ఆపత్కాలములో ప్రాణరక్షణ కొరకు చేయబడే సంసిద్ధత భాగము – 1

అఖిల మానవాళికి ఆపత్కాలములో ప్రాణాలతో బ్రతికి వుండుటకు సంసిద్ధత  గురించి మార్గదర్శనము చేయు ఏకైక పరాత్పర గురువులు డా. జయంత్‌ బాలాజి ఆఠవలె !

ఆపత్కాలములో ప్రాణరక్షణ కొరకు సంసిద్ధత భాగము

 

1. కొరోనా విషాణువు యొక్క సంకటము అనగా మహాభీషణమైన ఆపత్కాలము యొక్క చిన్న హెచ్చరిక !

పిబ్రవరి 2020 నుండి కొరోనా విషాణువు  మహమ్మరి ప్రపంచవ్యాప్తంగా హాహాకారము రేకెత్తించింది. 13 జూన్‌ 2020 వరకు, ప్రపంచవ్యాప్తంగా 77,64,621 మందికి కొరోనా విషాణువు  సోకింది, వారిలో 4,28,740 మంది మరణించారు. ఏదేమైనా, ఈ సంకట సమయంలో, ఆహార ధాన్యాలు, నీరు, విద్యుత్‌ వంటి అవసరమైన వస్తువుల కొరత లేదు. ప్రజలకు కూడా మొబైల్‌, దూరదర్శని, అంతర్జాలం మరియు యంత్రపరికరాలు వంటి అన్ని సౌకర్యాలు అందుబాటులోనే వున్నాయి. లాక్‌డౌన్‌(గృహ నిర్బంధం) కారణంగా, వ్యాపారాలు విపరీతంగా ప్రభావితమయ్యాయి, ఇందుచేత దేశములో ఆర్థిక మాంద్యం, దేశంలోని వివిధ ప్రాంతాలలో మరియు విదేశాలలో చిక్కుకున్న ప్రజలు ఇంటికి చేరుకోలేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు; చాలా మంది ప్రజలు తమ ఇళ్ళ లోపల వుండడం మినహా(తప్ప) ఎటువంటి సమస్యను ఎదుర్కోవాల్సి రాకున్నను కొరోనా సంకటమునకు విసుగు చెంది ఆత్మహత్య చేసుకోవటము, మద్యం లభించకపోవడం వల్ల తాగుబోతులు వీధుల్లోకి రావడం, చాలా మంది ప్రజలు ప్రభుత్వం నిర్దేశించిన సూచనలు, నియమాలను పాటించకపోవడమనేది నిదర్శనములోకి వచ్చింది. ధర్మశిక్షణ ఇవ్వలేకపోవడము మరియు ఆధ్యాత్మిక సాధన నేర్పించ కపోవడము వల్ల ప్రజల స్థితి ఎంత  దుర్దైవంగ మారిందో, ఈ వాస్తవాల ద్వారా తెలుస్తున్నది.

 

2. మహాభీషణ ఆపత్కాలము యొక్క సంక్షిప్త స్వరూపము

ప్రపంచ మహాయుద్ధం, భూకంపాలు, వరదలు మొదలైన వాటి స్వరూపంలో మహాభీషణ ఆపత్కాలము ఇంకా రానున్నది. ‘అది వస్తుంది’,అని ఖచ్చితంగా చాలా మంది నాడిభవిష్యము చెప్పే పాఠకులు, ద్రష్టలైన సాధుమహాత్ములు ముందే చెప్పివున్నారు. ఆ సంకటాల దండోరా ఇప్పుడు వినబడుతున్నాయి. కొరోనా మహమ్మారి విపత్తు  చైనా వలనే  ఉద్భవించినది,’ అని అమెరికాతో పాటు కొన్ని యూరోపియన్‌ దేశాలు చైనాను దండించడానికి(శిక్షించడానికి) ప్రారంభించారు. సంక్షిప్తంగా చెప్పాలంటేనే మూడోవ ప్రపంచ మహాయుద్ధం సమీపిస్త్తుంది . ఈ భీషణ ఆపత్కాలము కొన్ని రోజులు లేదా నెలలు కాదు, అది 2023వ సంవత్సరము వరకు, అనగా ఇప్పటి నుండి 3 సంవత్సరాలుగా, అంటేనే ‘హిందూదేశం‘ (ఆదర్శవంతమైన ఈశ్వర రాజ్యము) యొక్క  స్థాపన జరిగే వరకు వుంటుంది. ఈ ఆపత్కాలములో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలుగుతుంది, ఇంధన కొరత కారణంగా రవాణా వ్యవస్థ కుప్పకూలిపోతుంది. ఇందుచేత ప్రభుత్వయంత్రణలు ప్రతిచోటా సహాయం చేయుటకు చేరుకోలేకపోతాయి. ప్రభుత్వ సహాయంలో కూడా ఆటంకాలు వస్తాయి. అందువల్ల, వంట గ్యాసు  తినటానికి – త్రాగటానికి కావలసిన వస్తువులు కొన్ని నెలల పాటు లభించకపోవటము మరియు అవి లభించినప్పటికీ,  మరియు అందుబాటులో వున్నను అవి కొలత ప్రకారం (రేషనింగ్‌) పరిమితిలో వుంటాయి. ఇలాంటి సమయాల్లో వైద్యులు, ఔషధములు, ఆసుపత్రులు మొదలైనవి సులభంగా అందుబాటులో వుండటము కఠినమగును. ఈ వాస్తవాలన్నింటినీ గ్రహించినట్లుతై ఈ ఆపత్కాలమును ఎదురుకోడానికి ప్రతి ఒక్కరూ శారీరక, మానసిక, కుటుంబ, ఆర్థిక, ఆధ్యాత్మిక మొదలగు స్థాయిలలో ముందుగానే సిద్ధంగా వుండటము అవసరం.

