ఆపత్కాలములో ప్రాణ రక్షణ కొరకు చేయబడే సంసిద్ధత భాగము – 5

To read Part 4 Click here

అఖిల మానవజాతికి ఆపత్కాలములో ప్రాణాలతో బ్రతికి వుండుటకు సంసిద్ధత గురించి మార్గదర్శనము చేయు ఏకైక పరాత్పర గురువు  డా. జయంత్‌ బాలాజి ఆఠవలె !

3. ఆపత్కాలములో భౌతిక(శారీరిక) స్థాయిలో తీసుకోవలసిన చర్యలు

3 ఈ. పెట్రోల్‌, విద్యుత్‌ వంటి ఇంధనాలు అందుబాటులో లేనప్పుడు ప్రయాణము చేయుటకు చేయవలసిన సంసిద్ధత

3 ఈ 1. ప్రయాణం లేదా రవాణాకు వుపయోగపడే సాధనాలను కొనుగోలు చేయడం

ఆపత్కాలములో పెట్రోల్‌, డీజిల్‌ మొదలైన వాటి కొరత వస్తుంది. భవిష్యత్తులో, ఇంధనాలు కూడా అందుబాటులో వుండవు. అప్పుడు అలాంటి ఇంధనాలపై నడుస్తున్న ద్విచక్ర మరియు నాలుగు చక్రాల వాహనాల వల్ల ప్రయోజనం లేకుండా పోతుంది. ఈ లేఖనములో ప్రయాణానికి, రోగిని వైద్యుడి వద్దకు తీసుకెళ్ళడానికి, ధాన్యం లేదా భారీ వస్తువులు రవాణ చేయడానికి, వుపయోగపడే సాధనాల సమాచారం క్రింద ఇవ్వబడింది.

3 ఈ 1 అ. సైకిల్‌

సైకిల్

వివిధ రకాల సైకిళ్ళ గురించి ముందు ప్రస్తావించబడింది. మన అవసరాలు మరియు ఆర్థిక సామర్థ్యాన్ని, అలాగే సైకిళ్ళ ప్రయోజనాలను పరిశీలించి గ్రహించుకొని, మనకు సరిఅయిన, సౌకర్యవంతంగా వుండే    ఎన్నుకోవలెను.

3 ఉ1 అ1. సాధారణ సైకిల్‌

రెండు రకాల సైకిళ్ళు కలవు,  ఒకటి టైర్‌-ట్యూబ్‌ రెండింటిని కలిగిన సైకిల్‌, మరొకటి ట్యూబ్‌ లేకుండా  టైర్‌ మాత్రమే కలిగిన సైకిల్‌.

3 ఈ 1 అ 2. బ్యాటరీ సహాయముతో  నడిచే  సైకిల్‌ (ఇ-బైక్‌ లేదా విద్యుత్‌ సైకిల్‌ అని కూడా పిలుస్తారు)

3 ఈ 1 అ 3. సైకిల్‌-రిక్షా

ఆపత్కాలములో రోగిని వైద్యుడి వద్దకు తీసుకెళ్ళడానికి, సామానులు రవాణా చేయడానికి  సైకిల్‌-రిక్షాలు వుపయోగపడతాయి.

3 ఈ 1 ఆ. బ్యాటరీ సహాయముతో  నడిచే ద్విచక్ర మరియు నాలుగు చక్రాల  వాహనాలు  

ఆపత్కాలములో పెట్రోల్‌, డీజిల్‌ మొదలైన వాటి కొరత ఉన్నప్పుడు ఇటువంటి వాహనాలు వుపయోగపడతాయి. అయితే పెట్రోల్‌, డీజిల్‌ మొదలగు వాటిపై నడుస్తున్న వాహనాలతో పోలిస్తే ఈ వాహనాలకు కొన్ని లోపాలు ఉన్నాయి. పాఠకులు దీని గురించి మరింత సమాచారం సంబంధిత విక్రేతల నుండి తెలుసుకొనగలరు.

3 ఈ 1 ఇ. తోపుడు బండ్లు 

రోడ్డు ప్రక్కన  కూరగాయలు, వడ-పావ్‌ మొదలగునవి విక్రయించే వారు వుపయోగించే తోపుడు బండ్లు ఆపత్కాలంలో  వస్తువులను రవాణా చేయడానికి వుపయోగపడతాయి.

