వనస్పతుల తోట (2 భాగాలు)]