 

3. శారీరిక స్థాయిలో చేయవలసిన సంసిద్ధత

జీవించడానికి ఆహారం ప్రాథమిక అవసరం. ఆపత్కాలములో  మనకు ఆకలిని ఎదిరించే సమయము రాకుండ వుండటానికి, ముందే తగినంత ఆహార ధాన్యాలు కొనడం చాలా అవసరం. ప్రస్తుత తరానికి వివిధ రకాల ఆహార ధాన్యాలు ఎక్కువ కాలం నిల్వ వుంచే మరియు సంరక్షించే పద్ధతుల గురించి తెలియదు. ఇందుకొరకు, మేము  కొన్ని పద్ధతులను ఈ లేఖనలో పొందుపరచాము.

ఎంత ఆహారన్ని నిల్వ చేసినా అది క్రమంగా అయిపోతుంది. ఇలాంటి సమయాల్లో ఆహార కొరతను నివారించడానికి ముందు జాగ్రత్తగా ఆహార ధాన్యాలను పండించడము కూడ అవసరం. వరి(బియ్యము), ధాన్యాలు(మొలకలు) వంటి ఆహార ధాన్యాలను పండించడమనేది అందరికి సాధ్యము కాదు; కానీ కంద మూలాలు, తక్కువ నీరులో ఎక్కువ వుత్పన్నమయ్యే  ఏడాది పొడువున పండించగల కూరగాయలు  మరియు అన్ని రకాల వుపయోగపడే చెట్లు, ఫలాలు కాసే మొక్కలు మొదలైనవి ఇంటి చుట్టూ మరియు మేడమీద వసారాలో కూడా పండించవచ్చు. వీటికి సంబంధించిన విషయమును క్లుప్తంగా ఈ లేఖలో వ్రాయబడినది.

ఆపత్కాలములో వంట చేసుకోడానికి(ఆహారధాన్యాలను వుడకబెట్టుకోడానికి) వంట గ్యాసు అందుబాటులో వుండకపోయినప్పుడు కట్టెల  పొయ్యి, సోలార్‌ (సౌరశక్తి )కూకర్‌’ మొదలైన వాటిని వాడాలి. ఆపత్కాలములో నిత్యము అన్ని ఆహార పదార్థాలను వుడికించడం సాధ్యం కాకపోవచ్చు. దీన్ని దృష్టిలో వుంచుకుని, నిర్దిష్ట ఆహార పదార్థాలను నిల్వ(సంగ్రహించి పెట్టడము) చేయడం మరియు వాటిని ఎక్కువకాలం సంరక్షించే మార్గాలపై వుపయుక్తమైన సూచనలు ఇవ్వబడ్డాయి. మన కుటుంబానికి కావలసిన  వస్తువుల జాబితా, అలాగే అప్పుడప్పుడు అవసరమయ్యే వస్తువుల జాబితా ఇవ్వబడింది. దీని ద్వారా పాఠకులకు అన్ని వస్తువులను కొనుగోలు చేయడానికి సులభమౌతుంది. నీరు లేకుండా జీవించడం అసాధ్యం, మరియు ప్రస్తుత తరం మానవులు విద్యుత్‌ లేకుండా జీవించడం అనే ఆలోచన ఊహించలేనిది. అందుకొరకు నీటి వ్యవస్థ, నీటిని నిల్వ చేయడం, శుద్ధి చేయడం, అలాగే విద్యుత్‌ వ్యవస్థకు గల ప్రత్యామ్నాయ (వుపాయములు) వ్యవస్థను కూడ  ఈ లేఖనలో ఇవ్వడం జరిగింది. ఈ లేఖనలో ఒకే విషయము గురించి వివిధ సంసిద్ధతల గురించి చెప్పబడినది. ప్రతి ఒక్కరు తమ  అవసరాలను, స్థలం లభ్యత, ఆర్థిక పరిస్థితి,  స్థానిక వాతావరణం మరియు భౌగోళిక పరిస్థితులు మొదలగువాటి గురించి ఆలోచించి తమకు సౌకర్యవంతంగా వుండేటట్లు సంసిద్ధత చేయవలెను. ఆచరణాత్మక స్థాయిలో సలహాలను అందించడానికి పరిమితులు వున్నచోట, కేవలము మార్గదర్శక సూత్రాలను  ఇవ్వడం జరిగింది; ఉదాహరణకు, ఆపత్కాలములో నీటి కొరతను నివారించడానికి బావిని తవ్వాలని,’ చెప్పబడినది; కానీ ‘ఖశ్చితంగా ఏమేమి చేయవలసి వస్తుంది,’ అనేది చెప్పలేదు.  ఇలాంటి విషయాలలో పాఠకులు నిపుణులను సంప్రదించాలి లేదా పుస్తకాలను చూడవలెను.

 

4. మానసిక స్థాయిలోని సంసిద్ధత

ఆపత్కాలములో చాలా మంది అస్థీరమగుట, దిగులు చెందుట(చింత), నిరాశ చెందుట, భయపడటము మొదలైన వాటితో బాధపడకుండ వుండుటకు, అనగా ఇటువంటి  ప్రతికూల పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవటానికి, ముందుగానే ‘మనస్సుకు ఏ స్వయం సూచన ఇవ్వాలి,’అనేది మార్గదర్శనము చేయబడినది.

 

5. ఆధ్యాత్మిక స్థాయిలో చేయవలసిన సంసిద్ధత

ఆపత్కాలములో తనను తాను రక్షించుకోవడానికి ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసినా, మహాభీషణమైన ఆపదలలో చిట్టచివరికి దేవునిపై నమ్మకమంత (విశ్వాసము) పెట్టుకోవలసి వస్తుంది. మనుష్యుడు ఆధ్యాత్మిక సాధన ద్వారా దేవుని కృప పొందినప్పుడు, ఎలాంటి సంకటములోనైనా దేవుడు ఖచ్చితంగా రక్షిస్తాడు. ఈ లేఖ చదివిన తరువాత ఆధ్యాత్మిక సాధన గురించి  అవగహాన  నిర్మాణమౌతుంది.

6. పాఠకుల్లారా,  సిద్ధతను శీఘ్రంగా ప్రారంభించండి !