3 ఈ 1 ఈ. ఎడ్ల బండి లేదా గుర్రపు బండి

ఎడ్ల  బండ్లను లాగడానికి ఎద్దులను పెంచాలి. ఆవులు మరియు ఎద్దులు రెండింటినీ పెంచుకుంటే, ఆవు పాలతో పాటు, ఆవు మరియు ఎద్దుల సంతానోత్పత్తి కూడా కొనసాగుతుంది. ఎద్దులకు సుమారు 3 సంవత్సరాల వయస్సు వచ్చినప్పటి నుండి వాటిని బండ్లను లాగడానికి కట్టవచ్చు. ఎడ్ల బండిలాగే, గుర్రపు బండిని కూడా కొనవచ్చు. గుర్రాన్ని మాత్రమే కొనుగోలు చేస్తే, అది ప్రయాణానికి వుపయోగపడుతుంది.

ఆవులు, ఎద్దులు మరియు గుర్రాలకు పశుగ్రాసం ఇవ్వడం మరియు నీళ్ళు పెట్టడం, పశువుల పాకను(గుడిసె) ఏర్పాటు చేయడం, అనారోగ్య సమయంలో వాటికి ఔషధాలను ఇచ్చి జాగ్రత్తగా చూసుకోవడం మొదలగు వంటివి నిపుణుల నుంచి నేర్చుకోవాలి. గుర్రపు స్వారీ మరియు గుర్రం లేదా ఎడ్ల  బండిని నడిపించుటకు కూడా నేర్చుకోవాలి.

3 ఈ 2. రాత్రి ప్రయాణ సమయంలో విద్యుత్‌ కోత కారణంగా వీధి దీపాలు ఆపివేయబడినప్పుడు కాంతి ప్రసార సాధనాలు వుపయోగించడం 

3 ఈ 2 అ. విద్యుత్‌ లేదా సౌర శక్తితో ఛార్జ్‌ చేయగల బ్యాటరీ (డ్రై సెల్)

ఆపత్కాలం కోసం ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఫ్లాష్‌లైట్‌లను కొనుగోలు చేసి పెట్టుకోవాలి. ఇలాంటి ఫ్లాష్‌లైట్‌లను వాడుతూ ఉండాలి. కొన్ని డ్రై సెల్ expairy 10 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇటువంటి ఎక్కువ రోజులు పని చేసే సెల్ లను కొనుగోలు చేసి పెట్టుకోవచ్చు.

3 ఉ 2 ఆ. లాంతరు

 లాంతరు

లాంతరును వెలిగించటానికి కిరోసిన్‌ వుపయోగిస్తారు.  కిరోసిన్‌ అందుబాటులో లేకపోతే, ఇతర నూనెలు (ఉదా. వంట నూనె, నువ్వుల నూనె) వుపయోగించవచ్చు. లాంతర్లతో పాటు, వివిధ రకాల కిరోసిన్‌ దీపాలు కూడా బజారులో లభిస్తాయి.

3 ఉ  2 ఇ. కాగడా 

 కాగడా

కాగడా అన్నిచోట్లా దొరకవు; కానీ వాటిని వడ్రంగి (కార్‌పెంటర్‌) వద్ద తయారు చేయించవచ్చును. కాగడా పైభాగంలో లోహంతో చేసిన పెద్ద గిన్నె (ఉక్కు, ఇత్తడి) ఉంచాలి. ఈ గిన్నె అర మీటరు పొడవున్న చెక్క కర్రతో జతచేయబడుతుంది. దీపములో పత్తి వత్తి ఉన్నట్లే, గుడ్డ పీలికను ( వస్త్రాన్ని చుట్టి) ఈ కాగడాలో వత్తిగా వుపయోగిస్తారు.

కాగడాను ఎలా వెలిగించాలి :

‘కాగడాను నిటారుగా పట్టుకుని, పైన గిన్నెలో గట్టిగా చుట్టబడిన వస్త్రాన్ని వుంచాలి మరియు వస్త్రం యొక్క ఒక చివరను బయటకు వుంచాలి. చుట్టబడిన వస్త్రం పూర్తిగా నానే వరకు గిన్నెలో నూనెను (ఉదా. ఆముదము నూనె, వెనిగర్‌ నూనె) పోయాలి.