పాఠకులు ఈ లేఖలననుసరించి ఇప్పటి నుండే ఆచరణ ప్రారంభించినచో రాబోయే ఆపత్కాలములో సౌకర్యవంతంగా వుంటుంది. పాఠకులు ఈ విషయమును సమాజములో మేల్కోల్పాలి. ఈ లేఖలలో ఇంకా కొన్ని విషయాలు వ్రాయడము జరిగినది. పాఠకుల సంసిద్ధత కొరకు త్వరగా ప్రారంభించాలని, ఈ లేఖలను అందరికి అందజేస్తున్నాము. ఈ విషయముపై గ్రంథాలను కూడ శీఘ్రంగా ప్రచురించ బోతున్నాము.

 

7. ప్రార్థన!

‘ఆపత్కాలములో మనుగడ సాగించడమే(ప్రాణాలతో బ్రతికి వుండుటకే) కాకుండా, జీవితములో ఆధ్యాత్మిక సాధన  దృష్టికోనమును అంగీకరించుకొని ఆనందంగా వుండటానికి కూడా ఈ  లేఖలు వుపయోగపడాలని,’ శ్రీగురువుల పవిత్ర పాదాలకు ప్రార్థన !

– పూజ్య సందీప్ ఆళశి

 

రాబొయే ఆపత్కాలములో మానవులందరు ప్రాణాలతో బ్రతికి వుండుటకు మరియు సృష్టి యొక్క సంక్షేమం కోసం ఈ జగములో క్రియాశీలమైన ఏకైక ద్రష్టలైన పరాత్పర గురువులు డా. జయంత్‌ ఆఠవలె !

హిరణ్యాక్ష అనే అసురుడు పృథ్విని అపహరించి సముద్రంలో దాచిపెట్టినప్పుడు, శ్రీ విష్ణువు ‘వరాహ’ రూపంలో అవతరించి పృథ్విని రక్షించాడు. సృష్టి నిరంతరము సమతుల్యంగా వుండుటకు శివుడు అఖండ ధ్యాన స్థితిలో వుంటాడు. పరాత్పర గురువులు డా. జయంత్‌ ఆఠవలెగారు కూడా అనేక దైవగుణాలతో యుక్తమైనవారైనందువలన వారు దేవుడితో సమానమని సాధకులకు అనేక అనుభూతులు (ఆధ్యాత్మిక అనుభవాలు) కలిగినాయి పరాత్పర గురువులు డా. జయంత్‌ ఆఠవలెగారు కూడా, దేవతల మాదిరిగా అఖిల మానవ జాతి యొక్క రక్షణ మరియు సంక్షేమం గురించి, ఈ సృష్టి గురించి చింతిస్తుంటారు.

ఆపత్కాలములో వరదలు, భూకంపాలు లాంటి నైసర్గిక ఆపదలు మరియు ప్రపంచ మహాయుద్ధం లాంటి మానవ నిర్మితమైన విపత్తులు  రాబోతున్నాయి. ఈ ఆపదలను సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి మార్గ దర్శనము దొరకాలని, పరాత్పర గురువులు డా. ఆఠవలెగారు  2013 నుండి ‘ఆపత్కాలములోని సంజీవని’ అనే గ్రంథ మాలను నిర్మించుటకు (రచించుటకు)  ప్రారంభించారు. ఈ గ్రంథ మాలలో వైద్యులు మరియు మందులు లేనప్పుడు మనల్ని మనం నయం చేసుకోవడానికి వివిధ వుపచారాపద్ధతుల గురించి పవిత్ర గ్రంథాలు వున్నాయి.  వాటిలో, ముఖ్యమైనవి ‘ప్రాణ శక్తి ప్రవాహ వుపచారము’ మరియు ‘ఖాళీ పెట్టెల వుపచారము’ ఈ అత్యంత సరళమైన మరియు ప్రభావవంతమైన నివారణలను వుపచారపద్ధతులను పరాత్పర గురువులు డాక్టరుగారు స్వయంగా కనుగొన్నారు. ఆశ్చర్యమైన విషయమేమిటంటే  పరాత్పర గురువులు డాక్టరుగారు 1980వ సంవత్సరం నుండే ముంబయిలో వారి ఇంట్లో వున్నప్పుడు ఆయుర్వేదం, ఆక్యుప్రెషర్‌, రేకి వంటి చికిత్సల గురించి వందలాది పత్రికల (పేపర్‌ క్లిప్పింగ్స్‌) నుండి సమాచారాన్ని సంగ్రహించి పెట్టారు. ఆ సమాచారం ఇప్పుడు గ్రంథాలను సంకలనం చేయడానికి వుపయోగకరంగా వున్నాయి. ఇవన్ని పరాత్పర గురువులు డాక్టరుగారి దూరదృష్టిని కూడా తెలుపుతుంది.

ఆపత్కాలములో ఆయన ప్రపంచవ్యాప్తంగా వున్న ప్రజలందరూ, వారి డాబాలపైన, ఇంటి ప్రాంగణంలో లేదా వారి ఇళ్ళ వసారాల్లో సులభంగా నాటగలిగే ఔషధ మూలికల గురించి అధ్యయనం చేసే సాధకులను తయారు చేస్తున్నారు. అన్ని చోట్ల ఈ వనస్పతులు నాటించే ప్రయత్నము కూడ చేస్తున్నారు. ఆయన  ఔషధ వనస్పతులను నాటడానికి సంబంధించిన గ్రంథాలను కూడ ప్రచురించారు.

ఆపత్కాలములో, ప్రాణాలతో బ్రతికి వుండుటకు కేవలము ఉపచార పద్ధతులు తెలిసి వుండటమే సరిపోదు, ఆహార ధాన్యాలు, నీరు, ఇంధనం, విద్యుత్‌ వంటి జీవనావశ్యకమైన ఘటకాలు కూడ మానవుడికి చాలా అవసరమై వుంటాయి. ఇవన్నిటిని గ్రహించుకొని ఆపత్కాలమును ఎదుర్కొనుటకు అందరు శారీరిక  స్థాయిలోనే కాకుండ; మానసిక, కుటుంబ, ఆర్థిక మరియు ఆధ్యాత్మిక స్థాయిలో కూడా  సంసిద్ధంగా వుండుట చాల అవసరం. వీటన్నిటినీ దష్టిలో పెట్టుకొని ‘ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా మరియు సమాజబాంధవులందరు ఐక్యమై కలిసి ఏమి చేయాలో, చెప్పేవారు ఏకైక పరాత్పర గురువులు డాక్టరుగారు మాత్రమే. అలాగే సమాజం యొక్క సమిష్టి ప్రయత్నాలు ఎలా వుండాలో చెప్పారు. ‘ఆపత్కాలములో ప్రాణాలతో బ్రతికి వుండుటకు సంసిద్ధత’ అనే విషయముపై  సనాతన ప్రభాత్‌ వార్తా పత్రికలు, వెబ్‌సైట్‌ ద్వారా ప్రచురించారు. ఈ విషయాల గ్రంథ మాలను కూడ త్వరలో ప్రచురించబోవుతున్నారు.

ఆపత్కాలములో రక్షింపబడుటకు మానవుడు స్వంత శక్తితో సంసిద్ధతమగుటకు ఎంతగా ప్రయత్నించినను, భూకంపాలు, త్సునామి వంటి  మహాభీషణమమైన ఆపదలలో రక్షింపబడుటకు, చివరికి  దేవుడిపై నమ్మకం పెట్టుకోవలసి వుంటుంది. మనిషి ఆధ్యాత్మిక సాధన చేయడం ద్వారా దేవుని కప ప్రాప్తించుకున్నట్లైతే, దేవుడు ఆ మనిషిని ఎలాంటి సంకటాలలోనైన  రక్షిస్తాడు. భక్త ప్రహ్లాదుడు, పాండవులు వంటి అనేక ఉదాహరణల ద్వారా ఇది నిరూపించబడినది. ఇందుకొరకే, పరాత్పర గురువులు డాక్టరుగారు గత కొన్ని సంవత్సరాల నుండి గ్రంథాలు, సనాతన ప్రభాత్‌, వెబ్‌సైట్‌ ద్వారా మొదలగు మాధ్యమాల ద్వారా అఖిల మానవాళికి  ఎంతో ఆసక్తిగా, ‘ఇప్పుటికైన ప్రాణాలతో బ్రతికి వుండుటకు ఆధ్యాత్మిక సాధన చేయండి!’ అని  విన్నవించుకుంటున్నారు!’

‘ధర్మాచరణ లోపించినప్పుడు (క్షీణించినప్పుడు) అధర్మము పెరిగినప్పుడు పృథ్విపై సంకటాలు వస్తాయి’, అని హిందూ ధర్మశాస్త్రం  చెబుతుంది. సమాజం ధర్మాన్ని పాటించి, సాధకులుగా మారితే, అలాగే సామాజిక మరియు జాతీయ జీవనములో ధర్మము యొక్క అధిష్ఠనమైతే, పృథ్విపై సంకటాలు రాకుండ వుంటాయి మరియు సృష్టి యొక్క సమతుల్యత స్థిరంగా వుండుటకు సహాయపడుతుంది. ఇందుకొరకే పరాత్పర గురువులు డాక్టరుగారు భారతదేశంలోనే కాదు, సంపూర్ణ  సృష్టిపై ధర్మాధిష్ఠానమైన  ‘ఈశ్వర రాజ్యము’ స్థాపించడానికి ఆధ్యాత్మిక స్థాయిలో  మార్గదర్శకత్వం ఇస్తున్నారు. దీనికొరకే సంత్‌మహాత్ములను, సంప్రాదాయలను, సాధకులను, హిందుత్వవాదులను, ధర్మప్రేమికులను మరియు దేశ భక్తులను ఐక్యము చేస్తున్నారు.

గత కొన్ని సంవత్సరాల నుండి, పరాత్పర గురువులు (డాక్టర్‌) ఆఠవలెగారి యొక్క ప్రాణశక్తి స్థాయి చాలా తక్కువగా వుంటుంది, కేవలము బ్రతికి వుండుటకు  మాత్రమే సరిపడేంత మాత్రమే వుంటుంది దీనితో పాటు ఆయన అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. ఆయన ఒక బ్రహ్మలీన స్థితిలో వున్నారు మరియు ఆయన నిశ్చయించుకుంటే (తలచుకుంటే) శరీరాన్ని ఆనందంగా త్యజించవచ్చు. ఇలా  వున్నప్పుటికి వారు కేవలము  అఖిల మానవజాతిని ఆపత్కాలమునుండి రక్షించడానికి మరియు సాత్వికంగా మార్చుటకు సర్వత్రము ఈశ్వర రాజ్యము రావాలని మరియు సకల సృష్టి యొక్క సంక్షేమగుటకు ఆయన దేహములోని ప్రాణాలన్నిటిని కూడబెట్టుకొని ప్రతిరోజు 15-16 గంటలు నిరంతరము కార్యనిరతరమై వున్నారు.

ఇటువంటి ధర్మసంస్థాపకులు, జగదోద్ధారకులు, సృష్టి యొక్క పాలనకర్త, మరియు యుగప్రవర్తకులైన పరమ కృపాళువైన  శ్రీ గురువుల పవిత్ర పాదాలకు శిరసాష్టంగా నమనం !’

– పూజ్యు సందీప్‌ ఆళశీ, (11.11.2019)

 

2023 వరకు, అంటే భారతదేశంలో ‘హిందూ రాష్ట్రం (దేశం)’ (ఆదర్శవంత ఈశ్వరీ రాజ్యము) స్థాపించబడేవరకు, ఆపత్కాలము కొనసాగుతుంది!

‘ప్రస్తుతం, భూకంపాలు, వరదలు, కొరోనా విషాణువు  వ్యాప్తి మొదలగు వాటి మాధ్యమంగా ఆపత్కాలమునకు ప్రారంభమైనది. 2021 సంవత్సరం నుండి, ఆపత్కాలము యొక్క తీవ్రత చాలా పెరుగుతుంది. 2023 వరకు అనగా  భారతదేశంలో ‘హిందూ రాష్ట్రం (దేశం)’ను(ఆదర్శవంతమైన ఈశ్వర రాజ్యము) స్థాపించబడే వరకు ఆపత్కాలము కొనసాగుతుంది . – (పరాత్పర గురువులు) డా. జయంత్‌ ఆఠవలె ఆఠవలె.