బయటకు పెట్టిన వస్త్రం యొక్క చివరను వెలిగించినప్పుడు, అది నూనె అయిపోయే వరకు వెలుగుతుంటుంది. నూనె పూర్తిగా అయిపోయినప్పుడు వస్త్రం యొక్క చుట్ట కాలిపోతుంది. అందువల్ల నూనె పూర్తిగా అయిపోకుండా మధ్య మధ్యలో అవసరమైనంత నూనెను పోయాలి. మషల్‌ ను గురించిన కృతి, విధులను నిపుణుడి నుండి తెలుసుకోగలరు.

– శ్రీ అవినాష్‌ జాదవ్‌, సనాతన ఆశ్రమం, రామనాథి, గోవా.

కాగడాలోని ఇనుప గిన్నెలోని మేకుకి చిట్టిన
వస్త్రం మరియు దానిని వెలిగించడానికి బయట
తీసిన గుడ్డ యొక్క చివరి భాగం చూపించే చిత్రం

3 ఉ 2 ఈ. కొబ్బరి ఆకుల కాగడా

 కొబ్బరి ఆకుల కాగడా

కొబ్బరి చెట్టు ఆకుల నుండి దీనిని తయారు చేస్తారు. దీన్ని తయారు చేయడానికి, కొబ్బరి ఆకులను ఒక పిడికిలిలో సరిపోయేంతగా తీసుకొని కొబ్బరి ఆకులతో లేదా పురికొస సహాయంతో చిత్రంలో చూపిన విధంగా అక్కడక్కడా గట్టిగా బిగించి కట్టవలెను. కాగడా నెమ్మదిగా కాలడానికి, వెలిగించే ముందు దానిపై కొంచెం నీరు చిలకరించవలెను. కొబ్బరి ఆకులలో సహజమైన నూనె పదార్థం వున్నందున, దానిని వెలిగించడానికి వేరొక ఇంధనం అవసరం లేదు. అగ్గి పుల్లను వెలిగించే ముందు ఎలా అయితే క్రిందికి వంచి వెలిగిస్తామో అలాగే, కాగడాను కూడా క్రిందికి త్రిప్పి వెలిగించాలి. సాధారణంగా 3 అడుగుల పొడవైన కాగడా సుమారు 20 నిమిషాలు వెలుగును ఇస్తుంది.

– శ్రీ వివేక్‌ ప్రభాకర్‌ నాఫడే, సనాతన ఆశ్రమం, దేవద్‌, పన్వెల్‌, మహారాష్ట్ర.

3 ఉ 3. తెలియని ప్రదేశంలో ప్రయాణించేటప్పుడు దిశలను తెలుసుకోడానికి దిక్సూచిని వుపయోగించడం

దిక్సూచి

ఆపత్కాలంలో, ఒక ప్రాంతం నుండి మరొక తెలియని ప్రాంతానికి వెళ్ళవలసి వుంటుంది. అటువంటి సమయాల్లో, రహదారిపై మార్గదర్శక పలకలు వుంటాయని మరియు సమాచారాన్ని ఇచ్చే వ్యక్తులు వుంటారని  ఎటువంటి హామీ వుండదు. మార్గదర్శక పలకలు వున్నప్పటికీ, రాత్రి పూట  చీకటిగా వుండటం వల్ల దారి కనిపించదు. అలాంటి సమయాల్లో, దిక్కులేని ప్రయాణం చేయకుండా మరియు తప్పు దిశను నివారించడానికి దిక్సూచి వుపయోగపడుతుంది. దీని కోసం, మీ మొబైల్‌లో దిక్సూచి ‘య్యాప్‌’ డౌన్‌లోడ్‌ చేసుకోండి. ఈ దిక్సూచిని చూడటం ద్వారా దిశ తెలుస్తుంది.

దిక్సూచి ఆప్‌ మొబైల్‌లో డౌన్‌లోడ్‌ అయినప్పటికీ, దాని బ్యాటరీ అయిపోతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని దిక్సూచిని కూడా దగ్గర  పెట్టుకోవాలి. దిక్సూచికి బ్యాటరీ లేదా విద్యుత్‌ అవసరం లేదు. దీనిలో ముల్లు ఎల్లప్పుడూ ఉత్తర-దక్షిణ దిశను సూచిస్తుంది. దాని నుండి, ఇతర దిశలను నిర్ణయించవచ్చు.

– శ్రీ విజయ్‌ పాటిల్‌, జల్గావ్‌, మహారాష్ట్ర.

సేకరణ : సనాతన గ్రంథమాల ‘  ‘ఆపత్కాలములో ప్రాణరక్షణకొరకు చేయబడే సంసిద్ధత’

Leave a Comment