 

1. ఆపత్కాలము కొంత శాతములో ప్రారంభమైనదని సూచించే కొన్ని నైసర్గిక ఆపదలు మరియు  అంతర్జాతీయ అంశాలు

1 అ. కొన్ని నైసర్గిక ఆపదలు

గత కొన్నేళ్లుగా నైసర్గిక ఆపదలు ప్రపంచమంతట  వ్యాప్తి చెందాయి. ఇటివలే జరిగిన కొన్ని ఉదాహరణలను చూద్దాం. 2013 లో కేదార్‌నాథ్‌లో వచ్చిన (సంభవించిన) జలప్రలయములో 60 గ్రామాలు దెబ్బతిన్నాయి, 1,000 మందికి పైగా మరణించారు. 2018వ సంవత్సరంలో కేరళలో వచ్చిన వరదల కారణంగా 3 లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు, 375 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 2018 డిసెంబర్‌లో ఇండోనేషియా సముద్రములో అగ్నిపర్వత (జ్వాలముఖీ) విస్ఫోటనం కారణంగా సంభవించిన సునామీలో సుమారు 300 మంది మరణించారు. కాలిఫోర్నియా, అమెరికాలోని వందల ఎకరాల అడవులు గత కొన్నేళ్ళల్లో రెండుసార్లు బూడిదై వందల ఎకరాల భూమిపై వున్న నైసర్గిక సంపదల హాని జరిగింది.

1 ఆ. మూడవ ప్రపంచ మహాయుద్ధానికి దారితీసే కొన్ని అంతర్జాతీయ అంశాలు

పాకిస్తాన్‌ తన తోలుబొమ్మలు మరియు ఉగ్రవాదుల ద్వారా భారతదేశముతో నిరంతరము రహాస్య యుద్దం, భారతదేశములోకి చైనా తరచూగా  చొరబడటం, ఉత్తర కొరియా అణ్వాయుధ నిరాయుధీకరణ అణు విధ్వంసముపై ఉత్తర కోరియా, అమెరికా సంఘర్షము, మహాసత్తా కావాలనే చైనా ఆశయంపై కొనసాగుతున్న చైనా అమెరికా సంఘర్షము, అమెరికా మరియు రష్యా మధ్య ప్రచ్ఛన్న యుద్ధం (శీతయుద్ధ), తిరిగి ప్రారంభమైంది, అమెరికా మరియు కొన్ని యూరోపియన్‌ దేశాలు ’చైనా వల్ల కలిగే కొరోనా విషాణువు  యొక్క విపత్తు’కు ప్రతీకారంగా చైనాను ఆంక్షలు శిక్ష విధించాలానే దురద, మొదలైనవి, భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలు మూడవ ప్రపంచ మహాయుద్ధం ఎప్పుడైనా ప్రారంభమయ్యే పరిస్థితి వున్నది.

 

2. ‘ఆపత్కాలములో పరిస్థితి ఎంత భయంకరంగా వుంటుందో,’ ఇది తెలియజేసే కొన్ని ఉదాహరణాలు

2 అ. రెండవ ప్రపంచ మహాయుద్ధకాలములోని పరిస్థితి

రెండవ ప్రపంచ మహాయుద్ధ సమయంలో, జర్మనీ, బ్రిటన్‌పై యుద్ధం ప్రకటించింది. ఫలితంగా, బ్రిటన్లో, మొదటి నాలుగు రోజుల్లోనే 1.3 మిలియన్ల మంది వెళ్ళవలసి వచ్చింది. యుద్ధ సమయంలో ‘బ్లాక్‌ అవుట్‌’ నిబంధనలు విధించారు. దీనివల్ల రాత్రి సమయాల్లో వీధిలో చీకటిగా వుండేది. కిటికీ లేదా తలుపు నుండి వెలుగుతున్న కాంతి కూడా జరిమానా విధించబడింది! ఈ బ్లాక్‌ అవుట్‌ 1-2 రోజులు లేదా కొన్ని నెలలు కాదు, 5 సంవత్సరాలు! రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, జర్మనీ యొక్క సైనిక ప్రచారాల ద్వారా రష్యా కూడా ప్రభావితమైంది. ఆ సమయంలో, విపరీతమైన ఆహార కొరత వల్ల రష్యన్లు ఆకులు మరియు రంపపుపొడి కలిగి వున్న ఆహారాన్ని బలవంతంగా తినవలసి వచ్చింది.

2 ఆ. 2015 లో  నేపాల్‌లో జరిగిన భూకంపం తరువాత అక్కడ నిర్మాణమైన పరిస్థితి మరియు దానివలన ప్రజలు ఎదురుకొన్న సమస్యలు

2 ఆ 1. వంట గ్యాసు కొరత వల్ల  ప్రజలు ఎదురుకొన్న కొన్ని ఇబ్బందులు

2 ఆ 1 అ. గ్యాస్‌ సిలిండర్ల నల్ల వ్యాపారం

1,500 రూపాయల వెల గల సిలిండర్‌ గ్యాస్‌ కోసం, నల్ల వ్యాపారంలో రూ .8 వేలు చెల్లించాల్సి వచ్చింది.

2 ఆ 1 ఆ. ప్రజలకు 7 మాసాలు గ్యాస్‌ సిలిండర్లు రాలేదు. భూకంపంలో కూలిపోయిన ఇళ్ళ కట్టెలను ‘ఇంధనంగా’ వుపయోగించాల్సి వచ్చింది. కొన్ని మాసాల తరువాత ప్రభుత్వం కట్టెలను అందుబాటులోకి తెచ్చింది;  కాని ఆ కట్టెల ధర రూ. 20=00 కిలోకు ఎక్కువ వుండేది.

2 ఆ 1ఇ. కట్టెల ఇంధనంగా వుపయోగించడం వల్ల ఉద్భవించిన సమస్యలు

1. కట్టెల వ్యాపారస్తులు తడి కట్టెలను కూడ అమ్మేవారు. తడి కట్టెలకు త్వరగా నిప్పు అంటుకోకపోవుటవలన, మహిళలకు పొయ్యి వెలిగించుటకు కష్టమయ్యేది.

2. చాలా మందికి కట్టెలను నరకడానికి గొడ్డలి లేకపోవడము మరియు కొందరికి గొడ్డలి వున్నప్పటికీ చెక్కను ఎలా నరకలో తెలియకపోవడము అందుకని వారు కట్టెలను నరకడానికి ఇతరులపై ఆధారపడవలసి వచ్చింది.

3. అద్దె ఇళ్ళలో నివసించే ప్రజలను కట్టెల పొయ్యిలపై వండటానికి భూస్వాములు అనుమతించేవారుకాదు. ‘పొయ్యి నుంచి వచ్చే పొగ ఇంటి గోడలు, పైకప్పులను నల్లగా చేస్తుంది’ అని భూస్వాములు ఆరోపించేవారు.

2 ఆ 1 ఈ. అనేక వారముల నుండి ఎదిరిచూసిన తరువాత  కొన్ని గ్యాస్‌ సిలిండర్లు పంపిణీ చేయబడ్డాయి; కానీ వాహనాల కొరత కారణంగా  వాటిని ఇంటికి తీసుకెళ్ళుటకు కష్టమైంది.

2 ఆ 2. కిరాణా వస్తువుల కొరత

ఆ సమయంలో, కిరాణా దుకాణాల్లో ఎక్కువ కిరాణా వస్తువులు అందుబాటులో లేకుండెను. అందుబాటులో వున్న వస్తువులను కూడా సాధారణ ధర కంటే నాలుగు రెట్లు అధిక ధరతో కొనవలసి వచ్చింది, ఉదాహరణకు, వంట(వేరుసెనగా) నూనె సాధారణంగా రూ. 100 నుండి రూ. 180 లీటరుకు వుండేది కానీ అది రూ. 500=00 చొప్పున విక్రయించారు.

2 ఆ 3. మందులు లేకపోవడం వల్ల చిన్న అనారోగ్యంతో బాధపడుతున్న రోగులు కూడా మరణించారు

ఆసుపత్రులలో మందులు అందుబాటులో లేకపోవడంతో కొంతమంది స్వల్ప అనారోగ్యంతో మరణించారు.

2 ఆ 4. విద్యుత్‌ కొరత వల్ల ఉద్భవించిన సమస్యలు

కాట్మండులో విద్యుత్‌ సరఫరా రోజుకు 14 గంటలు ఆపివేయబడింది. అయితే, కొన్నిసార్లు విద్యుత్‌ సరఫరా రోజుకు 2-3 గంటలు మాత్రమే ఉండేది. విద్యుత్‌ సరఫరా ఇచ్చినప్పుడు, ప్రజలు నీటి పంపును ఉపయోగించడం, విద్యుత్‌ ఉపకరణాలపై వంటచేయడం మొదలగునవి జరిగేవి. దీనితో ఒత్తిడి పెరిగి విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ కాలిపోయ్యేది. ఇలాంటి ట్రాన్స్‌ఫార్మర్‌లను సరి చేయడానికి ప్రభుత్వ ఉద్యోగులకు 4-5 రోజులు పట్టేది.

2 ఆ 5. పెట్రోల్‌ మరియు డీజిల్‌ కొరత వల్ల నిర్మాణమైన సమస్యలు

అ. పెట్రోల్‌, డీజిల్‌ కొరత కారణంగా వాహనాలు అందుబాటులో లేకపోవడంతో ఫలితంగా, పాఠశాలలు మరియు  ఉద్యోగాలు మూసివేయబడ్డాయి.

ఆ. కొన్నిసార్లు ఇంధనాన్ని ప్రభుత్వం పంపిణీ చేసేది; కాని దానికోసం 4-5 గంటలు వరుసలో వేచి వుండాల్సి వచ్చేది. చివరిగా వేచి వున్న వ్యక్తి వద్దకు వచ్చేటప్పటికి ఇంధనం అయిపోయేది. అందువల్ల, ప్రజలు ఇంకా చాలా వారాలు వేచి వుండాల్సి వచ్చేది. ప్రభుత్వము ద్వారా ఇంధనం ఎప్పుడు లభిస్తుందో మరియు తరువాత ఎప్పుడు పంపిణీ చేయబడుతోందనే దాని గురించి ప్రభుత్వం నుండి ఎలాంటి సమాచారం వుండేది కాదు. తత్ఫలితంగా, ప్రజలు తమ వాహనాలను చాలా రోజులు రోడ్డుపై క్యూలో పెట్టి వెళ్ళేవారు.

ఇ. పెట్రోల్‌ సాధారణంగా రూ. 100 నుండి రూ. 130 కు లీటరు వుండేది కానీ నల్ల వ్యాపారంలో రూ. 500 లీటరుకు విక్రయించేవారు మరియు డీజిల్‌ సాధారణంగా రూ. 80 నుంచి రూ. 100 లీటరైతే, నల్ల వ్యాపారంలో రూ. 250 నుండి రూ. 300 లీటరుకు విక్రయించేవారు.

ఈ. ఇంధన కొరత వల్ల సైకిల్‌ నడిపించే వారి సంఖ్య పెరిగింది. అందువల్ల, చౌకగా లభించే సైకిల్‌ కూడా రూ. 10,000 అయ్యింది.

2 ఆ 6. విద్యుత్‌, పెట్రోల్‌, డీజిల్‌ లేకపోవడం వల్ల అంతర్జాలం ఆపివేయబడింది.

వివిధ కార్యాలయాల విద్యుత్‌ సరఫరా ఆగిపోయినప్పుడు, జనరేటర్ల సహాయంతో విద్యుత్‌ సరఫరా జరిగేది; మాత్రము  భూకంపం తరువాత, విద్యుత్తుతో పాటు, పెట్రోల్‌ మరియు డీజిల్‌ కొరత కూడా ఏర్పడింది, మరియు ఈ విద్యుజ్జనక(జనరేటర్లు) యంత్రాలు పనికిరానివిగా మారాయి. కాబట్టి అంతర్జాలంపై ఆధారపడిన పనులు ఆగిపోయాయి.

2 ఆ 7. ఉద్యోగావ్యాపారాలు మూసివేయడం వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు

ఆ సమయంలో, సుమారు 2 వేల వ్యాపారాలు మూసివేయబడ్డాయి మరియు సుమారు 1 మిలియన్‌ ప్రజలు నిరుద్యోగులయ్యారు.

-ఎస్‌.ఎస్‌.ఆర్‌.ఎఫ్‌ సాధకురాలు శ్రీమతి సాను థాపా, నేపాల్‌. (24.4.2016)

పై ఉదాహరణలన్నీ ఆపత్కాలములోని భీషణమైన పరిస్థితి యొక్క చిన్న సంగ్రహవలోకనం(తళుకు). ఆపత్కాలములో సమస్యల తీవ్రత ఎంత అధికంగా వుండునో మనం ఊహించలేము. ఈ సమస్యలన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కోవలనుకుంటే, ఆపత్కాలములో సంసిద్ధత కూడ అంతే జాగ్రత్తగా చేసుకోవడం తప్ప వేరే మార్గము  లేదు,’ ఇది గ్రహించుకోవాలి.

 

3. ఆపత్కాలములో శారీరిక స్థాయిలో చేయవలసిన వివిధములైన సంసిద్ధత !

3 అ. ఆకలితో జీవితం గడిపే సమయము రాకుండ  వుండటానికి  వీటిని చేయండి !

3 అ. ఆకలితో బాధ పడకుండా వుండటానికి ఇలా చేయండి

3 అ 1. వంట గ్యాస్‌(సహజ వాయువు), పొయ్యికి అవసరమైన కిరోసిన్‌ మొదలైన వాటి కొరతను ముందుగా గ్రహించి, క్రింది వాటిని చేయండి.

3 అ 1 అ. ఇంట్లో కట్టెల పొయ్యిని వుంచండి

కట్టెల పొయ్యి

 

1. మీకు ఇంట్లో పొయ్యి లేకపోతే, ఒక మట్టి, సిమెంట్‌ లేదా పోత ఇనుప పొయ్యి కొనిపెట్టనండి. కొందరు సాంప్రదాయ పొయ్యితో పోల్చితే  తక్కువ ఇంధనాన్ని వినియోగించే, తక్కువ పొగను విడుదల చేసేది, అవసరమున్న చోటికి  సులభంగా తీసుకెళ్ళే విధంగా లాభలను కలుగజేసే ఇనుప పొయ్యిలను తయారు చేస్తారు. ఉదా. ఇటువంటి పొయ్యిల తయారీదారు ‘దత్తు చుల్హా’, భోపాల్‌, మధ్యప్రదేశ్‌ (మొబైల్‌: 9425009113). కొందరు వంటగది నుండి పొగ బయటకు వెళ్ళడానికి పొగ గొట్టంను తయారు చేస్తారు. ఇటువంటి ఆధునిక పొయ్యిల ప్రయోజనాన్ని మనం అధ్యయనం చేసి మరియు మన అవసరాన్ని బట్టి, మనకు సరిపోయేదాన్ని కొనుక్కోవచ్చు. (అత్యవసర పరిస్థితుల్లో, ఒక విశిష్టమైన పద్ధతిలో 3 రాళ్లను అమర్చి  పొయ్యిని తయారు చేయవచ్చు.)

2. పొయ్యి వెలిగించడం, ప్రతిరోజూ శుభ్రపరిచే విధానం మొదలైనవి నేర్చుకోండి.

3. తగినంత కట్టెలు, బొగ్గు, పిడకలు, ‘బయోమాస్‌ బ్రికెట్స్‌(జీవరసాన్ని కలిగిన బొగ్గు అచ్చు)’ (చెరకు పిప్పి, రంపపు పొడి, వేరుశెనగ తొక్కలు, పొద్దుతిరుగుడు(సూర్యపువ్వుల) కాండాలు మొదలైన వాటిని కుదించడం ద్వారా తయారు చేస్తారు). బయోమాస్‌ బ్రికెట్‌లు(జీవరసాన్ని కలిగిన బొగ్గు అచ్చు) పెద్ద నగరాల్లో మరియు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో వున్నాయి.

4. పొయ్యి పైన ఉపయోగించే పెనం, గిన్నెలు లాంటి ప్రత్యేకమైన పాత్రలు; అలాగే ఎక్కడైతే సూర్య ప్రకాశంతో ఎక్కువ విద్యుత్ నిర్మాణం చేసే వ్యవస్థ ఉందో, అటువంటి వాళ్ళు విద్యుత్ తో పని చేసే పిండి యంత్రం (ఇంటిలోనే పిండి చేసుకునే యంత్రం) పెట్టుకోండి.

5. కట్టెల పొయ్యి మీద వంట చేయడం నేర్చుకోవలెను. ‘ప్రెశర్‌ కూకర్‌’ ను వుపయోగించకుండ పాత్రలలో అన్నం వండటం, పప్పు వుడకపెట్టడము, మొక్క జొన్నరొట్టెలు (ఒక రకమైన భారతీయ రొట్టె) పేనం మీద వేడిచేసిన తరువాత నిప్పు బొగ్గులపై (అగ్గి మిప్కాలు) వేయించడము మొదలగునవి చేయాలి. కట్టెల పొయ్యి మీద వంటచేయడం నేర్చుకునేటప్పుడు, వంటగదిలోని గద్దెపై వంట చేసే  అలవాటును తగ్గించుటకు ప్రయత్నించవలెను.

లోహపుపొయ్యి

3 అ 1 ఆ. వంట చేయుటకు వుపయోగపడే సౌరఊర్జకు సంబంధించిన వంట పరికరాలను కొనండి

1. సౌరఊర్జ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసే ఉపకరణం లేని వారు, సౌర విద్యుత్తో ‘సోలార్‌ కూకర్‌’ లాంటి పరికరాలను కొనుగోలు చేసికొని పెట్టుకోవలెను.

సోలార్‌ కూకర్

2. సౌర శక్తితో విద్యుత్‌ ఉత్పత్తిచేసే ఉపకరణాలు వున్నవారు, వంట చేయడానికి ‘ఇండక్షన్‌ స్టవ్‌’, తగిన పాత్రలను కొనుగోలు చేయాలి. (మేఘావృత వాతావరణంలో సౌరశక్తిని పొందడానికి పరిమితులు వున్నాయి)

3 అ 1 ఇ.  తగినంత తడి చెత్త (కూరగాయల తొక్కలు, మిగిలిపోయిన ఆహారం, త్వరగా కుళ్ళిపోయే ఇతర పదార్థాలు మొదలైనవి) వుత్పత్తి అవుతున్న చోట, బయోగ్యాస్‌ ప్లాంట్ను కట్టడము, ఈ యంత్రాంగములకు ఆవు పేడను కూడావుపయోగించవచ్చు, అలాగే బయోగ్యాస్‌ ప్లాంట్‌కు శౌచాలయమును జోడించవచ్చు.  కొన్ని రాష్ట్రాల్లో, ప్రభుత్వం బయోగ్యాస్‌ ప్లాంట్ను నిర్మించడానికి కొంత శాతము ఖర్చులను ఇస్తుంది.

3 అ 1 ఈ. ఆవులు, ఎడ్లు మొదలగు జంతువులను పెంచుకొనువారు(పాలన చేసేవారు) వాటి పేడతో గోబర్‌ గ్యాస్‌ ప్లాంట్‌ను కట్టి దానికి శౌచాలయమును జోడించవచ్చు. ఈ యంత్రణాలు నిర్మించడానికి రైతుకు రాజ్య ప్రభుత్వం ద్వారా విశిష్ట నియమనుసారంగా మొత్తం ఖర్చులు పొందవచ్చు.

3 అ 2. వంట చేసేటప్పుడు మిక్సర్లు వంటి యంత్రాలను వాడటం మానుకోండి; బదులుగా సంప్రదాయ పరికరాలను వుపయోగించే అలవాటును పెంచుకోండి.

పదార్థాలను నూరే రాతిపీఠ

అ. విద్యుత్‌ రవితో (తెడ్డు) మజ్జిగ చేయడము మానుకొని దానికి బదులుగా చేతి రవిని(కవ్వం) వాడండి.

ఆ. ‘మిక్సర్‌’ బదులుగా వేరుశెనగ లేదా మసాలా దినుసులను పొడి చేయడానికి, పచ్చడి చేయడానికి కల్వము, రోలు మరియు రోకలి వుపయోగించండి.

రోలు

ఇ. సాంప్రదాయ పరికరాల వాడుటకు అలవాటు చేసుకోండి (నూరటానికి రాతి రోలు మరియు దంచడానికి రోకలి(దుడ్దు) వంటివి).

 

ఆపత్కాలములో ప్రభుత్వముపై ఆధరపడి వుండకుండ ప్రతిఒక్కరు వివిధ స్థాయిలో సంసిద్ధంగా వుండుట అవసరం !

ఆపత్కాలములో లాక్‌డౌన్‌  రవాణా ఆగిపోతుంది. అందుకని ప్రభుత్వము అన్ని చోట్ల సహాయమునకు   చేరుకోలేదు.  ప్రభుత్వము చేసే సహాయములో ఆటంకాలు కూడ రావచ్చు. వంటగ్యాసు, తినే పదార్థాలు మొదలగు వాటి కొరతను ఎదురుకోవలసివచ్చును. వాటిని అందజేసే వ్యవస్థలో భ్రష్టాచారము(అవినీతి) జరిగే అవకాశము వుంటుంది. ప్రభుత్వము కొన్ని వస్తువులను రేషనింగ్‌ (పరిమితంగా) అందజేసి మరియు ‘ఔషధములను పంచే కేంద్రాలను తెరిచి ప్రజలకు ఆధారమునిచ్చుటకు ప్రయత్నిస్తుంది; కానీ ప్రభుత్వము చేసే సహాయమునకు కూడ పరిమితముంటుంది. వీటన్నిటిని గ్రహించి ఆపత్కాలములో ప్రాణరక్షణకై అందరు శారీరిక, మానసిక, ఆధ్యాత్మిక స్థాయిలో సంసిద్ధంగా వుండటము అత్యవసరమైనది.

 

ఆపత్కాలములో ‘ఏది జరిగేది వున్నదో, అలా జరుగనీ,’ అను మానసికత వద్దు !

ఆపత్కాలము గురించి గాంభీర్యత నిర్మాణమగుటకు కొందరికి చెప్పబడినదేమిటంటే, ‘ఆపత్కాలములో అందరితో పాటు ఏది జరిగేది వున్నదో అదే మాకు జరుగుతుంది. ఆపత్కాలములో ‘ఏది జరిగేది వున్నదో, అది జరుగనీ,’ తరువాత జరిగేది తరువాత చూద్దాం.’ అనే దాని గురించి తెలుసుకోవలసినదేమిటంటే, ‘ఆపత్కాలములో ‘ఏది జరిగేది వున్నదో, అది అనగా వినాశము జరిగి తీరుతుంది. ఇంట్లో వద్ధులు మరియు చిన్న పిల్లలు కూడ వుంటారు. వద్ధులు ఇతరులపై ఆధారపడి వుంటారు మరియు నిస్సాహాయులై వుంటారు. చిన్నపిల్లలు ఏమి తెలియనివారు. వారిని జాగ్రత్తగా చూసుకోడము మరియు వారిని రక్షించే బాధ్యత కుటుంబములోని కర్త యజమానిదై వుంటుంది. కుటుంబములోని కర్త యజమాని ఒకవేళ ఆపత్కాలమును నిర్లక్షము చేసినచో, ఆపత్కాలము నిప్పు రేకెత్తినప్పుడు అందులో వద్ధులు మరియు చిన్నపిల్లలు కూడ నష్ట పోతారు. దీని పాతకము(పాపము)నకు ప్రతిఫలమును కుటుంబములోని కర్త యజమానికి కశ్చితంగా అనుభవించవలసి వస్తుందనేది గ్రహించుకోవలెను.

ప్రస్తుత లేఖల సర్వహక్కులు (కాఫీరైట్‌) ‘సనాతన భారతీయ సంస్కృతి సంస్థ’ వద్ద సంరక్షితమై వున్నవి.

సేకరణ : సనాతన గ్రంథ మాలలు ‘ఆపత్కాలములో ప్రాణరక్షణకొరకు చేయబడే సంసిద్ధత’

భాగము – 2 చదువుటకు సంప్రదించండి. ‘ఆపత్కాలములో ప్రాణరక్షణ కొరకు చేయబడే సంసిద్ధత’ భాగము – 2

Leave a Comment